విద్యుత్ సౌధలో ఉద్యోగుల ఆందోళన
Published Mon, May 26 2014 11:49 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
హైదరాబాద్: వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు.
ఉద్యోగులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యాల చర్చలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘ నాయకులు,. యాజమాన్యాల మధ్య చర్చలకు జెన్‌కో ఎండీ విజయానంద్, ట్రాన్స్ కో సీఎండీ సురేష్ చందా హాజరయ్యారు. విద్యుత్ సమ్మె సోమవారం కూడా కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
Advertisement