తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాలకు ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో మరో 432 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా తాండూర్, సంగారెడ్డి, జనగాం, ఖమ్మం, నల్లగొండ జిల్లా ఆస్పత్రులు సహా హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి, సుల్తాన్ బజార్‌లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో ఈ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ఆయా కేంద్రాలకుగాను 180 స్టాఫ్‌నర్సులు, 45 మెడికల్ ఆఫీసర్లు, 18 అనెస్థిటిస్ట్స్, 36 కౌన్సెలర్స్, 27 థియేటర్ అసిస్టెంట్లు, 36 గార్డులు, 36 కంటింజెంట్ వర్కర్లు, 18 ఎల్‌టీఎస్‌లు, 18 ఓబీజీవైలు, 18 డీఈవో పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీటిని భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
వైద్య ఆరోగ్యశాఖలో మరో 432 పోస్టులు
Published Mon, May 1 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
Advertisement
Advertisement