
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. తమ ప్రా ణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కోవిడ్ బారిన పడ్డారు. మరికొందరు ప్రాణాలు విడిచారు. వైద్యులే లేకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ నేపథ్యంలో వైద్యుల్ని ప్రత్యక్ష దైవంగా ప్రజలు కొలుస్తున్నారు. అలాంటి వైద్య వృత్తిలో కొందరు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కరోనా నేపథ్యంలో సొమ్ము సంపాదించుకునే పనిలో పడ్డారు. ఎంత వేగంగా పరీక్షలు చేస్తే అంత వేగంగా వైద్యం అందించవ చ్చని ప్రభుత్వం ఉచితంగా విలువైన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కిట్లను ఆస్పత్రులకు సమకూర్చితే వాటిని పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకుంటున్నారు. రోగులు వెంటనే కోలుకునేలా, ప్రాణాపాయం నుంచి కాపాడేందుకని ఖరీదైన రెమిడెసీవిర్ తదితర మందులను అందుబాటులోకి తెస్తే వాటిలోనూ చేతివాటం ప్రదర్శించి డబ్బులు వెనకేసుకుంటున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పలాస సీహెచ్‌సీలో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు దొరికారు. ఇలాంటి వారు జిల్లాలో మరికొన్నిచోట్ల ఉన్నారు.
కరోనా సమయంలో ఉచితంగా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న ర్యాపిడ్ కిట్లకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధార్ నమోదు చేసి ప్రైవేటు క్లినిక్‌లలో పరీక్షలు చేయించి నగదు వసూలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి రోగం వచ్చినా, దీర్ఘకాలిక రోగం ఉన్నా వైద్యులు చూసేందుకు భయపడుతున్నారు. కరోనా పరీక్షలు చేసుకుని, ఫలి తం చూపిస్తేనే చేయి ముట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డయాలసిస్ రోగులు, ఆస్తమా రోగులు, గర్భిణులు, డయాబెటిస్ రోగులు, హృద్రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ చెకప్ చేసుకుంటేనే వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సాధారణ జ్వరం, దగ్గు, జలుబు వచ్చిన వారికి కూడా వైద్యం అందించే పరిస్థితి కొన్నిచోట్ల కరువైంది. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అందుబాటులో ఉంచిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కిట్లను పక్కదారి పట్టించి, ఆయా రోగులకు ప్రైవేటు క్లినిక్‌లు పరీక్షలు చేస్తున్నారు.
ఉచితంగా చేస్తే ఫర్వాలేదు. కానీ ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 2వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేసి పరీక్షలు చేస్తున్నారు. విశేషమేమిటంటే ఆ కిట్లు వినియోగించినట్టు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత రోగుల ఆధార్ నమోదు చేయించి, బయట పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి ఇప్పటి వరకు ఐదు మాసాలుగా పలు విధాలుగా ఇండెంట్ పెడుతూ వేలల్లో ర్యాపిడ్ కిట్‌ల ను తీసుకువచ్చారు. కానీ ఇక్కడ కొంద రు కుమ్మక్కై వాటిని సర్దుకుంటూ వారికి ఉన్న ప్రైవేటు క్లినిక్‌లకు తీసుకెళ్లి వినియోగించారు. పలాస ఆస్పత్రిలో ఇది కొ త్తేమీ కాదు. గతంలో ప్రసూతి ఆపరేషన్‌కు రూ.5వేలు వసూలు చేసిన గైనికాలజిస్టు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడి సస్పెండైన విషయం తెలిసిందే. రక్తం పేరిట కూడా దందా నడిచేదన్న ఆరోపణలు ఉన్నాయి. కరోనా భయంలో అత్యవసర వైద్యం కోసమని శ్రీకాకుళం తరలించడానికి పెట్టే అంబులెన్స్‌లో కూడా కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క పలాసలోనే కాదు జిల్లాలో పలు చోట్ల ఇదేరకమైన తంతు నడుస్తోంది.
మందులు కూడా..
ప్రస్తుతం కరోనా రోగులు కోలుకునేందుకు బాగా ఉపయోగపడుతున్న రెమిడెసీవర్ త దితర మందులను కూడా పలుచోట్ల పక్కదా రి పట్టిస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ. 5400పైగా ఉండటంతో వాటిని ఆస్పత్రుల్లో రోగులకు వినియోగించినట్టు చూ పించి, వాటిని ప్రైవేటుగా విక్రయాలు చేప డుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ము ఖ్యంగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్టు సమాచారం.
ఉపేక్షించం..
ర్యాపిడ్ కిట్లను పక్కదారి పట్టించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎక్కడైనా జరిగినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే నిఘా పెట్టాం. రెమిడెసీవిర్ ఇంజెక్షన్ల విషయంలో కూడా ఆరా తీస్తాం. ఎక్కడై నా ప్రైవేటుకు తరలించినట్టు తేలితే సీరియస్‌గా చర్యలు తీసుకుంటాం.
– జె.నివాస్, కలెక్టర్
లెక్క అడుగుతున్నాం
కరోనా ర్యాపిడ్ పరీక్ష కిట్లు పక్కదారి పడుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యాం. ఎక్కడ ఎన్ని కిట్లు వినియోగించారు? ఎవరికి పరీక్షలు చేశారు? ఏ అవసరం కోసం పరీక్ష చేశారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నాం. ఆస్పత్రుల వారీ గా సరఫరా చేసిన కిట్‌లకు సంబంధించి లెక్క అడుగుతున్నాం. తప్పు చేసే వారిని వదలం.
– కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్.
Comments
Please login to add a commentAdd a comment