ఐటీడీఏల పరిధిలో కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించిన మంత్రి దామోదర
అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలకోసం బైక్ అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారు లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసి స్తున్న ప్రజలు అరగంట లోపలే చేరుకునేలా ఐటీ డీఏల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల నెట్‌వర్క్ ఉండాలన్నారు.
ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీ ఏల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సౌకర్యా లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు.
హైదరా బాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
ప్రత్యేక వార్డులు.. బర్త్ వెయిటింగ్ రూంలు..
ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గర్భిణి, ఆమెతోపాటు వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం, మంచినీరు ఇతర వసతులు కల్పించాలన్నారు. 108 అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వారి భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని ఆ వార్డుల్లో నియమించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment