
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి బాంబు బెదిరింపుల బెడద ఎక్కువైంది. ఢిల్లీలోని మ్యూజియాలు, ఆస్పత్రులను బాంబులతో పేల్చేస్తున్నట్లు ఆగంతకులు పంపిన ఈ మెయిల్స్ బుధవారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి.
ముమ్మర తనిఖీలు చేసి అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని లేదని తేల్చారు. నేషనల్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ బిహేవియర్, విద్యాసాగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో, అలైడ్ సైన్సెస్ మానసిక వైద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఢిల్లీలో ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆఫీసులకు నెల రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment