E-mails
-
ఢిల్లీలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి బాంబు బెదిరింపుల బెడద ఎక్కువైంది. ఢిల్లీలోని మ్యూజియాలు, ఆస్పత్రులను బాంబులతో పేల్చేస్తున్నట్లు ఆగంతకులు పంపిన ఈ మెయిల్స్ బుధవారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ముమ్మర తనిఖీలు చేసి అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని లేదని తేల్చారు. నేషనల్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ బిహేవియర్, విద్యాసాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో, అలైడ్ సైన్సెస్ మానసిక వైద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఢిల్లీలో ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆఫీసులకు నెల రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. -
ఎస్ఎంఎస్ చూడడంతో రూ.14 లక్షలు మాయం
సాక్షి, సిటీబ్యూరో : తనకు వచ్చిన ఎస్ఎంఎస్ను చూసిన ఓ యువకుడు రూ.14 లక్షలు పోగొట్టుకున్నాడు. పెట్టుబడుల పేరుతో ఎరవేసిన సైబర్ నేరగాళ్లు అతనితోపాటు మరికొందరిని మోసం చేశారు. దీంతో బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహిబ్ సెల్‌ఫోన్‌కు ఇటీవల ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ గ్రీన్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు అందులో ఈ–మెయిల్ ఐడీ కూడా ఉంది. ఈ–మెయిల్ సందేశంలో తాను మహిళగా పరిచయం చేసుకున్న పార్క్ గ్రీన్.. తన వద్ద ఉన్న సొమ్మును భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పింది. వెంటనే స్పందించిన సోహిబ్ తన వివరాలను ఈ–మెయిల్ చేశాడు. తన వద్ద ఉన్న 10 మిలియన్ డాలర్లు నీకు పంపిస్తున్నానని, వాటిని ఏదైనా లాభసాటి రంగంలో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులుగా కొందరు నేరగాళ్ళు నగర యువకుడికి ఫోన్ చేశారు. పార్సిల్లో వచ్చిన డబ్బు విషయం చెప్పి వివిధ పన్నుల పేరుతో పలుసార్లు రూ.14 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ►అంబర్‌పేట ప్రాంతంలో నివసించే ఓ కాలేజీ లెక్చరర్‌కు అదే కాలేజీ ప్రిన్సిపల్‌గా ఈ–మెయిల్ పంపిన సైబర్ నేరగాళ్ళు రూ.25 వేల విలువైన అమెజాన్ ఓచర్లు కాజేశారు. నారాయణగూడలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ఓ మహిళకు తన ప్రిన్సిపాల్ పంపినట్లు ఓ ఈ–మెయిల్ వచ్చింది. అందులో రూ.25 వేల విలువైన అమెజాన్ ఓచర్లు కొని, తాను సూచించిన మెయిల్ ఐడీకి పంపాలని ఉంది. బాధితురాలు అలానే చేసిన తర్వాత ప్రిన్సిపాల్‌తో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ►తన కుమారుడికి బుల్లెట్ వాహనం గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన మహిళ అందుకోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేసింది. అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించి బేరసారాలు పూర్తి చేసింది. చివరకు అడ్వాన్సుల రూపంలో వారికి రూ.75 వేలు చెల్లించి మోసపోయింది. ►షాహినాయత్‌గంజ్ ప్రాంతానికి చెందిన జనార్దన్ గౌడ్‌కు బ్లూ డాట్ కొరియర్ ద్వారా ఓ పార్సిల్ రావాల్సి ఉంది. నిర్ణీత గడువు ముగిసినా అది రాకపోవడంతో ఆయన సంస్థ కాల్ సెంటర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన ఓ బోగస్ నెంబర్‌ను నిజమైనదిగా భావించి కాల్ చేశారు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే చేసి రూ. 42 వేలు పోగొట్టుకున్నారు. ►మెహదీపట్నం ప్రాంతానికి చెందిన రాజేష్.. తన ఖాతా నుంచి రూ.41 వేలు గుర్తుతెలియని వ్యక్తులు డెబిట్‌కార్డుతో కాజేశారని తెలిపారు. ఈ మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఫేక్ ఈమెయిల్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: భారత్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు తమకు వచ్చే ఫేక్ ఈ–మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. ఇంటర్నెట్లో అశ్లీల వెబ్సైట్ల వంటి వాటిని చూసినపుడు అందులోని సాఫ్ట్వేర్ ద్వారా వెబ్‌కామ్ వాడి దాన్ని వీక్షిస్తున్న వ్యక్తి వీడియోను రికార్డు చేస్తారు. అనంతరం దాన్ని ఆ వ్యక్తికి పంపి, ఫేస్బుక్ మిత్రులు, బంధువులకు షేర్ చేస్తామంటూ ఆ వ్యక్తిని బెదిరిస్తారు. షేర్ చేయకుండా ఉండాలంటే డబ్బును 24 గంటల్లోగా ఇవ్వాలని, అదికూడా క్రిప్టో కరెన్సీలోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ తతంగమంతా ఈ–మెయిల్లో నడిపిస్తారు. ఇలాంటి ఈ–మెయిల్స్ వస్తే భయపడవద్దని సీఈఆర్టీ–ఇన్ సూచించింది. తమకు పాస్‌వర్ట్‌లు తెలుసని బెదిరిస్తే వెంటనే పాస్‌వర్ట్‌లు మార్చుకోవాలని ఇంటర్నెట్ యూజర్లకు సీఈఆర్టీ–ఇన్ సూచించింది. -
హ్యాకర్ల కొత్త ఎత్తుగడలు.. స్టార్టప్సే లక్ష్యం..
♦ డేటా లీక్ అయ్యిందంటూ హెచ్చరికలు ♦ అటుపై సాయమందిస్తామంటూ హామీ ♦ చివరకు సేవల పేరుతో ఆదాయం ముంబై: మోసపూరిత ఈ–మెయిల్స్/కాల్స్.. బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవడం.. క్రెడిట్ కార్డుల సమాచారం కొట్టేయడం.. ఇలా వివిధ మార్గాల్లో హ్యాకర్లు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీరు స్టార్టప్స్‌పై పడుతున్నారు. వీటిని భయపెట్టి ఆదాయం పొందాలని చూస్తున్నారు. అదెలాగంటే.. దేశీ క్రెడిట్ స్కోర్ మేనేజ్మెంట్ కంపెనీ ‘క్రెడిట్‌సేవ’ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని సర్వర్‌లో నిక్షిప్తమై ఉన్న దాదాపు 40,000 మంది రుణగ్రహీతల వివరాలు లీక్ అయ్యాయని ఒక యూరోపియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ దీన్ని హెచ్చరించింది. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సాయమందిస్తామని హామీ కూడా ఇచ్చింది. అలర్ట్ అయిన క్రెడిట్‌సేవ సంస్థ వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో డేటా భద్రంగానే ఉందని, ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని ఊపిరి పీల్చుకుంది. అయితే లండన్‌కు చెందిన ఒక బ్లాగర్ కూడా డేటా లీక్ జరిగిందని కథనం వడ్డించేసింది. కానీ క్రెడిట్‌సేవ సీఈవో సత్య విష్ణుభొట్ల మాత్రం డేటా లీక్ అవ్వలేదని, భద్రంగానే ఉందని స్పష్టం చేశారు. సమస్య సృష్టించేదీ...సొల్యూషన్ ఇచ్చేదీ వారే... ఇక్కడ మరొక కొత్త సమస్య ఉత్పన్నమౌతోంది. కొందరు నిష్ణాతులైన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇండియన్ కంపెనీలను భయపెడుతున్నారు. వీరు ఎలాంటి వారంటే వ్యాపారం కోసం సిస్టమ్ హ్యాక్ చేయడానికి కూడా వెనకాడరు. అంటే వారే సమస్యను సృష్టించి, దానికి సొల్యూషన్‌ను అందిస్తారు. స్టార్టప్స్ ఈ ఉదాహరణను ఒక హెచ్చరిక లాగా తీసుకోవాలని స్థానిక సెక్యూరిటీ సంస్థ ఒకటి హెచ్చరించింది. ఫిన్‌టెక్ విభాగంలో బిజినెస్‌కు సంబంధించి సెక్యూరిటీ అనేది ముఖ్యమైన అంశమని తెలిపింది. స్టార్టప్స్ ఎప్పుడూ వ్యాపార విస్తరణతో పాటు సైబర్ దాడులు, డేటా భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. స్టార్టప్‌ను నడిపించడం కష్టమైన పనే. మీ సిస్టమ్‌లో లోపాలున్నాయని, సమస్య పరిష్కారానికి మా సేవలు ఉపయోగపడతాయని కొందరు సెక్యూరిటీ కన్సల్టెంట్స్ మీ వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టార్టప్ నిర్వహణ మరింత కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి సేవలు తీసుకోవడానికి మనం నిరాకరిస్తే.. డేటా లీక్ అయ్యిందంటూ వీరు మీడియాకు తెలియజేస్తారు. మా పోర్ట్‌ఫోలియోలోని ఒక కంపెనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మీ వరకు కూడా ఈ సమస్య రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త. – స్టీవెన్ టంగ్ , బూట్‌క్యాంప్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్, క్రెడిట్‌సేవ ఇన్వెస్టర్ -
‘ప్రయివేటు’పైనే మక్కువ
ప్రభుత్వ ‘మెయిల్’ సదుపాయాన్ని వినియోగించుకోని అధికారులు సమాచారం భద్రతపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు దేశంలో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల మధ్య సమాచారం, సూచనలు, ఆదేశాలను ‘ఈ మెయిల్స్’ ద్వారా అందిస్తున్నారు. దీని కోసం జీమెయిల్, యాహూ మెయిల్ వంటి విదేశీ ప్రయివేటు సర్వీస్ ప్రొవెడర్స్ సేవలను వినియోగిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆన్లైన్ టెక్నాలజీని విస్తృతపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఆన్లైన్లో స్టోర్ చేసిన డేటా భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయివేటు సర్వీస్ ప్రొవెడర్స్కు చెందిన మెయిల్స్‌లో డేటాను అప్లోడ్ చేయటం వలన వారి ఆధీనంలో ఉన్న సర్వర్స్‌లో స్టోర్ అవుతాయి. దీని వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం గతేడు దేశీయంగా సర్వర్లు ఏర్పాటు చేసింది. ఝ్చజీ.జౌఠి.జీ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ః జౌఠి.జీ అనే ప్రభుత్వ మెయిల్ సర్వీసును తయారు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది అధికారిక పనులకు సంబంధించి వివరాలు పంపటానికి ప్రభుత్వ మెయిల్ సర్వీసునే వినియోగించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. దీని కోసం కలెక్టర్ కార్యాలయంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులందరికి ః జౌఠి.జీ మెయిల్ క్రియేట్ చేసే బాధ్యతను అప్పగించింది. అయితే జిల్లాలో సుమారు 15 వేల మంది ఉద్యోగులు ఉన్నా ఇప్పటివరకు 100 మంది లోపు మాత్రమే అధికారులు, మండలస్థాయిలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతానికి మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతస్థాయి అధికారులతో పాటు వివిధ శాఖలు ఇప్పటికీ ప్రయివేటు మెయిల్స్ నుంచే సమాచారం, సూచనలు పంపుకుంటున్నారు. కొత్తగా క్రియేట్ చేసుకున్నవారు సైతం ప్రభుత్వ మెయిల్ సర్వీసును వినియోగించటం లేదు. కార్యాలయ హెచ్వోడీదే బాధ్యత.. ప్రభుత్వ మెయిల్స్‌ను ఉద్యోగులకు క్రియేట్ చేయించాల్సిన బాధ్యత ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారిదే. ః జౌఠి.జీ మెయిల్ ఐడీని క్రియేట్ చేసే ఎన్ఐసీ అధికారులకు హెచ్‌వోడీ తమ కార్యాలయంలోని ఉద్యోగుల వివరాలను పంపించాల్సి ఉంటుంది. దీనికోసం ఝ్చజీ.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫార్మాట్లో ఉన్న విధంగా పేరు, వివరాలు మెయిల్ యూజర్ నేమ్‌తో వివరాలు పూర్తి చేసి ఎన్ఐసీ కార్యాలయానికి పంపితే వారు మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తారు. మెయిల్ క్రియేటైన వెంటనే అందులోని ఉద్యోగి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా మెయిల్ పాస్‌వర్డు వస్తుంది. ఈ మెయిల్ ఐడీ ద్వారా గ్రూప్ ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఈ-ఆఫీస్‌లు అమలవుతున్న 10 కార్యాలయాల ఉద్యోగులకు మాత్రమే ఇటీవలే ఈ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో చర్యలకు ఇంకెంత సమయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. -
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ‘వాట్సప్’లో సమాచారమివ్వండి
సాంకేతిక విప్లవాన్ని సర్కారు విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం యంత్రాంగం సైతం విధి నిర్వహణలో వాటి వినియోగానికి ప్రాధాన్యమిస్తోంది. సాధారణంగా ఒక విషయంపై ఫిర్యాదు చేయాలంటే సదరు బాధితులు కార్యాలయానికి వచ్చి.. లిఖితపూర్వకంగా ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ సామాజిక మాధ్యమాల వినియోగంతో తక్షణమే ఫిర్యాదును సంబంధిత ఆధారాలతో అందజేయవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రత్యేక ఖాతాలు తెరిచి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే వాటిని వినియోగంలోకి తెచ్చిన పలువురు అధికారులు.. సరైన ఆధారాలు సమర్పించి ప్రభుత్వానికి సహకరించే వారికి రివార్డులు సైతం ఇస్తున్నారు. పాలనకు సాంకేతిక పరిజ్ఞానం జోడించిన అధికారులు * అక్రమాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహం * వాట్సప్, మెయిల్స్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ * ఆధారాలు పంపినవారికి రివార్డులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: శాంతిభద్రతల అంశంలో సత్వరం స్పందించేందుకు గ్రామీణ పోలీసు విభాగం సామాజిక మాద్యమబాట పట్టింది. ఏదైనా సంఘటనకు సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షులు ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్ చేసిన మరుక్షణమే రంగంలోకి దిగేందుకు ఉపక్రమించింది. మెసేజ్ వచ్చిన మరుక్షణమే బాధితులకు సాయం అందించడంతోపాటు కారకులపై చట్టపరమైన చర్యలకు దిగుతామని ఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వాట్సప్ నంబర్లు: 80083 84500, 80083 84600 రాజధానికి ఆనుకుని జిల్లా ఉండడంతో రెవెన్యూ పరమైన సమస్యలు సైతం అధికంగా ఉంటాయి. విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులనుంచి కాపాడేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమార్కుల భరతం పట్టడానికి జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ సామాజిక మాద్యమాన్ని ఎంచున్నారు. వాట్సప్, ఈ- మెయిల్‌తో అక్రమాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించి.. ప్రజలకు వాట్సాప్ నంబర్‌ను, మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా సమాచారమిచ్చిన వెంటనే యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై ఉక్కుపాదం మొపనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఫేస్బుక్ ఖాతాను కూడా తెరువనున్నట్లు ఆయన వెల్లడించారు. వాట్సప్ నంబర్: 98499 04205 ప్రజా పంపిణీ వ్యవస్థ, వైద్య, ఆరోగ్యం, విద్య తదితర కీలక విభాగాల్లో అక్రమాలను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ -2 కాట ఆమ్రపాలి వాట్సాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకతే లక్ష్యంగా సామాజిక మాద్యమాన్ని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈమెయిల్ ఐడీకి సైతం సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. వాట్సప్ నంబర్ : 90005 44132 ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలో ఈ అక్రమాల్ని అరికట్టేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి కూడా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా అక్రమాలపై ఆధారాలను పోస్ట్ చేసే వారికి తగిన బహుమతులు సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వాట్సప్ నంబర్ : 98499 04208 రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తాండూరులో అక్కడి పోలీస్ విభాగం వాట్సప్, ఫేస్బుక్ ఖాతాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల తాండూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనదీప్తి.. ఈవ్‌టీజింగ్, మట్కా, జూదం, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. వాట్సప్ నంబర్: 9440627353 -
పోలీసు ఈ-మెయిళ్లపై హ్యాకర్ల గురి!
హ్యాకింగ్ ప్రమాదంపై నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తత జారీ చేసిన డీజీపీ కార్యాలయం పాస్‌వర్డ్స్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: పోలీసు అధికారుల ఈ-మెయిల్ అకౌంట్లు హ్యాకర్లు గురిపెట్టారంటూ నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే కొందరి అకౌంట్ల హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయంటూ తెలిపాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులందరికీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల మొదటి వారంలో ప్రభుత్వ వెబ్సైట్లు చొరబాటుకు గురైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశాకు చెందిన 22 వెబ్సైట్లపై పాకిస్థాన్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్న హ్యాకర్లు దాడి చేశారు. ప్రతి వెబ్‌పేజ్ మీదా ‘సమాచారం డిలీట్ చేయలేదు. తస్కరించలేదు. ఇది భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఓ సందేశం మాత్రమే’ అని హ్యాకర్లు రాశారు. ఇప్పుడు హ్యాకర్ల కన్ను పోలీసు అధికారులు, ఇతర ప్రముఖుల ఈ-మెయిల్ అకౌంట్లపై ఉన్నట్లు నిఘావర్గాలు గుర్తిం చాయి. హ్యాకింగ్ ద్వారా అత్యంత కీలకమైన, ర హస్య సమాచారాన్ని తస్కరించడానికి ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నట్లు నిర్ధారించారు. పబ్లిక్ డొమైన్స్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా పోలీ సు అధికారులకు చెందిన ఈ-మెయిల్ అడ్రస్ల్ని సేకరించిన ముష్కరులు హ్యాకింగ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘావర్గాలు చెప్తున్నాయి. సబ్జెక్ట్, కంటెంట్ లేకుండా వచ్చే ఈ-మెయిల్స్‌ను అనుమానించాల్సిందిగా ఐపీఎస్ అధికారులకు డీజీపీ కార్యాలయం సూచించింది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దని, తక్షణం డిలీట్ చేయాలని స్పష్టం చేసింది. పరిచయస్థుల ఐడీల నుంచి వచ్చినట్లు కనిపించినా... వారితో మాట్లాడి నిర్థారించుకునే వరకు ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. కొందరు హ్యాకర్లు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్‌పేజ్‌ల లింకుల్ని ఈ-మెయిల్ ఐడీలకు పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే సైన్‌ఔట్ అయినట్లు కనిపించి మరోసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుందని డీజీపీ కార్యాలయం తన సూచనల్లో పేర్కొంది. అలా చేస్తే పాస్వర్డ్ తేలిగ్గా హ్యాకర్లకు చేరిపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో అధికారులు వీలున్నంత వరకు పాస్వర్డ్ మార్చుకోవాలని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. -
పొరపాట్లను సరిదిద్దుకుందాం..
ప్రతి ఆర్టికల్‌లో కాన్సెప్ట్ చెప్పిన తర్వాత విద్యార్థుల మేధస్సును తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్న విషయం చూస్తున్నారు. వీటిపై విద్యార్థుల స్పందన అభినందనీయం. ముఖ్యంగా నవంబర్ 13న ప్రచురించిన ఆర్టికల్‌లో అడిగిన ప్రశ్నలకు స్పందించిన విద్యార్థులకు అభినందనలు. నాకు కొందరు విద్యార్థులు పంపిన ఈ-మెయిల్స్ చూసిన తర్వాత అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఈ ఆర్టికల్. చాలామంది విద్యార్థులు బాగా తెలివిగా ఆలోచిస్తున్నారు. కానీ, సమస్య సాధన విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. నవంబర్ 13 నాటి ఆర్టికల్‌లో అడిగిన మొదటి ప్రశ్న: 1. ఇక్కడ ఉపయోగించిన అక్షరాలకు ఏ అంకెలు ఇవ్వగలిగితే JMO అనే సంఖ్యనుUKతో భాగిస్తే భాగఫలం OK వస్తుంది. మొదట ఒకసారి ప్రశ్నను గమనించండి. సమస్య సాధనకు అనుగుణంగా ప్రశ్నను మలచుకోవాలి. అంటే JMO = OK × UKఅని రాస్తున్నాను. OK× UK _____ JMO. 'OK'అనే పదంలో Kఅనేది ఒకట్ల స్థానంలో ఉంది. 'UK'పదంలోనూ K అనేది ఒకట్ల స్థానంలోనే ఉంది. ఆ రెండు 'K’లను గుణిస్తే వచ్చే సంఖ్య OKఅనే పదంలో పదుల స్థానంలో ఉంది. ఇప్పుడు ఏ నంబర్‌స తీసుకుంటే సమస్యకు సాధన దొరుకుతుందో చూద్దాం. ఒకవేళ K = 0 తీసుకున్నట్లయితే సమాధానం (0) వస్తుంది కాబట్టి K = 0తీసుకోరాదు. ఒకవేళ K = 1V> తీసుకుంటే, రెండు 'K’లను గుణించినప్పుడు లబ్ధం'O' రావాలిగానీ K' రాకూడదు. ఇప్పుడు K = 1అయితే లబ్ధం మళ్లీ 1(ఒకటి) వస్తుంది కాబట్టి K = 1తీసుకోరాదు. ఒకవేళK= 2తీసుకున్నట్లయితే, రెండు'K’ల లబ్ధం 'O' కావలెను అనుకున్నట్లుగా అది 4 అవుతుంది. ఇప్పుడుU ’ విలువ ఎంత తీసుకోవాలో కనుక్కోవాలి. ఇప్పుడు Uవిలువను సున్నాగా తీసుకున్నట్లయితే సమాధానం రెండంకెల సంఖ్య మాత్రమే వస్తుంది. కానీ ప్రశ్నలో OK×UKచేసినట్లయితే JMO అనే మూడంకెల సంఖ్య రావాలి. కాబట్టి U= 0 తీసుకోరాదు. ఒకవేళU= 1గా తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు U= 1 తీసుకోవడం వల్ల OK × UK = JMO అనే మూడంకెలు వచ్చినట్లు ఇక్కడ కూడా ’504’ అనే మూడంకెల సంఖ్య వస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఒకవేళU = 2 తీసుకున్నట్లయితే, UK అనే పదం 22 అవుతుంది. UK = 22 కానీ ఇచ్చిన ప్రశ్నలో OK, UK లలో ఒకట్ల స్థానం లోనే Kఉంది. కాబట్టి K= 2 తీసుకుంటేUK అనే పదం ఓఓ అవుతుంది. కాబట్టి U= 2 తీసుకోరాదు. ఒకవేళ U= 3 తీసుకున్నట్లయితే సమాధానం నాలుగు అంకెల సంఖ్య వస్తుంది. కానీ ప్రశ్నలోOK × UK = JMO అనే మూడంకెలు మాత్రమే కావాలి. కాబట్టి K = 3 కూడా తీసుకోరాదు U= 3 నే తీసుకోలేనప్పుడు, U= 4, 5, 6, 7, 8, 9 లను కూడా తీసుకోలేం. ఎందుకంటే వాటి లబ్ధం మూడంకెల సంఖ్యను మించి పోతుంది. కాబట్టి =2లో మాత్రమే మూడంకెల సంఖ్యకి Possibility ఉంది. కాబట్టి సమాధానం 504 అని వచ్చింది. ఇక్కడ K = 2, O = 4, U = 2 అవుతుంది, J = 5 M = 0, O = 4అవుతుంది. ఇప్పుడు JMO=504 అని వచ్చింది, ఇంకా ఏమైనా అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఈసారి K= 3 తీసుకుందాం అంటే రెండు 'K’ల లబ్ధం'O' అని రావాలి. కాబట్టి ఇక్కడ 9 అని వస్తుంది. ఈ 9 అనేది'O' ఇప్పుడుU= ఎంత తీసుకుంటే JMO వస్తుందో చూద్దాం. ఒకవేళ K= 0 (సున్నా) తీసుకున్నట్లయితే సమాధానం రెండంకెల సంఖ్య వస్తుంది. కానీ కావాల్సింది ఒకై అనే మూడంకెల సంఖ్య కాబట్టి K= 0 తీసుకోరాదు. ఒకవేళ K= 1 తీసుకున్నట్లయితే సమాధానం నాలుగు అంకెల సంఖ్య వస్తుంది. కానీ కావాల్సింది మూడంకెల సంఖ్య కాబట్టి K= 1 కూడా తీసుకో కూడదు. కాబట్టి K = 3తీసుకుంటే ఏ నంబర్ దగ్గర కూడా కావల్సిన ఒకై అనే మూడంకెల సంఖ్య రావడం లేదు కాబట్టి K = 3కూడా తీసుకోరాదు. ఇప్పుడుK=4తీసుకుందాం అంటే రెండు ఓల లబ్ధం 'O'అని రావాలి. కాబట్టి ఇక్కడ కూడా 16 వస్తుంది. ఇప్పుడు మళ్లీ U = ఎంత తీసుకుంటే JMO అనే మూడంకెల సంఖ్య వస్తుందో చూద్దాం. ఒకవేళ U = 0 తీసుకుంటే రెండంకెల సంఖ్య వస్తుంది. కాబట్టి తీసుకోరాదు. ఒకవేళ U= 1 తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. U =1 తీసుకోవడం వల్ల JMO అనే మూడంకెల సంఖ్య మాదిరి 896 అని వచ్చింది. [JMO = 890] కాబట్టిU= 1 సరిపోతుంది. ఒకవేళU =2 తీసుకున్నట్లయితే సమాధానం నాలుగంకెల సంఖ్య వస్తుంది. కాబట్టి ్ఖ= 2 తీసుకోరాదు. U = 2తీసుకోలేనప్పుడుU= 3, 4, 5, 6, 7, 8, 9 కూడా తీసుకోలేం. ఎందుకంటే వాటి లబ్ధం కూడా మూడంకెల సంఖ్యను మించిపోతుంది. కాబట్టి K = 4, U =1లో కూడా మూడంకెల సంఖ్య వస్తుంది. సమాధానం JMO =896 అవుతుంది. ఇక్కడK = 4, O = 6, U = 1; J = 8, M = 9, O = 6అనే నంబర్సలో కూడా వచ్చింది. ఇంకా ఏ నంబర్‌స అయినా తీసుకుంటే వస్తుందేమో చూద్దాం. ఒకవేళ K = 5 తీసుకున్నట్లయితే వాటి లబ్ధం ’O'రావాలి. కానీ మళ్లీ Kవస్తుంది. కాబట్టి K = 5తీసుకోరాదు. ఒకవేళK = 6తీసుకున్నా మళ్లీ Kవస్తుంది కాబట్టి K = 6కూడా తీసుకోరాదు. K = 6తీసుకోలేనప్పుడు K =7, 8, 9లను కూడా తీసుకోలేం. ఎందుకంటే వాటి లబ్ధం మూడంకెల సంఖ్యను మించిపోతుంది. కాబట్టి రెండు కండిషన్సలో మాత్రమేOK × UK= JMO మాదిరిగా వచ్చాయి. అవి 504, 896. అంటే K = 2, O = 4, U= 2 అయితే JMO = 504 అని,K = 4, O = 6, U = 1 అయితేJMO =896అనే రెండు కండిషన్సలో మాత్రమే OK × UK = JMO వస్తుంది. కాబట్టి విద్యార్థులు ప్రశ్న స్వరూపాన్ని పూర్తిగాచూసి దాన్ని ఏ విధంగా విశ్లేషించి, ఆలోచన చేస్తున్నారో అది ముఖ్యం. రెండో ప్రశ్న 123123 ÷1001 = 123 దీనికి చాలా మంది విద్యార్థులు సమాధానం చాలా చక్కగా ఇచ్చారు. కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ప్రశ్నను ఒకసారి గమనించాలి. అంటే 123123ని 1001 తోనే భాగిస్తే 123 అని అంటున్నాం. అంటే మనకు ప్రశ్నలోనే సమాధానం అర్థమైపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రశ్నను చాలా సులువైన మార్గంలో, చాలా తక్కువ సమయంలో సాధన చేయాలి. అదెలా అంటే.. Þ 123123 ÷ 1001 Þ (123000+123) ÷ 1001 Þ (123×1000 + 123) ÷ 1001 Þ 123(1000 + 1) ÷ 1001 123(1001) ÷ 1001 123 అని వచ్చింది. ఈ విధంగా విద్యార్థులు చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో సమస్యను సాధించవచ్చు. ఎల్‌శాట్ - 2015 లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్) ఇండియాను అమెరికాలోని లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్.ఎస్.ఎ.సి.) నిర్వహిస్తుంది. ఎల్‌శాట్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అలియన్స్ స్కూల్ ఆఫ్ లా -బెంగళూరు; జిందాల్ గ్లోబల్ లా స్కూల్-సోనిపట్; శారదా యూనివర్సిటీ-గ్రేటర్ నొయిడా వంటి 48 లా స్కూళ్లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశించవచ్చు. అర్హతలు: కళాశాలలు ఆఫర్ చేస్తున్న కోర్సులకు అనుగుణంగా అర్హతలుంటాయి. పరీక్షా విధానం: ఎల్‌శాట్ ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. 96-100 ప్రశ్నలకు 140 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. అంశం ప్రశ్నలు సమయం (సుమారు) (నిమిషాలు) అనలిటికల్ రీజనింగ్ 24 35 లాజికల్ రీజనింగ్-1 24 35 లాజికల్ రీజనింగ్-2 24 35 రీడింగ్ కాంప్రెహెన్షన్ 24 35 అనలిటికల్ రీజనింగ్: వ్యక్తులు, వస్తువులు, సంఘటనల మధ్య ఉన్న సంబంధాలు, విశ్లేషణపై ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలను అన్వయిస్తూ ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. లాజికల్ రీజనింగ్: పేరాగ్రాఫ్ ఇచ్చి, దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. పేరాగ్రాఫ్‌ను బాగా చదివి అర్థం చేసుకుంటే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో విషయాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. వాదాలు, సంవాదాలతోపాటు నైపుణ్యాలను వెలికితీసే రీతిలో సూత్రాలు, సిద్ధాంతాల అప్లికేషన్సపై ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్: ఇందులో ఒక్కో అంశం నుంచి నాలుగు నుంచి తొమ్మిది ప్రశ్నలు వస్తాయి. ఇవి రీడింగ్, రీజనింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే తరహాలో ఉంటాయి. అవకాశాలెన్నో: లా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వరంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏపీపీఓ, మేజిస్ట్రేట్స్, సబ్-మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీలు, పరిపాలన ట్రైబ్యునల్స్‌లో పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. అలాగే ఐటీ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, ఆర్థిక సంస్థలు తదితరాల్లో లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్ల అవసరం పెరుగుతోంది. లా పూర్తి చేసినవారికి ఇదో చక్కని అవకాశం. దీంతోపాటు పబ్లిషింగ్ సంస్థలు, ఎన్జీఓలు , కాపీరైట్ సంస్థలు, పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. అలాగే లా గ్రాడ్యుయేట్లకు మన చట్టాలతో సరిపోలే బ్రిటన్‌లో అవకాశాలు అధికం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ లా యూనివర్సిటీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్‌లో విదేశీ సంస్థలు పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. సొంతంగా న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ముఖ్యతేదీలు: రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 1, 2015. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 28, 2015. పరీక్ష తేదీ: మే 17, 2015. ఫీజు: రూ. 3,800 ను చెక్కు/ డీడీ రూపంలో చెల్లించాలి. వివరాలకు: www.pearsonvueindia.com, www.barcouncilofindia.org - చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
ఇరుకు
విసుగ్గా వాచీ చూసుకున్నాను. రోజూ ఈపాటికి వచ్చేసేవాడు శంకరం, ఈ రోజింకా రాలేదు అనుకున్నాను. కారు ఏసీ చల్లదనం మెత్తగా స్పృశిస్తుంటే సెల్లో ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవటం మొదలుపెట్టాను. ఇంతకీ శంకర్రావు, నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇద్దరం సెక్షన్ ఇన్ఛార్జ్లమే. ఇద్దరివీ పక్క పక్క క్యూబికల్స్. శంకరం నాకన్నా ఐదారేళ్లు చిన్నవాడు. ప్రభుత్వం వారు సూచించినట్లు పూల్ ట్రాన్స్‌పోర్ట్‌లో భాగంగా ఇద్దరం ఆఫీసుకి ఒకే కారులో వెళ్తాం. నిజం చెప్పొద్దూ, ఇది నాకు సౌకర్యంగా ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. కారు నాది కాబట్టి పెట్రోల్ ఖర్చులో 60 శాతం శంకరానిది, నలభై శాతం నాది. మా ఇద్దరిళ్లు ఎదురెదురుగానే ఉంటాయి. నాది సొంతిల్లు. శంకర్రావు అపార్టుమెంటులో అద్దెకుంటున్నాడు. మా వ్యక్తిత్వాలు కూడా కలవవు. కానీ అవసరం మమ్మల్ని కలిపింది. శంకరానిది జాలి గుండె. చాలా సున్నితంగా ఉంటాడు. అతను మనసుతో ఆలోచిస్తాడు. నేను నా బ్రెయిన్ పవర్ ఉపయోగిస్తాను. ‘బీ ఏ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్’ అంటాన్నేను. మనిషి ఆలోచన ప్రాక్టికల్‌గా ఉండాలని బలంగా నమ్ముతాను. అందుకే ఆఫీసులో వీళ్లిద్దరికీ లంకె ఎలా కుదిరిందా అని ఆలోచిస్తారు. ఏదైనా పని చేయాలంటే నాకు గిఫ్టులు కావాలి. డబ్బులు బల్లమీదైనా పెట్టాలి. కాదంటే బల్ల కింద నుంచి ఇవ్వాలి. కొండకచో పార్టీలు ఇవ్వాలి. అవిచ్చేవాళ్లు నా ప్రాధాన్యత క్రమంలో ఉంటారు. అదే మీరు శంకరాన్ని కదిలించి చూడండి, ఎవరైనా ఒకటే అంటాడు. సీరియల్ నంబరు ప్రకారం వెళతానంటాడు. అందుకనే చాలామంది తమ ఫైల్స్ అతని టేబుల్ మీదకు కాకుండా నా టేబుల్ పైకి వస్తే బావుండనుకుంటారు. శంకరం టేబులంతా ఫైళ్లతో నిండిపోయి ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఆ ఫైల్ ముందుకు వెళుతుంది. దానికి చాలా సమయం పడుతుంది. అదే నా టేబుల్, కడిగిన ముత్యంలా ఉంటుంది. ప్రియుడి కోసం ఎదురుచూసే విరహ నాయికలా ఉంటుంది. శంకరం నా దారికి అడ్డురాడు కాబట్టి, నాకు అతనితో పేచీ లేదు. నేను సంపాదిస్తున్నాననే అసూయ అతనికి లేదు. నేనేం చెప్పినా వింటాడు. నాకో పెద్దరికమిస్తాడు. దానివల్ల నా అహం తృప్తిపడుతూనే ఉంటుంది. అసలు శంకరం ఆలస్యం చేస్తున్నందుకు ఈపాటికి నాకు కోపం వచ్చేయాలి కదా. దాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. శంకరం ఆలస్యంగా వచ్చినప్పుడల్లా, ‘కామత్’లో కట్లెట్, కాఫీ ఇప్పించాలి. ఇది మా ఒప్పందం అని నేను పైకి చెప్పినా, అది నేను పొందే లాభం. అదిగో వస్తున్నాడు శంకరం ఆయాసపడుతూ భుజానికి తగిలించుకున్న బ్యాగుతో. రా శంకరం... కామత్‌లో కాఫీ తాగి చాలా రోజులైంది అనుకున్నాను తృప్తిగా. ‘సారీ ఆనంద్... ఇవ్వాళ గురువారం కదా! కొంచెం చిల్లర తెచ్చుకునేటప్పటికి ఆలస్యమైంది’. కారు తలుపు తీసి లోపల కూర్చుంటూ అన్నాడు. గేరు మారుస్తూ, ఇవ్వాళ శంకరం ఆలోచనల రూట్ మార్చాలనుకున్నాను. ‘‘అది సరే శంకరం! ప్రతి వారం గుడి దగ్గర నువ్వు దానం చేసే మొత్తం ఓ వంద రూపాయలుంటుంది. నెలకు నాలుగు వందల చొప్పున లెక్కవేసినా సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు. పోనీ ఒక్క గురువారమేనా అంటే మళ్లీ శనివారం సాయంత్రం గుడికి వెళతావు. అక్కడ లెక్క వేరే. ఇలా నెలకి ఎనిమిది వందల రూపాయలు. దీనివల్ల ఎవరికి లాభం. పుణ్యం సంపాదించుకుని వచ్చే జన్మలో మరింత బాగా ఉండాలనా? లేదంటే పునర్జన్మ లేకుండా ఉండాలనా? అంటే నీ స్వార్ధం కోసమేగా ఈ దానాలు?’’ ఏసీ చల్లదనంలో శంకరానికి నా మాటలు చెమటలు పట్టిస్తాయనుకున్నాను. అందుకేనేమో వెంటనే సమాధానం ఇవ్వలేదు. రెండు నిమిషాలాగాడు. ‘‘ఆనంద్! పాప పుణ్యాల చిట్టా దగ్గర పెట్టుకుని నేనేదో ఇస్తున్నానని అనుకోవటం లేదు. ఎన్నో జన్మలెత్తిన తర్వాత మనిషి జన్మ ప్రాప్తిస్తుందని చదివాను. విన్నాను. వచ్చే జన్మలో ఎవరం ఎలా ఉంటామో తెలీదు. అసలు జన్మంటూ ఉంటుందో కూడా తెలీదు. ఇలా అందరికీ ఇవ్వు అని ఆ బాబా నన్ను ఆజ్ఞాపించాడనుకుంటున్నాను. ఇస్తున్నాను. మనం మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఒక పిజ్జానో, బర్గరో తింటే అయ్యే ఖర్చు కన్నా ఇది ఎక్కువని నేననుకోవటం లేదు.’’ శంకరం వాదన ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. అయినా అతనిలో ఏదో మార్పు తేవాలని నా వెర్రి ప్రయత్నం. ‘‘నువ్వు చెప్పిందే రైటనుకుందాం. నీ కుటుంబానికి ఇవ్వవలసిన ఆనందాన్ని, సుఖాన్ని ఆ మేరకు నువ్వు త్యాగం చేసినట్లే కదా!’’ ‘‘ఎంతసేపూ నేనూ నా కుటుంబం అని ఆలోచిస్తూ కూర్చుంటే సమాజం ఇలాగే ఉండేదా ఆనంద్?’’. ఈ శంకరం ఎప్పుడూ ఇంతే. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాననే ఒక భ్రమలో బతుకుతున్నాడు. ఇలాంటి వాళ్లని ఆ దేవుడు కూడా మార్చలేడని దృష్టి రోడ్డు మీద పెట్టాను. మొత్తానికి వీడి నోరు మూయించగలిగానని శంకరం కూడా అనుకుంటున్నాడేమో! శంకరం కూడా నాలాగే ఆలోచిస్తాడన్న నా పిచ్చి ఊహకు నాకే నవ్వొచ్చింది. ఇద్దరం మా క్యాబిన్లలో కూలబడ్డామో లేదో, మా ప్యూన్ సాయిలు వచ్చాడు డెరైక్టర్గారు రమ్మన్నారంటూ. క్రీగంట శంకరం వంక చూశాను. మొహంలో ఏ ఫీలింగూ లేదు. శంకరానికి మా బాగా క్లాసు పీకితే ఆనందించాలన్న కోరిక కలిగింది ఆ క్షణాన. గ్లాస్ డోర్ చప్పుడు చేయకుండా మమ్మల్ని లోపలికి నెట్టింది. ఒక్క క్షణం తలెత్తి చూశాడు బాస్. ‘టేక్ యువర్ సీట్స్’ అన్నాడే కాని చాలా అసహనం ధ్వనించింది ఆ గొంతులో. నేరుగా విషయంలోకి వచ్చేశాడాయన. ‘‘శంకరంగారూ! డెరైక్టరేట్ వాళ్లడిగిన స్టేట్మెంట్ ఎంతదాకా చేశారు. మీకు చెప్పి రెండు రోజులైంది. ఢిల్లీవాళ్లు ఫోన్ చేసి, ఇంకా అవ్వలేదా అంటున్నారు. అయినా మనకున్న ఇన్‌పుట్స్‌తో చెయ్యమన్నాను కదా. మీరేమిటి మొత్తం రికార్డులన్నీ తవ్విస్తున్నారట. ఆ తవ్వకాలు ఎప్పుడు పూర్తవుతాయి? మీ స్టేట్మెంట్ ఎప్పుడవుతుంది? ఎవడో ఢిల్లీలో కొత్తగా వచ్చాడు. వాడి ఉనికిని చాటుకోవటం కోసం ఇలాంటి అర్థం పర్థం లేనివి అడుగుతూ ఉంటాడు. అది వాడికీ తెలుసు, మనకూ తెలుసు. అక్కడ స్టేట్మెంట్ ఎంత కరెక్టుగా ఉన్నది అన్నదాని కంటే ఎంత తొందరగా పంపించామన్నది ప్రధానం. ఈ మాత్రం చిన్న లాజిక్ తెలుసుకోకపోతే ఎలా మీరు? ఆనంద్, ఆ స్టేట్మెంట్ మీరు తయారుచేయండి. సాయంత్రం లోపల పంపించాలి. నౌ యూ కెన్ గో’, నాకు ఆనందం కలిగించే ఆ నాలుగు మాటలు అని తన ఫైళ్లలో మునిగిపోయాడాయన. మహానుభావుడు అనుకున్నాను. శంకరం వంక చూశాను. మొహంలో ఏదైనా బాధ కనిపిస్తుందేమోనని. ఈయనా మహానుభావుడే, బాధను కూడా ఎంత జాగ్రత్తగా కనిపించకుండా దాస్తాడో అనుకున్నాను. మా డెరైక్టర్ మమ్మల్ని పిలవడం వెనుక అసలు కారణం నాకు తెలుసు. మెటీరియల్ పర్చేజ్‌కు సంబంధించి కొటేషన్లు తెప్పించటంలో కొంత మతలబు చేయాల్సి ఉంది. అది చేస్తే కాని మాకు గిట్టుబాటు కాదు. మా డెరైక్టర్ అనుకున్నట్లుగా శంకరం ఆ పని చేయటం లేదు. నువ్వు ఇలా ఎందుకు నేను చెప్పినట్లు చెయ్యవు అని మా బాస్ శంకరాన్ని అడగలేడు. అక్కసంతా ఇలా వెళ్లగక్కుతున్నాడు. నిజానికి స్టేట్మెంట్ అనేది ఆయన అల్లిన ఒక అందమైన కథ. శంకరాన్ని నా ముందు అవమానపరిస్తే కానీ ఆయన శాంతించడు. ఆ విషయం నాకర్థమైంది. నేనూ, శంకరం మా క్యాబిన్‌కు వచ్చాం. ప్యూన్ని పంపించి, శంకరానికి హితబోధ చేశాను. ‘‘చూడు శంకరం! మన బాస్ నువ్వు ఆయనకు అనుకూలంగా, ఆయన అనుకున్నట్లుగా పని చేయాలని ఆశిస్తున్నాడు. ఆ కొటేషన్ల విషయంలో చూసీ చూడనట్లు పోవచ్చు కదా!’’ ‘‘ఆనంద్! నేను రూల్‌కు విరుద్ధంగా చేస్తే చెప్పండి వింటాను. కొటేషన్లు, టెండర్ల విషయంలో కొన్ని పద్ధతులుంటాయి కదా. వాటిని పాటించాలి కదా. పోనీ ఆయనకు నేను నచ్చకపోతే, ఆ సీటు నుంచి నన్ను తప్పించొచ్చు కదా!’’ అవును నిజమే కదా అనుకున్నాను. పర్చేజ్‌కు సంబంధించి శంకరం నిష్ణాతుడు. బాస్ చెప్పినా వినకపోవడం అన్న తిక్కను తీసేస్తే మిగిలినవన్నీ అతను చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. వంక పెట్టడానికి వీల్లేదు. ఆ సంగతి మా డెరైక్టర్‌కు కూడా తెలుసు. ఇంకేం మాట్లాడతాను! ‘‘శంకరం మనకు నష్టం కలగనంత వరకు బాస్ చెప్పినట్లు చేయటంలో తప్పేమీ లేదు కదా’’ అనునయంగా అన్నాను. ‘‘ఆడిట్లోనో, విజిలెన్సులోనో బయటపడితే దానికి పేచీ ఎవరిది? అదే కాదు, అంతరాత్మను మోసం చేసుకుంటూ నేనలాంటి పనులు చేయలేను.’’శంకరం అన్న ఈ మాటలకి నా దగ్గర సమాధానం లేదు.నేనూ, శంకరం ఇద్దరం క్లాస్ వన్ ఆఫీసర్లమే. కానీ నాకు, అతనికి ఎంత తేడా! నేను ఏది చేసినా నా లెక్కలు నాకుంటాయి. లేకపోతే మంచి కారు, మంచి అపార్ట్మెంట్ ఎక్కడొచ్చేవి! శంకరంలాగా అద్దె కొంపలోను, అరువు కారులోను బతుకు బండి లాగిస్తుండేవాడిని అనుకున్నాను. అందుకే నేనంటే భయపడతారు. శంకరం అంటే జాలిపడతారు. శంకరాన్ని రాత్రికి ఇంటికి ఆహ్వానించాను. ఓ క్లయింటుని సతాయిస్తే స్కాచ్ బాటిల్ ఒకటి సమర్పించుకుని వెళ్లాడు. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నాను. శంకరం తీసుకోడు కానీ నా ఎద సొదంతా వింటాడు. అక్కసంతా భరిస్తాడు. శంకరం మంచితనం, నిజాయితీ అంటే నా గుండె లోతుల్లో ఎక్కడో చిన్న సెగ రగులుతోంది. దాన్ని మింగలేను, కక్కలేను. ఈ రోజు అతని నిజాయితీ మూలాల అంతు తేల్చాలనుకున్నాను. నాకున్న మొహమాటం మొదటి డ్రింకుతో పోయింది. రెండో డ్రింకు కలుపుకుని అతడికో లైమ్ జ్యూస్ గ్లాసుని మళ్లీ నింపుతూ అడిగాను, ‘‘ఇప్పుడు చెప్పు శంకరం. ఇంత మంచితనం సిన్సియారిటీ అవసరమంటావా?’’ ‘‘ఆనంద్, మీకో విషయం చెప్పాలి. మీరెలా పెరిగారో, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో నాకు తెలీదు గానీ, నా జీవితం అంత సుఖంగా గడవలేదు. మాదో పేద కుటుంబం. పెద్ద కుటుంబం కూడా. చదువుకోసం చాలామంది దాతల మీద ఆధారపడ్డాను. మాలాంటి పేద విద్యార్థులకున్న ఓ వసతి గృహంలో చేరాను. నెల నెలా దాతల ఇళ్లకెళ్లి డబ్బులు తెచ్చుకుని దాంతోటి ఆ వసతి గృహాన్ని నడిపేవాళ్లం. ఈ క్రమంలో కొంతమంది విసుక్కునేవాళ్లు. కొంతమంది మర్యాదగా మాట్లాడి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు అయిన తరువాత వారి దయా దాక్షిణ్యాలతో అక్కడే ఉండి పోటీపరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నవాడిని. ఇప్పుడు చెప్పండి. ఆ అనాథాశ్రమం నన్ను అక్కున చేర్చుకోకపోయినా, దాతలు నాలుగు మంచి మాటలు చెప్పకపోయినా నేనీ స్థాయికి వచ్చేవాడినా! సమాజం పట్ల కృతజ్ఞత చూపకుండా ఎలా ఉంటాను! ఆదర్శవంతంగా జీవించకుండా నాలాంటి అనేక మందికి ఎలా సహాయపడగలను! నేనెక్కడైతే ఉండి చదువుకున్నానో దాని బాగోగులు చూస్తున్నాను. గుడికి ఎందుకు వెళతానంటారా! చాలా మంది అనాథలు గుడికి వచ్చినవారు తమకేదన్నా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. నేను వారికోసం వెళుతుంటాను. దానితో పాటు నన్ను మనిషిగా పుట్టించినందుకు ఆ బాబాకు నా కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పండి నేను చేసే దాంట్లో తప్పేముందో.’’ శంకరం మాటలు స్కాచ్ విస్కీ అందిస్తున్న మత్తుని, హాయిని కరిగించేశాయి. ఇదన్నమాట శంకరం బిడియం, నెమ్మదితనం, బెరుకు వెనకున్న అసలు కథ. అందుకే అతని గురించి ఎవరేమనుకున్నా తను అనుకున్న గమ్యం వైపు నెమ్మదిగా సాగుతున్నాడు. ఇలా తనకు తాను ఒక ఆదర్శాల చట్రాన్ని సృష్టించుకుని ఆ ఇరుకులోనే సుఖం పొందుతున్నాడు. సెంటిమెంటల్ ఫూల్ అనుకున్నాను.ఓదార్పుగా అతని భుజం తట్టాను. ఆ తర్వాతి గురువారం నాటికి శంకరం ముఖ్యమైన పనిమీద ఢిల్లీ వెళ్లాడు. శంకరం లేకుండా అలవాటు ప్రకారం గుడికి నేనొక్కడినే వెళ్లాను. నా అవినీతి సంపాదనకు రక్షణ కల్పించమనీ, ఆ సంపాదన తగ్గకుండా చూడమనీ కోరటం నాకలవాటు. అది ముగించుకుని బయటకు వస్తూ, శంకరం స్నేహితులు అదే ఆ బిచ్చగాళ్లందరూ ఏం చేస్తున్నారా అని గమనించాను. రెండు వరుసల్లో కూర్చున్నారు వాళ్లు. ఓ ఇరవై మందుంటారేమో. ఆడవాళ్లంతా ఒకవైపు, మగవాళ్లు ఒకవైపు. దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, అందరి చేతుల్లో చిన్న చిన్న బొచ్చెలు. మగవాళ్లయితే మాసిపోయిన గడ్డాలు, తైల సంస్కారం లేని జుట్టు. మొత్తంగా మురికి పేరుకుపోయిన శరీరాలు వాళ్లందరివి. కొంచెం పరీక్షగా చూసేసరికి నాకు ఒళ్లు జలదరించింది. శంకరం రాకపోవటం వలన వాళ్లు నిరాశ చెందినట్లున్నారు అనుకున్నాను. వారిలో ఓ ముగ్గురు నా వెనకే రావటం గమనించాను. కొంపదీసి నన్ను డబ్బులడగరు కదా అనుకున్నాను. కారు తలుపు తీసి లోపల కూర్చుని కారు ఇగ్నేషన్ కీ తిప్పేలోపు బాగా దగ్గరకు వచ్చారు వాళ్లు.‘‘బాబూ, మీతో పాటు వచ్చే అయ్య రాలేదా ఇయ్యాల’’ వాళ్లలో ఒకతను అడిగాడు.‘‘రాలేదు’’ అన్నాను. ‘‘ఆ అయ్య మంచిగనే ఉన్నాడు కదయ్యా’’ ఈసారి ఇంకోడడిగాడు. ‘‘ఏం ఇవ్వాళ మీ పైసలు మీకు రాలేదనా?’’ ఎంత అణుచుకున్నా వెటకారం దాగలేదు. వారానికోసారి చిల్లర డబ్బులిచ్చేవాడిని అంత ప్రేమగా వాళ్లు తలచుకోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇగ్నేషన్ కీ తిప్పాను. ఇంజన్ మొరాయిస్తోంది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవటం లేదు. నాలో అలజడి మొదలైంది. వాళ్లు ముగ్గురూ నా వంకే చూస్తున్నారు. నాకు పట్టుదల పెరిగింది. చెమటలు పడుతున్నాయి కాని కారు కదలటం లేదు. మొరాయింపు ఆగటం లేదు. ఈసారి వాళ్లు ధైర్యం చేసి అడిగారు. ‘‘అయ్యా బండి తోస్తే కానీ కదలదేమో. ఒక్క నిమిషం మీరు అట్నే కూర్చోండి. మేం బండిని తోస్తాం’’. శుష్కించిపోయిన వాళ్ల శరీరాలు ఈ హెవీ వెయిట్ కారును నెట్టగలవా అని తొలుస్తున్నా, అక్కడ నా అహం కన్నా అవసరం ముఖ్యం కాబట్టి నీరసంగా తలూపాను. వాళ్ల తోపుకు బండి ఇరవై అడుగులు ముందుకు కదలగానే, గేరు వేశాను. ఇంజన్ గుర్రంలా సకిలించింది. కారు ముందుకు కదిలింది. న్యూట్రల్లో ఉంచి తలుపు తీసి బయటకు వచ్చి చేతులు జోడించాను. సిగ్గుతో జేబులోంచి పర్సు తీయబోయాను. ‘‘వద్దయ్యా. మా సారును తీసుకొచ్చే కారిది. ప్రతివారం మేం జూస్తుంటాం సార్, ఆ సార్ ఎప్పుడొస్తడాని. మమ్మల్ని నవ్వుతూ పలకరిస్తాడు. వచ్చేవారమొస్తడు కదు సార్. రమ్మని జెప్పుర్రి అయ్యా! మేము ఎదురుజూస్తుంటాం ఆ సార్ కోసం.’’ నా మాట కోసం ఎదురు చూడకుండానే వెళ్లిపోయారు వాళ్లు. శంకరాన్ని తలుచుకున్నప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన మెరుపు నా కళ్లు తెరిపించింది. శంకరంలో ఏమిటి గొప్ప అని నన్ను తొలిచే ప్రశ్నకు ఆ ముగ్గురి కళ్లలోని మెరుపే నాకు సమాధానం చెప్పినట్లనిపించింది. లోపలి ఇరుకేదో వదులయింది. - సి.ఎస్.రాంబాబు -
ఇక అధికారిక ఈ-మెయిళ్లన్నీ ‘ఎన్ఐసీ’ ద్వారానే...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వాధికారులు ఇకపై ప్రభుత్వం నిర్వహించే ఒకే ఈ-మెయిల్ సర్వీసు ద్వారానే అధికారిక ఈ-మెయిళ్లు పంపాలి. ఇందుకుగాను నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) రూపొందిస్తున్న ఈ-మెయిల్ సర్వీసు ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఈ-మెయిళ్లు పంపుకునేందుకు జీమెయిల్, యాహూ, హాట్ మెయిల్ వంటి సర్వీసులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కంపెనీలన్నీ విదేశాలకు చెందినవి కావడం, వాటి సర్వర్లు కూడా విదేశాల్లోనే ఉన్న నేపథ్యంలో కీలక, రహస్య సమాచార చౌర్యానికి ఆస్కారం ఉండటంతో వాటిని అధికారిక మెయిళ్ల కోసం ఉపయోగించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విభాగం(డీఈఐటీవై) ఓ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసిందని, దీనిపై మంత్రుల అభిప్రాయాలను కోరుతోందని ఆ విభాగం కార్యదర్శి జె.సత్యనారాయణ వెల్లడించారు. దీని అమలుకు రూ.50-100 కోట్లు ఖర్చు కానుందన్నారు.