న్యూఢిల్లీ: భారత్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు తమకు వచ్చే ఫేక్ ఈ–మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్ల వంటి వాటిని చూసినపుడు అందులోని సాఫ్ట్‌వేర్ ద్వారా వెబ్‌కామ్ వాడి దాన్ని వీక్షిస్తున్న వ్యక్తి వీడియోను రికార్డు చేస్తారు. అనంతరం దాన్ని ఆ వ్యక్తికి పంపి, ఫేస్‌బుక్ మిత్రులు, బంధువులకు షేర్ చేస్తామంటూ ఆ వ్యక్తిని బెదిరిస్తారు. షేర్ చేయకుండా ఉండాలంటే డబ్బును 24 గంటల్లోగా ఇవ్వాలని, అదికూడా క్రిప్టో కరెన్సీలోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ తతంగమంతా ఈ–మెయిల్‌లో నడిపిస్తారు. ఇలాంటి ఈ–మెయిల్స్ వస్తే భయపడవద్దని సీఈఆర్టీ–ఇన్ సూచించింది. తమకు పాస్‌వర్ట్‌లు తెలుసని బెదిరిస్తే వెంటనే పాస్‌వర్ట్‌లు మార్చుకోవాలని ఇంటర్నెట్ యూజర్లకు సీఈఆర్టీ–ఇన్ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment