Fake Email IDs
-
ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్!
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! ‘ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్‌ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్‌కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్‌ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్‌ను పంపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా ఫేక్.. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్‌లను పంపలేదని తేల్చింది. An E-mail claims that the recipient is entitled to a refund of ₹41, 104, and is seeking his/her personal details in the name of @IncomeTaxIndia#PIBFactCheck ✔️This claim is fake ✔️Report such suspicious emails at 'webmanager@incometax.gov.in' pic.twitter.com/bWgJT7iNbo — PIB Fact Check (@PIBFactCheck) March 20, 2023 ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు. ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వాటికి స్పందించవద్దు. అటాచ్మెంట్లు మీ కంప్యూటర్‌కు హాని కలిగించే హానికరమైన కోడ్‌ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్‌లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ -
'నీకు కరోనా రాను'
సాక్షి, సిటీబ్యూరో : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈఎస్ఐ మెడికల్ కాలేజీ డీన్ శ్రీనివాస్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. నకిలీ ఈ–మెయిల్ ఐడీలు సృష్టించిన నేరగాళ్లు ఆయనకు బెదిరింపులు, శాపనార్థాలతో కూడిన మెయిల్స్ పంపుతున్నారు. కొన్నింటిలో ‘నీకు కరోన రాను’తో పాటు మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో డీన్ తరఫున ఆ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ బబ్డే గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరబాద్ : యూట్యూబ్ చానల్లో తాను చేసిన కామెంట్ల ఆధారంగా తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్న వారిపై ఓ మహిళా న్యాయవాది సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో మరో కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రాయల్ సుందర్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆయన వినియోగిస్తున్న ఓల్వో కారుకు రూ. 20 వేల రాయితీతో బీమా చేస్తామని చెప్పారు. ఇలా ఆ యజమానిని నమ్మించి ఆయన నుంచి రూ. 98 వేలు కాజేశారు. ఛత్రినాక ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన స్థలంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పేరుతో ఆరు నెలల కాలంలో రూ. 1.09 లక్షలు కాజేసి మోసం చేశారు. మరో ఉదంతంలో బేగంపేట ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులంటూ ఎర వేశారు. అతడి నుంచి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ ఉదంతాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. -
సల్మాన్ పేరుతో మోసం!
‘‘నా పేరుని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సల్మాన్‌ఖాన్. ‘సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్’(ఎస్కేఎఫ్) అనే నిర్మాణ సంస్థను స్థాపించి సల్మాన్ సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎస్కేఎఫ్’లో నిర్మించనున్న సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా పలువురికి ఫేక్ ఈ–మెయిల్స్ అందుతున్నాయట. ఈ విషయంపై సల్మాన్ స్పందించారు. ‘‘నేను నటించబోతున్న సినిమాల్లో కానీ, ఎస్కేఎఫ్ సంస్థలో నిర్మించబోతున్న సినిమాల కోసం కానీ ప్రస్తుతం ఏ క్యాస్టింగ్ (నటీనటుల ఎంపిక) జరగడం లేదు. మేం ఎటువంటి క్యాస్టింగ్ ఏజెంట్స్‌ని నియమించలేదు. మా సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా వస్తున్న ఈ మెయిల్స్, మెసేజ్‌లను, వార్తలను నమ్మవద్దు. ఎస్కేఎఫ్ బ్రాండ్‌ను, అలాగే నా పేరును దుర్వినియోగం చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. -
ఫేక్ ఈమెయిల్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: భారత్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు తమకు వచ్చే ఫేక్ ఈ–మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. ఇంటర్నెట్లో అశ్లీల వెబ్సైట్ల వంటి వాటిని చూసినపుడు అందులోని సాఫ్ట్వేర్ ద్వారా వెబ్‌కామ్ వాడి దాన్ని వీక్షిస్తున్న వ్యక్తి వీడియోను రికార్డు చేస్తారు. అనంతరం దాన్ని ఆ వ్యక్తికి పంపి, ఫేస్బుక్ మిత్రులు, బంధువులకు షేర్ చేస్తామంటూ ఆ వ్యక్తిని బెదిరిస్తారు. షేర్ చేయకుండా ఉండాలంటే డబ్బును 24 గంటల్లోగా ఇవ్వాలని, అదికూడా క్రిప్టో కరెన్సీలోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ తతంగమంతా ఈ–మెయిల్లో నడిపిస్తారు. ఇలాంటి ఈ–మెయిల్స్ వస్తే భయపడవద్దని సీఈఆర్టీ–ఇన్ సూచించింది. తమకు పాస్‌వర్ట్‌లు తెలుసని బెదిరిస్తే వెంటనే పాస్‌వర్ట్‌లు మార్చుకోవాలని ఇంటర్నెట్ యూజర్లకు సీఈఆర్టీ–ఇన్ సూచించింది. -
డిస్ప్లే నేమ్‌తో దోచేశారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సోమాజిగూడ కేంద్రంగా పని చేసే పిట్టీ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్ళు నకిలీ ఈ–మెయిల్ ద్వారా టోకరా వేశారు. ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పేరును డిస్ప్లే నేమ్‌గా పెట్టి బోగస్ మెయిల్ ఐడీ సృష్టించారు. దీని ఆధారంగా దాని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు (సీఎఫ్ఓ) మెయిల్ పంపించి రూ.6.8 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. చివరకు విషయం తెలుసుకున్న పిట్టీ సంస్థ నిర్వాహకులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో బుధవారం కేసు నమోదైంది. పిట్టీ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థకు శరద్ బి.పిట్టీ సీఎండీగా, ఎన్కే ఖండెల్వాలా సీఎఫ్ఓగా పని చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరి మెయిల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ళు అందులోని ఉత్తరప్రత్యుత్తరాలు, వారు వినియోగించే భాష, ఏర్పాటు చేసుకున్న డిస్ప్లే నేమ్స్ తదితర అంశాలు పరిశీలించారు. ఎవరికీ అనుమానం కాకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్ళు వీళ్ళ ఇన్బాక్సుల్లోని అన్రెడ్ మెయిల్స్ జోలికి వెళ్ళలేదు. వాటిని తెరిస్తే అనుమానం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో అప్పటికే వాళ్ళు చదివేసిన మెయిల్స్‌ను (రెడ్) మాత్రమే పరిశీలించారు. దీని ఆధారంగా వారి ఉత్తరప్రత్యుత్తరాలపై సైబర్ నేరగాళ్ళు ఓ స్పష్టత సాధించారు. ఆపై మరో అంకం ప్రారంభించిన సైబర్ క్రిమినల్స్ శరద్ బి.పిట్టీ అనేది డిస్ప్లే నేమ్‌గా కనిపించేలా (hortensiacgarcia@cox.net) పేరుతో ఈ–మెయిల్ ఐడీ సృష్టించారు. ఒకే డిస్ప్లే నేమ్స్ ఎందరైనా పెట్టుకునే అవకాశం ఉండటం వీరికి కలిసి వచ్చింది. దీని ఆధారంగా మంగళవారం ఉదయం 11.18 నిమిషాలకు సీఎఫ్ఓకు మెయిల్ పంపారు. తన ఐ–ఫోన్లో ఈ మెయిల్‌ను చూసిన ఆయన కేవలం డిస్ప్లే నేమ్ ఆధారంగా అది తన సీఎండీ పంపినట్లు ఆయన భావించారు. అందులో ఉన్న అంశాలను పరిశీలించగా.. తాను మీటింగ్స్‌లో బిజీగా ఉన్నానని, ఓ ఖాతాకు రూ.6.8 లక్షలు తక్షణం బదిలీ చేయాలంటూ ఉంది. ఇది తన యజమాని నుంచే వచ్చి ఉంటుందని భావించిన ఖండెల్వాలా ఏ ఖాతాకు పంపాలంటూ? జవాబు ఇచ్చారు. దీన్ని అందుకున్న సైబర్ నేరగాళ్ళు పిట్టీ సంస్థ సీఎండీ మాదిరిగానే ముంబైకి చెందిన లక్ష్మీ ట్రేడర్స్ అనే సంస్థకు పంపాలంటూ మరో మెయిల్ పంపారు. ఆ వెంటనే నగదు పంపావా? అలా చేస్తే ఆ విషయం నాకు చెప్పాలి... అంటూ మరో సందేశాన్నీ పంపారు. ఇవన్నీ తన సీఎండీ నుంచే వస్తున్నాయని భావించిన ఖండెల్వాలా రూ.6.8 లక్షల్ని సదరు ఖాతాలోకి బదిలీ చేశారు. ఆ ఖాతా కరెంట్ అకౌంట్ కావడంతో ఖండెల్వాలాకు అనుమానం కూడా రాలేదు. ఇదే విషయాన్ని తన యజమానిగా భావిస్తూ సైబర్ నేరగాళ్ళకూ సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత తన యజమానిని సంప్రదించిన సీఎఫ్ఓ మీరు చెప్పినట్లే నగదు బదిలీ చేశానంటూ చెప్పారు. తాను అలాంటి మెయిల్స్ ఏవీ పంపలేదని ఆయన చెప్పడంతో అవాక్కైన సీఎఫ్ఓ తనకు వచ్చిన వాటిని చూపించారు. దీంతో మోసపోయామని భావించిన పిట్టీ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఎన్.మోహన్‌రావు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి లక్ష్మీ ట్రేడర్స్ పేరుతో ఉన్న ఖాతా ముంబైలోని అం«థేరీ వెస్ట్‌లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేరగాళ్ళను పట్టుకోవడానికి సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. పూర్తిగా సరి చూసుకోవాల్సిందే ఈ తరహా సైబర్ నేరాల బారిన ప్రస్తుతం అనేక సంస్థలు పడుతున్నాయి. ఒకే పేరు ఈ–మెయల్ ఐడీని వేర్వేరు వ్యక్తులు క్రియేట్ చేసుకోవం సా«ధ్యం కాదు. అలా చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ‘దిస్ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్. ట్రై అనెదర్’ అంటూ సందేశం వస్తుంది. అయితే ఒకే డిస్ప్లే నేమ్‌ను ఎందరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్నే సైబర్ నేరగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఈ–మెయిల్స్‌కు స్పందించే ముందు వాటిని పూర్తిగా ఓపెన్ చేయాలి. కేవలం డిస్ప్లే నేమ్ మాత్రమే చూసి కాకుండా పూర్తి మెయిల్ ఐడీ, అందులోని స్పెల్లింగ్స్ క్షుణ్ణంగా పరిశీలించాలి. అవసరమైతే ఎదుటి వ్యక్తిని నేరుగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించి, ఖరారు చేసుకున్నాకే నగదు బదిలీ చేయాలి. ఆయా సంస్థలు పటిష్టమైన ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకుని హ్యాకింగ్‌కు గురికాకుండా చూసుకోవాలి.– ఎన్.మోహన్‌రావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
జనరల్ మేనేజర్‌పై పగబట్టిన మేనేజర్
సాక్షి, సిటీబ్యూరో: పిల్లల చదువు కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బదిలీ కోరాడు ఓ మేనేజర్....దీనికి జనరల్ మేనేజర్ అంగీకరించకపోవడంతో ఉద్యోగం వదిలేశాడు...ఆ జీఎం ఉద్యోగం పొగోట్టాలని కుట్ర చేసి తానే ఇరుక్కున్నాడు..సంస్థ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు...నకిలీ ఈ–మెయిల్ సృష్టించడం ద్వారా సైబర్ నేరానికి పాల్పడిన ఆ మాజీ ఉద్యోగిని పట్టుకున్నారు. ఇతన్ని నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. బేగంపేట కేంద్రంగా పని చేసే వసంత్ కెమికల్స్ సంస్థకు నగరంలోని జీడిమెట్లతో పాటువిశాఖపట్నంలో తయారీ యూనిట్స్ ఉన్నాయి. ఈ సంస్థ దేశంతో పాటు విదేశాల్లోని అనేక పరిశ్రమలకు రసాయనాలు సరఫరా చేస్తుంటుంది. వసంత్ కెమికల్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్‌కు సత్యనారాయణ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇదే యూనిట్లో అనకాపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌గా పని చేసే వారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ కొన్నాళ్ళుగా వసంత్ కెమికల్స్‌లోని విధులు నిర్వర్తిస్తున్నారు. (తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం) శ్రీనివాస్‌రెడ్డి తన పిల్లల చదువు నిమిత్తం తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాలంటూ పలుమార్లు సత్యనారాయణను కోరారు. అయితే అనివార్య, పరిపాలన కారణాల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదు. దీంతో గత ఏడాది డిసెంబర్ 31న శ్రీనివాస్‌రెడ్డి వసంత్ కెమికల్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే తనను బదిలీ చేయకపోవడానికి, రాజీనామా చేయడానికి జీఎం సత్యనారాయణే కారణమనే భావనలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఆయనపై కక్షకట్టారు. ఎలాగైనా ఆయన ఉద్యోగం కూడా పోగొట్టాలనే కుట్రపన్ని సత్యనారాయణ పేరుతో ఓ నకిలీ ఈ–మెయిల్ ఐడీ సృష్టించారు. దీన్ని వినియోగించి వసంత్ కెమికల్స్ నుంచి నిత్యం రసాయనాలు ఖరీదు చేసే విదేశీ పరిశ్రమకు మెయిల్ పంపారు. తాము తయారు చేస్తున్న ఉత్పత్తులు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదని, ఇకపై వాటిని ఖరీదు చేయవద్దంటూ అందులో ఆరోపించాడు. దీన్ని అందుకున్న విదేశీ సంస్థ విశ్వసనీయతను సందేహించింది. (బాలునిపై అమానుషం ) అనుమానాలు నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో వసంత్ కెమికల్స్‌ను సంప్రదించింది. దీని యాజమాన్యం సత్యనారాయణ నుంచి వివరణ కోరడంతో అది ఆయన పేరుతో సృష్టించిన నకిలీ ఈ–మెయిల్‌గా తేలింది. దీంతో వసంత్ కెమికల్స్ యాజమాన్యం గత వారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. సదరు ఈ–మెయిల్ సృష్టించడానికి, మెయిల్ పంపడానికి వినియోగించిన ఐపీ అడ్రస్‌ల ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి నిందితుడిగా తేల్చారు. ఆయన్ను పట్టుకున్న దర్యాప్తు అధికారులు నిందితుడిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నేరానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించడం ద్వారా దర్యాప్తు పూర్తి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి :ఘోరం: చిన్నారిని బలి తీసుకున్న చిరుత -
మాయమాటలతో పౌండ్లు ఎర.. రూ.లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు... మిలియన్ల పౌండ్లకు వారసురాలివని, సుఫారీ గెల్చుకున్నావని చెప్పి ఇద్దరు మహిళలను నిండా ముంచారు. చిరుద్యోగులైన వీరిద్దరిలో ఒకరి నుంచి రూ.3.5 లక్షలు, మరొకరి నుంచి రూ.3 లక్షలు కాజేశారు. చివరకు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో సోమవారం కేసులు నమోదయ్యాయి. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న రేష్మ అనే యువతికి కొన్ని రోజుల క్రితం డాక్టర్ ఫెడరిక్ పేరుతో ఈ–మెయిల్ వచ్చింది. అందులో భారత్‌కు చెందిన సత్యేంద్ర చంద్రశేఖర్ పేరుతో లండన్‌లోని సెయిన్స్ బెర్రీ బ్యాంక్‌లో 3.1 మిలియన్ పౌండ్ల డిపాజిట్ ఉందని రాశాడు. ఆయన చనిపోయే వరకు నామినీ ఎవరనేది స్పష్టం చేయకపోవడంతో చట్టబద్ధమైన వారసుల వివరాలు బ్యాంకు రికార్డుల్లో లేవని చెప్పాడు. తాను అదే బ్యాంకులో పని చేస్తున్నందున ఈ విషయం తనకు మాత్రమే తెలిసిందని చెప్పాడు. ఆ మొత్తం సొంతం చేసుకునేందుకు ఆమెను వారసురాలిగా మారుస్తానని, అందుకు పూర్తి సహకారం ఇస్తానంటూ ఎరవేశాడు. తాను పంపే సత్యేంద డెత్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలను పొందుపరుస్తూ సదరు బ్యాంకునకు దరఖాస్తు చేయాలని సూచించాడు. వాటిని పంపుతూ ఆ బ్యాంకునకు చెందినదే అంటూ ఓ ఈ–మెయిల్ అడ్రస్ కూడా అందులో ఉంచాడు. అతని మాటలు నమ్మిన రేష్మ ఫెడరిక్ పంపిన ఆధారాలను జతచేస్తూ బ్యాంకునకు ఈ–మెయిల్ పంపించింది. మీ దరఖాస్తును పరిశీలిస్తున్నామంటూ బ్యాంకు అధికారులు పంపినట్లు రేష్మకు ఈ–మెయిల్ రూపంలో సమాధానం వచ్చింది. కొన్ని రోజులకు దరఖాస్తు అప్రూవ్ అయిందని, సత్యేంద్ర ఖాతాలోని పౌండ్లను తాత్కాలికంగా ఢిల్లీలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులోకి బదిలీ చేశామంటూ మరో సందేశం వచ్చింది. ఈ డబ్బు రూపాయల్లోకి మార్చి, సొంత ఖాతాలోకి తెచ్చుకోవడానికి సంప్రదించాలంటూ ఓ వెబ్సైట్ లింకును, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను పంపారు. దీంతో రేష్మ నగదు బదిలీకి ప్రయత్నాలు ప్రారంభించింది. కొంత వరకు బదిలీ అయినట్లు ఈ వెబ్‌పేజ్‌లో కనిపించిన తర్వాత కాస్ట్ ట్రాన్స్ఫర్ కోడ్ ఎంటర్ చేయాలంటూ హఠాత్తుగా బదిలీ ఆగిపోయింది. దీంతో ఆమె గతంలో బ్యాంకు అధికారులుగా తనను సంప్రదించిన వారికి ఫోన్ చేయగా, రూ.86 వేలు డిపాజిట్ చేస్తే ఆ కోడ్ తెలుస్తుందంటూ చెప్పడంతో నగదు డిపాజిట్ చేసింది. ఇలా వివిధ రకాల పేర్లతో రూ.3.5 లక్షలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన రేష్మ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వస్త్రాలు కొంటే కారు వచ్చిందంటూ... నగరంలోని ఓ హాస్పిటల్లో నర్సుగా పని చేస్తున్న మున్నీ ఇటీవల స్నాప్‌డిల్ సైట్ ద్వారా వస్త్రాలు ఖరీదు చేశారు. ఆ మరునాడే ఆమె సెల్‌ఫోన్‌కు ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది. స్నాప్‌డీల్‌లో ఖరీదు చేసిన నేపథ్యంలో లక్కీ డ్రాలో టాటా సఫారీ కారును గెలుచుకున్నారని, దానికోసం ఫలానా నెంబర్లో సంప్రదించాలని ఉంది. తొలుత ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకున్నా... పదేపదే సందేశాలు రావడం, టోల్‌ఫ్రీ నెంబర్లు పొందుపరిచి ఉండటంతో సంప్రదించింది. అవతలి వ్యక్తులు మీకు కారు కావాలా? దాని విలువకు సమానమైన నగదు కావాలా? అని కోరడంతో మున్నీ నగదే కావాలని పేర్కొంది. దీంతో మీ పేరుతో ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఉంటే అందులోకి నగదు బదిలీ చేస్తామంటూ చెప్పారు. ఖాతా వివరాలు పంపడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరారు. దీంతో ఆమె ఒడిస్సాలో ఉన్న తన భర్తకు చెందిన ఎస్బీఐ ఖాతా వివరాలను పంపారు. కొన్ని రోజులకు మరోసారి సంప్రదించిన సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ ప్రక్రియ తాత్కాలింకగా ఆగిందని సూచించారు. పూర్తికావాలంటే జీఎస్టీ సహా వివిధ పన్నులు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. అనంతరం వివిధ పేర్లతో మున్నీ నుంచి రూ. 3.06 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్‌లోని పంచ్ ముఠాలు ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
చందాకొచ్చర్ పేరుతో మోసం
సాక్షి ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్ పేరుతో బోగస్ ఈ-మెయిల్ ఐడీ తయారు చేసి వినియోగదారులను దోచుకునేందుకు ప్రయత్నించిన నైజీరియా రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నైజీరియన్‌తోపాటు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. జీమెయిల్, లైవ్ డాట్ కామ్, 163 డాట్ కామ్ తదితర మెయిల్ సర్వీసులను ఉపయోగించి ‘కొచ్చర్’ పేరిట సదరు ఈ ముఠా ఎనిమిది ఈ-మెయిల్ ఐడీలను తయారు చేసింది. బ్యాంక్ దగ్గరున్న రూ.50 కోట్ల రహస్య నిధిని దక్కించుకునేందుకు తమను సంప్రదించాలని దొంగ మెయిళ్లను పంపింది. ఈ విషయం గమనించిన ఐసీఐసీఐ అధికారులు సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నిపుణులు ఏ డేటాకార్డు నుంచి మెయిల్ పంపారో తెలుసుకున్నారు. అది బెంగళూరు ఏటీఎస్ డేటాకార్డు డీలర్ రతీష్ కరగప్పదని తేలింది. రతీష్తోపాటు అతని దగ్గర పనిచేసే వ్యక్తిని, కార్డు ను కొనుగోలు చేసిన నైజీరియన్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ ముఠా మెయిళ్లను నమ్మి ఎవరైనా మోసపోయారా అనేకోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నా మని సైబర్‌సెల్ అధికారి నందకిషోర్ తెలిపారు.