చందాకొచ్చర్ పేరుతో మోసం | Nigerian national creates fake email IDs of ICICI Bank chief Chanda Kochhar | Sakshi
Sakshi News home page

చందాకొచ్చర్ పేరుతో మోసం

Published Sat, Nov 16 2013 1:20 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

చందాకొచ్చర్ పేరుతో మోసం - Sakshi

చందాకొచ్చర్ పేరుతో మోసం

సాక్షి ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్ పేరుతో బోగస్ ఈ-మెయిల్ ఐడీ తయారు చేసి వినియోగదారులను దోచుకునేందుకు ప్రయత్నించిన నైజీరియా రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నైజీరియన్‌తోపాటు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. జీమెయిల్, లైవ్ డాట్ కామ్, 163 డాట్ కామ్ తదితర మెయిల్ సర్వీసులను ఉపయోగించి ‘కొచ్చర్’ పేరిట సదరు ఈ ముఠా ఎనిమిది ఈ-మెయిల్ ఐడీలను తయారు చేసింది.
 
బ్యాంక్ దగ్గరున్న రూ.50 కోట్ల రహస్య నిధిని దక్కించుకునేందుకు తమను సంప్రదించాలని దొంగ మెయిళ్లను పంపింది. ఈ విషయం గమనించిన ఐసీఐసీఐ అధికారులు సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నిపుణులు ఏ డేటాకార్డు నుంచి మెయిల్ పంపారో తెలుసుకున్నారు. అది బెంగళూరు ఏటీఎస్ డేటాకార్డు డీలర్ రతీష్ కరగప్పదని తేలింది. రతీష్‌తోపాటు అతని దగ్గర పనిచేసే వ్యక్తిని, కార్డు ను కొనుగోలు చేసిన నైజీరియన్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ ముఠా మెయిళ్లను నమ్మి ఎవరైనా మోసపోయారా అనేకోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నా మని సైబర్‌సెల్ అధికారి నందకిషోర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement