‘ప్రయివేటు’పైనే మక్కువ
ప్రభుత్వ ‘మెయిల్’ సదుపాయాన్ని వినియోగించుకోని అధికారులు
సమాచారం భద్రతపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు
దేశంలో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల మధ్య సమాచారం, సూచనలు, ఆదేశాలను ‘ఈ మెయిల్స్’ ద్వారా అందిస్తున్నారు. దీని కోసం జీమెయిల్, యాహూ మెయిల్ వంటి విదేశీ ప్రయివేటు సర్వీస్ ప్రొవెడర్స్ సేవలను వినియోగిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆన్‌లైన్ టెక్నాలజీని విస్తృతపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఆన్‌లైన్‌లో స్టోర్ చేసిన డేటా భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రయివేటు సర్వీస్ ప్రొవెడర్స్‌కు చెందిన మెయిల్స్‌లో డేటాను అప్‌లోడ్ చేయటం వలన వారి ఆధీనంలో ఉన్న సర్వర్స్‌లో స్టోర్ అవుతాయి. దీని వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం గతేడు దేశీయంగా సర్వర్లు ఏర్పాటు చేసింది. ఝ్చజీ.జౌఠి.జీ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ః జౌఠి.జీ అనే ప్రభుత్వ మెయిల్ సర్వీసును తయారు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది అధికారిక పనులకు సంబంధించి వివరాలు పంపటానికి ప్రభుత్వ మెయిల్ సర్వీసునే వినియోగించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. దీని కోసం కలెక్టర్ కార్యాలయంలోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులందరికి ః జౌఠి.జీ మెయిల్ క్రియేట్ చేసే బాధ్యతను అప్పగించింది. అయితే జిల్లాలో సుమారు 15 వేల మంది ఉద్యోగులు ఉన్నా ఇప్పటివరకు 100 మంది లోపు మాత్రమే అధికారులు, మండలస్థాయిలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతానికి మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు.
జిల్లా ప్రధాన కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతస్థాయి అధికారులతో పాటు వివిధ శాఖలు ఇప్పటికీ ప్రయివేటు మెయిల్స్ నుంచే సమాచారం, సూచనలు పంపుకుంటున్నారు. కొత్తగా క్రియేట్ చేసుకున్నవారు సైతం ప్రభుత్వ మెయిల్ సర్వీసును వినియోగించటం లేదు.
కార్యాలయ హెచ్‌వోడీదే బాధ్యత..
ప్రభుత్వ మెయిల్స్‌ను ఉద్యోగులకు క్రియేట్ చేయించాల్సిన బాధ్యత ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారిదే. ః జౌఠి.జీ మెయిల్ ఐడీని క్రియేట్ చేసే ఎన్‌ఐసీ అధికారులకు హెచ్‌వోడీ తమ కార్యాలయంలోని ఉద్యోగుల వివరాలను పంపించాల్సి ఉంటుంది. దీనికోసం ఝ్చజీ.జౌఠి.జీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఫార్మాట్‌లో ఉన్న విధంగా పేరు, వివరాలు మెయిల్ యూజర్ నేమ్‌తో వివరాలు పూర్తి చేసి ఎన్‌ఐసీ కార్యాలయానికి పంపితే వారు మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తారు.
మెయిల్ క్రియేటైన వెంటనే అందులోని ఉద్యోగి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా మెయిల్ పాస్‌వర్డు వస్తుంది. ఈ మెయిల్ ఐడీ ద్వారా గ్రూప్ ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఈ-ఆఫీస్‌లు అమలవుతున్న 10 కార్యాలయాల ఉద్యోగులకు మాత్రమే ఇటీవలే ఈ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో చర్యలకు ఇంకెంత సమయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.