ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు హాస్పిటల్స్‌కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమన ప్రభుత్వం యంత్రాంగం, ఫైర్ సర్వీసు బృందాలు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని దీప్ చంద్ బంధు, జీటీబీ, దాదా దేవ్, హెడ్గేవార్ హాస్పిటల్స్‌కు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఆదివారం కూడా పది హాస్పిటల్స్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాగా.. తనిఖీ చేసిన ఢిల్లీ పోలీసులు వాటిని నకిలీ బాంబు బెదిరింపులుగా తేల్చారు. తమకు ఎటువంటి బాంబు ఆనవాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఇక, మే 1వ తేదిన దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఈ మెయిల్స్‌పై దర్యాప్తు చేసిన పోలిసులు రష్యన్ మెయిల్ సర్వీస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment