e mails
-
ఢిల్లీ హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు హాస్పిటల్స్‌కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమన ప్రభుత్వం యంత్రాంగం, ఫైర్ సర్వీసు బృందాలు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని దీప్ చంద్ బంధు, జీటీబీ, దాదా దేవ్, హెడ్గేవార్ హాస్పిటల్స్‌కు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఆదివారం కూడా పది హాస్పిటల్స్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాగా.. తనిఖీ చేసిన ఢిల్లీ పోలీసులు వాటిని నకిలీ బాంబు బెదిరింపులుగా తేల్చారు. తమకు ఎటువంటి బాంబు ఆనవాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక, మే 1వ తేదిన దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఈ మెయిల్స్‌పై దర్యాప్తు చేసిన పోలిసులు రష్యన్ మెయిల్ సర్వీస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. -
సిటీ కంపెనీలకు ‘హిడెన్‌బర్గ్ బూచి’
సాక్షి, సిటీబ్యూరో: ‘హిడెన్‌బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని...
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ పెట్టుబడిగా ఆన్లైన్లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు నానాటికి తెలివి మీరుతున్నారు. ఈ క్రిమినల్స్ ఇటీవలి కాలంలో ‘సీజనల్ ఫ్రాడ్స్’ మొదలెట్టారు. వీరు సాధారణంగా ప్రముఖ కంపెనీల పేర్లతో లాటరీలంటూ పుట్టి ముంచుతుంటారు. వరల్డ్ కప్, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో వాటి పేర్లు చెప్పి ‘వర్తమానం’ పంపిస్తారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) రిటరన్స్ సమర్నించే సమయం కావడంతో ఆ పేరు చెప్పి మోసాలకు తెరలేపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఐటీశాఖ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తూ బోగస్ వెబ్‌సైట్స్ ద్వారా కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతా సరిచూసుకోవాలంటూ... ఐటీ రిటర్న్స్ గడువు లోపు ఫైల్ చేసిన వారికి ప్రస్తుతం తమకు రావాల్సిన నగదు ఐటీ విభాగం నుంచి వచ్చే సమయం కావడంతో దాన్నీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ర్యాండమ్‌గా కొన్ని నంబర్లను ఎంపిక చేసుకుని బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారు. స్థానిక భాషల్లోనూ ఉంటున్న ఆ సందేశాల్లో ఈ–ఫైలింగ్ ద్వారా పంపిన రిటర్న్‌ను అందుకున్నామని, ఖరారైందని చెబుతూ తమ నుంచి రావాల్సిన మొత్తం ఇంత అంటూ సూచిస్తున్నారు. ఆ నగదును మీకు సంబంధించిన బ్యాంకు ఖాతాకు పంపిస్తున్నామంటూ అక్కడ తప్పు ఖాతా నంబర్ చూపిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా మీది కాకున్నా... అప్డేట్ చేయాలన్నా ఈ కింది లింకులోకి వెళ్ళాలంటూ దాన్ని పొందుపరుస్తున్నారు. ఈ ఎస్సెమ్మెస్‌లు అందుకున్న వారిలో రిటర్న్ రావాల్సిన వారు లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రావాల్సిన వారు ఉంటే ఆ ఎస్సెమ్మెస్‌లో ఉన్న బ్యాంకు ఖాతా తమది కాదని భావించి లింకులోకి వెళ్ళి సైబర్ నేరగాళ్ళకు చెందిన బోగస్ ఐటీ వెబ్సైట్లో అసలు బ్యాంకు ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని... ఇలా బోగస్ వెబ్‌సైట్స్ ద్వారా నెట్ బ్యాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సదరు సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. వీటిని వినియోగించి లావాదేవీలు చేయాలంటే వారికి కావాల్సిందల్లా వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) మాత్రమే. దీన్ని సంగ్రహించడానికి సైబర్ నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. తప్పుడు వివరాలతో తీసుకునే సిమ్‌కార్డులతో కాల్స్ చేసే క్రిమినల్స్ ఆ నంబర్లను ముందే ‘ట్రూకాలర్’లో ‘ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్’, ‘ఐటీ ఆఫీస్ ల్యాండ్‌లైన్’, ‘ఐటీ అసిస్టెంట్ కమిషనర్’ తదితర పేర్లతో సేవ్ చేస్తున్నారు. దీంతో ఈ కాల్స్ అందుకునే వారు ట్రూకాలర్ ద్వారా ఈ పేర్లను చూస్తే ఐటీ శాఖ నుంచి ఫోన్ వస్తున్నట్లు భావిస్తారు. అప్పటికే బోగస్ వెబ్సైట్ ద్వారా తమకు చేరిన వివరాలు చెప్పి మరింత నమ్మకం కలిగించే నేరగాళ్ళు కరెక్షన్ పూర్తయిందని, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ అడిగి తీసుకుంటుంటారు. ఇలా అన్ని వివరాలు చేరిన తర్వాత ఆన్లైన్లో ఖాతాలు ఖాళీ చేస్తుంటారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న బోగస్ వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేసినప్పటికీ నేరగాళ్ళు మరికొన్ని మార్పులతో మరొటి సృష్టించి ఫిషింగ్ చేస్తున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నెట్ బ్యాకింగ్ సహా వ్యక్తిగత సమాచారం పొందుపరచాలని అందులో ఉన్నా అనుమానించి అధికారులను ఆశ్రయించి సందేహం నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. రిటర్న్స్‌లో తప్పులు ఉన్నాయంటూ... ఐటీ రిటర్న్స్‌లో పొరపాట్లు దొర్లినా, సరైన సమయంలో ఆ విభాగానికి చేరకపోయినా పాన్ హోల్డర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఐటీ శాఖ వెబ్‌సైట్‌ను పోలిన దాన్నే తయారు చేస్తున్నారు. అసలు వెబ్సైట్ (donotreply@incometaxindiaefiling.gov.in ) చిరునామాతో ఉంటుంది. అయితే నేరగాళ్లు గుర్తించడానికి వీలులేని కొన్ని చిన్న చిన్న మార్పులతో దీనినే పోలి ఉండేలా సైట్స్ రూపొందిస్తున్నారు.గతేడాది సైబర్క్రైమ్అధికారులు గుర్తించిన దాని ప్రకారం సైబర్‌నేరగాళ్ళు తయారు చేసిన బోగస్ వెబ్సైట్ (donotreply@incometaxindiafilling.gov.in) చిరునామాతో ఉంటోంది. ఈ–ఫైలింగ్ అనే పదంలో ‘ఇ’ అక్షరం లేకుండా (filing), ఫిల్లింగ్ అనే పదాన్ని (filling)గా పేర్కొంటూ ఈ సైట్ రూపొందిస్తున్నారు. ఈ లింకును పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు తక్షణం మళ్లీ రిటర్న్స్ దాఖలు చేయాలని గతంలో చేసిన ఈ–ఫైలింగ్‌లో తప్పులు ఉన్నాయని చెబుతూ మళ్లీ దాఖలు చేయకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తుంటారు. వీటిని నమ్మిన ఎవరైనా ఆ లింకులోని ప్రవేశిస్తే అది నేరుగా సైబర్ నేరగాళ్లకు చెందిన సర్వర్‌కు చేరుతుంది. ఆ లింకు ద్వారా ఓపెన్ అయ్యే పేజ్ పాన్ వివరాలతో పాటు నెట్ బ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలనూ పొందుపరచాలని కోరుతుంది. ఈ బోగస్ వెబ్సైట్ సైతం అసలు దాన్నేపోలి ఉండటంతో పలువురు నిజమేనని నమ్మివాటిని పూరించేస్తారు. -
మేధావుల నిలయం.. బుర్రలు కలుషితం
నన్ను ఉన్నతాధికారిగా నియమించండి. మన సామాజిక వర్గానికి అండగా నిలుస్తా. మనోళ్ల ఎదుగుదలకు దోహదపడతా. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీకాలం ముగుస్తోంది. ఆయన్నే కొనసాగిస్తే మన పనులేవీ కావు. కొత్త వాళ్లు వస్తే మన సామాజిక వర్గం ఉద్యోగులకు మేలు జరగదు. ‘అన్న’కు చెప్పండి.– ఎస్కేయూ ఉన్నతోద్యోగి మెయిళ్ల సారాంశం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. మేధావులకు నిలయమైన ఈ ఆలయం కుల పిచ్చితో కలుషితమవుతోంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసే అధ్యాపకులే తప్పుదారి ఎంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. నేను.. మనం.. వర్గం.. దిశగా సాగుతున్న వర్సిటీ రాజకీయాలతో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కులం ప్రాతిపదికన సాగుతున్న అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్న యూనివర్సిటీ వాతావరణంఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా ఓ ఉన్నతోద్యోగి సాగించిన ‘మెయిల్’ రాయబేరాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉన్నత స్థాయి పోస్టును దక్కించుకోవడంలో భాగంగా సాగిన ఈ బాగోతం కాస్తా ఇప్పుడు రచ్చకెక్కింది. యూనివర్సిటీలకు షాడో చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న ‘అన్న’ను రంగంలోకి దింపి.. తద్వారా ఆ ఉన్నతోద్యోగి లబ్ధి పొందడంతో పాటు ఆ సామాజిక వర్గం ఉద్యోగులకు అండగా నిలుస్తున్న తీరు యూనివర్సిటీని కుదిపేస్తోంది. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లోని రహస్య అంశాలను మెయిల్ చేయడం.. పాలకమండలి మినిట్స్‌ను సైతం చేరవేస్తున్న ఉన్నతోద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది. మేధావులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో వెలుగులోకి వచ్చిన ఆశ్రిత పక్షపాతం అందరినీ నివ్వెరపరుస్తోంది. ♦ మెయిళ్ల సారాంశం గతంలో ఎస్కేయూ ప్రశ్నపత్రాలను చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేసేవాళ్లు. అయితే ఎస్కేయూ యాజమాన్యం ఉన్నట్లుండి ఆ బాధ్యతలను హైదరాబాద్‌లోని ఓ ప్రెస్‌కు కట్టబెట్టారు. ఇందులో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాలకమండలిలో జరిగిన చర్చా వివరాలను మీకు మెయిల్ ద్వారా పంపుతున్నాను. పరిశీలించగలరు. హైదరాబాద్ కంపెనీ ఎక్కువ మొత్తం కోట్ చేయడంతో నిధుల దుర్వినియోగం జరిగింది. కానీ ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదని తెలిపింది. అదంతా వాస్తవం కాదు. కంపెనీని మార్చడంతో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉంది. ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను మెయిల్‌కు జతపరిచాను.. చూడగలరు. ♦ మొదటి దఫా మెయిల్. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీ కాలం ముగిసంది. అలాగే కొనసాగిస్తే వర్సిటీ పాలన గాడి తప్పుతుంది. మన సామాజిక వర్గానికి చెందిన వారికి ఉన్నతాధికారి పదవిని అప్పగిస్తే మొత్తం పాలనంతా మన చేతుల్లోకి వస్తుంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని ఉన్నతాధికారిగా నియమించేందుకు వీసీకి ఎలాంటి అవకాశం కల్పించకూడదు. నా ఆశ.. నా శ్వాస పార్టీని, మన సామాజిక వర్గానికి అండగా నిలిచేందుకే కృషి చేస్తాను. ♦ రెండో మెయిల్ చట్టవిరుద్ధంగా నియమింపబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైకోర్టును తప్పుదోవ పట్టించే విధానాలను అవలంబిస్తున్నారు. తరువాత నియామకాలకు ఇవి పెద్ద అవరోధంగా మారాయి. వీళ్ల పద్ధతుల్ని అడ్డుకోవాలి. మన సామాజిక వర్గం, మన పార్టీ బలోపేతం అయ్యేలా తమరు చొరవ చూపించాలి. అందుకు నన్ను ఉన్నతాధికారిగా నియమించేలా సిఫార్సు చేయండి. ♦ ఇదీ మూడో మెయిల్ : రూ.7లక్షల నిధులకు రెక్కలు యూనివర్సిటీలో అసోసియేట్, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూల నిర్వహణ, ఇంటర్వ్యూ చేసే నిపుణులకు సంబంధించి టీఏ, డీఏ ఖర్చులకు రూ.7 లక్షలను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్‌కు అందచేశారు. వాస్తవానికి సెక్షన్ హెడ్ అయిన డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ఖర్చు చేసే అధికారాన్ని అప్పగించాలి. కానీ అతను రెండు రోజులు సెలవులో ఉన్న కారణంగా సూపరింటెండెంట్‌కు రూ.7 లక్షల చెక్‌ను అందచేశారు. పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో ఈ మొత్తం చెల్లించాలి. కానీ 8 నెలలు గడుస్తున్నప్పటికీ రూ.7 లక్షలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. యూనివర్సిటీలో చక్రం తిప్పుతున్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. -
ఇక పాస్‌వర్డ్‌తో పనిలేదు!
టొరాంటో: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు భాగమైపోయాయి.అయితే వాటన్నింటి యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. ఇక అలాంటి కష్టానికి పుల్‌స్టాప్ పడనుంది. పాస్‌వర్డ్స్‌తో పనిలేకుండా మన అకౌంట్లలోకి లాగిన్ అయ్యే ఓ వ్యవస్థ రూపొందింది. ‘నెరేటివ్ ఆథంటికేషన్’గా పిలిచే ఈ వ్యవస్థను కెనడా ఓట్టావాలోని కార్ల్టన్ యూనివర్సిటీకి చెందిన కార్సన్ బ్రౌన్ బృందం అభివృద్ధి చేసింది. ఇది మన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా ఉపయోగించే ప్రోగ్రామ్ లేదా ఆప్స్‌ను గుర్తించి నమోదు చేసుకుంటుంది. -
ఇంటర్నెట్పై నిఘా‘నేత్రం
న్యూఢిల్లీ: మీరు తరచూ ఫేస్బుక్, ట్విటర్ వాడుతుంటారా? ఈమెయిల్స్, చాటింగ్, ఇంటర్నెట్ కాల్స్, బ్లాగుల్లో మునిగితేలుతుంటారా? అందులో మిత్రులను సరదాగా ‘కాల్చేస్తా, పేల్చేస్తా.. చంపేస్తా’ అంటూ బెదిరిస్తుంటారా? అయితే ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. ఆన్లైన్లో ప్రమాదకర, అనుమానాస్పద సందేశాలను, సంభాషణలను పసిగట్టేందుకు ప్రభుత్వం త్వరలో ‘నేత్ర’ పేరుతో ఇంటర్నెట్ గూఢచర్య వ్యవస్థను ప్రారంభించనుంది. హోం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతోంది. వైబ్సైట్లు, ఆన్లైన్ అప్డేట్లతోపాటు, స్కైప్, గూగుల్ టాక్ వంటి సాఫ్ట్వేర్ల గుండా నడిచే సంభాషణల్లో అనుమానాస్పదంగా తోచిన వాటిని జల్లెడపట్టేందుకు భద్రతా సంస్థలు ఈ వ్యవస్థను వాడుకోనున్నాయి. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు చెందిన ప్రయోగశాల సెంటర్ ఫర్ ఆర్టిఫిసియల్ అండ్ రోబోటిక్స్(సీకెయిర్).. ‘నేత్ర’ను అభివృద్ధి చేసింది. ఇది అమల్లోకి వస్తే విద్రోహ కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ను వాడే అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల చర్యలపై మరింత పటిష్ట నిఘా ఉంచడానికి వీలవుతుందని అధికారులు చెప్పారు. నేత్ర అమలుపై హోం శాఖ, కేబినెట్ సెక్రటేరియట్, ఐబీ, సీ-డాట్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తదితర శాఖలు, సంస్థల అధికారులతో కూడిన అంతర్ మంత్రిత్వ బృందం ఇటీవల చర్చించింది. సైబర్ భద్రత కోసం ఓ వ్యూహాన్నీ రూపొందించింది. ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై నిఘా కోసం ఐబీ, కేబినెట్ సెక్రటేరియట్ సహా మూడు భద్రతా సంస్థలకు 300 జీబీ స్టోరేజీని కేటాయించే అవకాశముంది.