
ఇక పాస్‌వర్డ్‌తో పనిలేదు!
టొరాంటో: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలు భాగమైపోయాయి.అయితే వాటన్నింటి యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. ఇక అలాంటి కష్టానికి పుల్‌స్టాప్ పడనుంది. పాస్‌వర్డ్స్‌తో పనిలేకుండా మన అకౌంట్లలోకి లాగిన్ అయ్యే ఓ వ్యవస్థ రూపొందింది. ‘నెరేటివ్ ఆథంటికేషన్’గా పిలిచే ఈ వ్యవస్థను కెనడా ఓట్టావాలోని కార్ల్‌టన్ యూనివర్సిటీకి చెందిన కార్సన్ బ్రౌన్ బృందం అభివృద్ధి చేసింది. ఇది మన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా ఉపయోగించే ప్రోగ్రామ్ లేదా ఆప్స్‌ను గుర్తించి నమోదు చేసుకుంటుంది.