మీడియాతో మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో సంపత్, ఒబేదుల్లా
పాలమూరు: ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి, గద్వాల, వనపర్తి జిల్లా ఆస్పత్రులను సీఎల్పీ బృందం సోమవారం పర్యటించింది. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసింది. అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో చాలా వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మిగులు రాష్ట్రంగా అప్పగిస్తే ప్రస్తుత ప్రభుత్వం రూ.మూడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు.
నీళ్ల కోసం తెచ్చిన రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్న నీరు పోయే పరిస్థితికి తెచ్చారన్నారు. కృష్ణానది నుంచి 11 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకుపోవడానికి యత్నిస్తుంటే.. ము ఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలంగాణపై ప్రేమతో ప్రాజెక్టులు నిర్మించాయని, నాగార్జునసాగర్‌తో నల్లగొండ, ఖమ్మం జిల్లాలో జోన్–1, 2 కింద 6.4 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 89 లక్షల ఎకరాలకు నీటిని అందించే ప్రాజెక్టులకు నీళ్లు అందక బీడు భూములు మార్చేందుకు నాంది పలికారని ఆయన విమర్శించారు. ఆయన వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment