
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్‌లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు.
ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment