చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది.
ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్
వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment