Southern states
-
కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల విజయం పార్లమెంటులో వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేదిలా ఉండకూడదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణలో సాధించిన విజయం ఆయా రాష్ట్రాలకు దండనగా మారకుండా తగు నిబంధనలను రూపొందించాలని కేంద్రానికి సూచించారు. సోమవారం ‘ఎక్స్’లో ఆయన... ‘కుటుంబ నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి. పరిమిత సంతానం విషయంలో 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదే శ్, 2005లో కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించగలవని కొంతకాలంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. అందుకే 2001 లో వాజ్‌పేయి ప్రభు త్వం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 82ను సవరించింది. లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన 2026 తర్వాత సేకరించే మొదటి జనాభా లెక్కలపై ఆధారపడి ఉంటుందని అందులో పేర్కొన్నా రు. సాధారణంగా, 2026 తర్వాత మొదటి జన గణన అంటే 2031 అని అర్థం. కానీ ప్రస్తుతం మొత్తం జన గణన షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడింది. 2021లో చేపట్టాల్సిన జనగణన మొదలే కాలేదు. ఇలా ఆలస్యం చేస్తూ వస్తున్న జన గణనను లోక్‌సభ సీట్ల కేటాయింపునకు ఉపయోగిస్తారా?’అని ఆయన ప్రశ్నించారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల విజయానికి ఇది విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదని, అలా జరగకుండా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని జైరాం రమేశ్ సూచించారు. -
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్‌లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్‌గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్‌కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ -
Lok Sabha Elections 2024: దక్షిణాదిన అత్యుత్తమ ఫలితాలు: అమిత్ షా
అహ్మదాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ఫలితాలను సాధించనుందని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని బట్టి 400 పైగా సీట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదఫా ఎన్నికల్లో దక్షిణాదిన మొదటిసారిగా అత్యధిక స్థానాలు సాధించుకుంటాం’అని అమిత్ షా చెప్పారు. దీన్ని బట్టి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు దక్కుతాయో ఊహించుకోవచ్చునన్నారు. -
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్‌ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్‌లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్‌ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్‌ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్‌గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్‌కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటున్నాయి. పట్టణవాసుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మందికి బీమా రక్షణ ఉంటోంది. బీమాపై అవగాహన, జీవిత బీమా పాలసీ కలిగి ఉండటం, ఆర్థిక భద్రతను మెరుగుపర్చుకోవడంపై ఇక్కడి వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించి బీమా సంస్థ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మార్కెటింగ్ డేటా కాంతార్ నిర్వహించిన 6వ విడత ఇండియా ప్రొటెక్షన్ కోషంట్ (ఐపీక్యూ) సర్వేలో దక్షిణాది 49 పాయింట్లు దక్కించుకుంది. దీని ప్రకారం 44 పీక్యూతో దక్షిణాది మెట్రోల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. దక్షిణ భారతంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక ప్రీమియం అనేది టర్మ్ ప్లాన్ కొనుగోలుకు అవరోధంగా ఉంటోందని పేర్కొన్నారు. దక్షిణాది వారు రిటైర్మెంట్ ప్లానింగ్‌కి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌వాసులు ఆరోగ్యకరమైన అలవాట్ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు పిల్లల భవిష్యత్‌పైనా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు వివరించింది. 25 నగరాల వ్యాప్తంగా 4,700 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. -
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్‌సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్‌కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
నియంత్రించాం.. నష్టపోతున్నాం: స్టాలిన్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
దక్షిణాదిలో మార్చి ఎండలు తక్కువే!
సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య! ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాలు కొంచెం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటారా? దేశం మొత్తమ్మీద మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. కానీ, దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మాత్రం వేడి సాధారణం నుంచి అంతకంటే తక్కువ ఉండనుంది. భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ విషయం తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం ఎన్నడూ లేనంతగా, స్పష్టంగా చెప్పాలంటే 1877 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించింది. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఎండీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో విలేకరుల సమావేశం నిర్వహించింది. మార్చి నుంచి మే నెల వరకూ వేసవి తీరుతెన్నులపై తన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం.. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు దేశ ఈశాన్య, తూర్పు, మధ్య ప్రాంతాలతోపాటు వాయువ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు మినహా మిగిలిన అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. మార్చి నుంచి మే నెల మధ్యభాగంలో దేశ మధ్య ప్రాంతం దానికి అనుకుని ఉండే వాయవ్య ప్రాంతాల్లో వడగాడ్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండనుంది. మార్చిలో దేశంలోని మధ్య ప్రదేశంలో వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. సాధారణ స్థాయిలోనే వర్షాలు.. మార్చి నెలలో వర్షపాతం కూడా దేశం మొత్తమ్మీద సాధారణంగానే ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక అంచనాలతో పోల్చినప్పుడు ఈ నెల వర్షాలు 83 –117 శాతం మధ్యలో ఉంటాయని తెలిపింది. దేశ వాయవ్య ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలు నమోదు కావచ్చునని, సెంట్రల్ ఇండియా పశ్చిమ దిక్కున, ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మార్చి నెల వానలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఎల్‌నినో, లానినాలపై ఇప్పుడే చెప్పలేం ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితులపై స్పష్టంగా చెప్పడం ప్రస్తుతానికి వీలుకాదని ఐఎండీ తెలిపింది. ‘‘పసఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతల దృష్ట్యా లానినా పరిస్థితులున్నాయి. రానున్న రోజుల్లో ఇది బలహీనపడి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది’’ అని వివరించింది. రుతుపవనాల సీజన్‌కు ముందు ఈ పరిస్థితులు ఏర్పడవచ్చంది. అంతేకాకుండా... రుతుపవనాలపై ప్రభా వం చూపగల హిందూ మహాసముద్ర ఉపరి తల జలాల ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితిలోనే ఉండే అవకాశమున్నట్లు చెప్పారు. -
బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు రూ.800 వరకు ఖర్చు!
ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే రొట్టె తినేవారు. ఇప్పుడైతే భారతీయుల్లో చాలామంది ప్రతిరోజూ రొట్టెల్ని లాగించేస్తున్నారు. అదేమంటే.. ఆరోగ్యం కోసమేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రొట్టెలు క్రేజీ ఫుడ్‌గా మారుతుండగా.. వాటి వినియోగంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం దేశంలో బ్రెడ్స్ అమ్మకాల విలువ 640 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024 మిలియన్ డాలర్లకు చేరిందంటే రొట్టెలు భారతీయులతో ఎలా లొట్టలు వేయిస్తున్నాయో అవగతం చేసుకోవచ్చు. సాక్షి, అమరావతి: పాశ్చాత్య వంటకమైన బ్రెడ్ భారతీయుల భోజనంలో ప్రధాన ఆహారంగా మారిపోతోంది. వేగవంతమైన జీవనశైలి, పనిభారం వల్ల వివిధ రకాల బ్రెడ్స్ భారతీయ భోజనశాలను ఆక్రమిస్తున్నాయి. ఎంతగా అంటే మసాలాలతో కూడిన కూరగాయ వంటకాలను భర్తీ చేస్తూ డైనింగ్ టేబుల్‌పై తిష్టవేస్తున్నాయి. జామ్, బటర్, పీనట్ బటర్ వంటి స్ప్రెడ్‌ల ఎంపికతో టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్లు పట్టణ వాసుల ఇళ్లలో నిత్య అల్పాహారాలుగా మారుతున్నాయి. రెడీ టు కుక్ ఆహారం అందుబాటులోకి రావడంతో మహిళలు సూప్, సలాడ్ డిన్నర్లను బ్రెడ్‌తో చేయడానికే మక్కువ చూపుతుండటం విశేషం. దక్షిణాది రాష్ట్రాలే టాప్ జాతీయ పోషకాహార సర్వే ప్రకారం బ్రెడ్ వినియోగిస్తున్న కుటుంబాల్లో ఓ వ్యక్తి సగటున రోజుకు 80 గ్రాముల బ్రెడ్ ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో స్త్రీల (66 గ్రా) కంటే పురుషులే (96 గ్రా) ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి ఒక కుటుంబం ఏడాదికి 31.7 కిలోలుగా పెరగనుంది. భారత్‌లో అతిపెద్ద బ్రెడ్ వినియోగదారుల జాబితాలో దక్షిణ భారతదేశం మొదటి స్థానంలో ఉండటం విశేషం. భారతదేశ బ్రెడ్ మార్కెట్ 2017లో 640.73 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024.54 (సుమారు రూ.837 కోట్లు) మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులు నెలకు బ్రెడ్ కోసం రూ.300 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రొటీన్ బ్రెడ్స్ కూడా వచ్చేశాయ్ దేశంలో ఊబకాయ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది 2030 నాటికి దాదాపు 27 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇందుకు భారతీయుల ఆహారంలో కార్బోహైడ్రేట్లే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సంప్రదాయ భారతీయ భోజనంలో అన్నం, రోటీ, వేపుడు పదార్థాలు ఉంటాయి. దీనికితోడు ఆధునిక జీవనశైలిలో తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పెరిగిపోయి ఊబకాయానికి దారి తీస్తోంది. శరీరానికి కార్బోహైడ్రేట్లు అవసరమే కానీ.. కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రెడ్లలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్ వంటివి లభిస్తున్నాయి. జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్‌ని అధికంగా అందిస్తున్నాయి. మల్టీగ్రెయిన్ బ్రెడ్స్దే హవా మార్కెట్లో రకరకాల బ్రెడ్స్ వస్తున్నాయి. తృణధాన్యాల వినియోగం కాలక్రమేణా పెరుగుతోంది. హోల్‌గ్రెయిన్, మల్టీ గ్రెయిన్, రై బ్రెడ్, వీట్ బ్రెడ్లు అన్ని సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పట్టణ ప్రజలు రొట్టెల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల కంటే తృణధాన్యాల ఉత్పత్తుల్లో ఎక్కువ డైటరీ ఫైబర్ కంటెంట్ ఉన్నందున అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి. చదవండి: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ఎందుకంటే.. -
ఏపీలో వేగంగా ఆర్టీఐ అప్పీళ్ల పరిష్కారం
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సమాచార కమిషన్‌కు వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా స్పందిస్తున్నట్లు ‘భారతదేశ సమాచార కమిషన్ల పనితీరు 2021–22’ నివేదిక స్పష్టం చేసింది. కేరళలో ఒక ఫిర్యాదును పరిష్కరించడానికి 15 నెలలు, కర్ణాటకలో 14 నెలలు, తెలంగాణలో ఏడాది సమయం పడుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం 4 నెలల్లోనే పరిష్కరిస్తున్నట్లు వివరించింది. వివిధ రాష్ట్రాల్లో కమిషన్‌లో పోస్టులు భర్తీ చేయకపోవడం, కమిషనర్లు కేసుల పరిష్కారంలో లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడం ఆలస్యానికి కారణంగా పేర్కొంది. కర్ణాటక సమాచార కమిషన్‌లో ఈ ఏడాది జూన్ 30 నాటికి అత్యధికంగా ఫిర్యాదులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, తమిళనాడులో సమాచార చట్టం కింద కోరిన సమాచారాన్ని అందించట్లేదని చెప్పింది. ఆర్టీఐకి వచ్చిన కేసుల్లో బ్యాక్లాగ్, నెలవారీ డిస్పోజల్ రేట్‌ను ఉపయోగించి ఢిల్లీకి చెందిన సిటిజన్స్ గ్రూప్, సతార్క్ నాగరిక్ సంగతన్ (ఎస్ఎన్ఎస్) బృందం ఈ ఏడాది జూలై 1న అప్పీళ్ల పరిష్కారాల సమయాన్ని లెక్కించింది. 2022 జూన్ 30 నాటికి దేశ వ్యాప్తంగా 26 సమాచార కమిషన్లలో 3,14,323 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో కర్ణాటకలో 30,358, తెలంగాణలో 8,902, కేరళలో 6,360, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,814 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. జరిమానాల్లో కర్ణాటక టాప్ కర్ణాటకలో 2021 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 మధ్య అత్యధిక అప్పీళ్లు నమోదు, పరిష్కారం పొందాయి. ఇక్కడ 26,694 అప్పీళ్లు వస్తే.. 25,710 కేసులను పరిష్కరించారు. తెలంగాణలో 7,169 కేసులకు గానూ 9,267 (గత ఏడాది పెండింగ్ కలిపి) అప్పీళ్లను, ఏపీలో 6,044 కేసులు నమోదవగా, 8,055(పెండింగ్‌తో కలిపి) డిస్పోజ్ అయ్యాయి. నిర్దిష్ట సమయానికి సమాచారం ఇవ్వకపోవడం, కావాలని జాప్యం చేయడం వంటి కారణాలతో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 1,265 కేసుల్లో రూ.1.04 కోట్లు జరిమానాలు విధించింది. కేరళ 51 కేసుల్లో రూ.2.75 లక్షలు, తెలంగాణ 52 కేసుల్లో రూ.2 లక్షలు, ఏపీ 9 కేసుల్లో రూ.55 వేలు జరిమానా విధించాయి. మధ్యప్రదేశ్‌లో రూ.47.50 లక్షలు, హరియాణా రూ.38.81 లక్షలు పెనాల్టీ విధించాయి. అయితే, సమాచారం ఇవ్వడంలో జాప్యానికి జరిమానాలు విధించడానికి అర్హత ఉన్నప్పటికీ, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే పెనాల్టీ వేశారని పేర్కొనడం గమనార్హం. ఏపీలో కమిషన్‌కు జవసత్వాలు రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం అమలు, సమాచార కమిషన్ నియామకంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విభజన అనంతరం 2014 నుంచి 2017 వరకు సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత మొక్కుబడిగా నలుగురు కమిషనర్లను నియమించి చేతులు దులిపేసుకుంది. ఇక్కడ కమిషన్ ఉన్నప్పటికీ సరైన మౌలిక వసతులు లేక 2019 వరకు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సమాచార కమిషన్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న నలుగురు కమిషనర్లకు తోడు కొత్తగా మరో నలుగురిని నియమించి కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టింది. ఇటీవల ఇద్దరు కమిషనర్లు పదవీ విరమణ చేయగా.. ఆ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేసింది. తద్వారా కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వేగంగా పరిష్కరించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఆర్టీఐ డే! రాష్ట్రంలో పూర్తిస్థాయిలో సమాచార కమిషన్ ఉండటంతో ఆర్టీఐపై వచ్చే అప్పీళ్లను వేగంగా పరిష్కరిస్తున్నాం. ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించేలా ఆర్టీఐ వారోత్సవాలను నిర్వహించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెల మూడవ శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా ప్రకటించింది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్‌ను బలోపేతం చేయడం సంతోషంగా ఉంది. – ఆర్.శ్రీనివాసరావు, చీఫ్ కమిషనర్ (ఇన్చార్జి) -
విభజన సమస్యల పరిష్కారంపై గట్టిగా డిమాండ్ చేద్దాం: సీఎం జగన్
అమరావతి: సెప్టెంబర్3వ తేదీన తిరువనంతపురంలో జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యుత్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దీన్ని జోనల్ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తూ, వీటి పరిష్కారంకోసం సమావేశంలో దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలన్న సీఎం.. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిందని, ఇప్పుడు విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ... రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోందని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. అందుకే వీటి పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్నికూడా అజెండాలో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం హాజరు కానున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. -
దక్షిణాది టాప్ డాక్టర్స్ జాబితాలో నరేంద్రకుమార్
వనపర్తి : మూడు దశాబ్దాలుగా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్యసేవలందిస్తున్న వనపర్తి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రకుమార్‌కు ఇండియాటుడే విడుదల చేసిన దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో స్థానం లభించింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో ఆయనకు అభినందనలు తెలిపారు. 1991లో పిల్లల వైద్య నిపుణుడిగా వృత్తిలో చేరిన నరేంద్రకుమార్ వేలాది మంది చిన్నారులకు చికిత్స చేశారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో 22 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించి, 30 వేల శస్త్రచికిత్సలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో ప్రభుత్వ వైద్యుడిగా తెలంగాణ నుంచి మొదటి స్థానం దక్కించుకున్న నరేంద్రకుమార్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
చదివింపుల్లేవ్.. విదిలింపులే!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం... కేంద్రీయ విద్యాసంస్థల మంజూరులో మాత్రం దక్షిణాదికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. గత 8 ఏళ్లలో మంజూరు చేసిన 220 కేంద్రీయ విద్యాసంస్థల్లో (157 కేంద్రీయ విద్యాలయాలు, 63 జవహర్ నవోదయ విద్యాలయాలు) దక్షిణాదికి కేవలం 40 (37 కేవీలు, 3 జేవీవీలు) మాత్రమే లభించడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ అంశంపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,311 కేంద్రీయ విద్యాసంస్థలు (661 జవహర్ నవోదయ విద్యాలయాలు, 1,650 కేంద్రీయ విద్యాలయాలు) ఉన్నాయని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత... కొత్తగా విద్యాలయాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవీల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు 20 మంజూరు చేసిన కేంద్రం... ఆ తర్వాత యూపీకి 16, కర్ణాటకకు 13, ఛత్తీస్‌గఢ్‌కు 10 చొప్పున మంజూరు చేసింది. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల విషయానికి వస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌కు 11, గుజరాత్‌కు 8, యూపీకి 6 చొప్పున ఇచ్చింది. దాదాపు 17 రాష్ట్రాలకు కొత్తగా జేఎన్వీలు మంజూరు చేయకపోవడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకకు మాత్రమే 3 జేఎన్వీలు మంజూరవగా మిగతా రాష్ట్రాలకు ఒక్కటీ లభించలేదు. జిల్లాకో జేఎన్వీ ఏమైంది..? ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటవగా కొత్త జిల్లాలకు జేఎన్వీలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క జేఎన్వీ కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో జేఎన్వీల ఏర్పాటును సైతం ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో కొత్తగా ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జేఎన్వీలు మాత్రమే ఉన్నాయి. -
దక్షిణాదిపై ‘ఆప్’ నజర్
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అఖండ విజయం తాలూకు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్ నేత సోమనాథ్ భారతి చెప్పారు. పంజాబ్‌లో గెలుపు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆప్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలోనే సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. మార్పు కోరేవారంతా ఆప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో దశల వారీగా పాదయాత్రలు సైతం చేపట్టాలని నిర్ణయించినట్లు సోమనాథ్ భారతి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి పాదయాత్రలకు శ్రీకారం చుడతామని వివరించారు. పాదయాత్రలో తొలి అడుగు తెలంగాణలోనే వేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. -
పునర్విభజనలో దక్షిణాది స్థానమేంటి?
పార్లమెంటులో ఆర్టికల్ 370ని రద్దు చేసి, 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ని ఏర్పర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు సంబంధించి అత్యుత్తమ ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో మరింత మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉండే దక్షిణాది ప్రాతినిధ్యం వల్ల యావద్దేశం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక శక్తుల మధ్య ఘర్షణ వాతావరణం పొడసూపుతుండటం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అత్యంత సున్నితంగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంటరీ నియోజకవర్గాల హద్దులను మార్చే ప్రక్రియే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. ఈ ప్రక్రియకు సుదీర్ఘంగా అయిదేళ్ల సమయం పడుతుంది. సాధారణంగా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడ తారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు దాదాపు సమాన సంఖ్యలో ఉండేలా చేయడమే దీని లక్ష్యం. భారతదేశం తదుపరి జగగణనకు సిద్ధమవుతున్నందువల్ల, నియోజకవర్గాల పునర్విభజన క్రమం పలుచోట్ల నిరసనలకు కారణమవుతోంది. దేశంలోని ప్రాంతా లమధ్య వ్యత్యాసాలు ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై చర్చకు ఇదే సరైన సమయంగా పరిగణించాల్సి ఉంది. పునర్విభజన ప్రక్రియ ఉత్తరాదికే అనుకూలం జనాభా నమూనాలపై ఆధారపడి, పార్లమెంటరీ నియోజకవర్గాలను రాష్ట్రాల వారీగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత విధానం ఉత్తరప్రదేశ్ వంటి అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు అత్యంత అనుకూలంగా ఉంటోందన్నది వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభా స్థానాలు ఉండగా, బిహార్‌లో 40 ఎంపీ స్థానాలు, తమిళనాడులో 39 స్థానాలున్నాయి. ఇక విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు 25 ఎంపీ స్థానాలు దక్కాయి. కర్ణాటకలో 28 పార్లమెంటు స్థానాలుంటున్నాయి. తాజాగా నియోజక వర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం ఎక్కువగా నష్టపోయే అవ కాశాలున్నాయి. ఎందుకంటే అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పురోగతి కాస్తా తగ్గుముఖం పడుతోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఇపుడున్న పార్లమెంటరీ స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశముంది. అదే సమయంలో జనాభా సంఖ్య అధిక మవుతున్న ఉత్తరాది రాష్ట్రాలు ఎంపీ సీట్ల విషయంలో ఇంకా పైచేయి సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ల ప్రాతినిధ్యానికి ప్రజల సంఖ్య మాత్రమే గీటురాయిగా ఉండాలా లేదా వారి నాణ్యతకు కూడా ప్రాధా న్యత ఉండాలా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి 2000 సంవత్సరం తర్వాత ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికపరంగా నాటకీయ స్థాయిలో ఎంతగానో పురోగమించాయని మనందరికీ తెలుసు. ఆదాయం, పేదరికం వంటి అనేక ప్రమాణాల్లో ఉత్తరాది రాష్ట్రాలు 1960ల ప్రారంభంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉండేవి. అయితే 1990ల ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత ఇటీవలి కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలు బాగా పుంజుకున్నాయి. పురోగతిలో దక్షిణాది విజృంభణ కర్ణాటక, కేరళ, తమిళనాడు మూడు రాష్ట్రాల స్థూలదేశీయ ఉత్పత్తిని కలిపి చూస్తే 13 తూర్పు రాష్ట్రాల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటోం దని ఇటీవలే ఒక కథనం వెల్లడించింది. ఆదాయపరంగా ఈ విభజ నకు... ఇటీవలి కాలంలో దక్షిణ భారతదేశం ఎంతో మెరుగ్గా పురోగతి సాధించడం కూడా తోడైంది. మానవ సామర్థ్యాలు, నైపుణ్యాలు, జాగ రూకత వంటి అనేక అంశాలు దక్షిణాదిని ముందువరసలోకి నెట్టాయి. ఇప్పుడు మనం రాష్ట్రాల జనాభా, వాటి మానవ సామర్థ్యాలు, నైపుణ్యాలు, జాగరూకత, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిద్దాం. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విద్యా ఫలితాలు, పాఠశాలలకు హాజరవుతున్న పిల్లల శాతం, పలు గ్రేడ్లకు సంబంధించి వీరిలోని గ్రహణ శక్తి సామర్థ్యాలను పరిశీలించి చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కంటే ఎంతో మెరుగ్గా ఉంటున్నాయని గత కొంతకాలంగా వెలువడుతున్న వార్షిక విద్యా స్థితిగతుల నివేదికలు పదేపదే చెబుతున్నాయి. అయితే తరగతి గదిలో మౌలిక సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాం వంటి అంశాలపై పెడుతున్న ఖర్చు విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు గతంలో దక్షిణాది కంటే ఎంతో మెరుగ్గా ఉండేవి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టభద్రుల అధిక నిష్పత్తి అనేది, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల విషయంలో ఎంతో ముందంజ సాధించింది. ఉదాహరణకు, 2011లో ఉత్తరప్రదేశ్ జనాభాలో 5 శాతం మాత్రమే పట్టభద్రులుండేవారు. తమిళనాడులో మాత్రం 8 శాతం మంది పట్టభద్రులు నమోదయ్యారు. నిర్ణయాలు తీసుకునే క్రమంలో చక్కటి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కోవిడ్–19 మహమ్మారి ప్రపంచం ముందు చక్కగా ప్రదర్శించింది. కరోనా మహమ్మారి వివిధ దశల్లో విజృంభి స్తున్న సమయంలో దక్షిణాది రాష్ట్రాలు వైరస్ పరీక్షలో ముందు వరసలో నిలిచాయి. 2021 డిసెంబర్ నాటికి తమిళనాడులో 7 కోట్ల 80 లక్షల మంది జనాభాకు గానూ 314 కరోనా వైరస్ పరీక్షా కేంద్రా లను నెలకొల్పారు. కానీ 23 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 305 కోవిడ్ పరీక్షా కేంద్రాలు మాత్రమే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్ర అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవు. నిస్సందేహంగా, ఆరోగ్య సౌకర్యాలు, సాధిస్తున్న ఉత్తమ ఫలితాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజానీకం ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నారు. కోవిడ్–19 వల్ల ఆయుర్దాయం కాస్త తగ్గిపోయి నప్పటికీ, 2021లో దక్షిణాదిలో ప్రతి మనిషీ సగటున 73.2 సంవత్స రాలు జీవిస్తుండగా (1971లో ఇది 51.6 సంవత్సరాలు మాత్రమే), ఉత్తరాదిలో సగటు ఆయుర్దాయం 69 సంవత్సరాలకే పరిమితమైంది (1971లో ఇది 47 సంవత్సరాలుగా ఉండేది). సమర్థ పాలన దక్షిణాది రాష్ట్రాలు విద్యా, ఆరోగ్య ఫలితాల్లో మెరుగ్గా ఉంటున్నా యంటే... విషయ గ్రహణలో, నిర్ణయాలను తీసుకోవడంలో నాణ్యత ప్రదర్శించడంతో ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని అర్థం. దక్షి ణాదిలో విద్యావంతులైన పౌరులు తమకు అవసరమైన మెరుగైన సౌకర్యాల విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. పౌరుల చైతన్యం, కార్యాచరణ ఈ రీజియన్‌లో చాలా ఎక్కువ. అందుకనే దక్షిణాది రాష్ట్రాల్లోని ఓటర్లు ఉత్తరాది ఓటర్లతో పోలిస్తే మెరుగైన పాలనను అందించే ప్రభుత్వాలనే ఎన్నుకుంటూ ఉంటారు. 1960 లలో ఇలాంటి పోలికకు తావుండేది కాదు. కానీ 1970ల తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పదవీ కాలం ఉత్తరాదితో పోలిస్తే దీర్ఘకాలం కొనసాగడాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. విద్య, ఆరోగ్యం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అధిక ఆర్థిక పురోగతి వంటి అంశాల్లో ఓటర్ల నాణ్యతను నియోజకవర్గాల పునర్వి భజనలో పరిగణనలోకి తీసుకోరా? నియోజక వర్గాల పునర్విభజన సమయంలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారానికీ, దక్షిణాది రాష్ట్రా లలోని ఆర్థిక బలసంపన్నతకూ మధ్య వైరుధ్యం ప్రబలం కానుంది. అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలు సాధించిన ఆర్థిక పురోగతి శక్తి ఉత్త రాది రాష్ట్రాల రాజకీయ బలాన్ని తోసి రాజనవచ్చు కూడా. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లోని మానవ నైపుణ్యాలు, సామర్థ్యాల రీత్యా వారికి పార్లమెంటులో మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉండే దక్షి ణాది ప్రాతినిధ్యం వల్ల యావద్దేశం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహమే లేదు. ఉత్తర భారతదేశం కూడా ఆర్థికంగా పురోగతి సాధించినట్లయితే, అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాదికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక శక్తుల మధ్య ఘర్షణ వాతావరణం పొడసూపుతుండటం మనకు తెలుసు. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అత్యంత సున్నితంగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. – కళా సీతారాం శ్రీధర్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఎకనమిక్ ఛేంజ్ -
14న దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ నెల 14న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. -
షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం
ముంబై: భారత్‌లో ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణాది ప్రాంతాల కుటుంబాల రుణ భారాలు అధికంగా ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2013 నుంచి 2019 వరకూ దేశంలోని కుటుంబాల రుణ భారాలపై ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఏఐడీఐఎస్) నిర్వహించిన సర్వే గణాంకాలను ఈ సందర్భంగా ఇండి యా రేటింగ్స్ ఉటంకించింది.దక్షిణాదిలో అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల కుటుంబాల రుణాలు దేశ ఇతర ప్రాంతాలతో పోల్చితే అధికంగా ఉన్నట్లు వివరించింది. 2019 లో తెలంగాణ 67.2 శాతంతో గ్రామీణ కుటుంబాలలో అత్యధిక శాతం అప్పులు కలిగి ఉంది. ఈ విషయంలో నాగాలాండ్ 6.6 శాతంతో కనిష్ట స్థాయిలో ఉంది. ఇందుకు సంబంధించి పట్టణ ప్రాం తాల విషయంలో 47.8 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉంటే, మేఘాలయ 5.1 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకన్నా ముందున్నాయి. ఆస్తులు–అప్పుల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్ నేపథ్యంలో గృహ రుణాలు భారీగా పెరిగాయి. 2020–21 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణ భారం జీడీపీలో 37.9 శాతం ఉంది. 2019–20లో నాల్గవ త్రైమాసికంలో ఈ నిష్పత్తి 33.8 శాతంమే కావడం గమనార్హం. చదవండి: ధనిక,పేదల మధ్య భారీ అంతరం -
ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీలలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతోంది. సప్లయి, లావాదేవీలు, అద్దెలు అన్నింట్లోనూ సౌత్ స్టేట్స్లోనే వృద్ధి నమోదవుతుంది. గత ఆర్థిక సంవత్సరం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.13 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 66 శాతంగా ఉంది. పశి్చమాది రాష్ట్రాల వాటా 21 శాతం, నార్త్ స్టేట్స్ వాటా 11 శాతంగా ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. ► 2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల్లోని 66 శాతం ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో 1.4 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. వెస్ట్ రాష్ట్రాల్లోని ట్రాన్సాక్షన్స్లో ముంబై, పుణే నగరాల్లో 45.6 లక్షల చ.అ. నార్త్‌లోని లావాదేవీల్లో ఎన్సీఆర్ నగరంలో 23 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. దేశంలోని టాప్–7 నగరాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో 3.11 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా దక్షిణాది రాష్ట్రాల వాటా 47 శాతం కాగా, పశి్చమంలో 33 శాతం, ఉత్తరంలో 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2018–19 ఆర్థికంలో 3.58 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. దక్షిణంలో 57 శాతం, వెస్ట్‌లో 25 శాతం, నార్త్‌లో 15 శాతం, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 4.3 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. సౌత్‌లో 55 శాతం, వెస్ట్‌లో 22 శాతం, నార్త్‌లో 20 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. సప్లయి కూడా సౌత్‌లోనే.. కొత్త ఆఫీస్ స్పేస్ సప్లయి కూడా దక్షిణాది రాష్ట్రాలనే ఎక్కువగా ఉంది. గత ఆర్థికంలో 4.02 కోట్ల చ.అ. సప్లయి జరగగా ఇందులో సౌత్ వాటా 63 శాతంగా ఉంది. పశ్చిమాది రాష్ట్రాల వాటా 19 శాతం, నార్త్ వాటా 18 శాతంగా ఉన్నాయి. 2019–20 ఆర్థికంలోనూ అంతే. మొత్తం 4.36 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. 59 శాతం దక్షిణాదిలో, 16 శాతం వెస్ట్‌లో, 24 శాతం ఉత్తరాది రాష్ట్రాలలో జరిగాయి. డిమాండ్ ఎందుకంటే.. గత రెండు మూడేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో స్టార్టప్స్ విపరీతంగా పెరగడం, తయారీ, పారిశ్రామిక రంగాలు వృద్ధి బాటలో కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాలలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఏర్పడుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. హైదరాబాద్‌లో అద్దెల వృద్ధి హైదరాబాద్‌లో నెలవారీ ఆఫీస్ స్పేస్ అద్దెలు పెరుగుతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చ.అ. రెంట్ నెలకు రూ.51 ఉండగా.. 2018–19 నాటికి రూ.53కు, 2019–20లో రూ.56కు, 2020–21 ఆర్థికం నాటికి రూ.57కి వృద్ధి చెందింది. గత ఆర్థికంలో నగరంలో గచ్చిబౌలిలో రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. దివ్యశ్రీ ఓరియన్‌లో వెల్స్‌ఫార్గో 13 లక్షల చ.అ., సాలార్పూరియా సత్వా నాలెడ్జ్ క్యాపిటల్‌లో గూగుల్ 10 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకుంది. బెంగళూరులో గత ఆర్థికంలో చ.అ. అద్దె నెలకు రూ.77గా ఉంది. చెన్నై లో రూ.60, ఎంఎంఆర్‌లో రూ. 125, పుణేలో రూ.68, ఎన్సీఆర్లో రూ.78గా ఉంది. -
18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విక్టర్ అమల్‌రాజ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ఆహారధాన్యాలను సరఫరా చేయడంతో తెలంగాణ రీజియన్ శాఖ విశేష కృషి చేస్తోందని వెల్లడించింది. దీంతోపాటే తెలంగాణ పీడీఎస్ అవసరాలకు బియ్యం సరఫరా చేస్తోందన్నారు. -
అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టేకంటే ఉపరితల నీరు, భూగర్భ జలాల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు. అంతేతప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టి, వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరితే మాత్రం తాము ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్ మిషన్ అంశంపై జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతో పాటు సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, కాడా కమిషనర్ మల్సూర్, సీఈలు బంగారయ్య, వీరయ్య, మోహన్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జల్‌మిషన్ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. అనంతరం తెలంగాణసహా మిగతా రాష్ట్రాలు తాము చేపడు తున్న ప్రాజెక్టులు, వాటికి ఖర్చు చేస్తున్న నిధులు, వాటి ప్రయోజనాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించాయి. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు తమ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని గట్టిగా కోరాయి. దీనిపై చివరగా కేంద్ర మంత్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రోల్స్‌రాయిస్ మీరిచ్చుకోండి.. మీ రాష్ట్రాల ప్రజలకు రోల్స్ రాయిస్ కారివ్వాలని అనుకుంటే రాష్ట్రాల నిధుల్లోంచి యథేచ్ఛగా నిధులు ఇచ్చుకోవచ్చని, అయితే కేంద్రం మాత్రం మారుతి–800 కారు మాత్రమే ఇస్తుందని షెకావత్ స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మేము ఎక్కువ నిధులు ఖర్చు చేశాం కాబట్టి, కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం తాము ఇవ్వలేమన్నారు. ఏపీ, తెలంగాణకంటే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలున్నాయని, నీటి ఎద్దడి ఉందన్న కారణంగా ఎక్కువ నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. నీటి సద్వినియోగం కోసం అందరం కృషి చేయాలని, గ్రామం యూనిట్‌గా తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి పునర్వినియోగంలో రామకృష్ణా మిషన్ మోడల్ చాలా బాగుందని, దానిపై రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. జలజీవన్ మిషన్ కింద మొదటి విడత నిధులు విడుదల చేశామని, రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ విజయవంతం కావడానికి తొలి ఆరు నెలల పనితీరే కీలకమని, సంబంధిత అధికారులంతా మిషన్ పనులను ప్రారంభించడంతో పాటు మెరుగైన పనితీరును కనబరచాలని షెకావత్ అన్నారు. నదుల అనుసంధానానికి నిధులివ్వాలి ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరిచ్చేలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపడుతున్నామని తెలిపారు. దీన్ని 2021 నాటికి పూర్తి చేస్తామని, దీనికి కేంద్ర సహకారం అందించాలని కోరారు. ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఏపీలో ఎక్కువగా గిరిజన, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలున్నాయని, ఇక్కడి తాగునీటి అవసరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎక్కువ నిధులివ్వాలని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రతినిధులు మాట్లాడుతూ, మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపించారు. ‘భగీరథ’కి నిధులివ్వాలి సీఎస్ ఎస్కే జోషి తెలంగాణ తరఫున సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ, రక్షిత తాగునీటి సరఫరాలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ ముందుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే తాగునీటి సరఫరా చేస్తున్నామని, భారీగా అప్పులు తెచ్చి దీన్ని పూర్తి చేశామని, వాటి తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్రాలకు మరిన్ని నిధులు పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకే గాటన కట్టకుండా, పనిచేసే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న షెకావత్. చిత్రంలో సీఎస్ జోషి, మంత్రి దయాకర్‌రావు, ఏపీ మంత్రి అనిల్ తదితరులు -
దక్షిణాదికి ఉగ్రముప్పు
పుణే/తిరువనంతపురం/అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని సదరన్ కమాండ్ జీవోసీ(జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్) లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ వెల్లడించారు. పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సరిహద్దుల్లోని సర్ క్రీక్ లేన్ వద్ద ఇటీవల గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నాం. ఇవి దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నాం. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ మాకు సమాచారం అందింది. దీతో సర్ క్రీక్ ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాం’అని తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెన్నైలో మాట్లాడుతూ.. ఆర్మీ సదరన్ కమాండ్ పరిధిలోకి గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. అందుకే, జనరల్ సైనీ తెలిపిన ప్రకారం ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి’అని వివరణ ఇచ్చారు. దక్షిణాదిన ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్లు ఏపీ అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు. ‘కీలక సంస్థలు, వ్యవస్థ లున్న చోట పరిస్థితులపై తీరప్రాంత పోలీస్ స్టేషన్లతోపాటు ఎస్పీఎఫ్ విభాగాన్ని మా కంట్రోల్ రూం అప్రమత్తం చేస్తోంది. ముఖ్యం గా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటే శ్వరాలయం, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం’అని అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానా శ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, జన సమ్మ ర్థం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచాలని పోలీసు లను కేరళ డీజీపీ లోకనాథ్ బెహరా కోరారు. -
ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు.