కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్‌ | Family planning success should not reduce Parliamentary seats of Southern States says Jairam Ramesh | Sakshi
Sakshi News home page

కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్‌

Published Tue, Oct 22 2024 5:42 AM | Last Updated on Tue, Oct 22 2024 5:42 AM

Family planning success should not reduce Parliamentary seats of Southern States says Jairam Ramesh

ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రాతినిథ్యాన్ని తగ్గించకండి 

కేంద్రానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల విజయం పార్లమెంటులో వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేదిలా ఉండకూడదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణలో సాధించిన విజయం ఆయా రాష్ట్రాలకు దండనగా మారకుండా తగు నిబంధనలను రూపొందించాలని కేంద్రానికి సూచించారు. సోమవారం ‘ఎక్స్‌’లో ఆయన... ‘కుటుంబ నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి. 

పరిమిత సంతానం విషయంలో 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదే శ్, 2005లో కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ విజయాలు పార్లమెంట్‌లో ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించగలవని కొంతకాలంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. అందుకే 2001 లో వాజ్‌పేయి ప్రభు త్వం రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 82ను సవరించింది. 

లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన 2026 తర్వాత సేకరించే మొదటి జనాభా లెక్కలపై ఆధారపడి ఉంటుందని అందులో పేర్కొన్నా రు. సాధారణంగా, 2026 తర్వాత మొదటి జన గణన అంటే 2031 అని అర్థం. కానీ ప్రస్తుతం మొత్తం జన గణన షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడింది. 2021లో చేపట్టాల్సిన జనగణన మొదలే కాలేదు. ఇలా ఆలస్యం చేస్తూ వస్తున్న జన గణనను లోక్‌సభ సీట్ల కేటాయింపునకు ఉపయోగిస్తారా?’అని ఆయన ప్రశ్నించారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల విజయానికి ఇది విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదని, అలా జరగకుండా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని జైరాం రమేశ్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement