రెండేళ్ల బీఎడ్, ఎంఈడీకి దక్షిణాది రాష్ట్రాలు ఓకే
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈ డీ), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సులు ఈసారికి (2014-15 విద్యా సంవత్సరంలో) మాత్ర మే. వచ్చే విద్యా సంవత్సరంలో అవి రెండేళ్ల కోర్సులుగా మారబోతున్నాయి. మార్గదర్శకాలను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) త్వరలో జారీ చేయనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని బీఎడ్ కాలేజీల యాజమాన్యాలు, విద్యావేత్తలు, విద్యాశాఖ అధికారులతో ఎన్‌సీటీఈ శనివారం బెంగళూరులో సమావేశం నిర్వహించింది. ఉపాధ్యాయ విద్యలో కొన్ని సవరణలు మినహా మిగతా సంస్కరణలకు దక్షిణాది రాష్ట్రాలు సంపూర్ణ అంగీకారం తెలియజేశాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాధరెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, బీఈడీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం తదితరులు హాజరయ్యారు.