Tamil Nadu chief minister
-
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
స్టాలిన్‌కు చైనా భాషలో శుభాకాంక్షలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాష్ట్ర బీజేపీ విభాగం శుక్రవారం చైనా భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘బీజేపీ తమిళనాడు విభాగం గౌరవ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది’అని ‘ఎక్స్’లో పేర్కొంది. అందులో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలై చిత్రాలు, ఆపక్కనే స్టాలిన్ చిత్రం కింద చైనీస్ భాషలో ఒక సందేశం ఉంది. రాష్ట్రంలో ఇస్రో కాంప్లెక్స్ సముదాయం ప్రారంభం సందర్భంగా ఇటీవల డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో చైనా జెండా కనిపించడం వివాదం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ మేరకు స్పందించడం విశేషం. అయితే, ఆ ప్రకటనలో పొరపాటున చైనా జెండా అచ్చయిందే తప్ప, ఉద్దేశపూ ర్వకంగా చేసింది కాదని ఆ ప్రకటన ఇచ్చిన మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
నియంత్రించాం.. నష్టపోతున్నాం: స్టాలిన్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి నడిపే ఫౌండేషన్‌కు చెందిన రూ.36 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఫౌండేషన్‌కు చెందిన తమిళనాడులోని రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్ చేసినట్లు వివరించింది. ఈ కేసు దర్యాప్తులో కల్లాల్ గ్రూప్, యూకే కేంద్రంగా పనిచేసే లైకా గ్రూప్ అనుబంధంగా భారత్‌లోని లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్‌లో సోదాలు జరిపినట్లు తెలిపింది. -
గవర్నర్లకు నోరు తప్ప చెవుల్లేవు : స్టాలిన్
చెన్నై: గవర్నర్ల వ్యవహార శైలిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు ఉందే తప్ప వినడానికి చెవుల్లేవని వ్యంగ్యస్త్రాలు విసిరారు. అందుకే గవర్నర్లందరూ ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటున్నారని వ్యాఖ్యానించారు. ఆన్లైన్లో జూదం నిరోధక బిల్లుని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు గవర్నర్లు కట్టుబడి ఉన్నారా? అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ కొందరు గవర్నర్ల వ్యవహార శైలి చూస్తుంటే వారికి నోరు ఉందే తప్ప చెవులు లేవని అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగానే ఎలా హెచ్చరిస్తుందో సిసోడియా అరెస్ట్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రాజకీయ కారణాల కోసం దర్యాప్తు సంస్థల్ని బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎన్నికల్లో గెలవడానికి బదులుగా, దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి విజయం సాధించాలని చూడడమేంటని ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా స్టాలిన్ వెల్లడించారు. -
Chess Olympiad 2022:చెస్ విజేతలకు నజరానా
సాక్షి, చెన్నై: 44వ చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లను ఆతిథ్య తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున ఆరు జట్లు పాల్గొనగా...ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు, మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించాయి. ఓపెన్ జట్టులో గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆదిబన్, రౌనక్ సాధ్వాని సభ్యులు కాగా, మహిళల టీమ్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి భాగంగా ఉన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరందరి ఘనతను సీఎం ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక్కో జట్టుకు రూ. 1 కోటి చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధికారులతో పాటు మంత్రి మెయ్యనాథన్, సీఎస్ ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు. ‘టాటా స్టీల్’లో మహిళలు చెన్నై: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదినుంచి ఈ టోర్నీలో మహిళల విభాగంలో కూడా పోటీలు నిర్వహించబోతున్నారు. పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీని అందిస్తూ తొలిసారి మహిళల కేటగిరీని చేర్చారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 29నుంచి డిసెంబర్ 4 వరకు కోల్‌కతాలో జరుగుతుంది. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఈవెంట్లలో జరిగే టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లంతా భాగం కానున్నారు. మహిళల విభాగంలో భారత్‌నుంచి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలతో పాటు అనా ముజిచుక్, మారియా ముజిచుక్ (ఉక్రెయిన్), నానా జాగ్నిజ్ (జార్జియా), అలినా కష్లిన్స్కయా (పోలండ్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. టాటా స్టీల్ చెస్ టోర్నీకి భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సలహాదారుడు కావడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. -
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. జ్వరం కారణంగా నేటి అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్.. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో సోమవారం పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు -
‘నీట్’ తీర్మానం వెనక్కి పంపిన గవర్నర్.. దుమారం
After NEET Bill Sent Back GetOutRavi Trending In Twitter: నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపించినట్టు రాజ్ భవన్ గురువారం ప్రకటించింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై డీఎంకేతో పాటుగా నీట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి, చెన్నై : గురువారం రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో నీట్‌పై అసెంబ్లీలో చేసిన తీర్మా నం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వివరించారు. నీట్ రాకతో విద్యార్థులందరికీ సామాజిక న్యాయం దక్కుతోందని పేర్కొన్నారు. సమగ్ర పరిశీలన, సమీక్ష మేరకు పేద విద్యార్థులకు నీట్ ఎంతో దోహదకరంగా ఉందన్నారు. Christian Medical College, Vellore Association Vs. Union of India (2020) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని వెనక్కి పంపించడమే కాకుండా, అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో, పునః పరిశీలన జరిపాలని, తగిన వివరణ ఇవ్వాలని స్పీకర్ అప్పవును గవర్నర్ ఆదేశించడం గమనార్హం. గెట్‌అవుట్‌రవి ట్రెండింగ్‌లో.. ఇక గవర్నర్ నిర్ణయంపై పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ ప్రజలంతా గవర్నర్ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ.. ట్విటర్లో గెట్ అవుట్ రవి యాష్ ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మనోభావాల్ని గౌరవించలేనప్పుడు తప్పుకోవాలంటూ, వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. #GetOutRavi😡😡 That’s the tweet — Dr Sharmila (@DrSharmila15) February 3, 2022 Hon TR Balu MP at parliament of India Today said that" To call back TN Governor Ravi "#GetOutRavi pic.twitter.com/QQn7fiABR7 — ELAIYA (@elaiyakumar_r) February 3, 2022 ఇదిలా ఉంటే అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈ బిల్‌కు మద్ధతు తెలపగా.. బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. NEET అసమానతలను పెంపొందించడంతో పాటు సమాజంలోని ధనవంతులు, అధిక ప్రాధాన్యత కలిగిన తరగతికి అనుకూలంగా ఉందని, XII తరగతిని కొనసాగించడమే కాకుండా ప్రత్యేక కోచింగ్‌ను పొందగలుగుతారు. ఇది వాస్తవంగా వైద్య మరియు దంత విద్య నుండి గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన సామాజిక వర్గాలను అడ్డుకుంటుంది. Who are you to decide the NEET is against rural students....#GetOutRavi Or you will be forced to get out of TN pic.twitter.com/ygM9oGN8Lj — selvam (@Selvam_nallavan) February 3, 2022 #GetOutRavi When you can’t work for TN, quit https://t.co/hhbOUJNry1 — Upright (@GATHOBIAS) February 3, 2022 వైద్య UG ప్రోగ్రామ్‌ల తర్వాత సంపన్న తరగతికి చెందిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం లేదని. తరచూ విదేశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య క్షీణతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. All party has to take unanimous decision to send back the governer.#GetOutRavi #GetOutGovernorRavi https://t.co/1HoemlZLMx — Aravindan L (@i_am_aravindan) February 3, 2022 రీకాల్ చేయండి ఇదిలా ఉంటే నీట్ బిల్లును వెనక్కి పంపిన నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం గుర్రుగా ఉంది. వెంటనే గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సైతం గళం వినిపించారు. ఐదు నెలల కాలయాపన తర్వాత ఆ బిల్లును పంపించడం ఏంటో అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ(ఎం) ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 5న గవర్నర్ నిర్ణయంపై చర్చించేందుకు.. భవిష్యత్ చర్యల కోసం శనివారం(ఫిబ్రవరి 5న) సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రాజ్యాంగం ప్రకారం.. సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఒకవేళ వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ దగ్గరికి గనుక వస్తే మాత్రం.. దానిపై ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపిస్తారు. ఆపై తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్ చెప్తున్నారు. -
31మంది మంత్రులతో పళనిస్వామి కేబినెట్
-
'అమ్మ’ టూ వీలర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్లు
చెన్నైః తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత మరో అడుగు ముందుకేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా 'అమ్మ టూ వీలర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ల' ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే నెల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోలో తాను ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐడీఎంకే సుప్రీమో జయలలిత తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 35 కేంద్రాల్లో సెంటర్లను స్థాపించేందుకు సిద్ధం చేస్తున్నామని, ఒక్కో సెంటర్లో 30 మంది వరకూ అభ్యర్థులకు మూడు నెలల శిక్షణతో పాటు 3000 రూపాయల స్టై ఫండ్ చెల్లించనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 1.65 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 'సీమెన్స్', 'డిజైన్ టెక్' లతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద.. రూ. 546,84 కోట్ల అంచనా వ్యయంతో ఓ ఎక్సలెన్స్ సెంటర్ తో పాటు, ఐదు నైపుణ్యాభివృద్ధి ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. -
హిల్లరీకి అమ్మ అభినందనలు
చెన్నై: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల చరిత్రలో ప్రధాన రాజకీయ పార్టీ తరపున తొలి మహిళా అభ్యర్థిగా నామినేషన్ పొందిన హిల్లరీ క్లింటన్‌ను అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. 2011లో అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ భారత్ పర్యటకు వచ్చిన విషయాన్నిజయలలిత గుర్తుచేసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ నామినేషన్ పొందిన సంగతి తెలిసిందే. 'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ తరపున నామినేషన్ పొందిన తొలి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ గర్వపడాల్సిన, సంతోషించాల్సిన విషయమిది. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో ఓ పార్టీ నుంచి మీరు అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందడం అసాధారణ విషయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారతకు పాటుపడతారని, గళం వినిస్తారని ఆశిస్తున్నా' అని జయ అభినందన సందేశంలో పేర్కొన్నారు. -
జయలలిత అనూహ్య నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. జయ మంత్రివర్గంలో మరో నలుగురికి స్థానం కల్పించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు ఈ మేరకు జాబితా పంపారు. గవర్నర్ కొత్త మంత్రులతో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్తగా బెర్తులు దొరికిన వారిలో జీ భాస్కరన్, ఎస్.రామచంద్రన్, నిలోఫర్ కబిల్, పి.బాలకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం జయతో పాటు మొత్తం 28 మంది మంత్రులు ప్రమాణం చేశారు. -
వరద సాయం
బాధిత కుటుంబానికి రూ.5 వేలు గుడిసెకు పది వేలు హెక్టారుకు రూ.13-18 వేలు ప్రకటించిన సీఎం జయలలిత చెన్నై: ఎట్టకేలకు సీఎం జయలలిత వరద సాయాన్ని ప్రకటించారు. గుడిసె వాసులకు రూ.10 వేలు, సొంత ఇళ్లలోని వరద బాధితులకు రూ.5 వేలు చొప్పున సాయం అందించనున్నారు. పంటల్ని కోల్పోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకు అందించనున్నారు. ఈశాన్య రుతు పవనాలు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. లక్షలాది కుటుంబాలు కష్టాల కడలిలో మునిగాయి. ఇతర జిల్లాల్లోనూ వర్షం ప్రభావం ఓ మోస్తరే. తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లోని బాధితులకు ఏ మేరకు సీఎం జయలలిత సాయం ప్రకటిస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అదే సమయంలో వరద సాయంపై ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో విమర్శలు బయల్దేరాయి. ఎట్టకేలకు స్పందించిన సీఎం జయలలిత సోమవారం సచివాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన అనంతరం వర్షాల నుంచి ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని కాంక్షిస్తూ, ఆరోగ్య సూత్రాలతో కూడిన ఓ ప్రకటనను తొలుత వెలువరించారు. తదుపరి వరద సాయం ప్రకటిస్తూ మరో ప్రకటన చేశారు. వరద బాధితుల వివరాలను త్వరితగతిన సేకరించాలని, నష్టం తీవ్రతపై నివేదికను త్వరితగతిన సిద్ధం చేసి సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వరద సాయం: వరదలతో గుడిసెల్ని కోల్పోయిన కుటుంబాలకు రూ.10 వేలు ప్రకటించారు. ఇతర బాధితుల కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున వరద సాయం అందించనున్నారు. ఈ సాయంతో పాటుగా గుడిసెవాసులకు పది కేజీల బియ్యం, ఇతరులకు ఐదు కేజీల బియ్యం, దుప్పటి, చీర, దోవతి అందించనున్నారు. కూవం నదీ తీరం వెంబడి ఉన్న గుడిసెవాసులకు ప్రత్యామ్నాయంగా గృహాల కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. ఒక్కియం తురై పాక్కంలో నిర్మిస్తున్న పది వేల గృహాలను వారికి అప్పగించేందుకు నిర్ణయించారు. వరదలతో కోల్పోయిన కుటుంబ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు, లెసైన్స్‌లు, ఇంటి పట్టాలు తదితర అన్ని రకాల కార్డులు, సర్టిఫికెట్లను మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం ఈ నెల 14వ తేదీ నుంచి రెండు వారాల పాటుగా వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రభుత్వ సేవా కేంద్రాల ద్వారా కూడా నకళ్లను పొందవచ్చని సూచించారు. వరద సాయం బాధితులకు బ్యాంక్ ఖాతాల ద్వారా అందుతున్నాయని ప్రకటించారు. రాత్రనక పగలనక చెన్నైలో పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన కార్మికులకు ప్రత్యేకంగా తలా రూ.2 వేలు ప్రకటించారు. ఇక, అన్నదాతల్ని ఆదుకుంటున్నామంటూ వరదలతో పంట పరిహారం అందజేయనున్నట్టు వివరించారు. సాగుబడులు, భూ సారం ఆధారంగా కొన్ని పంటలకు హెక్టారుకు రూ.7500, మరికొన్ని పంటలకు రూ.13,500, ఇంకొన్ని పంటలకు రూ. 18 వేలు చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. సహకార బ్యాంక్‌ల ద్వారా ఈ రుణాలను అందిస్తామని, అయితే, రైతుల అప్పులతో ఈ రుణాలు జమ చేసిన పక్షంలో తీవ్ర చర్యలు తప్పదని బ్యాంక్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, వరదలతో మరణించిన పశువులకు రూ.30 వేలు, మేకలకు రూ.3 వేలు, కోళ్లకు రూ.100 చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నామన్నారు. మరో ప్రకటనలో వరద సాయం గురించి వివరిస్తూ, 13.80 లక్షల మందిని రక్షించామని తెలిపారు. వారిని యాభై వేల శిబిరాల్లో ఉంచి, సహాయకాలను అందిస్తున్నామని వివరించారు. -
కోట్లకు అధిపతి కాకూడదా?
నగర కార్యదర్శి, నగర పాలక సంస్థ చైర్పర్సన్లు వంద కోట్ల మేరకు ఆస్తి కలిగి ఉంటే తమ అధినేత్రి జయలలిత కోట్లకు అధిపతి ఎందుకు కాకూడదంటూ మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అవినీతి తాండవం చేస్తోందని, ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకంగా మంత్రులు ఏ మేరకు అక్రమార్జన సాగిస్తున్నారో చిట్టాలను సైతం ప్రకటిస్తూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు అయితే ఫలాన అధికార పక్షం నేతకు వద్ద ఇన్ని కోట్లు ఉన్నాయని, ఫలాన నేత ఈ నాలుగేళ్లలో ఇన్ని కోట్లు సంపాదించాడని ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యత కల్గిన పద విలో ఉన్న మంత్రి ఏకంగా ప్రతిపక్షాల ఆరోపణల్ని సమర్థించే రీతిలో కోట్లు, అధిపతి అంటూ ప్రస్తావించడం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. గుడియాత్తంలో అన్నాడీఎంకే సర్కారు నాలుగున్నరేళ్ల ప్రగతిని చాటుతూ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గుడియాత్తం నగర కార్యదర్శి జెకేఎన్ పళని నేతృత్వంలో అక్కడి బస్టాండ్ ఆవరణలో సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ హాజరయ్యారు. కేసీ వీరమణి మాట్లాడుతూ గుడియాత్తం నగర పార్టీ కార్యదర్శి జేకే ఎన్ పళని, నగర చైర్ పర్సన్ అముదాలు వంద కోట్ల ఆస్తిపరులుగా పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్యదర్శి, చైర్పర్సన్లే వంద కోట్ల ఆస్తి పరులుగా ఉంటే తమ అధినేత్రి, అమ్మ జె జయలలిత కోట్లకు అధిపతిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఇంతలో నాంజిల్ సంపత్ అందుకుని వంద కోట్ల ఆస్తి పరుడు ఇక్కడ కార్యదర్శిగా పార్టీకి సేవల్ని అందించడం బట్టి చూస్తే ఏ మేరకు వారు దోపిడీకి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిం చాయి. ఈ వ్యాఖ్యలపై అమ్మ ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో అతనిపై చర్యలు తప్పవని అంటున్నారు. -
ఆర్కేనగర్లో జయలలిత ఘన విజయం
ఉప ఎన్నికల్లో లక్షన్నర మెజారిటీ సాధించిన జయ ఎంపీలో బీజేపీ, కేరళ-మేఘాలయల్లో కాంగ్రెస్, త్రిపురలో సీపీఎం సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్‌పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు నల్లేరుపై బండి నడకలా మారింది. మంగళవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే మహేంద్రన్ జయ దరిదాపుల్లోకీ రాకుండా పోయారు. 17వ రౌండ్ ముగిసేసరికి పోలైన మొత్తం 1,81, 420 ఓట్లలో 1,60,432 ఓట్లు జయకే వచ్చాయి. మహేంద్రన్‌కు పోలైన ఓట్లు కేవలం 9,710 కాగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి 4,590 ఓట్లు తెచ్చుకోగలిగారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు, డీఎండీకే, బీజేపీ, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ 25 మంది స్వతంత్రులు ఈ ఎన్నికలో పోటీ పడ్డారు. మహేంద్రన్‌తో సహా జయపై పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థికీ డిపాజిట్ కూడా దక్కలేదు. గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష పడడంతో శ్రీరంగం నియోజకవర్గం ఎమ్మెల్యే అర్హతను, ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయారు. అదే కేసులో కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా బైటపడడంతో గత నెల 23వ తేదీన ఆమె తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సీఎం పదవిని చేపట్టిన ఆరునెలల్లో తిరిగి ఎన్నిక కావటం తప్పనిసరి కావటంతో ఆర్కేనగర్ ఎమ్మెల్యే పి. వెట్రివేల్చే రాజీనామా చేయించి జయ ఉప ఎన్నికకు వెళ్లిన సంగతి తెలిసిందే. జయలలిత గెలుపుతో రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల పూజలు నిర్వహించారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌లు జయలలితకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జయ విజయంపై విచారణ జరిపించాలని ఆమె ప్రత్యర్థి సీపీఐ నేత మహేంద్రన్ డిమాండ్ చేశారు. అధికార పార్టీలదే విజయం ఆర్కేనగర్‌తో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లోని 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే గెలిచారు. కేరళలోని అరువిక్కరలో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్ శబరినందన్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో గరోత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి చందర్‌సింగ్ సిసోడియా గెలుపొందారు. త్రిపురలో ప్రతాప్‌గఢ్, సుర్మా స్థానాలను అధికార సీపీఎం చేజిక్కించుకుంది. మేఘాలయలోని చోక్పాట్లో కాంగ్రెస్ అభ్యర్థి బ్లుబెల్ ఆర్ సంగ్మా 2550 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. -
మోదీకి జయలలిత ధన్యవాదాలు
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు తమిళనాడు సీఎం జయలలిత ధన్యవాదాలు తెలిపారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తనకు అభినందనలు తెలిపినందుకు, మంచి జరగాలని కోరుకుంటూ సందేశాలు పంపినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలితకు ప్రధాని మోదీ ట్విటర్ లో అభినందలు తెలిపారు. జయకు అభినందనలు తెలిపిన జైట్లీ.. తమిళనాడుతో కేంద్రం సత్సంబంధాలు కోరుకుంటోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు.. జయలలితకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
జోక్యం వద్దు
సాక్షి, చెన్నై: విశ్వాసానికి పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం తనకంటూ కొన్ని ఆంక్షలను విధించుకున్నారు. ఈ మేరకు బంధువులు, ఆప్తులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ జోక్యం చేసుకోవద్దని, సచివాలయం వైపుగా ఎవ్వరూ రావద్దంటూ హితవు పలికారు. అన్నాడీఎంకేలో ఆ పార్టీ అధినేత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా, విశ్వాస పాత్రుడిగా ఓ పన్నీరు సెల్వం పేరు తెచ్చుకున్నారు. అందుకే తొలిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టిన ఆయన్ను జయలలిత తన ప్రతినిధిగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతల్ని ప్రభుత్వ పరంగా అప్పగించారు. అలాగే, పార్టీ పరంగా కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జయలలిత కారాగార వాసంలోకి వెళ్లడంతో ఇప్పుడు మళ్లీ సీఎం అయ్యారు. తన మీద జయలలిత ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో ప్రభుత్వాన్ని నడిపించేందుకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. పరిమితులు: జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ఉపయోగించిన చాంబర్ నుంచి పన్నీరు సెల్వం పరిపాలన సాగించడం లేదు. గతంలో సమీక్షలకు మందిరంగా ఉన్న ఓ గది నుంచి తన పాలనను సాగించే పనిలో పడ్డారు. కొత్త ఆదేశాలు, కొత్త నిర్ణయాల జోలికి వెళ్లకుండా, అమ్మ ఆజ్ఞ మేరకు నిజాయితీగా ముందుకు సాగుతున్నారు. అలాగే, తాను అమ్మగా పిలుచుకునే జయలలిత బెయిల్ మీద బయటకు వచ్చే వరకు కాబోలు మాసిన గడ్డంతో ప్రత్యక్షం అవుతున్నారు. ఒక సీఎం ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నట్టుగా ఇది వరకు ఆ కుర్చీలో ఉన్న వాళ్లు వ్యవహరించారు. అయితే, వారందరికన్నా భిన్నంగా ఏదో ఒక బాధ్యతను మాత్రమే తాను నిర్వర్తిస్తున్నట్టుగా ముందుకు సాగుతున్నారు. సమీక్షా సమావేశాల్లో తనను ఫోకస్ చేసుకోకుండా గ్రూపు ఫొటోలను, లాంగ్ షాట్ ఫొటోలను మీడియాకు పంపిస్తుండడం బట్టి చూస్తే, జయలలిత మీద తనకున్న విశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న జయలలిత ఫొటోల్ని తొలగించాలన్న ఆదేశాలు ఇంత వరకు ఆయన ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం రోజు వారి కార్యక్రమాల మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్న పన్నీరు సెల్వం తన కంటూ కొన్ని ఆంక్షల్ని విధించుకున్నట్టుగా సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. బరువెక్కిన హృదయంతో బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం సీఎం హోదాకు తగ్గ వసతులు కాకుండా, ఇది వరకు మంత్రిగా తనకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో వాటినే అనుకరిస్తూ ముందుకు వెళ్తుండడం విశేషం. తన వాళ్లకు హెచ్చరిక: తన కంటూ కొన్ని పరిమితులు విధించుకున్న పన్నీరు సెల్వం బంధువులు, ఆప్తులకు కొన్ని హెచ్చరికలు చేశారు. తన పేరు చెప్పుకుని చెలామణి అయితే, మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కుటుంబీకులకు సైతం ఇదే హితవు పలికినట్లు సచివాలయ వర్గాలు, అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనద్దని, ఎలాంటి జోక్యం చేసుకోవద్దని చెప్పారు. రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు వద్దు అని, ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు, మీడియాతో ఏది బడితే అది మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అలాగే, కుటుంబీకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల కనెక్షన్లను సైతం తొలగించారు. తన పిల్లలు కూడా ఇది వరకు ఎలా వ్యవహరించే వారో, అలాగే నడచుకునే విధంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం గమనించాల్సిందే. -
సామరస్యమేనా?
సాక్షి, చెన్నై:రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చిలి శశికళపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు , ఆదాయపు పన్ను ఎగవేత కేసుల విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ఆస్తులు గడించిన కేసు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో, పన్ను ఎగవేత కేసు చెన్నై ఎగ్మూర్ కోర్టులోనూ ఏళ్ల తరబడి సాగుతోంది. ఆదాయపు పన్ను ఎగవేత : జయలలిత, శశికళ భాగస్వామ్యంలోని శశి ఎంటర్ ప్రెజైస్కు సంబంధించి 1991-92,1992-93 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదు. అలాగే, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీన్ని గుర్తించిన డీఎంకే సర్కారు కేసులు దాఖలు చేసింది. ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ కోర్టులో సాగుతోంది. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో విచారణ సాగుతోంది. విముక్తి : ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు చుక్కెదురు కావడంతో జయలలిత, శశికళ చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను నాలుగు నెలల్లో ముగించి తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి దక్షిణా మూర్తి నేతృత్వంలో విచారణ వేగం పెరిగింది. నిర్విరామంగా వాయిదాలతో విచారణ సాగుతోంది. ఈ సమయంలో పలు మార్లు కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు కోర్టు నోటీసులు పంపింది. అయితే, వారు డుమ్మాల పర్వం కొనసాగించారు. దీంతో విచారణను తుది దశకు చేర్చేందుకు న్యాయమూర్తి దక్షిణామూర్తి నిర్ణయించారు. మలుపు : సోమవారం విచారణ సందర్భంగా కేసు మలుపు తిరిగింది. జయలలిత, శశికళ తరపున కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆదాయపు పన్ను శాఖకు జయలలిత, శశికళలను ఓ విజ్ఞప్తి చేసుకున్నట్టు వివరించారు. సామరస్య పూర్వకంగా, జరిమానాలతో సమస్యను పరిష్కరించుకుందామని అందులో సూచించినట్టు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి దక్షిణామూర్తి ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామికి ప్రశ్నల్ని సంధించారు. జయలలిత, శశికళ తరపు వచ్చిన విజ్ఞప్తి వాస్తవేమనని, ఆ విజ్ఞప్తి పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుందని గుర్తు చేశారు. అదే సమయంలో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని, అంతలోపు సమస్య సామరస్య పూర్వకం అవుతుందంటూ జయలలిత తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. దీంతో తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయించారు. ఆదాయపు పన్ను ఎగవేత కేసు సామరస్యంగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, ఇక జయలలిత తరపున సామరస్య పూర్వక పరిష్కార విజ్ఞప్తి వచ్చిన దృష్ట్యా, సానుకూలంగా జరిమానాలతో కేసును ముగించేయడం తథ్యం. -
తమిళనాడు సిఎం ముఖ్యమంత్రిపై కావేరి దాడి