
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాష్ట్ర బీజేపీ విభాగం శుక్రవారం చైనా భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘బీజేపీ తమిళనాడు విభాగం గౌరవ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది’అని ‘ఎక్స్’లో పేర్కొంది. అందులో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలై చిత్రాలు, ఆపక్కనే స్టాలిన్ చిత్రం కింద చైనీస్ భాషలో ఒక సందేశం ఉంది.
రాష్ట్రంలో ఇస్రో కాంప్లెక్స్ సముదాయం ప్రారంభం సందర్భంగా ఇటీవల డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో చైనా జెండా కనిపించడం వివాదం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ మేరకు స్పందించడం విశేషం. అయితే, ఆ ప్రకటనలో పొరపాటున చైనా జెండా అచ్చయిందే తప్ప, ఉద్దేశపూ ర్వకంగా చేసింది కాదని ఆ ప్రకటన ఇచ్చిన మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment