జయలలిత అనూహ్య నిర్ణయం | Hours after swearing-in, Jayalalithaa expands her cabinet | Sakshi
Sakshi News home page

జయలలిత అనూహ్య నిర్ణయం

Published Mon, May 23 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

జయలలిత అనూహ్య నిర్ణయం

జయలలిత అనూహ్య నిర్ణయం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. జయ మంత్రివర్గంలో మరో నలుగురికి స్థానం కల్పించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు ఈ మేరకు జాబితా పంపారు.

గవర్నర్ కొత్త మంత్రులతో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్తగా బెర్తులు దొరికిన వారిలో జీ భాస్కరన్, ఎస్.రామచంద్రన్, నిలోఫర్ కబిల్, పి.బాలకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం జయతో పాటు మొత్తం 28 మంది మంత్రులు ప్రమాణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement