
ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం,తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.
అయితే తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను (Rupee symbol row) తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. ఈ క్రమంలో ఆ రూపాయి సింబల్ డిజైన్ ఎవరు తయారు చేశారు? అనే అంశంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.
రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్ చేశారు?
ఇక ఆ రూపాయి డిజైన్‌ను చేసింది మరెవరోకాదు తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్.ధర్మలింగం కుమారుడు ఐఐటీ ప్రొఫెసర్ డీ.ఉదయ్‌కుమార్ ధర్మలింగం. తొలిసారిగా ఈ రూపాయి సింబల్ 2010లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వినియోగంలోకి తెచ్చారు.
రూపాయి డిజైన్ ఎలా చేశారంటే?
2010 నాటి యూపీఏ ప్రభుత్వం రూపాయి డిజైన్ చేసేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. అయితే, ఈ కాంటెస్ట్‌లో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ కుమార్ సైతం పాల్గొన్నారు. రూపాయి సంకేతం డిజైన్ చేయడంలో దేవనాగరి, రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్ చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనగరి భాషలోని ‘ర’ను రోమన్‌లోని ‘ఆర్’ కలిపి రూ (₹) సింబల్‌ను తయారు చేశారు. సరిగ్గా ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు కేంద్రం రూపాయి సింబల్ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా.. ఆ డిజైన్లు అన్నింటిల్లో ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి డిజైన్‌ను కేంద్రం ఎంపిక చేసింది.
భారత కరెన్సీలో రూపాయి సింబల్
2010 జూలై 15న,మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ కుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలో ఉన్న మారూరు గ్రామంలో జన్మించిన ఉదయ కుమార్ రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. ఇక, ప్రస్తుతం ఉదయ కుమార్ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం హెచ్‌ఓడీగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment