Rupai
-
కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి 21 పైసలు కోలుకుంది. 77.50 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం జీవితకాల కనిష్టం 77.71కి పడిపోయింది. బుధవారం 77.58 వద్ద ప్రారంభమైంది. 77.50–77.62 శ్రేణిలో తిరిగింది. కొన్ని బ్యాంకులు డాలర్ల విక్రయం రూపాయికి కొంత మేర కలిసివచ్చింది. అయితే ఇది తాత్కాలిక ధోరణి అని, రూపాయి బలహీనతే కొనసాగుతుందని నిపుణుల అంచనా. -
రూపాయి ఢమాల్..డాలర్‌కి జోష్!
జాతీయ, అంతర్జాతీయ పరిణాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలరు మారకంలో దేశీయ కరెన్సీ విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. పీటీఐ కథనం ప్రకారం..సోమవారం అమెరికా డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ విలువ పతనమైంది. 60పైసలు తగ్గి 76.90 నుండి 77.50 వద్ద ట్రేడింగ్‌తో ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 77.17 వద్ద దిగువన ప్రారంభమైంది. చివరికి దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 60 పైసలు తగ్గి 77.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్లో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.52కి చేరుకుంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి ఆందోళనల ఫారెక్స్ మార్కెట్‌పై పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల పెంపు కారణంగా డాలర్ రెండు దశాబ్దాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. అదనంగా, చైనాలో కఠినమైన లాక్డౌన్, మూడవ నెలలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా రష్యా చమురును నిషేధించాలనే యూరప్ ప్రణాళిక, వస్తువుల ధరలను పెంచడం వల్ల ఆర్థిక వృద్ధి ప్రమాదాలు మందగించడం డాలర్ రేటు పెరగుదలకు ఊతమిచ్చింది. -
మూడోరోజూ..రూపాయి ‘బాహుబలి’
ముంబై: రూపాయి విలువ వరుసగా మూడోరోజూ బలపడింది. డాలర్ మారకంలో 24 పైసలు ఎగసి 75.29 వద్ద స్థిరపడింది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడింది. ఈ అంశాలు మన కరెన్సీకి కలిసొచ్చాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 75.54 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.27 స్థాయి వద్ద గరిష్టాన్ని అందుకుంది. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, భౌగోళిక అనిశ్చితుల ఆందోళనలతో లాభాలు పరిమితమైనట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ‘‘రష్యాపై ఆంక్షల విధింపు ప్రభావం, షాంఘైలో లాక్డౌన్ విధింపుతో చైనా వృద్ధి అవుట్‌లుక్ అంచనాలతో పాటు ఆర్బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు రానున్న రోజుల్లో రూపాయి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్దేవ్ తెలిపారు. -
రూపాయికి తిప్పలే, 2023 మార్చి నాటికి 77.5కి రూపాయి పతనం!
ముంబై: భారత్ కరెన్సీ రూపాయి విలువ డాలర్ మారకంలో 2023 మార్చి నాటికి 77.5కు బలహీనపడుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ఇంధన ధరలతో పెరగనున్న కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక నిల్వల మధ్య నికర వ్యత్యాసం), అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ (విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కు మళ్లడం) వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొలినాళ్లలో జరిగిన ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగియగా, ఇంట్రాడేలో 77.05 స్థాయినీ చూసింది. నివేదిక ప్రకారం... రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫారెక్స్ మార్కెట్లో తన జోక్యాన్ని కొనసాగిస్తుంది. 630 బిలియన్ డాలర్లకుపైగా 12 నెలలకు సరిపడా పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలను భారత్ కొనసాగిస్తుండడమే దీనికి కారణం. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ‘ఆర్బీఐ జోక్యం’ కొంత నివారించవచ్చు. ►ఫెడ్ ఫండ్ రేటును బుధవారం 25 పైసలు పెంచిన (0.25–0.50 శాతం) సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరో ఆరుసార్లు రేట్లు పెంచవచ్చనీ సంకేతాలు ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ బేరల్‌కు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల శ్రేణిలో ఉండే వీలుంది. ఈ ప్రాతిపదికన దేశ కరెంట్ అకౌంట్ లోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి (జీడీపీలో) పెరగవచ్చు. 2021–22లో ఈ రేటు 1.6 శాతం. ► ఫిబ్రవరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.1 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వెనక్కు మళ్లాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో ఉపసంహరణలు ఇదే తొలిసారి. ఇది రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ► అయితే 2013లో ఫెడ్ ఫండ్ రేటు పెంచినప్పటి పరిస్థితి ప్రస్తుతం రూపాయికి ఎదురుకాకపోవచ్చు. భారత్‌కు భారీ విదేశీ మారక నిధుల దన్ను దీనికి కారణం. ► ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో ఆశించిన నిధుల ప్రవాహం అలాగే 2023 ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశం డెట్ ఇన్స్టమెంట్ను చేర్చడం వంటి అంశాలు భారత్ కరెన్సీకి సమీప కాలంలో మద్దతునిచ్చే అంశాలు. 75.84 వద్ద రూపాయి... ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోల్చితే 37 పైసలు లభపడి 75.84 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల పెరుగుదల, విదేశీ కరెన్సీల్లో డాలర్ బలహీనత దీనికి కారణం. వారంవారీగా చూస్తే, అమెరికన్ కరెన్సీలో రూపాయి విలువ 63 పైసలు లాభపడింది. హోలీ పండుగ నేపథ్యంలో సోమవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయదు. -
14న తెరపైకి రూపాయ్
తమిళసినిమా: రూపాయ్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. గాడ్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు ప్రభుసాలమన్ నిర్మిస్తున్న చిత్రం రూపాయ్. ఆర్పీకే.ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత ఆర్.రవిచందర్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చంద్రన్, ఆనంది జంటగా నటించారు. ఈ జంటను ప్రభుసాలమన్ తన కయల్ చిత్రం ద్వారా పరిచయం చేశారన్నది గమనార్హం. కాగా కిశోర్‌రవిచంద్రన్, చిన్నిజయంత్, మరీష్‌ఉత్తమన్, ఆర్ఎస్ఆర్.మనోహర్, మారిముత్తు, వెట్ట్రివేల్‌రాజా తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన రూపాయ్ చిత్రానికి వి.ఇళయరాజా చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతం అందించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎం.అన్బళగన్ నిర్వహించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ డబ్బు అందరికీ అవసరమేనన్నారు. అయితే దాన్ని న్యాయంగా సంసాదిస్తే జీవితం సంతోషంగా సాగుతుందన్నారు. అదే అక్రమంగా అర్జిస్తే ఆ డబ్బు సమస్యల పాలు చేస్తుందనే ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రూపాయ్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంతకు ముందే విడుదల చేయనున్నట్లు వెల్లడించామని అయితే ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దు సంఘటనతో చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా ఈ నెల 14న రూపాయ్ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు.