Udaya Kumar
-
వేగం ఉంది.. వివేకం లేదు
ప్రస్తుత నిర్మాతల మండలి నిర్వాకంలో వేగం ఉంది గానీ వివేకం లేదు అని సీనియర్ దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ విమర్శంచారు. డీకే.పిక్చర్స్ పతాకంపై జే.ధనలక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం కోణలా ఇరుందాలుమ్ ఎన్నోడదు. క్రిషిక్ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఢిల్లీగణేశ్, పవర్‌స్టార్, అభినవ్, తీపెట్టి గణేశ్, కేకే.శేషు, క్రేన్‌మనోహర్, జ్యోతిలక్ష్మి, షకీలా ముఖ్య పాత్రలను పోషించారు. కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న దీనికి వల్లవన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం స్థానికి టీనగర్‌లోని ఎంఎం.థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ మాట్లాడుతూ తాను సినీ రంగంలోకి ప్రవేశించాలని భావించినప్పుడు తొలిరోజునే పురట్టి తలైవర్ ఎంజీఆర్‌ను కలిసి ఆయన సిఫార్సుతోనే ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు. రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్ హీరోలతో చిత్రాలు చేసినట్లు చెప్పారు. తాను మూడుసార్లు నిర్మాతల మండలిలో వివిధ పదవులకు బాధ్యతలు నిర్వహించానని, ప్రతిసారి సినిమా రంగానికి ఏదైనా మంచి చేయాలని భావించానని, అయితే అక్కడి సిస్టమ్ సరిలేక తనను ఏమీ చేయనివ్వలేదని అన్నారు. ప్రస్తుతం మండలి కార్యవర్గంలోకి తానుగానే ప్రవేశించి వారికి, ప్రభుత్వానికి వారధిగా ఉండి సినీరంగానికి పలు మంచి విషయాలను చేయడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఉందన్న విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళ్లగా 100 మినీ థియేటర్లను కట్టించడానికి సంకల్పించారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే సినీ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో సినీరంగానికి మంచి చేయాలనుకున్న ప్రభుత్వం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటి నిర్మాతల మండలి తనను కరివేపాకు మాదిరి వాడుకుని వదిలేస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఇప్పుటి మండలి నిర్వాకంలో వేగం ఉందిగానీ, వివేకం లేదని విమర్శించారు. దర్శకుడు పేరరసు, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్‌తంగం, జిప్సీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆన్లై న్ డేటా వర్క్ పేరుతో మోసం
కనిగిరి : ఆన్లైన్ డేటా వర్క్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి లక్షల రూపాయలు దిగమింగిన ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్థానిక కొత్తపేటలో ఉదయకుమార్ అలియాస్ ప్రదీప్ అనే యువకుడు ఆన్లైన్లో డేటా వర్క్ ఇస్తానని ఏడాది నుంచి నిరుద్యోగులను నమ్మిస్తున్నాడు. డేటా వర్క్ కావాలంటే తొలుత తన ప్రాజెక్ట్‌లో సభ్యునిగా చేరాలని చెప్తాడు. అందుకు ముందుగా రూ. 25 వేలు చెల్లించాలని మెలిక పెడతాడు. ఈ విధంగా అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసుకుని తన సొంత ఖాతాకు జమ చేసుకున్నాడు. నమ్మించేది ఇలా.. ప్రదీప్ ముందు నిరుద్యోగులను గుర్తిస్తాడు. అతని వద్ద సభ్యునిగా చేరాక వెబ్సైట్ ద్వారా మీకు సాఫ్ట్వేర్ ఇస్తానని చెప్తాడు. డేటా ఎంట్రీ వర్క్ చేసేందుకు అవసరమైన ల్యాప్‌టాప్ కూడా తన వద్దే కొనాలని షరతు విధిస్తాడు. ల్యాప్‌టాప్ బయట కొంటే సాఫ్ట్వేర్ సక్రమంగా సపోర్ట్ చేయదని నమ్మిస్తాడు. తక్కువ కష్టంతో సులువుగా డబ్బులు సంపాదించే మార్గమని, మీరు చేయాల్సిందల్లా కేవలం కొలేటి బబుల్ వెబ్సైట్లో 3 వేల క్యాప్చా (గజిబిజిగా ఉన్న ఇంగ్లిష్ పదాలను అక్షరాలుగా గుర్తించడం) టైప్ చేస్తే ఒక డాలర్ మీ అకౌంట్లో జమ అవుతుందని చెబుతాడు. ఒక డాలర్ (58 రూపాయలు) అకౌంట్లో పడాలంటే అర గంట టైప్ చేస్తే సరిపోతుందని, రోజుకు 3 గంటలు పనిచేసినా మీకు రూ.300 నుంచి రూ.400 వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపుతాడు. రంగంలోకి ఏజెంట్లు ఇక అక్కడి నుంచి ఒకరిద్దరు ఏజెంట్లను రంగంలోకి దింపుతాడు. తమకు చాలా ఆదాయం వస్తోందని నిరుద్యోగుల వద్ద వారితో ప్రచారం చేయిస్తాడు. ముగ్గురిని నెట్‌వర్క్‌లో చేర్పిస్తే ఏజెంట్‌కు కరెంట్‌బిల్, నెట్ బిల్, రూమ్‌రెంట్ బోనస్‌గా ఇస్తానని నమ్మబలుకుతాడు. అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రదీప్ మాయలో పడి నిలువునా మోసపోయారు. అనుమానం వస్తే ఇలా.. నమ్మిస్తాడు ఆన్లైన్ డేటా వర్క్‌లో చేరిన వారికి సాఫ్ట్వేరు యూసర్ ఐడీ నంబర్ ఇస్తాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఆ యూసర్ ఐడీని ఉదయ్కుమారే బ్లాక్ చేస్తాడు. దీనిపై అనుమానం వచ్చిన యువకులు ఆయన్ను ప్రశ్నిస్తే మీరు డేటా ఎంట్రీలో తప్పులు కొట్టారని, అందువల్లే మీ యూసర్ ఐడీ రద్దయిందని నమ్మిస్తాడు. తిరిగి యూసర్ ఐడీ ఇన్స్టాల్ చేయాలంటే మరో రూ. 5 వేలు కట్టాలని చెబుతాడు. అంతేగాకుండా నమ్మకం కుదిరేందుకు డాలర్ రూపంలో (నగదును) డేటా వర్క్ చేసిన వారి అకౌంట్లో కంపెనీ వారు వేసినట్లు తనే జమ చేస్తాడు. దీంతో వారికి నమ్మకం కలిగి మరి కొందరిని చేర్పించారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కూడా సభ్యులే నెట్‌వర్క్‌లో కనీస కంప్యూటర్ పరిజ్ఙానం లేనివారు కూడా సభ్యులుగా చేరారు. వారు ఇంగ్లిష్‌లో 3000 పదాలు కొట్టలేక నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఉదయ్‌కుమార్ నిరాకరించాడు. బాధిత యువకులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీయగా మీపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడని బాధితులు వంశీ, జోసఫ్, రంగప్రసాద్, వెంకట రామిరెడ్డి, అశోక్, మేరీ, శిరీషలు విలేకరుల ఎదుట వాపోయారు. తీగలాగితే డొంక కదిలింది తీగ లాగితే డొంక కదిలినట్లు తొలుత చిన్న కేసుగా భావించి పెద్దగా పట్టించుకోని పోలీసు అధికారులు ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగు చూశాయి. అతనిపై చీరాల, దర్శి ప్ రాంతాల్లో పలు చీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. 2009లో షిరిడీ సాయి వికలాంగుల ఆశ్రమం పేరిట గొలుసు సిస్టంతో రూ. లక్షలు ప్రజల నుంచి వసూలు చేసి పరారయ్యాడని తెలుసుకున్నారు. ఆ కేసులో ఐదేళ్ల నుంచి అరెస్టు కాకుండా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని సీఐ యూ.సుధాకర్‌రావు విలేకర్లకు వెల్లడించారు. నిందితుడు ఉదయ్‌కుమార్ అలియాస్ ప్రదీప్ ఓ విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కావడం కొసమెరుపు. -
కరూర్ విజేత ఎవరో?
సాక్షి, చెన్నై : బనియన్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా కరూర్ బాసిల్లుతోంది. కావేరి, అమరావతి నదులను తనలో ఇముడ్చుకుని పురాతన పట్టణంగా పేరెన్నికగన్న కరూర్ నియోజకవర్గం పునర్విభజన ప్రభావంతో పెనుమార్పులను చవి చూసింది. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలో అరవకురుచ్చి, కరూర్, కృష్ణరాయపురం, కుళిత్తలై, మరుంగాపురి, తొట్టియం అసెంబ్లీ స్థానాలు ఉండేవి. వీటిలో మరుంగాపురి మనపారైగా రూపాంతరం చెందింది. కుళిత్తలైను పెరంబలూరు లోక్‌సభలోకి చేర్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి కరూర్, దిండుగల్, తిరుచ్చి, పుదుకోట్టై జిల్లాకు చెందిన అసెంబ్లీ స్థానాలు ఉండడం విశేషం. నాలుగు జిల్లాలను తనలో ఇముడ్చుకున్న లోక్‌సభ నియోజకవర్గంగా కరూర్ పేరుగాంచింది. అసెంబ్లీ స్థానాలు ఈ నియోజకవర్గం పరిధిలో వేడచందూర్, కరూర్, విరాళి మలై, మనప్పా రై, కృష్ణరాయపురం, అరవకురుచ్చి ఉన్నాయి. 2011 ఎన్నికల్లో వేడ చందూర్ నుంచి ఎస్ పళని స్వామి(అన్నాడీఎంకే), కరూర్ నుంచి వి సెంథిల్ బాలాజీ (అన్నాడీఎంకే), విరాళి మలై నుంచి సీ విజయభాస్కర్ (అన్నాడీఎంకే), మనప్పారై నుంచి ఆర్ చంద్రశేఖర్(అన్నాడీఎంకే), కృష్ణరాయపురం నుంచి ఎస్ కామరాజ్ (అన్నాడీఎంకే), అరవకురుచ్చి నుంచి కేసీ పళని స్వామి (డీఎంకే) అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక్క స్థానాన్ని మాత్రం డీఎంకే దక్కించుకోగా, మిగిలి స్థానాలను అన్నాడీఎంకే కైవశం చేసుకుంది. కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని, విరాళి మలై ఎమ్మెల్యే సి ఉదయకుమార్‌ను మంత్రి పదవులు వరించాయి. ఓటర్లు ఈ నియోజకవర్గం పరిధిలో 12,78,348 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,32,187 మంది పురుషులు, 6,46,132 మంది స్త్రీలు, 29 మంది ఇతరులు ఉన్నారు. గతంలో ఇక్కడ పురుషుల ఓట్లు అధికంగా ఉండేవి. తాజాగా పురుషులను స్త్రీలు అధిగమించారు. అప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో అన్నాడీఎంకే పాగా వేసింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సార్లు, అన్నాడీఎంకే 6 సార్లు విజయ ఢంకా మోగించాయి. స్వతంత్ర పార్టీ, డీఎంకేలు ఒక్కొక్కసారి మాత్రమే గెలిచాయి. గతంలో వరుస విజయూలతో దూసుకొచ్చిన కాంగ్రెస్‌కు అన్నాడీఎంకే బ్రేక్ వేసింది. అన్నాడీఎంకే వరుస విజయాలకు 2004లో డీఎంకే బ్రేక్ వేసింది. అయితే, 2009లో మళ్లీ తన గుప్పెట్లోకి ఈ స్థానాన్ని అన్నాడీఎంకే తీసుకుంది. 2009 ఎన్నికల్లోకి వె ళితే... కూటమి ధర్మం కారణంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు డీఎంకే కేటాయిస్తూ వచ్చింది. వరుస పరాజయాలను కాంగ్రెస్ చవి చూడడంతో 2004లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డీఎంకే సిద్ధం అయింది. ఈ ఎన్నికల్లో విజయం వరించడంతో మళ్లీ 2009లో ఈ స్థానం బరిలో తన అభ్యర్థిని డీఎంకే రంగంలోకి దించింది. డీఎంకే అభ్యర్థిగా మళ్లీ రేసులో నిలిచిన సిట్టింగ్ ఎంపీ కేసీ పళని స్వామికి భంగపాటు తప్పలేదు. అన్నాడీఎంకే అభ్యర్థి తంబిదురై ముందు తలొంచక తప్పలేదు. పార్లమెంట్ మెట్లు ఎక్కిన తంబి దురైని అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత పదవి వరించింది. మళ్లీ అదృష్టం వరించేనా మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తంబి దురై సిద్ధం అయ్యారు. అయితే, పలు గ్రామాల్లో తంబిదురైకు వ్యతిరేకత ఉండడంతో విజయం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి అన్నాడీఎంకేకు ఏర్పడింది. తంబిదురై గెలుపు బాధ్యతలను ఆ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు మంత్రులు సెంథిల్ బాలా జీ, విజయ భాస్కర్ తమ భుజాన వేసుకున్నారు. తంబిదురై ఓడిన పక్షంలో ఎక్కడ తమ సీట్లు ఊడుతాయోనన్న బెంగతో గెలుపు లక్ష్యంగా రేయింబవళ్లు ఈ ఇద్దరు మంత్రులు శ్రమిస్తున్నారు. మళ్లీ తనకు సీటు దక్కుతుందని ఎదురు చూసిన డీఎంకే మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త కేసీ పళని స్వామికి చుక్కెదురైంది. ఆయనకు బదులుగా స్థానిక నేత చిన్న స్వామిని వరించింది. చిన్న స్వామి మీద కేసీ పళని స్వామి వర్గం గుర్రుమంటోంది. అయితే, అధిష్టానం ఆదేశాలతో చిన్నస్వామి గెలుపు కోసం డీఎంకే వర్గాలన్నీ ఒకే తాటి మీద సాగుతున్నారుు. తంబిదురై వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ, ఆయన మీద అనేక గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకుని చిన్న స్వామి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ఇద్దరికీ గట్టి పోటీ ఇచ్చి తీరుతానంటూ డీఎండీకే అభ్యర్థి ఎస్ఎస్ కృష్ణన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేల మీద నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న దృష్ట్యా, బీజేపీ కూటమిలోని తనకు ఓటర్లు పట్టం కట్టడం తథ్యమన్న ఆశాభావం లో మునిగి ఉన్నారు. ఓటర్లను ఆకర్షిం చడంలో కృష్ణన్ దూసుకెళుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దల కుట్రతో కరూర్ నుంచి ఓటమి చవి చూసిన జ్యోతిమణికి లోక్‌సభ సీటు దక్కింది. తనతో మాట వరుసకైనా అడగకుండా, సీటు ఇవ్వడంతో ఆమె అసంతృప్తి తో ఉన్నారు. ఆర్థిక బలం లేని తాను ఎలా ఎన్నికలను ఎదుర్కొంటానంటూ ఏకంగా అధిష్టానాన్ని ఆమె ప్రశ్నించి ఉన్నా రు. ఇక చేసేది లేక ఓటమి తప్పదని గ్రహించి మొక్కుబడిగా ప్రచారంలో ఆమె నిమగ్నం అయ్యారు. కార్మిక ఓటు బ్యాంక్ ఇక్కడ ఉన్నా, సీపీఎం, సీపీఐలు మాత్రం ఎన్నికల బరిలో నిలబడేందుకు సాహసించ లేదు. ఈ దృష్ట్యా, కార్మిక ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టే పనిలో రాజకీయ పక్షాల అభ్యర్థులు ఉన్నారు. సమరం డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకేల మధ్య నెలకొన్న దృష్ట్యా, కరూర్ విజేత ఎవరో వేచి చూడాల్సిందే.