newly wedded woman
-
Pahalgam: ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్ని పిండేసే వీడియోలు
జమ్మూకశ్మీరిలోని పహల్గామ్ ఉగ్ర దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. మినీ స్విట్జర్లాండ్ బైసరన్ లోయలో మంగళవారం జరిగిన మారణ హోమం పలువురి కంటతడి పెట్టిస్తోంది. ఈ సంఘటనకు భయానక వివరాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. హనీమూన్‌కి వచ్చి ఒకరు, సెలవులకోసం వచ్చి ఒకరు ఇలా 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న వైనాన్ని యావద్దేశం ఖండించింది. 8 ఏళ్ల శిశువు నుండి నావికాదళ అధికారి వరకు, 22 మంది పర్యాటకులు, ఇద్దరు విదేశీయులు ,ఇద్దరు స్థానికులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తండ్రి కోల్పోయిన చిన్నారి హృదయ విదారకంగా రోదిస్తున్న వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉగ్రమూకలు రెచ్చిపోయి పర్యాటలకు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణ భయంతో అనేకమంది పరుగులు తీశారు. 26 మంది తూటాలకు నేలకొరిగారు. ఇలా తండ్రిభౌతిక దేహం మీద ఒక చిన్నారి రోదిస్తున్న వీడియో నెటిజనుల గుండె పిండేసింది. అతణ్ని రక్షించి తీసుకెళ్లుతుండగా, ఆ చిన్నారి రోదన ముఖ్యంగా అమ్మకావాలి అటూ ఏడుస్తున్న దృశ్యాలు హృదయ విదారకం ఉన్నాయి. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని, బాధితులకు నివాళులర్పించారు. దేశం ఉగ్రవాదానికి తలొగ్గదని, దోషులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రకటించారు. आपका दिल फट्ट जाएगा इस छोटे बच्चे का रोना सुनकर! इसके पिता का जुर्म इतना सा था की वह एक हिंदू थे! इन आतंकियों को ऐसा सबक सीखना चाहिए की इनकी 100 पुश्ते भी याद करके काँप जाये! #PahalgamTerroristAttack #HindusUnderAttack pic.twitter.com/J6Q6xhSU8L— Priyanshi Bhargava (@PriyanshiBharg7) April 23, 2025మృతుల్లో నావికాదళ అధికారి వినయ్ నర్వాల్.భార్య హిమాన్షి నర్వాల్ భర్త శవపేటిక పక్కన తీవ్రంగా రోదించింది. తన భర్త ధైర్యసాహసాల గురించి మాట్లాడుతూ విలపించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. కోటి ఆశలతో కొత్తజీవితాన్ని ప్రారంభించిన ఆ జంట కలలు క్షణాల్లో తునాతునాలైపోయాయి. ఇక హిమాన్షి దుఃఖాన్ని నిలువరించడం ఎవ్వరి తరము? #WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ— ANI (@ANI) April 23, 2025మరోవైపు ఆ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరిని జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులుగా భావిస్తున్నారు. -
పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు..
గ్రేటర్ నోయిడా: ఓ నూతన వధువు పెళ్ళైన మరుసటి రోజునే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం గ్రేటర్ నోయిడాలో ఒక గ్రామంలో చోటుచేసుకుంది. వివాహం జరిగి 24 గంటలైనా కాకుండానే తన భార్యకు డెలివరీ కావడంతో షాక్ లో ఉండిపోయాడు నవవరుడు. కడుపు నొప్పని వెళ్తే.. వివరాల్లోకి వెళ్తే జూన్ 26, సోమవారం రోజున పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యారు. అదే రోజు రాతి ఆ వధువుకు కడుపులో చిన్నగా నొప్పి వస్తోందని చెప్పడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి చూడగా ఆమె ఏడో నెల గర్భవతి అని నిర్ధారించి డెలివరీ కూడా చేయగా అడబిడ్డకు జన్మనిచ్చింది వధువు. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమామలు షాక్ కు గురయ్యారు. గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ట్రీట్మెంట్ చేయించాము. ఆ తర్వాత కడుపు వాపు వస్తుండటంతో ట్రీట్మెంట్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనుకున్నామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. బంధువుల జోక్యంతో.. సికింద్రాబాద్ కు చెందిన ఆ యువతి పెళ్ళికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికూతురు తల్లిదండ్రులు విషయాన్ని దాచిపెట్టారని ఆమెను గానీ ఆమె బిడ్డను గానీ తమ ఇంటిలోకి రానిచ్చేది లేదని మొదట తెగేసి చెప్పారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు. అంతలోనే బంధువులు కల్పించుకుని సమస్య సద్దుమణిగేలా చేయడంతో వారు మాకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వెడ్డింగ్‌లో విచిత్రం.. కోపంతో ఊగిపోయిన వధువు ఏం చేసిందంటే.. -
కడుపునొప్పి పేరుతో భర్తను బయటకు పంపి.. క్షణాల్లో పెళ్లికూతురు మాయం
సాక్షి, హైదరాబాద్: ‘బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని అత్తగారింటికి వచ్చిన నవ వధువు భర్తపై రుసరుసలాడి అక్కడి నుంచి పరారైంది. ఈ సంఘటన యాచారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి తనకు పెళ్లి సంబంధం చూడాలని సమీప బంధువైన మంచాల మండలం లింగంపల్లికి చెందిన ఓ మధ్యవర్తిని కోరాడు. అతను విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం చూశాడు. విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి కుదిర్చాడు. ఈ నెల 17న కుర్మిద్దకు చెందిన సదరు వ్యక్తితో సహా కుటుంబ సభ్యులు విజయ వాడకు వెళ్లారు. అదేరోజు ఉదయం 11.40 గంటలకు ఓ లాడ్జిలో వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు, ఇరువురి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి నేరుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున మధ్యవర్తి గ్రామమైన మంచాల మండలం లింగంపల్లికి వచ్చారు. అదే రాత్రి 9 గంటలకు కుర్మిద్దకు చేరుకున్నారు. వచ్చి రాగానే.. ‘పాత ఇంటిని చూసి బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని రుసరుసలాడింది. తనకు కడుపు నొప్పి వస్తుంది మాత్రలు తేవాలని చెప్పి ఇంటి నుంచి అతడ్ని బయటికి పంపించింది. చదవండి: మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి.. వివస్త్రగా ఉండడం చూసి వధువుతో పాటు వచ్చిన మరో మహిళ ఇంటి బయటనే ఉండి అప్పటికే వేసిన పథకం ప్రకారం కారును తెప్పించుకుని క్షణాల్లోనే వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళల నుంచి తాను మోసపోయా నని మంగళవారం కుర్మిద్ద గ్రామానికి చెందిన వరుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై సీఐ లింగయ్యను సంప్రదించగా.. తాను కోటీశ్వరుడినని, నగరంలో పెద్ద బంగ్లా ఉందని, తన పేరు మీద కుర్మిద్దలో పదెకరాల వ్యవసాయ పొలం ఉందని ఆ వ్యక్తి చెప్పిన మాటలకు తామే మోసపోయానని వధువు చెప్పినట్లు సీఐ తెలిపారు. చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి.. -
కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం!
కొత్తగా పెళ్లయిన ఓ యువతిని ఆమె భర్త, అతడి స్నేహితులు ఇద్దరు కలిసి తుపాకి చూపించి బెదిరించి, అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. పల్మావు జిల్లాలోని రహయ్యా గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయిందని డీఎస్పీ హీరాలాల్ రవి తెలిపారు. అతడు, అతడి స్నేహితులు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. ఒక రోజు రాత్రి తన స్నేహితులు బబ్లు సింగ్, అఫ్జల్ మియాలతో కలిసి అన్సారీ ఇంటికి వచ్చాడని, ముందుగా తాను అత్యాచారం చేసి.. తర్వాత తన స్నేహితులతో కూడా చేయించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని అన్సారీయే వీడియో తీయించి, ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడట. తర్వాతి రోజు ఉదయం ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే.. స్థానిక పోలీసు అధికారి మాత్రం కేసు పెట్టకుండా వాళ్లను వెనక్కి పంపేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు.