కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం!
కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం!
Published Sat, Dec 17 2016 8:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
కొత్తగా పెళ్లయిన ఓ యువతిని ఆమె భర్త, అతడి స్నేహితులు ఇద్దరు కలిసి తుపాకి చూపించి బెదిరించి, అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. పల్మావు జిల్లాలోని రహయ్యా గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయిందని డీఎస్పీ హీరాలాల్ రవి తెలిపారు. అతడు, అతడి స్నేహితులు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. ఒక రోజు రాత్రి తన స్నేహితులు బబ్లు సింగ్, అఫ్జల్ మియాలతో కలిసి అన్సారీ ఇంటికి వచ్చాడని, ముందుగా తాను అత్యాచారం చేసి.. తర్వాత తన స్నేహితులతో కూడా చేయించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని అన్సారీయే వీడియో తీయించి, ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడట. తర్వాతి రోజు ఉదయం ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే.. స్థానిక పోలీసు అధికారి మాత్రం కేసు పెట్టకుండా వాళ్లను వెనక్కి పంపేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు.
Advertisement
Advertisement