
సాక్షి, హైదరాబాద్: ‘బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని అత్తగారింటికి వచ్చిన నవ వధువు భర్తపై రుసరుసలాడి అక్కడి నుంచి పరారైంది. ఈ సంఘటన యాచారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి తనకు పెళ్లి సంబంధం చూడాలని సమీప బంధువైన మంచాల మండలం లింగంపల్లికి చెందిన ఓ మధ్యవర్తిని కోరాడు. అతను విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం చూశాడు. విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి కుదిర్చాడు.
ఈ నెల 17న కుర్మిద్దకు చెందిన సదరు వ్యక్తితో సహా కుటుంబ సభ్యులు విజయ వాడకు వెళ్లారు. అదేరోజు ఉదయం 11.40 గంటలకు ఓ లాడ్జిలో వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు, ఇరువురి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి నేరుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున మధ్యవర్తి గ్రామమైన మంచాల మండలం లింగంపల్లికి వచ్చారు. అదే రాత్రి 9 గంటలకు కుర్మిద్దకు చేరుకున్నారు. వచ్చి రాగానే.. ‘పాత ఇంటిని చూసి బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని రుసరుసలాడింది. తనకు కడుపు నొప్పి వస్తుంది మాత్రలు తేవాలని చెప్పి ఇంటి నుంచి అతడ్ని బయటికి పంపించింది.
చదవండి: మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి.. వివస్త్రగా ఉండడం చూసి
వధువుతో పాటు వచ్చిన మరో మహిళ ఇంటి బయటనే ఉండి అప్పటికే వేసిన పథకం ప్రకారం కారును తెప్పించుకుని క్షణాల్లోనే వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళల నుంచి తాను మోసపోయా నని మంగళవారం కుర్మిద్ద గ్రామానికి చెందిన వరుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై సీఐ లింగయ్యను సంప్రదించగా.. తాను కోటీశ్వరుడినని, నగరంలో పెద్ద బంగ్లా ఉందని, తన పేరు మీద కుర్మిద్దలో పదెకరాల వ్యవసాయ పొలం ఉందని ఆ వ్యక్తి చెప్పిన మాటలకు తామే మోసపోయానని వధువు చెప్పినట్లు సీఐ తెలిపారు.
చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి..
Comments
Please login to add a commentAdd a comment