yacharam
-
ఫ్యూచర్‌సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూములపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములపై పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమ సన్నిహితుల ద్వారా ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు పుష్కలంగా, ఎర్రటి నేలలున్న భూములను కొనుగోలు చేసి పెట్టాలని కోరుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీని నెలకొల్పడానికి సంకల్పించడం తెలిసిందే. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి పచ్చజెండా ఊపింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే భావనతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులతో కలిసి వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ గ్రామాలపై ఫోకస్.. కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ఆకులామైలారం, బెగరికంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల, తుక్కగూడ తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి సమీపంలోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు ఫాంహౌస్లపై ఆసక్తి యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. భూగర్భ జలాలకు ఢోకా లేదు. అందుకే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఉంది. అత్యధికంగా 5 నుంచి 10 ఎకరాల్లోపే కొనుగోలు చేసేలా దృష్టి సారించారు. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో.. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత మంది పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరైతే నేరుగా రైతులతోనే మాట్లాడుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రియల్ వ్యాపారి, హైదరాబాద్ -
సిటీ స్కై డ్రోన్స్ ఫ్లై
సాక్షి, హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ నుంచి ఫంక్షన్ల షూటింగ్ దాకా.. మందుల అత్యవసర సరఫరా నుంచి రోడ్డుపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించేదాకా.. డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. మరెన్నో రంగాలు, అవసరాలకూ డ్రోన్లు విస్తరిస్తున్నాయి. పదులు, వందల్లో కాదు.. రోజూ వేల సంఖ్యలో డ్రోన్లు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సరదాగా వాడే చిన్న చిన్న కెమెరా డ్రోన్ల నుంచి ఓ స్థాయిలో బరువులు, వస్తువులు మోసుకెళ్లే భారీ డ్రోన్ల దాకా దూసుకుపోతున్నాయి. దీంతో వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగైతే తప్పనిసరో అలా డ్రోన్లను ఎగరవేసేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. అధికారికంగా, అనధికారికంగా రాష్ట్రంలో సుమారు 3 వేల డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అధికారుల అంచనా.యాచారంలో డ్రోన్ అకాడమీ..ఇప్పటివరకు డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) త్వరలోనే డ్రోన్ల తయారీ, నిర్వహణ సేవలను సైతం అందించనుంది. నగర శివార్లలోని యాచారం మండలంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి ని కేటాయించింది. భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరో ఏడాదిలో డ్రోన్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఆపరేషనల్ మేనేజర్ సామల రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంధనంతో నడుస్తూ, 150–200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యమున్న భారీ డ్రోన్లను నడిపే పైలట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిని రక్షణ, నేవీ రంగాల్లో భద్రత కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 120 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటాయని వివరించారు.డ్రోన్లతో ట్రాఫిక్ నిర్వహణ..జంక్షన్లు, రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ‘మావిక్ 3 పీఆర్ఓ’ డ్రోన్‌ను సైబరాబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు. దీనికి ఉండే నాలుగు అత్యాధునిక కెమెరాల సాయంలో ఏరియల్ ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ రియల్ టైమ్‌లో ప్రసారం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. దీంతో ట్రాఫిక్ పోలీసు బృందాలు ఆయా సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు కలుగుతుంది. వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు.ఔషధాల సరఫరా కోసంనగర శివార్లలోని బీబీనగర్‌లో ఉన్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండు డ్రోన్లను వినియోగిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్షయవ్యాధి మందులను, టీబీ పరీక్షల కోసం కఫం నమూనాలను సైతం డ్రోన్లతో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రెండు గంటలకుపైగా సమయం పడితే.. డ్రోన్‌తో కేవలం పది, ఇరవై నిమిషాల్లోపే అత్యవసర ఔషధాలను చేరవేస్తున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్ క్యాంపస్‌లోని హ్యాంగర్ నుంచి యాదాద్రి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు 8 కిలోల బరువు మోసే సామర్థ్యమున్న డ్రోన్‌తో మందులను సరఫరా చేస్తున్నారు.వ్యవసాయ పనుల్లోనూ ఎంతో లాభంవ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యావంతులైన కొందరు రైతులు డ్రోన్ల వినియోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ల వినియోగం, నిర్వహణ సేవలపై పలు డ్రోన్ తయారీ సంస్థలు, రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ డ్రోన్ అకాడమీ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందు పిచికారీకి ఒక రోజు సమయం పడుతుంది.పైగా రూ.700–1,000 వరకు ఖర్చు అవుతుంది. డ్రోన్‌తో పిచికారీ రూ.500–600 ఖర్చుతోనే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా పురుగు మందు వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. పైగా డ్రోన్‌కు అమర్చే కెమెరాలతో పంటలను ఫొటో తీయడం, చీడ పురుగుల స్థాయిని గుర్తించడం తేలికవుతుంది. ఇక్రిశాట్ సంస్థ పంట రకాలను, దశలను అధ్యయనం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్ లెరి్నంగ్ టెక్నాలజీల సాయంతో విశ్లేషిస్తోంది.వాతావరణ మార్పుల పరిశీలనకూ..నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వాతావరణ పరిశోధన, అంచనాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. వివిధ సెన్సర్లతో కూడిన డ్రోన్‌తో ఆకాశంలో అంతెత్తు వరకు వెళ్లి.. భూమి ఉపరితలం, వాతావరణ పరిస్థితుల డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు.అటవీశాఖ పరిధిలోనూ..అటవీ ప్రాంతాలు, తోటలు, నీటి మట్టం పర్యవేక్షణకు అటవీ శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో ఏనుగు ఇద్దరు రైతులను తొక్కి చంపిన ఘటనలో ఆ ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగించారు. అలాగే పులుల సంచారాన్ని గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలిలైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం నేరంవాహనాలు నడిపేందుకు ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలో అలాగే డ్రోన్‌ను ఎగరవేసేందుకు కూడా సర్టిఫికెట్ కావాల్సిందే. వాణిజ్య అవసరాల కోసం డ్రోన్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ అనుమతి పొందిన సంస్థ నుంచి డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆ లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ సర్టిఫికెట్‌కు పదేళ్ల కాల పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.ఫీజు రూ. 38వేలు...నాలుగేళ్లలో తెలంగాణ డ్రోన్ అకాడమీ నుంచి 600 మందికిపైగా విద్యార్థులు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందారు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు రూ.38 వేలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శిక్షణ కోసం వస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందినవారిలో 30 మందికిపైగా మహిళా డ్రోన్ పైలట్లు ఉండటం గమనార్హం.డ్రోన్లతో స్టార్టప్‌లు పెడుతున్నారువయసు,లింగ భేదాలతో సంబంధం లేకుండా చాలా మందిడ్రోన్ పైలట్ శిక్షణపై ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, నిర్వహణ ఎలా అనే అంశాలపై నైపుణ్యం కోసం మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తర్వాత సొంతంగా డ్రోన్లతో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా.. నలుగురు చిన్నారుల మృత్యువాత
యాచారం: ఈత సరదా నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. చెరువులో పెద్ద గుంత ఉన్న విషయం తెలియక ఈతకు వెళ్లిన వారిలో ఒకరు మునిగిపోతుండగా కాపాడబోయి ఒకరి తర్వాత మరొకరు వరుసగా నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి అనుబంధ గ్రామం గొల్లగూడలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. యాచారం సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గొల్లగూడకు చెందిన ఎండీ కాశీం, బీబీ జానీ దంపతుల కుమారుడు కహ్లీద్ (12), కూతురు సమ్రీన్ (14), కాశీం సోదరుడు రజాక్, హస్మ దంపతుల కుమారుడు రెహాన్ (10), వారి సమీప బంధువైన ఎస్కే హుస్సేన్, పార్‌జాన్ దంపతుల కుమారుడు ఇమ్రాన్(9) ఆదివారం మధ్యాహ్నం కొంతమంది బంధువులతో కలసి గ్రామ సమీపంలోని దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చేటప్పుడు కహ్లీద్, సమ్రీన్, రెహాన్, ఇమ్రాన్ ముందుగా బయలుదేరారు. సమీపంలో ఉన్న ఎర్రకుంట వద్దకు వచ్చి సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగారు. భారీ వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయి ఉంది. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈత కోసం కుంటలోకి దిగిన ఓ బాలుడు మునిగిపోతుండగా గమనించిన మిగతావారు కేకలు వేస్తూ అతడిని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మునిగి పోయారు. అదే సమయంలో వారితో కలసి ఈత కొట్టడానికి కొంత ఆలస్యంగా వచ్చిన మరో బాలుడు అయాన్ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి గ్రామానికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న రైతు లక్ష్మయ్య చిన్నారుల అరుపులు విని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికే నలుగురు చిన్నారులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఒకేరోజు నలుగురు పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారులను విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి.. -
కడుపునొప్పి పేరుతో భర్తను బయటకు పంపి.. క్షణాల్లో పెళ్లికూతురు మాయం
సాక్షి, హైదరాబాద్: ‘బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని అత్తగారింటికి వచ్చిన నవ వధువు భర్తపై రుసరుసలాడి అక్కడి నుంచి పరారైంది. ఈ సంఘటన యాచారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి తనకు పెళ్లి సంబంధం చూడాలని సమీప బంధువైన మంచాల మండలం లింగంపల్లికి చెందిన ఓ మధ్యవర్తిని కోరాడు. అతను విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం చూశాడు. విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి కుదిర్చాడు. ఈ నెల 17న కుర్మిద్దకు చెందిన సదరు వ్యక్తితో సహా కుటుంబ సభ్యులు విజయ వాడకు వెళ్లారు. అదేరోజు ఉదయం 11.40 గంటలకు ఓ లాడ్జిలో వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు, ఇరువురి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి నేరుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున మధ్యవర్తి గ్రామమైన మంచాల మండలం లింగంపల్లికి వచ్చారు. అదే రాత్రి 9 గంటలకు కుర్మిద్దకు చేరుకున్నారు. వచ్చి రాగానే.. ‘పాత ఇంటిని చూసి బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని రుసరుసలాడింది. తనకు కడుపు నొప్పి వస్తుంది మాత్రలు తేవాలని చెప్పి ఇంటి నుంచి అతడ్ని బయటికి పంపించింది. చదవండి: మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి.. వివస్త్రగా ఉండడం చూసి వధువుతో పాటు వచ్చిన మరో మహిళ ఇంటి బయటనే ఉండి అప్పటికే వేసిన పథకం ప్రకారం కారును తెప్పించుకుని క్షణాల్లోనే వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళల నుంచి తాను మోసపోయా నని మంగళవారం కుర్మిద్ద గ్రామానికి చెందిన వరుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై సీఐ లింగయ్యను సంప్రదించగా.. తాను కోటీశ్వరుడినని, నగరంలో పెద్ద బంగ్లా ఉందని, తన పేరు మీద కుర్మిద్దలో పదెకరాల వ్యవసాయ పొలం ఉందని ఆ వ్యక్తి చెప్పిన మాటలకు తామే మోసపోయానని వధువు చెప్పినట్లు సీఐ తెలిపారు. చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి.. -
అర్జీ ఇవ్వండి.. రుణం తీసుకెళ్లండి
యాచారం: రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడానికి యాచారం పీఏసీఎస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి ఏ బ్యాంకులో రుణం పొందని రైతులకు రుణాలు ఇచ్చేందుకు పీఏసీఎస్ పాలకవర్గం కృషిచేస్తుంది. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా రైతులకు పీఏసీఎస్ సేవలు అందేలా చూస్తున్నారు. యాచారం పీఏసీఎస్‌లో దాదాపు 7 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో 4,985 మంది రైతులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక, వ్యవసాయ తదితర పద్దుల కింద రూ.40 కోట్లకు పైగా రుణాలు పొందారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రుణాల కోసం 200 మందికి పైగా అర్జీలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ముమ్మర ప్రచారం.. ఈ ఏడాది యాచారం పీఏసీఎస్‌లో రూ.2 కోట్లకు పైగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు సంఘం నిర్ణయించింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతును పీఏసీఎస్‌లో భాగాస్వామ్యం(రుణాలు కల్పించి సభ్యత్వం ఇవ్వడం) చేసే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా గ్రామాల్లో పీఏసీఎస్ డైరెక్టర్ల ద్వారా రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అప్పు పరిమితి పట్టిక(క్రెడిట్ లిమిట్) తయారు చేసి డీసీసీబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ నుంచి యాచారం పీఏసీఎస్‌కు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.1.50 కోట్ల నిధుల మంజూరుకు పీఏసీఎస్ అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ పంట రుణాలు ఇలా..(ఎకరాకు) వరి, పత్తి తదితర మెట్ట పంటలకు రూ.30 వేలు కూరగాయల పంటలకు రూ.38 వేలు ప్రతి రైతుకు రుణం ఇస్తాం మండలంలోని 24 గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు అర్జీలు స్వీకరిస్తున్నాం. ప్రతి రైతుకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, యాచారం -
మహిళా ఎంపీపీ వివాదం: ఎమ్మెల్యేపై కేసు
సాక్షి, రంగారెడ్డి : మండల పరిధిలోని నందివనపర్తిలో నిర్వహించిన ఫార్మాసిటీ రోడ్డు విస్తరణ భూమిపూజ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ వివాదంగా మారింది. రూ.77 కోట్లతో యాచారం– మీరాఖాన్‌పేట, నందివనపర్తి– నక్కర్తమేడిపల్లి గ్రామాల మధ్యన చేపట్టే ఈ పనులకు గురువారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూమిపూజ చేస్తుండగా, తనకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని స్థానిక ఎంపీపీ కొప్పు సుకన్య పనులను అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్యన మాటల యుద్ధం జరుగుతుండగా పోలీసులు కలగజేసుకొని ఎంపీపీని అక్కడి నుంచి లాగేశారు. ఈ క్రమంలోనే ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకోగా, తోపులాటలో ఎంపీపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తనపై దురుసుగా వ్యవహరించారని, దళితులంటూ దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై యాచారం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 509, 323, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కాగా మంచిరెడ్డి తీరును నిరశిస్తూ.. యాచారంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎంపీపీ సుకన్య నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రొటోకాల్ విషయంలో స్పష్టత ఇవ్వాలని అడిగినందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి దళిత ఎంపీపీ అని అవమానపర్చే విధంగా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో నిరసన తెలపడంతో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీపీని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీపీని పరామర్శించిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం రాత్రి బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మద్దతుగా పోరాటాలు చేయాలని సూచించారు. ప్రొటోకాల్పె స్పష్టత అడిగితే దళిత ఎంపీపీని అవమానించి, పోలీసులచే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇదేనా నీ సంస్కారం అని ప్రశ్నించారు. అభివృద్ధికి బీజేపీ అడ్డుకాదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. -
జిత్తులమారి చిరుత!
సాక్షి, యాచారం: చిరుత రూటు మార్చింది. యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో తలదాచుకుంటూ సమీప పొలాల్లో కట్టేసిన మూగజీవాలపై ఏడాదిగా దాడులు చేస్తోంది. చిరుత వరుసగా పంజా విసురుతుండడంతో ఎలాగైనా దానిని బంధించాలని అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. ఏకంగా జూపార్కు నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన షూటర్స్‌ను రప్పించి మత్తు మందుతో చిరుతపై షూట్ చేయించి పట్టుకుందామన్నా ప్రయోజనం దక్కలేదు. యాచారం, కడ్తాల, మాడ్గుల, ఆమనగల్లు మండలాల సరిహద్దులో దాదాపు 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో తప్పించుకోవడం దానికి సులువుగా మారింది. ఆరు నెలలుగా ఫారెస్టు అధికారులు దానిని పట్టుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు మండలాల్లో 25 చోట్ల గొర్రెలు, మేకలు, దూడలపై దాడులు చేసి చంపేసింది. కాగా, సీసీ కెమెరాల్లో దాని కదలికలు నిక్షిప్తమయ్యాయి. బోన్లకు మాత్రం చిక్కలేదు. అటవీప్రాంతంలో ఒకే చిరుత ఉందా... లేదా రెండు, మూడు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడం కోసం అటవీ ప్రాంతంలో పలు చోట్ల సీసీ కెమెరాలు బిగించినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో అటవీప్రాంతం పచ్చగా మారిందన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోను తనిఖీలతోనే రూటు మార్చిందా..? పల్లెచెల్క తండాలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఫారెస్టు అధికారులు ఏడాది కాలంగా యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో దాడులు చేసిన చిరుత రైతులకు, అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో చేసేదేమీ లేక అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల్లో రైతులను చైతన్యం చేసి అటవీ ప్రాంతం సమీపంలోని పొలాల్లో గొర్రెలు, మేకలు, పశువులను కట్టేయకుండా అవగాహన కల్పించారు. అడవిలో తిరుగుతున్న చిరుత మూగజీవాలపై దాడులు చేయకుండా అరికట్టేందుకు యాచారం మండల పరిధిలోని తాడిపర్తి, కుర్మిద్ద అట ప్రాంతంతోపాటు కడ్తాల మండల పరిధిలోని చరికొండ, పల్లెచల్కతండా అటవీ ప్రాంతంలో 34 జింకలను ఇటీవల ఫారెస్టు అధికారులు వదిలేశారు. జింకలను వదిలినప్పటి నుంచి అది యాచారం, కడ్తాల మండలాల్లో దాడులు జరగలేదు. తాజాగా యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని అటవీప్రాంతం వదిలేసి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమన్‌గల్లు మండల పరిధిలోని మంగల్‌పల్లి, చంద్రయ్యపల్లి తండా సమీపంలోని పొలాల్లో కట్టేసి ఉన్న పశువులపై దాడులు చేయడం ఆరంభించింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి సమీపంలో సోమవారం రాత్రి పొలాల వద్ద ఉన్న దూడను చంపి దాదాపు కిలోమీటరు దూరం వరకు చిరుత లాక్కెళ్లింది. మూడు రోజుల క్రితం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాయణపల్లి తండాలో రైతు బిచ్చానాయక్‌కు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. చిరుత అటవీ ప్రాంతంలో వదిలిన జింకలను కనిపెట్దిందా.. లేదా ఆహారం కోసమే ఆమనగల్లు మండల పరిధిలోని పొలాల్లోని పశువులపై దాడి చేస్తోందా..? లేదా వచ్చిన దారిగుండా నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి రూటు మార్చిందా అనే విషయం తెలియడం లేదు. వరుస దాడులతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక టీంలను పంపాం ఆమన్‌గల్లు మండలంలోని పలు గ్రామాల సమీపంలో చిరుత సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. దీంతో కందుకూరు డివిజన్ నుంచి రెండు ప్రత్యేక టీం బృందాలను ఆమనగల్లుకు పంపాం. దాడులు చేసిన చోటుకు చిరుత మళ్లీ వస్తుందనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశాం. పులి నిత్యం ఆహారం కోసం 25 కిలోమీటర్ల మేర సంచరిస్తోంది. ఈక్రమంలో అది నల్లమల్ల అడవులకు వెళ్లే అవకాశం లేకపోలేదు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. – సత్యనారాయణ, అటవీశాఖ రేంజ్ అధికారి మరోసారి చిరుత పంజా చిరుత దాడిలో మృతిచెందిన దూడను పరిశీలిస్తున్న సర్పంచ్ నర్సింహారెడ్డి సాక్షి, ఆమనగల్లు: ఆమనగల్లు మండలంలో మరోసారి చిరుత పంజా విసిరింది. మంగళపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి వ్యవసాయ పొలాల వద్ద ఉన్న మూగజీవాలపై చిరుత దాడి చేసింది. ఒక దూడను చంపి దాదాపు కిలోమీటర్ దూరం లాక్కెళ్లి వదిలేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మంగళపల్లి గ్రామ సమీపంలో తిప్పిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పర్వతాలు తదితర రైతులు తమ పాడి పశువులను వ్యవసాయ పొలం వద్ద షెడ్డుల్లో కట్టేశారు. సోమవారం రాత్రి శ్రీనివాస్‌రెడ్డి, పర్వతాలుకు చెందిన ఆవులపై చిరుత దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. అనంతరం తిప్పిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన రెండు బర్రె దూడలపై దాడిచేసింది. ఇందులో దూడ గొంతును చిరుత తీవ్రంగా గాయపర్చింది. మరో దూడను దాదాపు కిలోమీటరు దూరం లాక్కెళ్లి హతమార్చింది. ఉదయాన్నే పొలాల వద్దకు వెళ్లిన రైతులు పశువులపై చిరుత దాడి చేయడాన్ని గుర్తించారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. అధికారుల సందర్శన.. మంగళపల్లి గ్రామ సమీపంలో చిరుత మూగజీవాలపై దాడి చేసిన సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు ఎఫ్ఆర్ఓ కమాలుద్దీన్, సర్పంచ్ తిప్పిరెడ్డి నర్సింహారెడ్డి, స్థానిక నాయకులు సందర్శించారు. చిరుత దాడిలో మృతిచెందిన దూడ, తీవ్రంగా గాయపడిన బర్రె దూడలను వారు పరిశీలించారు. చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ రేంజ్ అధికారి కమాలుద్దీన్ తెలిపారు. మూడు రోజుల క్రితం చంద్రాయణపల్లితండా సమీపంలో బోను, నాలుగు అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. మంగళపల్లి గ్రామసమీపంలో మంగళవారం రాత్రికి చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రైతులు భయాందోళనలు చెందవద్దని చిరుతను బంధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. చంద్రాయణపల్లి సమీపంలో చెట్టుకు ఏర్పాటు చేసిన కెమెరా -
ఒంటరిగా తిరగొద్దు.. చిరుత సంచరిస్తోంది
సాక్షి, యాచారం: అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం డివిజన్ అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణ ప్రజలకు సూచించారు. కొత్తపల్లి గ్రామంలో పక్షం రోజుల క్రితం చిరుత దాడిలో మృతిచెందిన ఆవుదూడకు సంబంధించి రూ. 6 వేల పరిహారాన్ని రైతు ఈగ శ్రీనువాస్‌రెడ్డికి అధికారి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పగలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతంలో పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో చిరుతను పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జగన్, గ్రామస్తులు గుండాలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
యాచారం: భార్య అక్రమ సంబంధం పెట్టుకుం దని మనస్తాపానికి గురైన భర్త ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కటకటాల్లోకి వెళ్లే పరిస్థితి రావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాలు... నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మోటె లింగం(36)కు కొత్తపల్లి గ్రామానికి చెందిన లలితతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అఖిల(10), గోపిచంద్(6), సిరి(3) ముగు ్గరు పిల్లలున్నారు. లలిత గ్రామానికి చెందిన నరేందర్ అనే వ్యక్తితో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. పసిగట్టిన భర్త లింగం పలుమార్లు భార్య లలితను హెచ్చరించాడు. అయినా లలితలో మార్పు రాలేదు. పక్షం రోజుల క్రితం లింగం పిల్లలను చూసైనా పద్ధతి మార్చు కోవాలని లలితను గట్టిగా హెచ్చరించాడు. భర్తపై కోపంతో లలిత చెప్పకుండానే తల్లిగారిళ్లు కొత్తపల్లికి వెళ్లిపోయింది. భార్య, భర్తల మధ్య ఘర్షణ చిన్నారులపై పడుతుందని తెలుసుకున్న సర్పంచ్ బాషా, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ మోటె శ్రీశైలంలు లింగంకు నచ్చజెప్పి కొత్తపల్లిలో ఉన్న లలితను కొద్ది రోజుల కిందే నక్కర్తమేడిపల్లికి తీసుకువచ్చారు. మళ్లీ ఏమైందో ఏమో గాని శనివారం ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అక్రమ సంబంధం వద్దంటే కొనసాగిస్తున్నావ్... గ్రా మంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పో యిందని మనుస్తాపానికి గురైన లింగం శనివారం రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అదే రాత్రి నక్కర్తమేడిపల్లికి చేరుకుని లింగం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. తండ్రి మృతిచెందడం, తల్లిని దాచిపెట్టడం చూసిన పిల్లలు బోరున విలపిస్తున్న తీరు గ్రామస్తులు, బంధువులను కన్నీరు పెట్టించింది. లలిత, నరేందర్‌లను అరెస్టు చేయాలి... ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి నుంచి ఆదివారం సాయంత్రం లింగం మృతదేహన్ని నక్కర్త మేడిపల్లిలోని ఆయన ఇంటికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన లింగం బంధువులు, గ్రామస్తులు భర్త మృతికి కారణమైన లలితను చంపేయాలి, అక్ర మ సంబంధం పెట్టుకున్న నరేందర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు చర్యలు తీసుకోనిదే అంత్యక్రియలు జరిపేది లేదని గ్రామస్తులు, బంధువులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. లలితను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణంరాజు హామీ ఇచ్చారు. నరేందర్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. శాంతించిన బంధువులు, గ్రా మస్తులు సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. -
కన్నవారే కడతేర్చారు
ఇబ్రహీంపట్నం: నవమాసాలూ మోసిన కన్న తల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుదేవతైంది. అల్లరి చేస్తోందనే కారణంతో దివ్యాంగురాలనే కనికరం కూడా చూపకుండా ఆ తల్లి కన్నకూతురికే మరణ శాసనం రాసింది. కన్న తల్లి కూతుర్ని ఇటుకతో కొట్టి చంపితే.. కన్న తండ్రి ఆమె మృతదేహాన్ని బూడిద కుప్పలో పూడ్చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తమ కుమార్తె అదృశ్యమైందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న ప్రేమకే మచ్చతెచ్చిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. అల్లరి చేస్తోందని.. ఒడిశాకి చెందిన భార్యాభర్తలు బల్లటి ఛత్రియ, హేతురాం యాచారం మండల పరిధిలోని చింతుల్ల శివారులోని బీఎన్సీ ఇటుక బట్టీలో 5 నెలలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. మూడో కుమార్తె ఊర్మిళ(7) పుట్టు మూగ, చెవుడు. ఊర్మిళ అల్లరి ఎక్కువగా చేసేది. తరచూ పొరుగువారితో గొడవ పడుతుండేది. దీంతో తల్లి ఛత్రియ(39) తన కూతురును చంపాలని నిర్ణయించుకుంది. 26వ తేదీ మధ్యాహ్నం ఊర్మిళ గుడిసెలో నిద్రిస్తుండగా ఇటుకతో ఆమె తలపై కొట్టి చంపింది. గుడిసె బయట నిద్రిస్తున్న భర్త హేతురాంను లేపి విషయాన్ని చెప్పింది. మృతదేహాన్ని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. దీంతో సమీపంలోని ఇటుకబట్టీల్లో కాల్చేసిన బూడిద పొట్టు కుప్పను తవ్వి అందులో మృతదేహాన్ని హేతురాం పాతిపెట్టాడు. అనంతరం చిన్నారి తప్పిపోయిందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించారు. ఇటుక బట్టీ యజమాని ఆ చిన్నారి తల్లిదండ్రులతో కలసి 27న యాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ కృష్ణంరాజుకు తల్లిదండ్రులపైనే అనుమానం కలిగింది. ఇటుక బట్టీ ల వద్ద దుర్వాసన వస్తుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఛత్రియను బిడ్డ ఎక్కడుందో చెప్పాలని నిలదీయగా వాస్తవాన్ని వెల్లడించింది. పోలీసులు ఘటనాస్థలంలో తవ్విచూడగా మృతదేహం లభ్యమైంది. విచారణ చేపట్టిన పోలీసులు తల్లిదండ్రులే ఆ చిన్నారిని హతమార్చారని తేల్చారు. ఛత్రియ, హేతురాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అస్వస్థతకు గురైన విద్యార్థిని మృతి
యాచారం: విద్యార్థిని మృతితో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కట్టెల క్రిష్ణ, పద్మల కుమార్తె సోనీ.. వికారాబాద్ జిల్లా గండీడ్ మండలం నంచర్ల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన సోనీ వాంతులు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో పాఠశాల యజమాన్యం నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం రాత్రే మొండిగౌరెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. సోమవారం గ్రామంలో విద్యార్థినికి అంత్యక్రియలు జరిగాయి. గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు నంచర్ల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటమ్మ మొండిగౌరెల్లి గ్రామానికి చేరుకుని విద్యార్థిని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయన్ని అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్రిన్సిపాల్ వెంకటమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ప్రవీణ్‌కుమార్ విచారణకు ఆదేశించినట్లు వెంకటమ్మ పేర్కొంది. -
పల్లెలకు కరెంటు షాక్
పల్లెల్లో అంధకారం అలుముకోనుందా? చీకటి పడితే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనా? రోజువారీ నీటి సరఫరా కూడా నిలిచిపోనుందా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. గ్రామ పంచాయతీల్లో ఏళ్లుగా విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో వీధిలైట్లు, నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన కనెక్షన్లను తొలగించేందుకు డిస్కంలు సన్నద్ధమవుతున్నాయి. జిల్లాలో రూ.210 కోట్ల బకాయిలు పేరుకపోవడంపై కన్నెర్ర చేస్తున్నాయి. కచ్చితంగా చెల్లించాల్సిందేనని నోటీసులు అందజేస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో వీధిలైట్లు, నీటి కోసం వినియోగించే బోరుబావులు, నీటి పథకాలకు విద్యుత్ వాడకం తప్పనిసరి. ఈ కేటగిరీల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,200 విద్యుత్ కనెన్షన్లు ఉన్నట్లు అంచనా. ఇందులో సుమారు రెండు వేల కనెక్షన్లు జీహెచ్ఎంసీ, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. అక్కడ విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను క్రమం తప్పకుండా ఆయా పాలక సంస్థలు చెల్లిస్తున్నాయి. మిగిలిన 3,200 కనెక్షన్లు గ్రామాల్లోనివి. ఇక్కడ నిత్యం విద్యుత్ వినియోగం జరుగుతున్నా బిల్లులు చెల్లించలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వమే కరెంటు బిల్లులు చెల్లించేది. కొన్నేళ్ల కిందట ఆ విధానానికి స్వస్తి పలకడంతో భారమంతా పంచాయతీలపైనే పడింది. ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలయ్యే డబ్బుల్లోంచే బిల్లులు చెల్లించుకోవాలని స్పష్టం చేయడంతో అప్పటి నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. చాలా పంచాయతీల్లో పన్నులు అరకొరగానే వసూలవుతున్నాయి. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించడం భారంగా పరిణమించింది. బోరుకు బిగించిన విద్యుత్ మీటర్ ఈ ఏడాది రూ.కోటి వసూలు పల్లెల్లో వీధిలైట్లు, తాగునీటి బోరుబావుల మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ అధికారుల నుంచి సంకేతాలు వెలువడుతుండడంతో సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాలకు వస్తున్న నిధులు అభివృద్ధి పనులకే చాలడం లేదు. ఇలాంటి సమయంలో కరెంటు బిల్లుల మాటెత్తితే సర్పంచ్‌లు బెంబేలెత్తుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి రూ.210 కోట్ల బకాయిలు పేరుకపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ డిస్కం సర్కిళ్ల పరిధిలో సుమారు రూ.31 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. ఇందులో సైబర్ సిటీ పరిధిలో రూ.1.03 కోట్లు మాత్రమే చెల్లించారు. బకాయిలు చెల్లించాలని విద్యుత్ సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో నోటీసులు జారీ చేస్తున్నారు. ఒక్క డివిజన్‌లోనే రూ.19 కోట్ల బకాయి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బకాయిలు రూ.19 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది కరెంట్ సరఫరా నిలిపేస్తామని డిస్కం అధికారులు హెచ్చరించడంతో గ్రామ కార్యదర్శులు రూ.60 లక్షల బకాయిలు చెల్లించారు. ఇదే చివరిసారి. ఆ తర్వాత ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ప్రస్తుతం బకాయిలు చెల్లిస్తారా.. విద్యుత్ సరఫరా నిలిపేయాలా అని అధికారుల నుంచి గ్రామ కార్యదర్శులకు హెచ్చరికలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగిస్తున్నందుకు కచ్చితంగా ప్రతినెలా బిల్లులు చెల్లించాల్సిందేనని, బకాయిలు చెల్లించకపోతే కరెంట్ సరఫరా నిలిపేస్తామని ఇబ్రహీంపట్నం ఏడీ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. అభివృద్ధికే నిధుల్లేవు.. ప్రజల అవసరాల కోసం వినియోగించే వీధిలైట్లు, బోరుమోటార్లకు విద్యుత్ బిల్లులు చెల్లించలేం. మా గ్రామానికి రూ.లక్షల్లో బిల్లు బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికే సరిపోవడం లేదు. ఇక విద్యుత్ అధికారులకు బకాయిలు ఎలా చెల్లించేది. ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలి. విద్యుత్ బకాయిల భారం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. – వర్థ్యవత్ రాజునాయక్, నందివనపర్తి సర్పంచ్, యాచారం మండలం -
ఫోన్లో ఏం మాట్లాడాడో.. అంతలోనే
యాచారం : ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన ఆ పోలీసే.. ఓ యువతి పట్ల కాలయముడైనాడు. ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులను తట్టుకోలేక ఆ యువతి వంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మన్నగూడలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ చంద్రకుమార్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్నన్నగూడకు చెందిన సోమా నర్సింహ నగరంలోని అంబర్‌పేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన మండల శ్యామల (23) అనే దళిత యువతిని ప్రేమించమంటూ నాలుగేళ్ల క్రితం వెంటపడ్డాడు. అతని వేధింపులు భరించలేక అప్పట్లోనే ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో సోమా నర్సింహను మందలించి, నచ్చజెప్పి వదలిపెట్టారు. బుద్ధిమారని ఆ కానిస్టేబుల్ తిరిగి ఫోన్లో శ్యామలను వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం యువతి తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లగానే గ్రామంలో ఉన్న అతడు సోమవారం శ్యామలకు ఫోన్ చేశాడు. ఫోన్లో అతను ఏదో మాట్లాడగానే శ్యామల వంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకుంది. తీవ్రంగా శరీరం కాలిపోవడంతో నగరంలోని గాంధీ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దళిత యువతి కావడంతో కానిస్టేబుల్ చులకనగా చూస్తూ వేధింపులకు గురిచేశాడని.. తన కూతురు శ్యామల ఆత్మహత్యకు సోమా నర్సింహనే కారకుడని మృతురాలి తండ్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
యాచారంలో చిరుతపులి సంచారం
యాచారం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి తాడిపర్తి గ్రామంలో కడారి రాములు ఇంటి ఆవరణలో ఉన్న మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను ఎత్తుకుపోయింది. సోమవారం ఉదయం గమనించిన బాధిత రైతు స్థానికుల సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో అటవీ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో చిరుతల సంచారం ఎక్కువైంది. వారం క్రితం కొత్తపల్లిలోకి ప్రవేశించిన ఒక చిరుత మేకను ఎత్తుకుపోయింది. దీంతో అటవీ అధికారులు దానిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు.అయితే తాడిపర్తిలోకి ఆదివారం రాత్రి చిరుత ప్రవేశించటంతో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. -
పిడుగుపాటుకు యువకుడు బలి
యాచారం (రంగారెడ్డి) : పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్యాం(24) ఇంటి పైన ఉన్న బట్టలు తీయడానికి వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
యాచారం: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ వారిని ఢీకొంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి కారణమైన బైకిస్టు అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మాల్లో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాచారం మండలం మాల్లో ఓ ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఉన్న మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సమాచారం లేని ఉపాధి గ్రామసభలు
యాచారం: మల్కీజ్‌గూడలో ఉపాధి హామీ పథకం గ్రామసభను ఈనెల 25న నిర్వహించడానికి ఈజీఎస్ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల దాటినా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు అధికారులెవరూ రాలేదు. గ్రామసభపై ‘సాక్షి’ గ్రామ సర్పంచ్ మల్లేష్‌ను సంప్రదిస్తే అసలు తనకు సమాచారమే లేదన్నారు. వెంటనే సర్పంచ్ ఈజీఎస్ మండల ఏపీఓ నాగభూషణానికి ఫోను చేయగా స్పందించలేదు. గడ్డమల్లయ్యగూడ గ్రామంలో 21న గ్రామసభ ప్రారంభమై 22, 23 తేదీల్లో ఏడాదిపా టు కూలీలకు పనులు కల్పించే విషయమై నిర్ణయం తీసుకొని 24న సోమవారం మళ్లీ గ్రామసభ జరిపి పనుల ఎంపికపై తీర్మానం చేయాల్సి ఉంది. కానీ ఆ గ్రామంలో అసలు గ్రామసభనే జరగలేదు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ తేదీ గడువు ముగిసినా సర్పంచ్‌కు అసలు సమాచారమే లేదు. ఈజీఎస్ అధికారుల నిర్వాకంతో గ్రామాల్లో ఉపాధి పథకం గ్రామసభలు సమాచారం లేని సభలుగా మారాయి. వచ్చే ఏడాది పాటు గ్రామాల్లో కూలీలకు చేతి నిండా పనికల్పించాలంటే గ్రామసభల్లో పనుల ఎంపిక ఎంతో ముఖ్యం. కానీ మండలంలో సక్రమంగా జరగని గ్రామసభలపై మంగళవారం వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఈజీఎస్ ఉన్నతాధికారులకు, ఏపీడీకి ఫిర్యాదులు చేశారు. సర్పంచ్‌లకు సమాచారం లేదు.. మండలంలోని 20 గ్రామాల్లో 20 వేలకుపైగా కూలీలు ఉన్నారు. ప్రతి యేటా మంజూరయ్యే కోట్లాది రూపాయల నిధులకు ఉపాధి గ్రామసభల్లో ఎంపిక, తీర్మానం చేసే నిర్ణయాలే కీలకం. కానీ మండల ఏపీఓ నాగభూషణం పర్యవేక్షణాలోపంతో మండలంలో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు సక్రమంగా జరగడ లేదు. ఉపాధి గ్రామసభలు పరిశీలించడానికి సాక్షి మంగళవారం ఉదయం 9-30 గంటలకు (షెడ్యూల్ ప్రకటించిన సమయం ప్రకారం) కుర్మిద గ్రామానికి వెళ్లగా గ్రామసభ లేదు. సర్పంచ్ విజయను సంప్రదించగా ఈ రోజు గ్రామసభ ఉందని తనకు సమాచారమే లేదని తెలిపింది. మల్కీజ్‌గూడ గ్రామానికి ఉదయం 11 గంటలకు వెళ్లగా అక్కడ కూడా గ్రామసభ లేదు. సర్పంచ్ మల్లేష్‌ను సంప్రదించగా గ్రామసభల విషయం తనకు తెలియదన్నారు. గ్రామసభలు జరుగుతున్నాయా..? అని గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్‌ను సంప్రదించగా తమ గ్రామంలో ఇంతవరకు గ్రామసభలే జరగలేదన్నారు. నల్లవెల్లి సర్పంచ్ శోభను సంప్రదించగా 21నఅధికారులు వచ్చారు.. కొంతమంది రైతుల నుంచి ధరఖాస్తులు తీసుకున్నారు.. 24న మళ్లీ గ్రామసభ జరగాలి కానీ జరగలేదన్నారు. గతంలో జరిగిన పనుల్లో తప్పిదాలవల్ల ప్రజలు నిలదీస్తారేమోనని గ్రామసభల గురించి సమాచారం లేకుండా ముగించే విధంగా ఈజీఎస్ సిబ్బంది వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
రాయితీ విత్తనం.. బహుదూరం
యాచారం: రైతులకు రాయితీ కూరగాయల విత్తనాలు అందే విషయంలో అయోమయం నెలకొంది. ఉద్యాన శాఖ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉండడంతో కూరగాయల విత్తనాలు ఎప్పుడు వస్తున్నాయో... విక్రయాలు ఎప్పుడు జరుగుతున్నాయో రైతులకు సమాచారం తెలియడంలేదు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే 50 శాతం రాయితీ విత్తనాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. యాచారంలోనే ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కూరగాయల రాయితీ విత్తనాలను అందించాలని స్థానిక రైతులు పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోతోంది. యాచారరం నుంచి ఇబ్రహీంపట్నం 15 కిలోమీటర్ల దూరంలో ఉండడం, పైగా ప్రయాణ ఖర్చులు రూ. 50కి పైగా కావడం, కాల యాపన అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు ధరలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ అందుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. వంద హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో.. మండలంలోని యాచారం, గునుగల్, మొండిగౌరెల్లి, తాడిపర్తి, నందివనపర్తి, గడ్డమల్లయ్యగూడ, మాల్ తదితర గ్రామాల్లోని రైతులు 100 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయల తోటల ను సాగు చేయడానికి పొలాలను సిద్ధం చేశారు. దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో కూరగాయల ధరలు భగ్గుమనడం, ఉద్యాన శాఖ నుంచి రాయితీ విత్తనాలు అందకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తక్షణమే రాయితీ కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ ఇబ్రహీంపట్నం క్షేత్రస్థాయి అధికారి యాదగిరిని సంప్రదించగా మరికొద్ది రోజుల్లో రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. -
‘వాటర్ గ్రిడ్’తో నీటి కష్టాలకు చెక్!
యాచారం: జిల్లాలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వాటర్ గ్రిడ్ల ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాట ర్ గ్రిడ్ అమలులో భాగంగా మొదట గ్రామా ల్లో జనాభాపై అధికారులు సర్వే చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాతో పాటు 2050 వరకు వృద్ధిచెందే జనాభాకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విజయలక్ష్మి ఆధ్వర్యంలో యాచారం, ఇబ్రహీంపట్నం, మంచా ల, హయత్‌నగర్ మండలాల ఏఈలు సర్వేలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత జనాభా ఎంత.. 2050 వరకు ఏ మేరకు పెరుగుతుంది.. దీనికనుగుణంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే నీటి సమస్య తీరుతుందనే విషయంలో ఏఈలు సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నిత్యం 100 లీటర్లు.. ఆర్డబ్ల్యూఎస్ లెక్కల ప్రకారం పట్టణాల్లోని ఒక్కో వ్యక్తికి నిత్యం 135 లీటర్లు, గ్రామాల్లోని వ్యక్తికి 40 లీటర్ల నీరు అందించాలనే నింబంధన ఉంది. కానీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇందులో భాగంగానే గ్రామాల్లోని ప్రజలకు నిత్యం 100 లీటర్లు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాల నీటి అవసరాలు, విద్యాలయాలు, పరిశ్రమలకు అవసరమయ్యే నీటి వినియోగంపైనా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2011 లెక్కల ప్రకారం 4 లక్షల వరకు జనాభా ఉంటుందని లెక్కలు కట్టారు. ప్రస్తుతమున్న జనాభా మరో 30 ఏళ్లలో ఏ మేరకు పెరుగుతుందో.. అప్పుడు కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి...వాటికి ఏమేరకు నీటి కేటాయింపులు అవసరమనే అంశంపై సమగ్ర సర్వే జరుపుతున్నారు. సంపులు, ట్యాంకుల నిర్మాణాలపై దృష్టి.. ప్రస్తుతం గ్రామాల్లో లక్ష నుంచి రెండు లక్షల లీటర్ల మధ్యనే నీటి నిల్వ చేసుకునేలా ట్యాంకులు, సంపులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి నిత్యం వంద లీటర్లు ఇవ్వడంతోపాటు ఇతర అవసరాల కోసం కూడా నీటి కేటాయింపులు జరపాల్సి ఉండడంతో కొత్తగా ఎక్కువ పరిమాణంలో ఉండే ట్యాంకులు, సంపుల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి సరఫరా అయ్యే కృష్ణాజలాలను గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్ ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలో నీటి అవసరాల దృష్ట్యా అక్కంపల్లి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటిని తరలించేలా ఆలోచనలు చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా గ్రిడ్ల వల్ల ప్రజలకు సరిపడా తాగునీరు అందుతుంది వాస్తవమే కాని నీటి కేటాయింపులు ఎలాగా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వ తగ్గిపోతే.. ఎలాగా అనే విషయంలోనూ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
వరద నీటిని ఒడిసిపట్టరేం!
యాచారం: వృథాగా పోయే నీటిని ఆపేందుకు.. భూగర్భ జలాలను పెంపొందించేందుకు రూ. లక్షల వ్యయంతో నిర్మించిన ఆన కట్టలు, చెక్‌డ్యాంలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అవగాహన లోపంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహం లేని చోట, అవసరం లేని చోట సైతం చెక్‌డ్యాంలు నిర్మించారు. మరికొన్ని గ్రామాల్లో అవసరమున్న చోటే నిర్మించినప్పటికీ పనుల్లో నాణ్యత లోపం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లోని ఆనకట్టలు, చెక్‌డ్యాంలు కనిపించే పరిస్థితే లేకుండాపోయింది. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యంగా మారింది. రూ. 5 కోట్లకుపైగా వెచ్చించినా.. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో గత నాలుగేళ్ల కాలంలో రూ.5 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసి ఈజీఎస్, నాబార్డు, మెగా వాటర్‌షెడ్ తదితర పథకాల కింద చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించారు. కొన్ని గ్రామాల్లో అవసరమున్న చోటనే చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించినప్పటికీ అవి నాణ్యతగా లేకపోవడంతో కొద్ది నెలల్లోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అవసరం లేని చోట నిర్మించడంతో పెద్దగా ప్రయోజనం లేకుండాపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని కొన్ని గ్రామాలు మినహా యాచారం, మంచాల మండలాల్లో గుట్టలు, వాగులు, వంకలున్న ప్రాంతాలున్నాయి. వర్షం కొద్దిపాటిగా కురిసినా గుట్టల్లోంచి వరద నీరు వృథాగా పోతోంది. ఈ విషయం సంబంధితాధికారులకు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు తెలిసిందే. కానీ ఆయా చోట్ల తక్షణమే చెక్‌డ్యాంలు, ఆన కట్టలు నిర్మించకపోవడం శాపంలా పరిణమించింది. నల్గొండ జిల్లాలోకి వరద నీరు.. యేటా కురిసే వర్షాలకు మంచాల, యాచారం మండలాల సరిహద్దులోని వెంకటేశ్వర తండా, నల్లవెల్లి తండాల సమీపంలోని గుట్టలోంచి ఉద్ధృతంగా వరదనీరు పారుతుంది. ఇక్కడ సమీపంలో గుట్టలు ఉండడంతో కొన్ని రోజుల పాటు జాలు నీరు పారుతూ ఉంటుంది. కొన్నేళ్లుగా నీటి వృథా స్థానిక ప్రజాప్రతిధులకు, అధికారులకు తెలిసినా అక్కడ మాత్రం పెద్ద కట్ట నిర్మించకపోవడంతో.. ఆ వరదనీరు నల్లొండ జిల్లాలోకి వెళుతోంది. తాడిపర్తి, కుర్మిద్ద అటవీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. యాచారం మండలంలోని మాల్, మంతన్‌గౌరెల్లి సమీప అటవీ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారి వరదనీరు పారే ప్రాంతాలను గుర్తించి చెక్‌డ్యాంలు, పెద్ద ఆనకట్టలు నిర్మిస్తే భూగర్భజలాల పెంపునకు అవకాశముంది. -
పత్తిపై తెగుళ్లతో పరేషాన్
యాచారం: పత్తి పంటపై తెగుళ్లతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రోజుల వ్యవధిలోనే మొక్కలు వాడిపోయి, నేలవాలుతుండటంతో జీర్ణించుకోలేక పోతున్నారు. అదనులో వర్షాలు లేక ఆలస్యంగా విత్తనాలు విత్తారు. కురిసిన కొద్దిపాటి వర్షాలకు మొక్కలు ఎదుగుతున్న దశలో తెగుళ్లు సోకి ఎండిపోతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మండలంలోని తమ్మలోనిగూడ, యాచారం, నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో పంటపై తెగుళ్ల కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ప్రాణం పోసుకున్నాయి. ఈ దశలో పత్తి మొక్కలు వాడిపోవడం, నేల వాలిపోవడంతో రైతుల్లో బెంగ పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో రోహిణీ కార్తెలో విత్తిన పత్తి ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. కాగా.. రెండు మూడు రోజుల వ్యవధిలోనే పంటలో పలు మార్పులు వస్తుండటంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
న్యాయం చేయండి
యాచారం: రుణమాఫీ వర్తించని రైతులతో యాచారం తహసీల్దార్ కార్యాలయం శుక్రవారం దద్దరిల్లింది. 2010లో మండల పరిధిలోని మాల్లో అప్పటి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రీ షెడ్యూల్ చే యడంతో పాటు టర్మ్ లోను ఇచ్చినట్లు రికార్డులు మార్చాడు. దీంతో బ్యాంకు పరిధిలో ఉన్న నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది.తమకు న్యాయం చేయాలంటూ రైతులు వారం రోజులు గా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు మాఫీ రైతుల లిస్టును గ్రామాల్లో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన వివిధ గ్రామాల బాధిత రైతులు శుక్రవారం పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎంపీపీ రమావత్ జ్యోతి శ్రీనివాస్ నాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరిపల్లి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, మంతన్‌గౌరెల్లి ఎంపీటీసీ అరవింద్‌నాయక్ తదితరులు రైతులకు మద్దతుగా నిలిచారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆం దోళన సాయంత్రం 4 గంటల దాకా కొ నసాగింది. తహసీల్దార్ వసంతకుమారి విషయాన్ని ఉన్నతాధికారులకు ఫోను ద్వారా సమాచారం అందించారు. వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ విజయకుమార్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులు 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిం చారు. అప్పట్లో మేనేజర్ 409 మందికి రుణాలు రీ షెడ్యూల్ చేయడంతో టర్మ్ లోను కింద మార్చినట్లు, అందులో 250 మందికి పైగా రైతులకు సమాచారం తెలియకుండానే సంతకాలు పెట్టినట్లు ఉందని ప్రస్తుత బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ అధికారుల దృష్టికి తెచ్చారు. బ్యాంకు మేనేజర్ తప్పిదం వల్లే రైతులకు మాఫీ వర్తించకుండా పోతోందని, రైతులకు న్యాయం చేసే వరకు రుణమాఫీ పైనల్ లిస్టును ప్రకటించవద్దని ఎంపీపీ, జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని జేడీఏ విజయకుమార్ ఇచ్చిన హామీతో రైతులు తమ ఆందోళన విరమించారు. -
షరతుల్లేకుండా రుణమాఫీ
యాచారం: బ్యాంకర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూలు చేసి నేడు రుణమాఫీ వర్తించకుండా చేయడం న్యాయం కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షితో ఆయన మాట్లాడారు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాల వల్ల నేడు పేద రైతులు ఆందోళన చెందే పరిస్థితులు వచ్చాయని అన్నారు. 2010 లో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు మొత్తంగా పంటలను నష్టపోయారని తెలిపారు. అప్పట్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కొన్ని బ్యాంకుల మేనేజర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూల్ చేయడం, టర్మ్‌లోన్ కింద మార్చడం వల్ల , ప్రభుత్వ నిబంధనల వల్ల నేడు ఆ రైతులు రుణమాఫీకి అనర్హులుగా మిగులుతున్నారన్నారు. షరతుల్లేకుండా రైతులంతా రుణమాఫీ పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రీ షెడ్యూల్ వల్ల జిల్లాలో పలు చోట్ల వందలాది మంది పేద రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ పర్యవేక్షణ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా యాచారం, మంచాల మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు సరైన నింబంధనలు పాటించలేదని అన్నారు. పంటలను పరిశీలించకుండానే రుణాలిచ్చేశారన్నారు. అధికారులు ప్రత్యేక చోరవ తీసుకొని అర్హులెన రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం షరతుల్లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ చేయాలని కోరారు. -
లేని భూమికి రుణం!
యాచారం: పట్టాలిచ్చి హద్దులు చూపని అధికారుల నిర్లక్ష్యం.. ఆ పట్టాలకు భూములున్నాయో లేవో తేల్చుకోకుండానే వాటిపై అప్పులిచ్చిన బ్యాంకు అధికారుల నిర్వాకం.. లేని భూములకు అప్పులు తెచ్చుకున్న రైతుల వ్యవహారం.. ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామనడం, ఎన్నికల హామీ మేరకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం వంటిని ఈ ఉదంతం బయటపడేందుకు ఉపకరిస్తున్నాయి. అప్పట్లో పట్టాలు తీసుకున్న మాకు హద్దులు చూపలేదని, మళ్లీ మాకు భూమి ఇవ్వాలని అప్పటి లబ్ధిదారులు ఇన్నాళ్ల తర్వాత ఆందోళన బాట పడుతున్నారు. ఇక ఇన్నేళ్లుగా అదే భూమిపై యేటా బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుంటున్న వీరు.. భూములు చూసి నిర్ధారించుకున్నాకే రుణమాఫీకి సిఫారస్ చేస్తామని అధికారులు అంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. భూ పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా మండలంలోని 20 గ్రామాల పరిధిలో వందలాది మంది రైతులకు రెండు ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూములను పంచింది. కానీ చాలా గ్రామాల్లో 90 శాతం మందికి పట్టాలు మాత్రమే ఇచ్చిన అధికారులు హద్దులను చూపలేదు. మండలంలోని నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మాల్ గ్రామాల్లోనే సుమారు 150 మందికిపైగా పట్టాలిచ్చిన అధికారులు భూములు స్వాధీనం చేయలేదు. అప్పట్లో భూములు చూపెట్టకున్నా రైతు అనిపించుకున్న లబ్ధిదారులు వాటిని ఏళ్ల నుంచి ఆయా బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలో రుణమాఫీ చేసినప్పుడు వీరిలో చాలా మందికి రుణం మాఫీ అయింది. కచ్చితమైన నిబంధనలు పెట్టకుండానే అప్పట్లో రుణాలు మాఫీ కావడంతో చాలా మంది లబ్ధిపొందారు. అయితే ఈసారి అర్హులను గుర్తించి, భూములు పరిశీలించే రుణమాఫీకి సిఫారస్ చేస్తామని అధికారులు చెబుతుండడంతో రుణాలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, వ్యవసాయాధికారి, ఆయా బ్యాంకు మేనేజర్లు కమిటీగా ఏర్పడి రుణమాఫీ వర్తించే వారిని నిర్ధారిస్తారని ప్రచారం జరుగుతోంది. గుట్టలకు కూడా పంట రుణాలు.. రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకు అధికారులు ఏ మాత్రం నిబంధనలు పాటించలేదు. రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ కార్యాలయం నుంచి వచ్చిన రికార్డులను చూసి, భూములను స్వయంగా పరిశీలించాలి. ఏఏ పంటలు సాగుచేస్తున్నారన్న విషయాన్ని నమోదు చేసుకున్న తర్వాతే రుణం మంజూరు చేయాలి. కానీ రుణాలిచ్చిన బ్యాంకులు ఇవేమీ చూసుకోకుండానే లక్షల రూపాయలు ఇచ్చేశాయి. మండలంలోని పలు గ్రామాల్లో కేవలం పట్టాలుపెట్టే రూ.50 లక్షల వరకు రుణాలు పొందినట్టు తెలుస్తోంది. మాల్లోని ఆంధ్రాబ్యాంకు, మండల కేంద్రంలోని పీఏసీఎస్, నక్కర్తమేడిపల్లిలోని ఇండియన్ బ్యాంకు, యాచారంలోని ఎస్బీహెచ్లలో వందలాదిమంది ఈ విధంగానే రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఇక కొన్ని గ్రామాల్లో కొంత మంది రైతులకు అధికారులు గుట్టలు, రాళ్లున్న స్థలాలను అంటగట్టారు. వాటిని కూడా బ్యాంకుల్లో పెట్టి లబ్ధిదారులు అప్పు తీసుకున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో బ్యాంకు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. నిబంధనలు పాటించకుండానే రుణాలిచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళితే చర్యలుంటాయని భయపడుతున్నారు. ఇదిలాఉంటే పలు గ్రామాల్లోని రైతులకు బోగస్ పట్టాలిప్పించి.. వాటిని బ్యాంకుల్లో పెట్టి బ్రోకర్లు రుణాలు కాజేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ విషయంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల వివరాలుతీస్తే భూముల్లేకుండా రుణాలు తీసుకున్న వారి వివరాలు బయటపడే అవకాశం ఉంది. మాకూ భూములివ్వాలి అప్పట్లో పట్టాలు తీసుకుని భూములు పొందని రైతులు ప్రస్తుతం తమకు కూడా ప్రభుత్వం మూడెకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో పట్టాలే ఇచ్చారని, దాని వల్ల ప్రయోజనమేమీలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
మాఫీ అన్నారు..‘చేయి’చ్చారు
యాచారం: ప్రతీ నెల 50 యూనిట్లలోపు గృహ వినియోగానికి ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు మాఫీ అని కిరణ్ సర్కార్ హయాంలో ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. వారి ఆనందం నిలవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అప్పటి ప్రభుత్వం సబ్‌ప్లాన్ కింద నిధులు విడుదల చేయకపోవడంతో పైసా కూడా మాఫీ కాలేదు. మరోవైపు బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అప్పట్లో మండలంలోని 20 గ్రామాల్లో గృహ వినియోగానికి విద్యుత్ వాడుకునే ఎస్సీ,ఎస్టీలను 2,500 మంది వరకు గుర్తించారు. అందులో 900 మందికిపైగా ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తున్నారని గుర్తించి వారికి సబ్‌ప్లాన్ మాఫీ వర్తించేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల్లోని రాజకీయపక్షాల నాయకులు సైతం విద్యుత్ వినియోగంపై చైతన్యం తెచ్చి అధిక శాతం మందికి మాఫీ వర్తింపజేసేలా కృషి చేశారు. మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతుల్ల, నల్లవెల్లితండా, తక్కళ్లపల్లి తండా, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేసే లబ్ధిదారులున్నారు. బకాయిలు చెల్లించాలని ఒత్తిడి మండలంలోని 2,500 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బకాయిలు రూ.40 లక్షలకు పైగా ఉండడం, సబ్‌ప్లాన్ కింద అర్హులైన 900 మంది లబ్ధిదారులకు సంబంధించి ఏడాది కాలంగా రూ.20 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. అప్పట్లో ప్రభుత్వ హామీతో లబ్ధిదారులు మాఫీ అవుతుందిలే అని బిల్లులు చెల్లించడమే మానేశారు. రూ. లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని అధికారులు పట్టుదలతో ఉన్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రమైంది. నెలకు రూ.వందల్లో చెల్లిస్తే నేడు బకాయిలు ఉండేవి కావని, ఇప్పుడు రూ. వేలల్లో ఉన్న బకాయిలను ఎలా చెల్లించాలని దిగులు చెందుతున్నారు. కిరణ్ సర్కార్‌ను నమ్మి నిండా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వమైనా తమపై జాలి చూపి విద్యుత్ బకాయిలు మాఫీ చేసేలా కృషి చేయాలని కోరుతున్నారు. -
సమగ్ర సర్వే ఎలా సాధ్యం..?
యాచారం: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజాప్రతినిధులు సందేహాల వర్షం కురిపించారు. గ్రావూల్లో ఇప్పటికీ కొన్ని ఇళ్లకు నంబర్లు వేయులేదని, కొత్త ఇల్లు కట్టించుకున్న వారు పంచాయుతీ కార్యాలయుంలో నమోదు చేరుుంచుకోలేదని వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంత గందరగోళం వుధ్య ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడానికి బుధవార మండల పరిషత్ కార్యాలయంలో సవూవేశం నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్న ఈ సవూవేశంలో తహసీల్దార్ వసంతకువూరి సర్వే జరిగే విధానాన్ని వివరించారు. 19న ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. దీంతో పలు గ్రావూల సర్పంచ్‌లు లేచి గ్రామాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఉన్నా ఇళ్లకు నంబర్లున్నాయా, ఉంటే నంబర్ల మీద యజమానుల పేర్లు తదితర విషయాలపై పూర్తి సమాచారం గ్రామ పంచాయతీల్లోనే లేదు, ఇక సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిజానికి మండలంలో 20 గ్రామాల్లో 20 వేలకు పైగా కుటుంబాలున్నాయున్నారు. అరుుతే అధికారుల వద్ద ఉన్న రికార్డుల్లో వూత్రం కేవలం 11,490 నుంచి 12,072 వరకు కుటుంబాలు ఉన్నట్లు మాత్రమే రికార్డున్నట్లు చెప్పారు. ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు విడతల్లో వుండలంలో 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యూయుని, వీటిలో ఆరు వేలకు పైగా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అరుుతే ఈ కొత్త ఇళ్లకు అధికారులు ఇంకా నంబర్లు కేటారుుంచలేదని, వారు పాత ఇళ్ల నంబర్లతోనే పలు సంక్షేమ పథకాలు పొందుతున్నట్లు చెప్పారు. వురి సర్వే రోజు పాత ఇళ్లలో ఉండటం ఎలా కుదురుతుందని, వారంతా ఈ సర్వే కోసం కొత్త ఇళ్లను వదిలి వుళ్లీ ఇళ్లలోకి వూరాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికారులు ఆయా గ్రామాల రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శుల చేత రెండు రోజుల్లో ఇంటి నంబర్లు వేసేలా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటామని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై లబ్ధిదారుల్లో అందోళన మొదలైంది. రాజకీయ పలుకబడి ఉపయోగించి పలువురు ఒక ఇంటి మీదే రెండు, మూడు ఇళ్లు పొందారు. అర్వులు కాని పేర్ల మీద పింఛన్లు మంజూరైనాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ పింఛన్లు వస్తున్నారుు. సమగ్ర కుటుంబ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నందునా వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మాల్, మంతన్‌గౌరెల్లి, చౌదర్పల్లి, నక్కర్తమేడిపల్లి, గునుగల్ , గడ్డమల ్లయ్యగూడ తదితర గ్రామాల్లో ఇళ్లు నిర్మించకున్నా చాలావుంది లబ్ధిదారులకు నిధులు మంజూరయ్యూరుు. వారిలో కొంతమంది పేర్ల మీద వారికి తెలియకుండానే ఇళ్లు మంజూరైనట్లు, బిల్లులు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. అంతేకాకుండా పలువురు పల్లెల్లో జీవిస్తూ పట్టణాల్లో, అలాగే పట్టణాలకు వలస వెళ్లి పల్లెల్లో లబ్ధి పొందుతున్నారు. వీరంతా ఇప్పుడు ఏంచేయూలో తెలియుని సందిగ్ధంలో పడిపోయూరు. ఇప్పటికే బోగస్ కింద మండలంలో వందలాది రేషన్ కార్డులు తొలగించిన అధికారులు మళ్లీ సమగ్ర సర్వే పేరుతో సంక్షేమ పథకాల్లో కూడా కోత పెట్టడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావ త్ జ్యోతి నాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్ గౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జి. రామకృష్ణ యాదవ్, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ తదితరులున్నారు. -
పట్టా ఉంది.. భూమే లేదు!
యాచారం: పేదలకు భూపంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే. అయితే హడావుడిగా పట్టాలు పంచేసి.. హద్దులు చూపకపోవడంతో చాలా మంది రైతులు లబ్ధిదారులుగా మారుతున్నారు తప్ప.. వారికి ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. సుమారు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులకు తమ భూమి ఎక్కడుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. అర్హులైన రైతులకు భూమి చూపించి, హద్దులు గుర్తించి, సర్వేయర్‌తో మ్యాప్ తయారు చేయించిన తర్వాతే పట్టాలివ్వాలి. కానీ అలా చేయకపోవడం వల్ల వారంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం దళితులకు భూపంపిణీలో భాగంగా సాగుకు యోగ్యమైన భూమిని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్‌లోనే యాచారం మండలంలో మంతన్‌గౌరెల్లి గ్రామాన్ని ఎంపికచేసి అర్హులైనవారికి మూడెకరాల చొప్పున పంపిణీకి నిర్ణయించారు. గ్రామంలో అర్హులైన తొమ్మిది మంది రైతులను ఎంపిక చేశారు. గ్రామంలో దళితులకు భూపంపిణీ కింద సాగుయోగ్యమైన భూమిని పంపిణీ చేయడానికి అధికారులు నిర్ణయించడంపై నాడు పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. తమను కూడా ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని వారంతా కోరుతున్నారు. నేడు ఫిర్యాదుల బాట యాచారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా వందలాది పేద రైతులకు దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పలుమార్లు భూపంపిణీ కింద పట్టాలిచ్చింది. అప్పట్లో అధికారుల తప్పిదంవల్ల కొన్ని గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల్ని పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లోనైతే భూముల్లేకుండానే రైతులకు పట్టాలిచ్చారు. అప్పట్లో పేద రైతులు భూములు లేకున్నా పట్టాలిస్తేచాలు అనే తరహాలో పట్టాలు తీసుకున్నారు. ఏళ్లు గడిచినా వారికి భూములు చూపించలేదు. అధికారుల సర్వేలో పట్టాలు పొందిన రైతులకు భూములన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. దీనివల్ల భూములు లేకున్నా వారు నేడు భూపంపిణీకి అర్హులు కాకుండా పోయారు. నేడు ప్రభుత్వం సాగు భూములనే పంపిణీ చేయాలనే యోచనతో ఉండడం వల్ల నాడు పట్టాలు పొందిన రైతులు నేడు ఫిర్యాదుల బాట పట్టారు. సోమవారం మంతన్‌గౌరెల్లి గ్రామానికి చెందిన 15మందికి పైగా రైతులు నాడు భూములు లేకుండా పట్టాలిచ్చిన పుస్తకాలను తీసుకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తమకు పట్టాలు మాత్రమే ఇచ్చారనీ, భూము లివ్వలేదని వాపోయారు. నాటి పట్టాలు రద్దుచేసి ప్రస్తుతం భూపంపిణీ ఎంపిక అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా నమోదు చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు రమేష్‌గౌడ్, తహసీల్దార్ వసంతకుమారికి ఫిర్యాదు చేశారు. మంతన్ గౌరెల్లి గ్రామంలోనే కాకుండా మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తాడిపర్తి తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులకు అప్పటి అధికారులు కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి భూమి చూపించలేదని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ వసంత కుమారిని సంప్రదించగా భూపంపిణీలో భూమి ఇవ్వకుండా పట్టాలిచ్చిన విషయమై వివరాలు సేకరిస్తామని అన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని అన్నారు. -
విద్యుత్ సమస్యలకు చెక్
యాచారం: మండలంలో ఉన్న విద్యుత్ సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తానని, గ్రామాల్లో ఉన్న సమస్యలపై సర్పంచ్‌లు వెంటనే నివేదిక అందజేయాలని ఆ శాఖ ఎస్ఈ బాలకిషన్ పేర్కొన్నారు. ఈ నెల 24న మండల కార్యాలయంలో జరిగిన ‘మన ఊరు...మన ప్రణాళిక’ సమావేశంలో గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు సర్పంచ్‌లు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి మండలానికి ఎస్ఈని పంపించి సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎస్ఈ బాలకిషన్ సోమవారం డీఈ రాఘవేందర్రావు, ఏడీ చక్రవర్తి, మండల ఏఈ శ్రీనివాస్‌తో కలిసి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లతో సమావేశమయ్యారు. ఒక్కో గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను మార్చి, ఏళ్ల కింద ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలను వెంటనే తొలగిస్తామని అన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల గ్రామాల్లో 24 గంటల పాటు సింగల్ ఫేజ్ విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాబోయే ఐదేళ్ల కాలంలో అదనంగా మరో ఐదు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. బిల్లులు చెల్లింపుల విషయంలో ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. అత్యవసరంగా వ్యవసాయ పొలాల వద్ద ప్రమాదకరంగా కిందకు వేలాడే తీగలను మార్చి, అవసరమైన చోట స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిధులకు కోరత లేదు, సమస్యలన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలు మాట్లాడుతూ... అసలే భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి, నాణ్యమైన ఏడు గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేయాలని కోరారు. ఎల్ఆర్ పేరుతో రాత్రి పూట గంటల కొద్దీ కోతలు విధించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య వచ్చినప్పుడు విద్యుత్ సిబ్బంది తక్షణమే స్పందించే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాశ్ఛ బాషా, నర్రె మల్లేష్, గౌర నర్సింహ, సత్యపాల్, నర్సయ్య, బండిమీది కృష్ణ, మల్లేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, టీడీపీ నాయకులు లిక్కి నర్సింహరెడ్డి, ఉడుతల జంగయ్యగౌడ్, రమావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘పంట’ పండిస్తాం!
యాచారం: కూరగాయల పంటల సాగును ప్రోత్సహిస్తే గణనీయమైన దిగుబడులు తీసి చూపిస్తామంటున్నారు యాచారం మండలంలోని రైతులు. మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, గడ్డమల్లయ్యగూడ, తమ్మలోనిగూడ, తాడిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వీరికి దశాబ్దాలుగా ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకుండాపోతోంది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, ఒకవేళ ఉన్నా వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు యాచారం, మాల్ మార్కెట్లకు దిగుబడులు తీసుకెళుతుం డగా.. మరికొందరు నగరంలోని సరూర్‌నగర్ రైతు బజారు, మాదన్నపేట తది తర మార్కెట్లకు తరలిస్తున్నారు. నాలుగేళ్లుగా ఇబ్రహీంపట్నంలో రైతుబజారు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడమే గానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. రైతులకు సకాలంలో కూరగాయల విత్తనాలు సైతం అందడంలేదు. పాత పద్ధతుల్లోనే పంటల సాగు ప్రభుత్వ పోత్సాహం లేకపోవడంతో ఇక్కడి రైతులు ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. చౌదర్‌పల్లిలోని పలువురు రైతులు మాత్రమే పందిర్లపై కూరగాయల సాగు, డ్రిప్ సౌకర్యాంతో మంచి దిగుబడి తీస్తున్నారు. కానీ మిగతా గ్రామాల్లో రైతుల కాల్వల ద్వారా నీరు పారించి పంటలు సాగు చేస్తున్నారు. సంబంధిత అధికారులను కలిసి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేలా సౌకర్యాలు కల్పించాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
మళ్లీ భూ సేకరణ!
యాచారం: మరో విడత భూ సేకరణ చేపట్టేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గతంలో ఏపీఐఐసీ యాచారం మండలంలోని నాలుగు గ్రామాల్లో 3,145 ఎకరాలు సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా మరో విడత ఇదే మండలంలో భూములు సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రాల విభజనకు ముందు మొదటి విడితగా మండలంలోని కుర్మిద్దలో 985 ఎకరాలను సేకరించేందుకు ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ) నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో భాగంగా యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల గ్రామాల్లో 2,160 ఎకరాలను సేకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ఈ భూముల సర్వే నంబర్లతో సహా అధికారులు బయటకు వెల్లడించినా.. రైతుల నుంచి భూ సేకరణ చేయలేదు. పరిహారం, పునరావాసం వంటి విషయాలపైనా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలోనే స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ విషయం కొలిక్కి రాకముందు టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ) మండలంలోని మరో నాలుగు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అధికారులు మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి గ్రామాల్లో 550 ఎకరాలను వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పరిశీలించినట్టు తెలుస్తోంది. అప్పట్లో మండలంలోని కుర్మిద్ద, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు భూముల సేకరణ విషయమై రైతుల నుంచి ఎలాంటి అభిప్రాయం కోరలేదు. ప్రస్తుతం మరో 550 ఎకరాలకుపైగా భూములను సేకరించేందుకు టీఎస్ఐఐసీ అధికారులు చకచకా పనులు పూర్తిచేస్తుండడం, తరచూ స్థానిక రెవెన్యూ అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూములు సేకరించాలని నిర్ణయించిన యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల గ్రామాల్లో అత్యధికంగా పట్టా భూములున్నాయి. మిగతా గ్రామాల్లో అసైన్డ్ భూములు, రాళ్లు, గుట్టలు ఉన్నాయి. మండలంలో పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటైతే తీవ్ర నష్టం తప్పదని మరికొందరు అంటున్నారు. -
ఖాయిలాపడ్డ ‘ఖాదీ’ తెరుచుకునేనా?
యాచారం: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖాదీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చేనా అని అప్పటి కార్మికులు ఎదురుచూస్తున్నారు. పరిశ్రమను మళ్లీ ప్రారంభించి జీవనోపాధి కల్పించేలా కృషి చేయాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు. భాగ్యనగర్ ఖాదీ సమితి పేరుతో 1962 నుంచి 1992 వరకు మండల పరిధిలోని గున్‌గల్‌లో ఖాదీ పరిశ్రమ వందలాది మందికి జీవనోపాధి కల్పించింది. 30 సంవత్సరాలపాటు ఈ ఖాదీ పరిశ్రమలో పనులు చేసుకుంటూ ఎంతో మంది జీవనోపాధి పొందారు. నగరంలోని సరూర్‌నగర్ ఖాదీ పరిశ్రమ కేంద్రం నుంచి గున్గల్ పరిశ్రమకు దూది, కాటన్ సరఫరా అయ్యేవి. గున్గల్ కేంద్రంగా యాచారం మండలంలోని కొత్తపల్లి, చింతపట్ల, చౌదర్పల్లి, మేడిపల్లి, తక్కళ్లపల్లి, నందవనపర్తి, నానక్‌నగర్, మంచాల మండలంలోని ఆరుట్ల, జాపాల, కాగజ్‌ఘాట్, ఆగాపల్లి, ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో ఉప కేంద్రాలు ఉండేవి. సరఫరా అయ్యే దూది, కాటన్లను ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు దారంగా వడికేవారు. కొంతమంది చేతులతో, మరికొంతమంది విద్యుత్ యంత్రాలతో దారాన్ని వడికేవారు. వడికిన దారాన్ని నగరానికి సరఫరా చేసే వారు. ఆయా పనులతో మూడు మండలాల్లో ఐదు వందలమందికిపైగా కార్మికులు జీవనోపాధి పొందేవారు. వీరికి వారం వారం వేతనాలు అందించేవారు. ప్రతివారం రూ.3 లక్షల వరకు వేతనాలు చెల్లించేవారని ఆనాటి కార్మికులు పేర్కొంటున్నారు. రానురానూ ఖాదీ పరిశ్రమకు గిట్టుబాటు లేకపోవడంతో ప్రభుత్వం ఈ పరిశ్రమపై దృష్టి సారించకపోవడంతో గునుగల్ ఖాదీ పరిశ్రమ అప్పట్లో ఒక వెలుగు వెలిగి అనతి కాలంలోనే డీలా పడింది. నిలిచిపోయిన బకాయిలు.. రక్షణ లేని భవనాలు అప్పట్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ పరిశ్రమ శ్రేయస్సు కోసం ఏ మాత్రం కృషి చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో డివిజన్ పరిధిలోని ఖాదీ పరిశ్రమ కేంద్రాలు మూతపడ్డాయి. దాదాపు 400 మంది కార్మికులకు లక్షల రూపాయల వేతనాలు అందాల్సి ఉంది. పలుమార్లు సరూర్‌నగర్‌లోని ఖాదీ పరిశ్రమ కేంద్రానికి వేతనాల కోసం కార్మికులు తిరిగినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు. డివిజన్లోని కొన్ని కేంద్రాల్లో విలువైన పరికరాలు వృథాగా ఉన్నాయి. గున్గల్, ఆరుట్ల, నందివనపర్తి గ్రామాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే ఈ పరిశ్రమకు చెందిన సొంత భవనాలు ఉన్నాయి. యజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పరిశ్రమలోని విలువైన యంత్రాలు, పరికరాలకు ర క్షణ కూడా కరువయింది. కొంతమంది కార్మికులు కూడా మళ్లీ పరిశ్రమ తెరుస్తారేమోనని యంత్రాలను, పరికరాలను తమ వద్దే ఉంచుకుని నేటికీ భద్రంగా దాచుకుంటున్నారు. ఈ పరిశ్రమను పునఃప్రారంభించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానికులు మొరపెట్టుకున్నప్పటికీ ఎటువంటి స్పందనా లేకుండాపోయింది. అప్పట్లో వందల మందికి ఉపాధి కల్పించిన ఖాదీ పరిశ్రమను మళ్లీ ప్రారంభించేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వంలోనైనా మంచిరోజులు వచ్చేనా అని నాటి కార్మికులు ఆశతో చూస్తున్నారు. -
సాగుకు కొత్త సమస్య
యాచారం: ఇన్నాళ్లు వర్షాలు లేక ఆందోళనకు గురైన రైతన్నను ఊరడిస్తూ వరుణుడు కాస్త కరుణించాడు. అడపాదడపా పడుతున్న వర్షాలకు సాగు కోసం రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వారికి మళ్లీ ఇప్పుడుయచ కొత్త సమస్య వచ్చి పడింది. నెల రోజుల ఎదురు చూపుల తర్వాత ఇటీవలె వర్షాలు కురిశాయి. దీంతో రైతులంతా ఒక్కసారిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్ని గ్రామాల్లో మెట్ట పంటలు వేసుకుంటుండగా మరికొన్ని గ్రామాల్లో వరి నాట్లు వేస్తున్నారు. అయితే అన్ని గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీల సమస్య తీవ్రంగా మారింది. ఒకవైపు ఉపాధి పనులు కొనసాగుతుండటం, ఒకేసారి అందరికీ అవసరం పడటంతో కూలీలకు తీవ్ర కొరత వచ్చి పడింది. దీంతో కూలి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతేకాకుండా కూలీలు కూడా ఉదయం పూట ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో రైతుల వద్ద వ్యవసాయ పనులకు వెళ్లుతున్నారు. అంతేకాకుండా రోజుకు రూ. 300కు పైగా కూలిని డిమాండ్ చేస్తుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. దీనికితోడు కూలీ నాగలితో వస్తే రోజుకు రూ. వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొందరు యం త్రాల సహాయంతో పనులు చేసుకుంటుండగా మరికొందరు కూలీలపైన ఆధారపడక తప్పడం లేదు. కొందరు కూలీలకు ముందే అడ్వాన్సులు ఇచ్చి వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. కొందరు కూలీలు వ్యవసాయ పనులను గుత్తకు తీసుకొని పూర్తి చేస్తున్నారు. తాడిపర్తి, నానక్‌నగర్, తక్కళ్లపల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో వరి నాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు జరిగి నన్ని రోజులు అధికారులు ఉపాధి పనులు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు. -
జవాబుదారీ రెవె‘న్యూ’
యాచారం: ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు స్థానిక తహసీల్దార్ వసంతకుమారి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ కార్యదర్శులు వారంలో మూడురోజుల పాటు గ్రామాల్లోనే ఉండేం దుకు, జనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర ణాళికను రూపొందించారు. చిన్న చిన్న పనుల కోసం వారాలతరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా ప్రజల వద్దకే రెవెన్యూ పాలన తీసుకెళ్లేందుకు ఆమె వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. గత ఏడాది ప్రభుత్వం రెవెన్యూ క్లస్టర్లలో గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఎప్పుడూ చూసినా మూతపడే ఉండేవి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ తహసీల్దార్ కార్యాలయాన్నే ఆశ్రయించేవారు. అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి కావు. దీంతో తహసీల్దార్ వసంతకుమారి గ్రామ రెవెన్యూ పాలనకు శ్రీకారం చుట్టారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల రెవెన్యూ కార్యదర్శులతో ఆమె సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి రెవెన్యూ పాలన గ్రామం నుంచే సాగించాలని కార్యదర్శులకు సూచించారు. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్రామంలోనే కార్యదర్శులు ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. వారు గ్రామాల్లోఉండడమే కాకుండా.. రెవెన్యూ రికార్డులు స్థానికంగానే చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల్లో హర్షం కార్యదర్శులు గ్రామాల్లో ఉండే రోజుల్లో ఉదయం నుంచి 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామాల్లో ఉండాలి. కార్యదర్శి పేరు, ఫోను నంబరు క్లస్టర్ కార్యాలయం వద్ద అతికించాలి. అత్యవసర సమయాల్లో గ్రామాలకు రాని పక్షంలో తహసీల్దార్ లేదా సర్పంచ్‌కు సమాచారం అందించాలని వసంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ పాలన ఇక గ్రామాల నుంచి సాగడానికి తహసీల్దార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పహాణీ, పాసు పుస్తకాలు, పట్టాల మార్పిడి తదితర చిన్న చిన్న పనుల కోసం నెలల కొద్దీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లమని, ప్రస్తుతం స్థానికంగానే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కృషి చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామాల్లోనే కార్యదర్శులు ఉండేలా.. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయానికి రాకుండా చూడడమే లక్ష్యమని తహసీల్దార్ వసంతకుమారి స్పష్టంచేశారు. -
పంట మార్పిడిపై రైతుల దృష్టి
యాచారం: ఆలస్యంగా కురిసిన వర్షాల కారణంగా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. అదునలో వర్షాలు కురిస్తే పత్తి పంట సాగు చేద్దామనుకున్న రైతులు.. దిగుబడి తగ్గుతుందేమోనని ఇతర పంటల సాగుపై అసక్తి చూపుతున్నారు. మండలంలో ఈ ఏడాది 1,500 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయడానికి రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అదనులో వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి వైపు మళ్లారు. ఈసారి పత్తి 400 హెక్టార్ల వరకు కూడ సాగు చేయలేదు. రెండు రోజుల క్రితం ఓ మోస్తరు వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు రోజుల్లోనే 700 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తుకోవడం గమనార్హం. వర్షాలు సకాలంలో కురిసే అవకాశం లేని విషయం పసిగట్టిన వ్యవసాయాధికారులు అవసరమైన మొక్కజొన్న విత్తనాలు నిల్వలు సిద్ధంగా ఉంచారు. మండలంలో ఇప్పటివరకు 13.3 టన్నుల మొక్కజొన్న విత్తనాలు విక్రయించారు. అదనులో కురవని వర్షాల కారణంగా రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్న దృష్ట్యా మళ్లీ మూడు టన్నుల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. 100 రోజుల్లోనే పంట చేతికి.. ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తే వంద రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పుడప్పుడు కురిసే వర్షాలతోనైనా మొక్కజొన్న పంట పండే అవకాశముంది. కానీ పత్తి పంట ఆలస్యంగా విత్తితే పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా.. పంటపై చీడపీడలు సోకడంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుందని రైతుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో వారు మొదట మొక్కజొన్న, రెండో దశలో ఆముదం, కందులు తదితర పంటలపై దృష్టి పెట్టారు. మండలంలో ఇప్పటికే 900 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు అయింది. పంటమార్పిడితో రైతులు సాగు విస్తీర్ణం పెంచితే మొక్కజొన్న రెండు వేల ఎకరాలకు పైగా దాటే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఆయా గ్రామాల్లో 400 హెక్టార్లలో ఆముదం, కంది పంటలు సాగు చేశారు. 200 ఎకరాలకు పైగా వరి పంట సాగులో ఉంది. బీపీటీ తూకాలు పోసిన రైతులు సంమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప కరిగెట్లు దున్ని నాట్లేయలేమని అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకున్న రైతులు దిగుబడి తగ్గుతుందని తెలిసినా పత్తినే సాగు చేస్తున్నారు. ఈసారి అత్యధికంగా మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా బీమా సౌకర్యాం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. -
‘పౌల్ట్రీ’కి ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం
యాచారం: మండలంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రగతి కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) విరివిగా రుణాలు అందించేందుకు సంసిద్ధమైంది. పౌల్ట్రీఫాంల అభివృద్ధి కోసంనెదర్లాండ్‌కు చెందిన రోబో బ్యాంకు డీసీసీబీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే జిల్లాలోనే యాచారం మండలంలోని రైతులకు విరివిగా రుణాలిచ్చి పౌల్ట్రీఫాంలను అభివృద్ధిపరిచేందుకు సంకల్పించింది. మూడు నెలల క్రితం నెదర్లాండ్‌కు చెందిన రోబో బ్యాంకు ప్రతినిధులు మండలంలో పర్యటించారు. పౌల్ట్రీ రైతులు జీవన స్థితిగతులు, కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయం, రైతుల ఆసక్తి, బ్యాంకు రుణాల వివరాలు, బకాయిల చెల్లింపు తదితర విషయాలను అధ్యయనం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలోని చిన్న, సన్నకారు రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, షెడ్ల నిర్మాణం చేపట్టి 5 వేలనుంచి 10 వేలకుపైగా కోళ్ల పెంపకానికి వివిధ కంపెనీలతో ఇంటెగ్రేషన్ పద్ధతిన లాభాలు పొందుతున్న విషయం తెలుసుకున్నారు. జిల్లాలో మిగతా మండలాల రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడం గుర్తించి మండలాన్ని దత్తతగా తీసుకోవడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగానే మండలంలో పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంల ఏర్పాటుపై ఔత్సాహిక రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. రూ.6 కోట్ల ప్రతిపాదనలు మండలంలోని పలు గ్రామాల రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి డీసీసీబీ ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం (పీఏసీఎస్) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కొద్ది రోజులు క్రితం డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీఈఓ రాందాసు స్వయంగా ఇక్కడికి వచ్చి రైతులతో సమావేశమయ్యారు. రుణాల విషయంలో హామీ సైతం ఇచ్చారు. గతంలో పీఏసీఎస్‌ల ద్వారా 42 మంది రైతులు పౌల్ట్రీ పరిశ్రమ కోసం రూ.2 కోట్ల వరకు రుణాలు ఇచ్చారు. రుణాలు పొందిన 42 మంది రైతుల్లో మళ్లీ కొత్తగా పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకుంటే రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. వీరిలో ఇప్పటికి 30 మంది రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే పౌల్ట్రీ పరిశ్రమలో ఎటువంటి అనుభవం లేని రైతులకు సైతం పీఏసీఎస్ నుంచి రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. గతంలో పౌల్ట్రీఫాంల కోసం పీఏసీఎస్ నుంచి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే రుణాలిచ్చేవారు. కానీ ప్రస్తుతం రూ. 10లక్షలపైనే ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. కొత్త రైతులు ఇప్పటి వరకు 18 మంది అర్జీలు పెట్టుకున్నారు. నిబంధనలు పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రుణాలు విరివిగా అందజేస్తుండడంతో ఔత్సాహిక రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రానున్న రోజుల్లో మండలంలో పౌల్ట్రీఫాంల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. -
రాయితీ విత్తనాల జాడేదీ?
యాచారం, న్యూస్‌లైన్: మెట్ట పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతులు... ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. విత్తుకునే గడువు దగ్గర పడుతుండటం... రాయితీ విత్తనాల జాడలేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు ఎప్పుడొస్తాయని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే వస్తాయి... ఇస్తాం అంటున్నారే తప్ప ఎప్పుడొస్తాయనేది స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో రైతులు నిత్యం వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో రైతుల మెట్ట పంటల సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు అత్యధికంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఆముదం, కందులు తదితర మెట్ట పంటలు సాగు చేస్తారు. ఈ మెట్ట పంటలను రైతులు రోహిణికార్తె ప్రారంభం నుంచే వర్షం వస్తే విత్తనాలను విత్తుకుంటారు. ఈ ఏడాది మండలంలో దాదాపు వెయ్యి హెక్టార్లపైనే మెట్ట పంటల సాగు కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకుంటారు. కాని విత్తనాలు కొనుగోలు చేసుకుందామన్నా వాటి జాడ లేకపోవడంతో పంటలు ఎట్లా సాగు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు పత్తి విత్తనాల విక్రయాలపైనే అధిక దృష్టి పెట్టడం వల్ల తక్కువ జొన్న, సజ్జ, కందులు, మొక్కజొన్న తదితర విత్తనాల విక్రయంపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. కూరగాయల విత్తనాల సంగతీ అంతే... మండలంలో మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, చింతపట్ల, నందివనపర్తి, సింగారం, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో రైతులు అత్యధికంగా టమాట, బెండ, చిక్కుడు, వంకాయ, కాకర, మిర్చి తదితర కూరగాయల పంటలను సాగు చేస్తారు. ప్రైవేట్ దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం వల్ల ప్రతి యేటా రైతులు ఉద్యాన శాఖ రాయితీపై అందజేసే కూరగాయల విత్తనాలపైనే ఆధారపడతారు. అయితే రాయితీ కూరగాయల విత్తనాలు కూడా ఇంతవరకూ జాడలేవు. విత్తనాల కోసం ఇబ్రహీంపట్నంలోని ఉద్యాన శాఖ కార్యాలయానికి వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతోంది. రాయితీ విత్తనాలు ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదని అధికారులు చెబుతుండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అవసరమైన రాయితీ విత్తనాలను రెండు, మూడు రోజుల్లో తెప్పించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. -
కార్యదర్శుల కొరత.. పాలన పడక
యాచారం, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో పాలన పడకేసింది. మండలంలో 20 గ్రామాలకు గాను నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక్కొక్కరికీ ఐదేసి గ్రామాల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు నిత్యం ఏ గ్రామంలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్ర స్థాయిలో పరిపాలన సాఫీగా సాగాలంటే పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో ముఖ్యం. రెండు, మూడేళ్లుగా పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. మూడు నెలల క్రితం ఆరుగురు పంచాయతీ కార్యదర్శులుండగా మాల్ కార్యదర్శి వీణ ప్రసూతి సెలవులో వెళ్లగా, చౌదర్పల్లి కార్యదర్శి మిస్కిన్ రోడ్డు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మిగిలింది శ్రీనివాస్, రాములు, సురేష్‌కుమార్, పురుషోత్తంరెడ్డి మాత్రమే. ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు అప్పగించారు. మండలంలోని 14 క్లష్టర్లకు గాను 14 మంది పంచాయతీ కార్యదర్శులుండాలి. కానీ మండలంలో నలుగురు మాత్రమే ఉండడంతో విధుల్లో భారంతో పాటు ప్రజలకు సరైనా న్యాయం చేయలేకపోతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా తెరుచుకోని పరిస్థితి ఉంది. ముందుకు సాగని అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేక పర్యవేక్షణ కరువై అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సీసీ రోడ్లు, నీటి ట్యాంకులు, డ్రైనేజీ కాల్వలు, భవన నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్ల పనులు పూర్తిగా కుంటుబడ్డాయి. పలు గ్రామాల్లో రూ. కోట్ల విలువ జేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా కట్టడి చేసే నాథుడే లేకుండా పోయారు. కొద్ది రోజుల క్రితం తక్కళ్లపల్లి తండాలో రూ. పది లక్షలకు పైగా విలువ జేసే జీపీ ఆక్రమణకు గురవగా ప్రజల ఫిర్యాదు మేరకు ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ రక్షించి హద్దులు పాతారు. రూ. లక్షలాది పన్నులు కూడా వసూలు కాని పరిస్థితి ఉంది. వీధిలైట్లు కాలిపోయి మరమ్మతులు లేక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. అనుమతుల్లేకుండానే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకుంటున్నా అడిగే వారు లేరు. మరోవైపు వివిధ ధ్రువీకరణ పత్రాల నమోదు, పన్నులు చెల్లింపు, ఇంటి అనుమతులు, లెసైన్సులు తదితర పనుల నిమిత్తం ప్రజలు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పంచాయతీ కార్యదర్శులను నియమించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
మైనింగ్ జోన్ రద్దయ్యేనా!
యాచారం, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో యాచారం, నందివనపర్తి గ్రామాల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల పరిధిలోని ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 900 ఎకరాల్లో ైమైనింగ్ జోన్ ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే స్థానిక రైతులు మాత్రం జోన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు.. ఆ భూముల్లో సాగు సాగడంలేదని తప్పుడు రికార్డులు సృష్టించి మైనింగ్ జోన్ ఏర్పాటుకు కుట్రలు చేశారని రైతులు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు. వివిధ రాజకీయపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి కలెక్టర్‌తోసహా ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డిలు కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్లను కలిసి రద్దు విషయంలో తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అయితే మైనింగ్ జోన్ రద్దుకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాగా రెండేళ్ల కిందట జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం వస్తే మైనింగ్ జోన్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరగదనే ఆశతో అన్నదాతలున్నారు. ఈ రెండు గ్రామాల్లో వందలాది మంది రైతులు ఏళ్ల కొద్ది ఆ భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ మైనింగ్ జోన్లో అత్యధికంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులే స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అనుమతులు పొందారు. అయితే స్థానికుల ఆందోళనలకు భయపడి సదరు భూముల్లో ప్రభుత్వం స్టోన్ క్రషర్లకు, క్వారీల ఏర్పాటుకు మాత్రం అనుమతులివ్వడం లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండడం, తన సన్నిహితుడైనా కేసీఆరే త్వరలో రాష్ట్రానికి సీఎం కానున్నట్లు స్పష్టం కావడంతో ఈ విషయంపై కోదండరాం ప్రత్యేక దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మైనింగ్ జోన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని వారు కోరుతున్నారు. -
వడగళ్ల వర్షంతో పంటలకు నష్టం
యాచారం, న్యూస్‌లైన్: అయ్యో పాపం అనేవాళ్లే గాని అన్నదాతను ఆదుకునే వారే లేరు. అది చేస్తాం... ఇది చేస్తామని ఉత్తుత్తి హామీలివ్వడమే తప్ప కనీసం వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మంచాల, చేవెళ్ల, షాబాద్ తదితర మండలాల్లో గత పదిరోజుల క్రితం వడగళ్లు, అకాల వర్షంతో పంటలకు విపరీతంగా నష్టం జరిగింది. చాలా గ్రామాల్లో కూలీల కొరతతో వరి పంట కోతల్లో జాప్యం జరిగింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం వడగళ్లు కురిసి వందలాది ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, మల్కీజ్‌గూడ, తాడిపర్తి తదితర గ్రామాల్లో దాదాపు రెండువేలకు పైగా ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. దాదాపు ఏడువందల మందికి పైగా రైతులు రూ.లక్షల్లో పెట్టుబడులు నష్టపోయారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలు పార్టీల నాయకులతో పాటు జేడీఏ, రెవెన్యూ, ఈజీఎస్ అధికారులంతా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నాయకులైతే అయ్యో రైతుకు ఎంత నష్టం వాటిల్లింది అని విచారం వ్యక్తం చేశారు. పోయిన పంట పోయింది... మిగిలిన పంటను ఉపాధి హామీ పథకం కూలీలతో సేకరించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని, పరిహారం అందించేందుకు కృషి చేస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. అయితే ఇప్పటివరకు కూడా పంట కోతల విషయమై, పరిహారం చెల్లింపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సర్పంచ్‌లు, ఈజీఎస్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కనీసం పంట నష్టం వివరాలు కూడా అధికారులు నమోదు చేయకపోవడంతో పరిహారంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులే రంగంలోకి... వారం రోజులైనా ఉపాధి కూలీలతో పంట కోత పనులు ప్రారంభించకపోవడంతో రైతులు స్వయంగా రంగంలోకి దిగారు. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పుట్ల కొద్ది ధాన్యం నేలపాలైంది. ఎంతో కొంత దక్కకపోతుందా అన్న ఆశతో కూలీలతో చెరి సగం చొప్పున ఒప్పం దం చేసుకొని నేలరాలిన ధాన్యాన్ని సేకరించుకుంటున్నారు. ఇదే ఒప్పందంపై పశుగ్రాసం కూడా కోయించుకుంటున్నారు. ఇక మామిడి, పూల, పండ్ల రైతుల పరస్థితి కూడా ఇలాగే ఉంది. రాలిన మామిడి కాయలను ఏరుకుని ఎంతకో కొంతకు అమ్ముకుంటున్నారు. త్వరలో కొలువుదీరన్ను కొత్త ప్రభుత్వమైనా స్పందించి తమను ఆదుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
సీపీఐ అభ్యర్థికి ఇండిపెండెంట్ గుర్తు
యాచారం, న్యూస్‌లైన్: బీ- ఫారం సకాలంలో అందజేసిన సీపీఐ అభ్యర్థికి అధికారులు ఇండిపెండెంట్ గుర్తు కేటాయించారు. ఇది గుర్తించిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పును సరిదిద్దుకున్నారు. వివరాలు.. మండలంలోని రిధిలోని చింతుల్లకు చెందిన ఆకుల భిక్షపతి యాచారం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సోమవారం మధ్యాహ్నం సీపీఐ నుంచి పార్టీ బీ- ఫారాన్ని జెడ్పీలో కార్యాలయంలో అధికారులకు అందజేశారు. సీపీఐ నుంచి భిక్షపతి సకాలంలో బీ-ఫారం అందజేసినప్పటికీ అధికారులు అతనికి ఇండిపెండెంట్ గుర్తు కేటాయించారు. ఇది గుర్తించిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కావలి నర్సింహ, అభ్యర్థి భిక్షపతిలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సకాలంలో బీ-ఫారం అందజేసినా ఇండిపెండెంట్ గుర్తు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో అధికారులు తమ తప్పు తెలుసుకున్నారు. అనంతరం భిక్షపతికి సీపీఐ పార్టీ గుర్తును కేటాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. -
ఉపాధికి ‘ఆధార్’ గండం!
యాచారం, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల విషయంలో మధ్య తరగతి ప్రజలను ‘ఆధార్’తో బెదరగొట్టి, చివరకు వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బడుగుజీవులపై ‘ఆధార్’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరూ తమ జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్దేశించింది. ఈ నెల 15వ తేదీలోగా అనుసంధానం ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఉపాధికి-ఆధార్ లింకుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కూలీలకు ఆందోళన కలిగిస్తోంది. అనుసంధానం కాకపోతే డబ్బులు రావని పథకం అధికారులు సూచనప్రాయంగా చెబుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. చేసిన పనుల డబ్బుల కోసం నెలల తరబడి కాళ్లరిగేలా తిరుగుతుంటే... ప్రభుత్వం మళ్లీ కొత్త పద్ధతి పెట్టి ఇబ్బందుల పాల్జేయాలని చూస్తోందని కూలీలు మండిపడుతున్నారు. యాచారంలో సగంమంది కూలీలకే... మండలంలో 20గ్రామాల్లోని 925 శ్రమశక్తి సంఘాల్లో 18,708 మంది కూలీలు ఉన్నారు. అదే విధంగా వ్యక్తిగతంగా జాబ్‌కార్డులు పొందిన (పనులకు వెళ్లని) వారు మరో 18మంది వేల వరకూ కూలీలు ఉన్నా రు. శ్రమశక్తి సంఘాల్లో 14,849 మంది కూలీలు మాత్రమే తమ జాబ్‌కార్డులను, ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. రెండువేల మంది కూలీల అనుసంధానం రిజెక్ట్ కాగా, మరో రెండువేల మంది కూలీల వరకూ అనుసంధానం చేసుకోలేదు. అలాగే వ్యక్తిగత జాబ్‌కార్డులు పొందిన మరో 16వేల మంది కూలీలు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోలేదు. మండలంలో మొత్తం 36వేల మందికి పైగా ఉన్న కూలీల్లో కేవలం సగంమందికి మాత్రమే జాబ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో కూలీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జాబ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల ఇక తమకు సకాలంలో డబ్బులు అందవన్న భయాందోళన మొదలైంది. నత్తనడకన స్మార్ట్‌కార్డుల నమోదు జాబ్కార్డులుండి ఆధార్ కార్డు అనుసంధానం జరిగినా తప్పనిసరిగా స్మార్ట్‌కార్డులు ఉంటేనే కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ల (సీఎస్పీ) ద్వారా కూలీలు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే యాక్సిస్ బ్యాంకు కూలీలకు డబ్బులు పంపిణీ చేసే సంస్థను మార్చింది. దీంతో పాత సంస్థ స్మార్ట్‌కార్డులు చెల్లకుండా పోయాయి. తాజాగా వచ్చిన మణిపాల్ సంస్థ కూలీలకు కొత్త స్మార్ట్‌కార్డులు అందజేసేందుకు ఉపక్రమించింది. అయితే ప్రక్రియ నత్తనడకన నడుస్తుండటంతో మండలంలోని 20 గ్రామాల్లో పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్న 18,708 మంది కూలీల్లో నేటికీ సగంమందికి కూడా స్మార్ట్‌కార్డుల నమోదు పూర్తి కాలేదు. -
రూ.కోట్ల భూములు హాంఫట్
యాచారం, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండడంతో మండలంలోని పలు గ్రామాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే అదనుగా గ్రామ కంఠం, గైరాన్ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా భూములకు సర్వే చేయకపోవడం, హద్దులు గుర్తించకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. అధికారులతో రాజకీయ నాయకులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విలువచేసే భూములను అందినకాడికి అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అడిగే అధికారులే లేకుండాపోయారు. మండలంలోని చాలా గ్రామాల్లో గ్రామ కంఠం, గైరాన్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వీటికి సర్వేలు చేసి హద్దులు గుర్తించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు అధికారులతో మొర పెట్టుకున్నా స్పందించని దుస్థితి నెలకొంది. దీంతో కబ్జాదారులు వాటిని తోచిన కాడికి అమ్ముకుంటున్నారు. భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుజువులివిగో.. నెలరోజుల క్రితం తాడిపర్తిలో రూ.లక్షల విలువచేసే భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ నారాయణరెడ్డి సమక్షంలో ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ గ్రామస్తుల్ని సమావేశపర్చారు. పంచాయతీకి రూ.60 వేల ఆదాయం వచ్చేలా చేశారు. మల్కీజ్‌గూడలో సర్వే నంబరు 167లో కబ్జాకు గురైన గైరాన్ భూమిని గ్రామ సర్పంచ్ మల్లేష్ పరిరక్షించారు. ప్రస్తుతం ఈ భూమిలో కృష్ణాజలాల సంపును నిర్మిస్తున్నారు. పైన పేర్కొన్న రెండు గ్రామాల్లోనే కాకుండా మిగతా 18 గ్రామాల్లోనూ రూ.కోట్ల విలువైన గ్రామకంఠం, గైరాన్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి విలువైన భూములను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అన్యాక్రాంత మైన భూముల వివరాలివీ.. మాల్ గ్రామంలోని సర్వే నంబరు 640లో దాదాపు రూ. 15 కోట్లు విలువ చేసే 20 ఎకరాల భూములున్నాయి. చుట్టూ హద్దులు లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి దారిలో అర ఎకరం గ్రామకంఠం భూమి ఉంది. కానీ సర్వే చేసి హద్దులు గుర్తించలేదు. కుర్మిద్దలో ఎకరానికిపైగా గ్రామకంఠం భూమి ఉంది. సర్వే చేసి గుర్తించకపోవడంతో గ్రామస్తు ల మధ్య తరచూ ఘర్ణణలు జరుగుతున్నాయి. కేసులు నమోదైనా అధికారుల్లో చలనం లేదు. భూముల పరిరక్షణకు కృషి చేయడం లేదు. చింతుల్లలో ఎకరానికిపైగా గ్రామకంఠం భూమితో పాటు సర్వే నంబర్ 1, 2లలో రెండు ఎకరాల గైరాన్ భూములున్నాయి. గ్రామ పడమటి దిక్కున పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని పంపిణీ చేయకపోవడంతో అన్యాక్రాంతమవుతోంది. మల్కీజ్‌గూడలో సర్వే నంబర్ 167లో సర్వే చేస్తే మరింత గైరాన్ భూమి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు సర్వే చేయకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. నల్లవెల్లిలో రెండెకరాలకుపైగా గ్రామకంఠం భూమి ఉంది. వీటికి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకుండాపోయింది. నందివనపర్తి, చింతపట్ల, గునుగల్, గడ్డమల్లయ్యగూడ తదితర గ్రామాల్లోనూ విలువైన గ్రామ కంఠం, గైరాన్ భూములున్నాయి. వాటిని గుర్తించి, హద్దులు ఏర్పాటు చేసి రక్షించే చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. -
‘ప్రత్యేకం’ తెలంగాణ ప్రజల విజయం
యాచారం, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోందని, ఇది తెలంగాణ ప్రజల సమష్టి విజయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, యువత బలిదానాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజనకు నిర్ణయం తీసుకుందని, పార్లమెంటులో బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ అప్పట్లోనే రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపించడంలో వైఎస్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయపక్షాలు కృషి చేయాల్సి ఉందని, ఈ విషయంలో వైఎస్సార్ సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని, పార్టీ ఆశయాలు... ప్రణాళికలను వివరించి ప్రజల మద్దతు కూడగడతామన్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌కు సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. మూడేళ్ల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసి బోరుబావుల్లో నీళ్లున్నా విద్యుత్ కోతలతో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో గంట కోత విధించడం, నాణ్యత లేని కరెంటుతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నాణ్యమైన ఏడు గంటల విద్యుత్ ఇవ్వకుంటే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఈసీ శేఖర్‌గౌడ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, నందివనపర్తి సర్పంచ్ రాజునాయక్ చెల్లెలు విజయ, సూర్యల వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ మోతీరాంనాయక్, నాయకులు రెడ్డి వెంకట్‌రెడ్డి, దార నర్సింహ, నస్దిక్‌సింగారం ఉప సర్పంచ్ చింతపల్లి వరప్రసాద్‌రెడ్డి, మారోజ్ శ్రీనువాస్, ప్రశాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి, బుచ్చానాయక్ తదితరులు ఉన్నారు. -
పస్తులుంటున్నాం.. పైసలివ్వండి
యాచారం,న్యూస్‌లైన్: కష్టపడి పనులు చేసి పస్తులుంటున్నాం.. వెంటనే బకాయిలు చెల్లించాలని ‘ఉపాధి’ కూలీలు ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. సోమవారం తక్కళ్లపల్లి, పిల్లిపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు బకాయిల చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని ఎంపీపీ చాంబర్లో మండల ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడుతూ.. మండలంలో పలు గ్రామాల్లో కూలీలకు అందాల్సిన బకాయిలు రూ. 30 లక్షలకు పైగానే ఉన్నాయన్నారు. పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేదని మండిపడ్డారు. ఓ బ్యాంక్ పేదల డబ్బులను స్వాహా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్, ఈజీఏస్ నాగభూషణాన్ని పిలిపించుకొని బకాయిల వివరాల గురించి తెలుసుకున్నారు. వెంటనే బకాయిలు కూలీలకు అందేలా కృషి చేయాలని సూచించారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రత్యేకాధికారి హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కూలీలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
విద్యుత్ కోత.. ఉపాధికి వాత
యాచారం, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలు చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా వచ్చే ఆదాయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అరకొరా విద్యుత్ సరఫరా నిండా ముంచుతోంది. వ్యాపారం జరిగే సమయంలోనే కోతలు విధిస్తుండడంతో ఆదాయం లేక అప్పులు చేసి కిరాయిలు చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మాల్ కేంద్రంలో గంటల కొద్దీ కోతలు విధిస్తున్నారు. దీంతో పని లేక చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోందంటున్నారు. వారం, పది రోజులుగా సమస్య తీవ్రంగా మారింది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు కోతలు విధిస్తుండడంతో వివిధ గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం వచ్చేవారు వెనుదిరిగి పోతున్నారు. నిత్యం రూ.వేలల్లో సంపాదించే వారు, కోతలతో వందల్లో కూడా ఆదాయం పొందలేకపోతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక కొంతమంది దుకాణాలను మూసి వెళ్తున్నారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మీసేవా కేంద్రాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. -
మొలకెత్తిన నిర్లక్ష్యం!
యాచారం, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించినా సక్రమంగా రైతులకు బిల్లులు ఇవ్వరు. పోనీ కొనుగోలు చేసిన మక్కలనైనా తరలిస్తారంటే.. అదీ లేదు. మొత్తంగా కొనుగోళ్ల వ్యవహారాన్ని అధికారులు గాలికొదిలినట్టు కన్పిస్తోంది. యాచారం మండలంలో మహిళా సమాఖ్య, ఐకేపీ సంయుక్తంగా చింతపట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి మండలంలోని రైతులే కాకుం డా మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాల నుంచి 200మంది రైతులకుపైగా సోమవారం వరకు 8,111 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయాలు జరిపారు. విక్రయాలు జరిపిన రైతులకు క్వింటాల్‌కు రూ.1,310 చొప్పు న రూ.కోటి పది లక్షల వరకు డబ్బులు అందాల్సి ఉంటుంది. కానీ రైతులకు సగం బిల్లులు కూడా అందలేదు. కొనుగోలు కేంద్రంలో ప్రారంభంలో విక్రయాలు జరిపిన వారం రోజుల్లోనే రైతులకు బిల్లులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించినా సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నిత్యం చెప్పులరిగేలా తిరగక తప్పడం లేదు. ఇదిలాఉంటే మక్కల బస్తాలు ఏ రక్షణ లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దే మూలుగుతున్నాయి. సుమారు 200 క్వింటాళ్ల మక్కల బస్తాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ మొలకలొస్తున్నాయి. కొనుగోళ్లు జరిగిన తర్వాత మక్కల బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ ఉత్పత్తులు ఏ మాత్రం ఉపయోగానికి రాని దుస్థితి ఏర్పడింది. పంటలు వేసుకోవటానికి సిద్ధం వర్షాలు సంవృద్ధిగా కురిసి భూగర్భజలాలు పెరగడం వల్ల వరితోపాటు వివిధ రకాల పంటలు వేసుకోవటానికి రైతులు సిద్ధమవుతున్నారు. చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విక్రయాలు జరిపిన రైతుల్లో అత్యధికంగా వరి సాగు చేసేవారే ఉన్నారు. ఒక్కో రైతుకు రూ.వేలాది బిల్లులు అందాల్సి ఉంది. విక్రయించిన మొక్కజొన్న డబ్బులు సకాలంలో అందకపోవడం, నాటేసే సమయం దగ్గరపడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల చివరి వరకే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు ఈ నెల చివరి వరకే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక ఐకేపీ, సమాఖ్య సభ్యులకు ఆదేశాలందాయి. గత కొద్ది రోజుల కింద ఇబ్రహీంపట్నంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం బంద్ కావడంతో ఇబ్రహీంపట్నం పరిసరాల గ్రామాల నుంచి రైతులు చింతపట్లలోని కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నలు విక్రయాలకు తరలి స్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఐకేపీ, సమాఖ్య సిబ్బంది ఈనెల 20లోపు రైతులకు ఇచ్చిన బస్తాల వరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 20 తర్వాత వచ్చిన రైతులకు బస్తాలు ఇవ్వడం నిలిపేశారు. కొద్ది రోజులుగా చింతపట్ల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను అధికారులు సకాలంలో తరలించకపోవడం, భద్రపర్చుకునే స్థలం లేక గోదాం బయటనే నిల్వ ఉంచారు. చలి, కురిసే వర్షాలకు వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న మొలకెత్తడంతోపాటు, బూజు పట్టింది. కొనుగోలు చేసిన వెంటనే తరలిస్తామని అధికారులు హామీలు ఇవ్వడమే కానీ ఆచరణలో శ్రద్ధ పెట్టడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. నెల కింద విక్రయించా... చింతపట్ల కొనుగోలు కేంద్రం లో 38 క్వింటాళ్ల మొక్కజొన్నలు నెల కింద విక్రయించా. విక్రయించిన మొక్కజొన్నకు రూ.49వేలకు పైగా నేటికీ బిల్లులు అందలేదు. చెప్పులరిగేలా తిరగగా సోమవారం చెక్ ఇచ్చారు. అది కూడా 27న తేదీ వేసి ఇచ్చారు. సాగు పనులు దగ్గరపడుతుంటే భయం నెలకొంది. - ముత్యాల సాయిరెడ్డి, నానక్‌నగర్ కొనుగోలు కేంద్రాని కొనసాగించాలి చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మరో పక్షం రోజలకు పైగా నిర్వహించాలి. నేటికీ రైతులు పలు గ్రామాల నుంచి వందలాది క్వింటాళ్ల మొక్కజొన్నలు తీసుకోస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి. లేదంటే రైతులు నష్టపోతారు. - లిక్కి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ, చింతపట్ల ప్రోత్సాహం లేదు కొనుగోలు కేంద్రం నిర్వాహణ సక్రమంగా చేయాలని చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారుల నుంచి ప్రోత్సాహం లేదు. వెనువెంటనే మొక్కజొన్నలు తరలించకపోవడం వల్ల వందలాది క్వింటాళ్ల నిల్వలు అలానే ఉంటున్నాయి. నేటికీ రైతులకు రూ.లక్షలాది బిల్లులు ఇవ్వాలి. రైతులు నిత్యం తిరుగుతున్నారు. - స్రవంతి, ఎస్ఆర్పీ మార్కెటింగ్ ఐకేపీ -
‘ఉత్త’ ప్రణాళిక!
యాచారం, న్యూస్‌లైన్ : దళితులు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను రూపొందించి చట్టబద్ధత కల్పించామని.. రూ.కోట్ల రూపాయలు వారి సంక్షేమానికి కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అరకొర నిధులు విడుదల చేస్తూ ఉప ప్రణాళికను ‘ఉత్త’ ప్రణాళికగా మార్చేస్తోంది. కాలనీల్లో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టనున్నట్టు ప్రజా ప్రతినిధులు, అధికారులు నమ్మబలకడంతో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలు అరకొర నిధులు మంజూరు కావడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఉదాహరణకు యాచారం మండలంలోని 20గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం దళితులు, గిరిజనులు రెండువేలకు పైగా అర్జీలు పెట్టుకున్నారు. అధికంగా ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, వీధి లైట్లు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సరఫరా మెరుగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల పరిధి 20 గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నేటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇక నందివనపర్తి అనుబంధ తండాలైన బొల్లిగుట్ట, ఎనెకింది, నీలిపోచమ్మ తండా, మంతన్‌గౌరెల్లి పరిధిలోని భానుతండా, కేస్లీతండా, మంతన్‌గౌడ్, కొత్తపల్లి తండా, తక్కళ్లపల్లి అనుబంధ ఎర్రగొల్ల తండా, వేపపురితండా ఇలా మండలంలోని 19 తండాల్లో మౌలిక వసతులు అటుంచి కనీస రోడ్డు కూడా లేకపోవడంతో గిరిజనులు నిత్యావసరాల కోసం కాలినడకన కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతిపాదనలు రూ.30కోట్లకు.. మంజూరైంది రూ.7.30లక్షలే! ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద చేపట్టాల్సిన పనుల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి అభివృద్ధి పనుల విలువ లెక్కకట్టారు. 20 గ్రామాలు, 19 తండాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపా రు. అయితే ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవ స్థ నిర్మాణాలు, తాగునీటి సమస్య పరిష్కారాలకు నిధుల మంజూరును పక్కన పెట్టిన ఉన్నతాధికారులు కేవలం ఒక్క కమ్యూనిటీ భవన నిర్మాణానికి మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం 12 గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు ప్రతిపాదించగా, ఒక్క మంతన్‌గౌరెల్లిలో మాత్రమే నిర్మించడానికి రూ.7.30లక్షలు మంజూరయ్యాయి. ఇటీవల మంతన్‌గౌరెల్లిలో పర్యటించిన ఎంపీడీఓ.. ఎస్సీ కాలనీ లో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరైన విషయం గ్రామస్తులకు తెలియజేశారు. కాగా, మంతన్‌గౌరెల్లి గ్రామంలోనే కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరైన విషయం తెలుసుకున్న మిగతా గ్రామాల ఎస్సీ కాలనీవాసులు తమ దరఖాస్తులను అధికారులు పక్కనపెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తున్నది.