యాచారం: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ వారిని ఢీకొంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి కారణమైన బైకిస్టు అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.