ఒంటరిగా తిరగొద్దు.. చిరుత సంచరిస్తోంది | Cheetah Roaming Near Yacharam Forest Area | Sakshi
Sakshi News home page

ఒంటరిగా తిరగొద్దు.. చిరుత సంచరిస్తోంది

Published Sat, Mar 16 2019 11:06 AM | Last Updated on Sat, Mar 16 2019 11:06 AM

Cheetah Roaming Near Yacharam Forest Area - Sakshi

రైతుకు పరిహారం అందజేస్తున్న ఫారెస్టు అధికారి సత్యనారాయణ

సాక్షి, యాచారం: అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం డివిజన్‌ అటవీ శాఖ రేంజ్‌ అధికారి సత్యనారాయణ ప్రజలకు సూచించారు. కొత్తపల్లి గ్రామంలో పక్షం రోజుల క్రితం చిరుత దాడిలో మృతిచెందిన ఆవుదూడకు సంబంధించి రూ. 6 వేల పరిహారాన్ని రైతు ఈగ శ్రీనువాస్‌రెడ్డికి అధికారి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్‌ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పగలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతంలో పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో చిరుతను పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్‌ జగన్, గ్రామస్తులు గుండాలు తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement