హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాచారం మండలం మాల్లో ఓ ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ కేసులో ఉన్న మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.