యాచారం: బ్యాంకర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూలు చేసి నేడు రుణమాఫీ వర్తించకుండా చేయడం న్యాయం కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షితో ఆయన మాట్లాడారు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాల వల్ల నేడు పేద రైతులు ఆందోళన చెందే పరిస్థితులు వచ్చాయని అన్నారు. 2010 లో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు మొత్తంగా పంటలను నష్టపోయారని తెలిపారు.
అప్పట్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కొన్ని బ్యాంకుల మేనేజర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూల్ చేయడం, టర్మ్‌లోన్ కింద మార్చడం వల్ల , ప్రభుత్వ నిబంధనల వల్ల నేడు ఆ రైతులు రుణమాఫీకి అనర్హులుగా మిగులుతున్నారన్నారు. షరతుల్లేకుండా రైతులంతా రుణమాఫీ పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రీ షెడ్యూల్ వల్ల జిల్లాలో పలు చోట్ల వందలాది మంది పేద రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
స్వయంగా జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ పర్యవేక్షణ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా యాచారం, మంచాల మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు సరైన నింబంధనలు పాటించలేదని అన్నారు. పంటలను పరిశీలించకుండానే రుణాలిచ్చేశారన్నారు. అధికారులు ప్రత్యేక చోరవ తీసుకొని అర్హులెన రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం షరతుల్లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ చేయాలని కోరారు.
షరతుల్లేకుండా రుణమాఫీ
Published Wed, Sep 3 2014 11:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement