re-scheduled
-
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
షరతుల్లేకుండా రుణమాఫీ
యాచారం: బ్యాంకర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూలు చేసి నేడు రుణమాఫీ వర్తించకుండా చేయడం న్యాయం కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షితో ఆయన మాట్లాడారు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాల వల్ల నేడు పేద రైతులు ఆందోళన చెందే పరిస్థితులు వచ్చాయని అన్నారు. 2010 లో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు మొత్తంగా పంటలను నష్టపోయారని తెలిపారు. అప్పట్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కొన్ని బ్యాంకుల మేనేజర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూల్ చేయడం, టర్మ్‌లోన్ కింద మార్చడం వల్ల , ప్రభుత్వ నిబంధనల వల్ల నేడు ఆ రైతులు రుణమాఫీకి అనర్హులుగా మిగులుతున్నారన్నారు. షరతుల్లేకుండా రైతులంతా రుణమాఫీ పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రీ షెడ్యూల్ వల్ల జిల్లాలో పలు చోట్ల వందలాది మంది పేద రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ పర్యవేక్షణ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా యాచారం, మంచాల మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు సరైన నింబంధనలు పాటించలేదని అన్నారు. పంటలను పరిశీలించకుండానే రుణాలిచ్చేశారన్నారు. అధికారులు ప్రత్యేక చోరవ తీసుకొని అర్హులెన రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం షరతుల్లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ చేయాలని కోరారు. -
ఎన్నాళ్లిలా?
►రుణమాఫీ అమలు చేయకుండా మూడు నెలలుగా నెట్టుకొస్తున్న బాబు ►కోటయ్య కమిటీ, రీషెడ్యూలు, కేబినెట్ నిర్ణయం, జీవో జారీ అంటూ కాలయాపన ►ఆర్బీఐ, నాబార్డు ఆదేశాలే బ్యాంకులకు శిరోధార్యం ►రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు ఇవ్వజాలదంటున్న బ్యాంకర్లు ►యథావిధిగా రైతులకు నోటీసులు.. జప్తులు ►రుణమాఫీ అమలు కాకపోతే జిల్లాలో రైతుల నెత్తిన అదనంగా రూ.858.41 కోట్ల వడ్డీ భారం అనంతపురం : జనం ముందుకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తమ ప్రభుత్వం ఏదో చేసేస్తోందన్న భ్రమను కల్గించే విధంగా చంద్రబాబు, ఆయన అనుంగు మంత్రులు వ్యవహరిస్తూ వస్తున్నారని ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్నికల ముందేమో తన తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనేనని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రోజున నిజంగా ఆ ఫైలుపైనే సంతకం చేస్తారేమోనన్న భావన కలుగజేశారు. చివరకు విధివిధానాల కోసం ‘కోటయ్య కమిటీ’ నియామకం ఫైలుపై సంతకం చేశారు. ఆ కమిటీ నివేదిక పేరుతో కొద్ది రోజులు గడిపి.. జూన్ 30న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీ గురించి కాకుండా రీషెడ్యూల్‌పై మాట్లాడారు. జూలై 16, 17 తేదీల్లో చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనకు రెండు, మూడు రోజుల ముందు నుంచి రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అంగీకరించిందన్న ప్రచారం ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. రీషెడ్యూల్ అయిపోయినట్లేనని, ప్రస్తుతానికైతే రైతులకు సమస్య తీరుతుందని, రీషెడ్యూలు చేసిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుందని... ఇలా చెప్పుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించారు. తర్వాత జూలై 24, 25 తేదీల్లో అనంతపురం జిల్లా పర్యటనకొచ్చారు. అంతకు మూడు రోజుల ముందు రూ.1.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు, రూ.లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీకి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దీనివల్ల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల్లో దాదాపు 96 శాతం మందికి లబ్ధి చేకూరనుందంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాల నేపథ్యంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. తర్వాత ఈ మూడు వారాల్లో రీషెడ్యూలు ప్రతిపాదనను రిజర్వు బ్యాంకు తిప్పికొట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కరువు, వరదల వల్ల పంటనష్టం జరిగితే మూడు నెలల్లోపే రీషెడ్యూలుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, సాధారణ దిగుబడిలో 50 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే రీషెడ్యూలు సాధ్యమవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘మీరు ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చారు కాబట్టి.. మమ్మల్ని రీషెడ్యూలు చేయమంటే కుదరద’ని తేల్చి చెప్పింది. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేసేందుకు చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రభుత్వం రుణమాఫీపై ఒక జీవోను విడుదల చేసింది. మూడు వారాల క్రితం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఈ జీవో విడుదలైంది. మళ్లీ ప్రభుత్వమూ, దాని వందిమాగధులు ‘అంతా అయిపోయింది. జీవో వచ్చేసింది. రూ.1.5 లక్షలోపు రుణాలన్నీ ఇక మాఫీ అయిపోయినట్లే’ అని ఊదరగొట్టాయి. ఈ ప్రచార పటాటోపం మధ్య బాబు జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తామేదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రుణమాఫీ కాకపోతే రైతు నెత్తిన రూ.858 కోట్ల వడ్డీ భారం జిల్లాలో 6.08 లక్షల మంది రైతులు రూ.3,093 కోట్ల పంట రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. 2.12 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన బంగారు తాకట్టు రుణాల మొత్తం రూ.1,851 కోట్లు ఉంది. దాదాపుగా ఈ మొత్తమంతా రూ.1.5 లక్షల రుణ పరిమితికి లోపలే ఉంది. 69,709 స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.1,264 కోట్లు, 5,537 చేనేత సహకార సంఘాల రుణాలు రూ.35.05 కోట్లు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలన్నీ కలిపి మొత్తం రూ.6,243 కోట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఈ రుణాలన్నింటికీ బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. నిర్ణీత కాల పరిమితిలోపు రుణం తీరిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం కింద 4 శాతం వడ్డీ మాఫీతో పాటు మిగిలిన 3 శాతం(పావలా) వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు రుణాలను ఇప్పటికీ తిరిగి చెల్లించలేదు. ఈ కారణంగా ప్రస్తుతం 11.75 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ కూడా దాటితే (సెప్టెంబర్ తర్వాత) మరో 2 శాతం వడ్డీ పెరుగుతుంది. అప్పుడు రైతులు 13.75 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన రుణమాఫీ జరగకపోతే రైతులు అదనంగా వడ్డీ కింద రూ.858.41 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల ముందు జీవో చెల్లని కాగితమే ప్రభుత్వం గురువారం రుణమాఫీపై జీవో విడుదల చేసిన నేపథ్యంలో ‘సాక్షి’ బ్యాంకర్లను కలిసి వివరణ కోరింది. బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించ జాలవని వారు స్పష్టం చేశారు. సహకార రంగంలోని బ్యాంకులకైతే నాబార్డ్, మిగతా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేస్తాయని, వాటి ప్రకారమే బ్యాంకులు నడుచుకుంటాయని వారు స్పష్టం చేశారు. ‘రైతులు బ్యాంకుల వద్ద రుణం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని రైతులైనా చెల్లించాలి లేదా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమైనా కట్టాలి. డబ్బు చెల్లించకుండా వట్టిమాటలు ఎన్ని చెప్పినా రుణాలు మాఫీకావు. ఆర్బీఐ సూచనల మేరకు రుణాల వసూళ్లకు సంబంధించి నోటీసుల జారీ, బంగారు, భూముల వేలం లాంటి చర్యలు ఉంటాయ’ని వారు స్పష్టం చేస్తున్నారు. -
రుణమాఫీపై డ్రామాలు ఎందుకు?
సాలూరు:ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న టీడీపీ నాయకులు ఇప్పుడు మాఫీ విషయంలో డ్రామాలు ఆడడం సరికాదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఏడీఏ కార్యాలయం వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై పాలకులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారన్నారు. రీషెడ్యూల్ చేసినా కొత్తగా రైతులకు రుణాలు మంజూరు కావన్నారు. ప్రభుత్వం తీరు వల్ల రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నార న్నారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా పంట రుణాలను మాఫీ చేసి కొత్త రుణా లు అందేలా చేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వరుణుడు రావొద్దన్న ఫైల్‌పై సంతకం చేయడంతోనే వర్షా లు పడడం లేదని ఎద్దేవా చేసారు. ఏడీఏ వెంకటయ్య మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖాధికారులు పొలాల్లో పర్యటించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. అనంతరం మండలంలోని శివరాంపురం, చంద్రపువలస గ్రామా ల పరిధిలోని పొలాల్లో పర్యటించారు.ఈ కార్యక్రమంలో పాచిపెంట మం డల వైస్ ఎంపీపీ టి.గౌరీశ్వరరావు, ఏఓ అనురాధ, ఏఈఓలు పాల్గొన్నారు. -
రీ షెడ్యూల్‌తో ఒరిగేది నిల్
విజయనగరం అర్బన్ : రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్బీఐ చేసిన ప్రకటన వల్ల జిల్లా రైతులకు పెద్దగా ఒరిగే ప్రయోజనం కనిపిం చడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ సీజన్లలో 2.6 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగా వీరిలో కేవలం 60 వేల మందికి మాత్రమే రీషెడ్యూల్ వర్తించనుంది. దీంతో మిగతా రెండు లక్షల మంది రైతుల పరిస్థితి అగమ్య గోచరమే. రుణమాఫీ హామీ వల్ల రైతులకు ప్రయోజనం కలగకపోగా వారి కొంపముంచింది. ఇటు రుణాల రీషెడ్యూల్ లేక, కొత్త రుణాలు అందక, చేతిలో పెట్టుబడి లేక పోవడంతో ఎలా సాగు చే యాలో తెలియక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణ జిల్లాల తో పాటు విజయనగరం జిల్లాలో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. జిల్లాలో 34 మండలాల్లో రైతులకు వర్తింపచేస్తూ ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే బ్యాంక్ విధిం చిన నిబంధనల కారణంగా చాలా మంది రైతులు రీ షెడ్యూల్‌కు దూరమవుతున్నారు. జిల్లాలో 4.30 లక్షల మంది రైతులుండగా వీరిలో బ్యాంకుల ద్వారా 2.60 లక్షల మంది రుణాలు పొందారు. ఏప్రిల్-అక్టోబర్ మ ధ్యలో తీసుకున్న రుణాలకు మాత్రమే రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకు ప్రకటించింది. అంటే ఖరీఫ్ సీజన్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఖరీఫ్ సీజన్లో సుమారు లక్షా10 వేల మంది రైతులు బ్యాం కుల ద్వారా రూ.482.72 కోట్లు రుణంగా పొందారు. వీటిలో రూ.250 కోట్ల వరకు రీ షెడ్యూల్ అర్హతలేని బంగారు తనఖా రుణా లు ఉన్నాయి. ఈ రుణాలు తీసుకున్న రైతు లు సుమారు 50 వేల మంది ఉన్నారు. దీం తో అన్నీ సక్రమంగా జరిగితే కేవలం 60వేల మంది రైతుల కు మాత్రమే ‘రీ షెడ్యూల్’ ద్వారా కొత్త రుణాలకు అర్హత లభించే అవకాశం ఉందని నివేదికలు చెపుతున్నాయి. -
రుణాల రీషెడ్యూల్‌పై అధికారుల కసరత్తు
ఆర్బీఐ గవర్నర్‌తో చర్చల కోసం 4న ముంబైకి పయనం! హైదరాబాద్: తెలంగాణ రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) అడిగిన సమాచారంతో పాటు, మరింత స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సోమవారం ముంబై వెళ్లనున్నారు. వీరు రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను కలిసి, రీ షెడ్యూల్‌పై రిజర్వ్‌బ్యాంకు నుంచి స్పష్టత తీసుకోనున్నారు. తెలంగాణలో 2013 ఖరీఫ్ రుణాలకు మాత్రమే రీ షెడ్యూల్ వర్తింప చేస్తామని రిజర్వ్‌బ్యాంకు ఇదివరకు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇదికూడా 337 మండలాల్లోని రైతులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. బంగారం తాకట్టు రుణా లు, పాత బకాయిలకు సంబంధించి రీ షెడ్యూల్ చేయబోమని.. అది ప్రభుత్వమే చూసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 78 మండలాలను రీ షెడ్యూల్ పరిధిలో చేర్చబోమని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, 337 మండలాల్లో రీ షెడ్యూల్ చేసేచోట పంటల దిగుబడి ఎలా ఉందన్న సమాచారం కూడా ఇవ్వాలని ఆర్బీఐ ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా రుణాలు రీ షెడ్యూల్ చేసే మండలాల్లో రైతుల రుణాలు నాలుగైదు వేల కోట్లకు మించవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్బీఐ రీ షెడ్యూల్ చేసినా.. చేయకపోయినా ప్రభుత్వం మాత్రం రుణ మాఫీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వాస్తవ ఆదాయం ఆధారంగా నిధులు ఇవ్వాలి 14వ ఆర్థిక సంఘం నిధులను వాస్తవ ఆదాయ ఆధారంగా కేటాయించాలని ఆర్థిక శాఖ కోరింది. వ్యాట్ రూపంలో హైదరాబాద్‌కు అధిక ఆదాయం వస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలతో ఏకీభవించరాదని అధికారులు ఆర్థిక సంఘాన్ని కోరారు. తమకు వస్తున్న ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీరెడ్డిని కలిసి వివరించారు. -
పంటల బీమాకు స్పందన కరువు!
{పధాన పంటలకు రేపటితో ముగియనున్న గడువు ఇప్పటివరకు ప్రీమియం చెల్లించని రైతులు హైదరాబాద్: మరో రెండురోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ రైతుల నుంచి పంటల బీమా పథకాలకు కనీస స్పందన కరువైంది. జాతీయ పంటల బీమా పథకం(ఎన్సీఐపీ), సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్) కింద ప్రధాన పంటల బీమాకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. వరి, పత్తి, టమాటా, ఎర్ర మిర్చి, కంది పంటలకు 31తో, బత్తాయి, ఆయిల్‌పామ్ పంటలకు ఆగస్టు 10తో, వేరుశనగకు ఆగస్టు 15తో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. ఎన్సీఐపీ, ఎంఎన్ఏఐఎస్ల కింద జిల్లాల వారీగా వరి, కంది సహా వివిధ పంటలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి, గుంటూరులో మిర్చి, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ, చిత్తూరులో టమాటా, పశ్చిమ గోదావరిలో ఆయిల్‌పామ్, వైఎస్సార్ జిల్లాలో బత్తాయి పంటలను గుర్తించినట్టు పేర్కొంది. గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా సౌకర్యం కల్పించింది. వర్షాలు కురవక పంట నష్టపోయిన రైతులకు బీమా మొత్తాన్ని చెల్లించాలన్నది ఈ పథకాల ఉద్దేశం. అరుుతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. పంట, సాగు విస్తీర్ణం, ఎంత మొత్తానికి బీమా అనే అంశాలపై ఈ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు మాఫీ కాలేదు. రీ షెడ్యూల్ సైతం జరగలేదు. రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో రైతులు ఎప్పటినుంచో పాత బకారుులు చెల్లించడం మానుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడా పంటల బీమాకు స్పందన లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా గడువును పొడిగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
రీషెడ్యూలుపై ఆర్బీఐ సందేహాలు
రుణాలు మాఫీ చేయకుండా రీ షెడ్యూల్ కోరుతోందని సర్కారుపై అనుమానం రీషెడ్యూల్కు నిబంధనలు అనుమతించవంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంట దిగుబడి 50 శాతానికి తగ్గితేనే రీషెడ్యూలుకు నిబంధనలు అనుమతిస్తాయని వెల్లడి ముంబై: గత ఖరీఫ్‌లో తుపాను, కరువు ప్రభావిత మండలాల్లోని రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయడంపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అనేక ధర్మసందేహాలు వ్యక్తంచేసింది. ఆర్బీఐ నిబంధనల మేరకు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి వీలైన పరిస్థితులే రాష్ట్రంలో లేవని పేర్కొంది. రీషెడ్యూల్ చేయాలని కోరినప్పుడు తాము అడిగిన వివరాలను ఎందుకు ఇవ్వడంలేదని రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా చురక అంటించింది. రుణ మాఫీ ముసుగులో రైతుల రుణాలను రీషెడ్యూలు చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానాన్ని ఆర్బీఐ వ్యక్తం చేసింది. అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయకుండా గత ఖరీఫ్‌లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించడం ద్వారా కొంత ఉపశమనం పొందాలని చూస్తోందని ఆర్బీఐ అధికారులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. పంట దిగుబడి, మండలాలవారీగా ఖాతాదారుల వివరాలు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే రుణాలను రీషెడ్యూల్ చేయాలంటే ఆర్బీఐకి కొన్ని పరిమితులున్నాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుదీర్ఘమైన లేఖ రాసింది. రీషెడ్యూల్ చేయడంలో ఆర్బీఐ ముందున్న నిబంధనలు, పరిమితుల గురించి వివరించింది. ఈ లేఖలో కోరిన సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. దీంతో హైదరాబాద్‌లోని ప్రాంతీయ ఆర్బీఐ శాఖ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అర్థ గణాంక శాఖ నుంచి ఆర్బీఐ ప్రధాన కార్యాలయం స్వయంగా సమగ్రమైన సమాచారాన్ని సేకరించింది. తుపాను, కరువు ప్రభావిత జిల్లాల్లో గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి వివరాలను తెప్పించుకుంది. ఆ సమాచారం ఆధారంగా రుణాలను రీషెడ్యూల్ చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయా లేదా అన్న అంశంపై అధికారులు అధ్యయనం చేశారు. రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ నిబంధనలు అనుమతించవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం మరో లేఖ రాసింది. నిబంధనల మేరకు గత ఖరీఫ్‌లో పంట రుణాల రీ షెడ్యూల్‌కు అర్హత లేదంటూ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ దీపాలీ పంత్ జోషి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ఆ లేఖలో పేర్కొన్నారు. కరువు, ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి 50 శాతానికన్నా తక్కువగా ఉంటేనే రుణాల రీ షెడ్యూల్‌కు అర్హత ఉంటుందని తెలిపారు. అయితే గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావిత జిల్లాల్లో పంటల దిగుబడి బాగుందని వెల్లడైనట్టు తెలిపారు. 2013 ఖరీఫ్‌లో పంటల దిగుబడి వివరాలను ఏపీ అర్థగణాంక శాఖ నుంచి సేకరించినట్టు తెలిపారు. 2013 ఖరీఫ్‌లో దిగుబడిని అంతకు ముందు నాలుగేళ్ల సరాసరితో పోల్చి చూస్తే సాధారణ దిగుబడికన్నా తక్కువగా ఏమీ లేదని చెప్పారు. ఆయూ కాలాల్లో పంటల గణాంకాలను అందులో వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన బ్యాంకుల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సేకరించిన సమాచారం మేరకు కిసాన్ క్రెడిట్ కార్డుల రెన్యువల్స్ కూడా గత సంవత్సరం తరహాలోనే ఉన్నాయని ఆ లేఖలో వెల్లడించారు. రుణాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ తరువాత కిసాన్ క్రెడిట్ కార్డుల రెన్యువల్స్‌లో కొంత తగ్గుదల ఉందని తెలిపారు. అయినప్పటికీ గ్రామీణ, సెమీ పట్టణ బ్యాంకు బ్రాంచిల్లో సేవింగ్స్అకౌంట్లలో నిల్వలు పెరిగాయని వివరించారు. దీన్నిబట్టి చూస్తే రైతులు రుణ మాఫీ అవుతుందనే విశ్వాసంతో రుణాలు తీర్చడానికి బదులు సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్ చేశారన్న అనుమానాలను వ్యక్తంచేశారు. రుణాలు చెల్లించకపోవడానికి రైతులు ఆపదలో ఉండటం కారణం కాదని, ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీయే కారణమని పేర్కొన్నారు. ఆ సేవింగ్స్ ఖాతాల నుంచి రైతులు ఈ ఖరీఫ్‌లో వ్యవసాయం కోసం నిధులను డ్రా చేయడంతో జూన్ నుంచి వాటిలో నిల్వలు తగ్గుతున్నాయని కూడా ఆ లేఖలో స్పష్టంగా వివరించారు. ఈ నేపథ్యంలో రైతులు ఆపదలో ఉన్నారనే అభిప్రాయానికి రాలేమని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రీ షెడ్యూల్ చేసిన రుణాలను ఏ విధంగా తీరుస్తారో పక్కా ప్రణాళికతో పాటు వనరుల సమీకరణెలా చేస్తారో తెలపాలని కోరామని కూ డా లేఖలో గుర్తు చేశారు. ఆ వివరాలను పంపిస్తే తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఏపీ ప్రభుత్వానికి స్పష్టంచేశారు.ఏపీ అర్థ గణాంక శాఖ సమాచారం మేరకు 2013 ఖరీఫ్‌లో పంటల దిగుబడిని గత నాలుగేళ్ల సగటు, గరిష్ట దిగుబడితో పోల్చుతూ ఆర్బీఐ లేఖలో పేర్కొన్న వివరాలు.. -
రీ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్టే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీ అంశంపై స్పష్టత ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రుణాలు రీ షెడ్యూ ల్ చేస్తామని చెబుతోంది. అది కూడా ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రీ షెడ్యూల్ చేయాలంటే ముందుగా రైతుల రుణాలకు సంబంధించిన వివరాలను, ఏయే బ్యాంకుల్లో ఏయే కుటుంబాలకు ఎన్నేసి రుణాలు ఉన్నాయనే సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. ఇందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈలోగా రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. ఈ తతంగమంతా గడిచి రీ షెడ్యూల్ అమలయ్యేసరికి ఖరీఫ్ పుణ్యకాలం కూడా గడిచిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని రైతులకు బ్యాంకుల నుంచి నయాపైసా కూడా రుణం అందలేదు. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఇదే సమయానికి వివిధ బ్యాంకుల నుంచి రైతులు రూ.600 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో జిల్లాలో బ్యాంకర్లు ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వలేదు. ప్రభుత్వం కుటుం బానికి రూ.లక్షన్నర రుణం రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, ఎప్పుడు వస్తాయో తెలియదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఆర్బీఐ నుంచి స్పష్టత వచ్చేవరకు రైతులకు ఒక్క పైసా కూడా రుణం ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. రీ షెడ్యూల్ చేస్తే 10.50 శాతం వడ్డీ గడువులోగా చెల్లించి ఉంటే వ్యవసాయ రుణాలపై ఏడు శాతం వడ్డీ పడేది. రుణాల చెల్లింపులో జాప్యం కారణంగా ఇప్పుడు 10.50 శాతం పడుతోంది. ఆర్బీఐతో ప్రభుత్వం చర్చిస్తే వడ్డీ తగ్గే అవకాశం ఉందని, ఇప్పటివరకైతే దీనిపైనా స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పుడు రైతులు రుణం మొత్తాల్ని తిరిగి చెల్లించినా 10.50 శాతం వడ్డీ వసూ లు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. డ్వాక్రా రుణాలపై 13 నుంచి 15 శాతం వడ్డీ ఇదిలావుంటే డ్వాక్రా రుణాలు రీ షెడ్యూల్ చేసే అవకాశమే లేదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. గడువులోగా డ్వాక్రా రుణమొత్తాలను చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీపడదని, ఆ మొత్తాల చెల్లిం పు జాప్యమైన కారణంగా బ్యాంకులను బట్టి 13 నుంచి 15శాతం వడ్డీ పడుతుందని చెబుతున్నారు. ఈ వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందా అనే దానిపైనా స్పష్టత లేదని అంటున్నారు. జిల్లా విషయూనికి వస్తే 61,120 సంఘాలు రూ.925 కోట్ల రుణాలు పొందాయి. అయోమయంలో కౌలు రైతులు రుణమాఫీ విషయంలో కౌలు రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. జిల్లాలో రెండున్నర లక్షలమంది కౌలు రైతులు ఉన్నారు. గతేడాది వీరిలో 54వేల మందికి రూ.138 కోట్ల రుణాలిచ్చారు. వీరికి రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. భూ యజమాని, కౌలు రైతు ఒకే సర్వే నంబర్‌పై రుణం పొంది ఉంటే తొలి ప్రాధాన్యం కౌలు రైతుకే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. దీంతో తమ రుణాలు మాఫీ అవుతాయో లేదోనన్న ఆందోళన కౌలు రైతుల్లో నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వపరంగా కౌలు రైతులకిచ్చిన రుణం తక్కువ. ఈ తక్కువ కూడా మాఫీ చేసేందుకు సిద్ధం కాకపోవడం బాధాకరమని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ లింకుతో ఆందోళన ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకాల నంబర్లను రైతుల ఖాతాలకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు. ఆధార్ నంబర్ ఇచ్చినవారికే రుణమాఫీ వర్తిస్తుందనే విషయూన్ని రైతులకు చెప్పాల్సిందిగా ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆదేశించారు. ప్రస్తుతానికి జిల్లాలో 3 లక్షల మందికి ఆధార్ కార్డులు లేవు. వీరిలో రైతులే ఎక్కువ. ఆధార్ నంబర్‌ను సాకుగా చూపి రుణమాఫీని మరింత జాప్యం చేయడం గానీ లేదా పూర్తిగా ఎత్తేసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆధార్ కార్డులున్న వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రుణమాఫీ అయిన రైతుకు భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో కోత పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రైతులను నట్టేట ముంచేందుకే ఆధార్ లింకు పెడుతున్నారని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. త్వరలోనే స్పష్టత వస్తుంది రుణాల రీ షెడ్యూల్ విషయమై వచ్చే వారంలో స్పష్టత వస్తుంది. త్వరలో రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత రీ షెడ్యూల్ విషయమై స్పష్టత వస్తుంది. - ఎం.లక్ష్మీనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాగు విస్తీర్ణం తగ్గుతుంది రైతులకు వ్యవసాయ రుణాలు అందని కారణంగా జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణ భారీగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలు గడచినా ఎక్కడా వ్యవసాయ పనులు పుంజుకో లేదు. ఇప్పటివరకూ జిల్లాలో కేవలం 32వేల హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. గతేడాదితో పోలిస్తే.. 15 శాతానికి లోపే పంటలు సాగయ్యే పరిస్థితి నెలకొంది. - కె.శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘం నాయకుడు -
రుణం.. వ్రణం
ఖరీఫ్‌లో ఒక్క రైతుకూ రుణం ఇవ్వలేదు - తొలి త్రైమాసికంలో పైసా కూడా విదల్చని బ్యాంకులు - గతేడాది ఇదే సమయానికి రూ.600 కోట్ల రుణాల మంజూరు - రుణమాఫీ జాప్యంతో ఆర్థిక సంక్షోభంలో అన్నదాత సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీ జాప్యంతో జిల్లాలోని అన్నదాతలు మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతున్నారు. అప్పులు తెచ్చి.. పెట్టుబడిగా పెట్టి.. వాతావరణం అనుకూలించక కన్నీళ్ల దిగుబడితో కొన్నేళ్లుగా కష్టాల సాగును నెట్టుకొస్తున్న జిల్లా రైతులు ఈసారి రుణమాఫీ జాప్యం పుణ్యమా అని కనీసం అప్పులు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలైనా బ్యాంకుల నుంచి అన్నదాతకు నయాపైసా కూడా రుణం అందలేదు. గత ఆర్థిక సంవత్సరం (2013-14) ఖరీఫ్ సీజన్ తొలి త్రైమాసికంలో వివిధ బ్యాంకుల నుంచి రైతులు రూ.600 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.4,374 కోట్లు కాగా, రూ.6,084 కోట్లను బ్యాంకులు రైతులకు అందించారు. ఆ ఏడాది లక్ష్యానికి మించి అప్పులు తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని రూ.5,221 కోట్లకు పెంచారు. కానీ రుణమాఫీపై చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలు వేయడం, రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నా రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పష్టత లేకపోవడంతో జిల్లాలో బ్యాంకర్లు ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వలేదు. పాత రుణాలు రికవరీ కాకపోవడంతో పంట రుణాల పంపిణీని పూర్తిగా పక్కన పెట్టేశారు. జాతీయ బ్యాంకులే కాదు సహకార సంఘాలదీ ఇదే దారి. జిల్లాలోని 253 సహకార సంఘాల్లో 2.60 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా ఈ సొసైటీలకు సంబంధించి రూ.1,182.54 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండగా, దీనిపైనా స్పష్టత లేకపోవడంతో సొసైటీలు కూడా రైతులకు రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు రుణాల కోసం వచ్చే రైతులతో ‘అసలు రుణమాఫీ అయ్యేది కాదు. రీ షెడ్యూల్ చేసినా మీకే భారం. వడ్డీ పెరుగుతుంది. చక్రవడ్డీ పడుతుంది. పాత రుణం ఇప్పుడు చెల్లిస్తేనే మంచిది. కొత్త రుణాలు వస్తాయి. లేదంటే కొత్త అప్పులూ పుట్టవు’ అని బ్యాంకర్లు తేల్చిచెప్పేస్తున్నారు. తగ్గనున్న సాగు రుణాలు లభించని కారణంగా జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. వరుణుడు ఇన్నాళ్లూ దోబూచులాడినా అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు దుక్కులు, దమ్ములు చేసుకునే వాతావరణం రావడంతో ఇప్పటికే నాట్లు ఊపందుకోవాలి. కానీ.. ఎక్కడా వ్యవసాయ పనులు పుంజుకోవడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3,24,749 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 2,38,506 హెక్టార్లలో వరి సాగు లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలి త్రైమాసికంలో ఇప్పటివరకూ జిల్లాలో కేవలం 32 వేల హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు వేశారు. మరో 9,300 హెక్టార్లలో నారుమళ్లు సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ఖరీఫ్ సీజన్ అదును దాటిపోవడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం తెలియని అన్నదాతలు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఎక్కువ వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేసినా పంటల పరిస్థితి ఏమవుతుందోన్న ఆందోళన రైతన్నను వెంటాడుతోంది. మరో వైపు ప్రైవేటు వ్యాపారులు వసూలు చేసే అధిక వడ్డీలతో రైతులు మరింత దివాళా తీసే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్తర్వులు వస్తే రుణాల రీ షెడ్యూల్
ఉత్తర్వులు వస్తే రుణాల రీ షెడ్యూల్ నుంచి ఆదేశాలు వస్తే జిల్లాలోని రైతులకు ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రుణగ్రహీతల జాబితాలు ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రీషెడ్యూల్‌పై నాలుగైదు రోజుల్లో క్లియరెన్స్ ఉంటుంది’’ అని కలెక్టర్ ముదావత్ మల్లికార్జున నాయక్ తెలిపారు. గురువారం ఆయనవిలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలుండగా వర్షాభావ పరిస్థతుల కారణంగా కేవలం 50 వేల ఎకరాల్లో మాత్రమే ఈ ఏడాది సాగయ్యే అవకాశముందని చెప్పారు. మిగతా 50వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ, తేలికపాటి పంటలు వేసుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. అవసరమైన విత్తనాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.రువు కొరత లేదుజిల్లాలో ఎరువుల కొరత లేదని, ఇప్పటికే 28వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. నెలవారీగా అవసరమైన ఎరువుల నిల్వలు తెచ్చుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రైతులకు ‘ఈ’ పాస్‌పుస్తకాలు జిల్లాలోని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానే ‘ఈ’ పాస్‌పుస్తకాల సరఫరాకు చర్యలు తీసుకుంటామని , అయితే ఇప్పటికే ‘ఈ’ పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులున్నా వారికి పంపిణీ చేయడంలో తాత్సారం జరిగిందన్నారు. ‘ఈ’ పాస్‌పుస్తకాల దరఖాస్తులు 8 వేల వరకూ పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. త్వరలో తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అప్రూవల్ చేయిస్తానని తెలిపారు. మీ సేవ కేంద్రాల ద్వారా పారదర్శకంగా ‘ఈ’ పాస్ పుస్తకాల పంపిణీ చేపడతామన్నారు. సమర్థంగా అక్షరాస్యత అక్షరాస్యత కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. తాగునీటి సమస్యపై ఆ శాఖ అధికారులతో మాట్లాడి ఎక్కడ ఎద్దడి ఉందో తెలుసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగేందుకు తనకు మరికొంత సమయం పడుతుందని, ఈ లోగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ నాయక్ తెలిపారు. -
మాఫీ అటకెక్కినట్టే
హైదరాబాద్: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ రైతులకు ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీ అటకెక్కినట్టే..! ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆఫైలు మీదే చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఇప్పుడు మొండిచేయి చూపించే దిశగా అడుగులు కదుపుతున్నారు. రుణాల మాఫీని క్రమేణా పక్కన పెడుతూ తానేదో ఘనత సాధించినట్టుగా రీషెడ్యూలు చేయించడాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కోటి మందికి పైగా రైతులకు సంబంధించి రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా.. ఆ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు రీషెడ్యూలు అంటూ రైతులపై మరింత భారం మోపడం పట్ల రైతాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది. రీషెడ్యూలే గొప్ప పనిగా ప్రచారం: తొలి సంతకం రుణ మాఫీ ఫైలు పైనే పెడతానని ఎన్నికల సందర్భంగా చెప్పిన చంద్రబాబు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజున నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో కమిటీ వేయడం మొదలుకొని.. గడిచిన 40 రోజులుగా ఈ విషయంలో దాటవేత ధోరణితోనే వెళుతున్నారు. రకరకాల ఆంక్షలు, పరిమితులు పెడుతూనే మరోవైపు రీషెడ్యూలు కోసం తమ ప్రభుత్వం ఎంతో పాటుపడుతోందన్న విధంగా ప్రచారం కల్పించుకున్నారు. అయితే రీషెడ్యూలు వల్ల రైతుల రుణాలన్నీ వారి పేరుతోనే ఉండగా, రీషెడ్యూలు వల్ల ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు పావలా వడ్డీ కాదు కదా ఇక నుంచి వారి రుణాలపై 13.5 శాతం మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఆ రుణాలు చెల్లించేంతవరకు భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలతో సహా దస్తావేజులన్నీ బ్యాంకు వద్దే తనఖా ఉంటాయి. వ్యవసాయ రుణాలపై మాట మార్చేశారు: ఎన్నికల ముందు వ్యవసాయ రుణాల మాఫీ అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అవి రూ. 87,612 కోట్లకుపైగా ఉండటంతో పంట రుణాలంటూ మాటమార్చారు. రుణ మాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీకి నిర్దేశించిన విధివిధానాల్లోనూ పంట రుణాలుగా నిర్దేశించారు. బంగారం కుదువపెట్టి తెచ్చిన పంట రుణాలు మాఫీ గురించి కాకుండా అవి ఎన్ని ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. 15 రోజుల్లోగా కమిటీ ప్రాధమిక నివేదికను అందించాలని, 45 రోజుల్లో తుది నివేదికను అందించాలని గడువు విధించారు. తుదిగడువు ముంచుకువస్తున్నా కమిటీ ఇంకా తన నివేదికను సమర్పించలేదు. ప్రాధమిక నివేదికకే సమయం కోరడంతో ప్రభుత్వం దాన్ని పెంచింది. అసలు మాఫీ మాటే మార్చేశారు: క్రమేణా రుణ మాఫీని పక్కనపెడుతూ... రీషెడ్యూల్‌ను తెరపైకి తెచ్చారు. కొద్ది రోజులుగా రీషెడ్యూల్‌పై రిజర్వు బ్యాంకు అధికారులతో సంప్రదింపుల పేరిట జరుగుతున్న తంతు అంతా అసలు విషయం నుంచి అందరి దృష్టినీ పక్కదారి పట్టించే వ్యూహమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ కోసం రిజర్వు బ్యాంకును ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డామన్నట్లుగా ప్రజల్లో భారీ ప్రచారానికి తెరతీశారు. రుణాల రీషెడ్యూల్‌తో రైతులకు కొత్తగా రుణాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. రైతు నడ్డి విరిచే రీషెడ్యూల్: వాస్తవానికి రుణాల రీషెడ్యూల్‌తో రైతులకు కొత్త రుణాల అందుబాటులోకి రావడం మాట అటుంచి రైతులకు అది వడ్డీలతో పెనుభారాన్నే మిగులుస్తుంది. పైగా రుణాల మాఫీ చేస్తామని పైకి ప్రకటిస్తూనే రీషెడ్యూల్‌ను సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించాలని రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా రుణమాఫీ చేయకుండా తప్పించుకోవటానికేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల రుణాల మాఫీ అయితే కొత్త రుణాలు మంజూరు బ్యాంకులు వాటంతట అవే అమలుచేస్తాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా రీషెడ్యూల్ దిశగా వెళ్లడం వెనుక కేవలం మాఫీ అంశాన్ని సాధ్యమైనంత మేర నాన్చి అటకెక్కించడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులకు ఒరిగేదైమైనా ఉందా అంటే అదీ కనిపిచండం లేదు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే వారికి వడ్డీరాయితీ పథకాలు వర్తిస్తాయి. ప్రస్తుతం పావలా వడ్డీ రైతులకు వర్తిస్తోంది. రీషెడ్యూల్ చేస్తే పావలా వడ్డీ వర్తించదు. సకాలంలో చెల్లించని రుణాలపై 13.5% వడ్డీ పడుతుంది. రీషెడ్యూల్ అనగానే రైతులకు అది భారమే తప్ప మేలు కాదు. పైగా రుణాల రీషెడ్యూల్ తరువాతైనా వాటిని వడ్డీలతో సహా బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిందే. అప్పుడైనా ఈ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందా? అంటే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టతలేదు. ప్రభుత్వం చెల్లించకపోతే రైతుల నుంచి బ్యాంకులు వడ్డీతో సహా వసూలు చేయతప్పదు. వాస్తవానికి పావలా వడ్డీ కాస్తా ఏడాది దాటాక 13.5%గా మారుతుంది. అది ఏడేళ్ల పాటు కొనసాగితే వడ్డీ మీద మళ్లీ చక్రవడ్డీలు పడి ఈ రుణ భారం భారీగా పెరిగిపోతుంది. రైతులు అసలూ కట్టలేక వడ్డీలూ చెల్లించలేక.. మరింత దయనీయ పరిస్థితుల్లో పడిపోతారు. అత్యవసరమైతే భూమి పత్రాలూ రావు: అదీగాక.. రైతుల భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రీషెడ్యూల్ వల్ల భూముల పత్రాలు బ్యాంకుల వద్దే ఉండిపోతాయి. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని అమ్మి తన కష్టాలను గట్టెక్కించుకోవాలనుకునే రైతులకు ఆ అవకాశం ఉండదు. భూమి పత్రాలు బ్యాంకుల నుంచి తీసుకోవాలంటే తానే స్వయంగా రుణం కట్టుకోవాలి తప్ప మరో మార్గం లేదు. రీషెడ్యూల్ అయ్యేదీ రూ. 10,000 కోట్లే: పైగా.. రీషెడ్యూల్ అనేది పంట రుణాలకు తప్ప టర్మ్, బంగారు రుణాలకు వర్తించదు. రాష్ట్రంలోని 572 మండలాలకే రీషెడ్యూల్ అమలవుతుంది. 86 మండలాలు రీషెడ్యూల్ పరిధిలో లేవు. దీంతో పంట రుణాల కింద ప్రస్తుత లెక్కల ప్రకారం కేవలం రూ. 10,500 కోట్లు మాత్రమే రీషెడ్యూల్ అవుతాయి. ప్రస్తుతం వ్యవసాయరుణాల బకాయిలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ. 87,612 కోట్లు ఉన్నాయి. మిగతా మొత్తం రుణాల సంగతి ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్న. దాదాపు రూ. 78,000 కోట్లు వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు కనీసం రీషెడ్యూల్ కూడా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా ఇలావుంటే.. డ్వాక్రా రుణాల మాఫీని చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. రూ. 14,000 కోట్ల డ్వాక్రా రుణాల సంగతి తేల్చకపోవడంతో ఇప్పటికే బ్యాంకులు బకాయిల వసూలుకు మహిళా గ్రూపులపై ఒత్తిడి చేస్తున్నాయి. రకరకాల మాటలతో మాయ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి బంగారు రుణాలపై మాఫీ వర్తించదని, మరోసారి కుటుంబానికి ఒక్కటే రుణమంటూ ప్రకటనలు చేస్తున్నారు. రుణాల మాఫీపై ఏదో చేస్తున్నట్లు కనిపించడానికే ఇలాంటి ప్రకటనలన్నది స్పష్టమవుతోంది. ఒకపక్క రీ షెడ్యూల్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నట్లు దాని కోసం ఎంతో కసరత్తు చేస్తున్నట్లుగా బయటకు ఫోకస్ ఇస్తుండటమే కాక.. బంగారు రుణాల మాఫీ ఉండదని, రుణాల రీషెడ్యూల్‌ను నాలుగేళ్లు, ఏడేళ్లు ఉంటుందని, ఆ తరువాత రుణాలు ఎవరు చెల్లించాలో తదుపరి నిర్ణయిస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ పదవీకాలం అప్పటికి ముగుస్తుంది కనుక ఆపై రుణాల మాఫీ బాధ్యత టీడీపీపై ఉండదన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కాలపరిమితి అయిదేళ్లే. ఏడేళ్ల తరువాత రైతుల రుణాలు ఎవరు తీర్చాలి? ప్రభుత్వం తీరుస్తుందా? రైతులే కట్టుకోవాలా? అంటే దానిపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తుండడం గమనార్హం. -
‘ఓటు’ దాటాక..!
పంట రుణాల మాఫీపై బాబు రోజుకో మెలిక 33 మండలాల్లోనే పంట రుణాల రీషెడ్యూలు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ పంట రుణాల మాఫీలో అలసత్వంపై రైతుల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఓటు దాటాక హామీలను తగలెయ్యడం అంటే ఇదే..! ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఒక్క సంతకంతో పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. ఆ హామీతోనే టీడీపీ గద్దెనెక్కింది. కానీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తక్షణమే ఆ హామీకి నీరుగార్చేందుకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పంట రుణాల మాఫీపై బాబు రోజుకో మాట మాట్లాడటమే అందుకు తార్కాణం. జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా బంగారు నగలను తనఖా పెట్టి 4,53,162 మంది రైతులు రూ.3,486.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. 68,761 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల రూపంలో రూ.1,129.75 కోట్లు అప్పుగా పొందారు. 45,780 మంది రైతులు వ్యవసాయ పరోక్ష రుణాల రూపంలో రూ.753.16 కోట్లు అప్పుగా తీసుకున్నారు. మొత్తమ్మీద బ్యాంకర్లకు రూ.11,180.25 కోట్లను పంట రుణాల రూపంలో రైతులు బకాయిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఒక్క సంతకంతో తమ రుణాలను మాఫీ చేస్తారనుకున్న రైతుల ఆశలను అడియాశలు చేశారు. పంట రుణాల మాఫీకి తొలి సంతకం చేస్తారని భావిస్తే.. విధి విధానాల రూపకల్పనకు కోటయ్య నేతృత్వంలో కమిటీని నియమిస్తూ సంతకం చేయడం రైతులను నిరాశకు గురిచేసింది. కోటయ్య కమిటీ 45 రోజుల్లోగా నివేదిక ఇస్తుంది.. ఆ నివేదిక ఆధారంగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ.. ఇప్పటికీ కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కరవు మండలాల్లోనే రీషెడ్యూలు.. రుణాలను రీషెడ్యూలు చేయించి.. కొత్తగా పంట రుణాలు ఇచ్చేలా చూస్తామని.. రీషెడ్యూలు చేసిన రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని.. ఇందుకు ఆర్బీఐ అనుమతి కోసం లేఖ రాశామని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. కరవు ప్రభావిత మండలాల్లో అదీ 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలనే రీషెడ్యూలు చేస్తామని, ఆ రుణాలను కూడా మూడేళ్లలోగా చెల్లించాల్సిందేనని మంగళవారం ప్రభుత్వానికి ఆర్బీఐ మార్గదర్శకాలు పంపింది. ఈ నిబంధనకు అంగీకరిస్తే రుణాల రీషెడ్యూలు చేస్తామని ప్రకటించింది. మన జిల్లాలో 66 మండలాలకుగానూ ప్రభుత్వం 33 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు రూ.1,438 కోట్లను పంట రుణాలుగా పొందారు. అంటే.. ఆర్బీఐ జారీచేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల పంట రుణాలు మాత్రమే రీషెడ్యూలు చేస్తారన్న మాట. కరవు, తుఫాను వంటివి సంభవించి, పంటలు నష్టపోయినప్పుడు రుణాలను రీషెడ్యూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ ఆనవాయితీలో భాగంగానే ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది తప్ప.. చంద్రబాబు కృషి ఏమీ లేదన్నది స్పష్టమవుతోంది. ఆర్బీఐ నిబంధనలకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్కిన 7.50 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్ల మాటేమిటన్న అంశంపై స్పష్టత లేదు. అదునులో వర్షాలు పడినా పెట్టుబడులకు డబ్బుల్లేక పంటలను సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాల మాఫీలో ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై రైతన్నలు మండిపడుతున్నారు. -
రుణాల రీ షెడ్యూల్ కుదరదు!
-
రుణాల రీ షెడ్యూల్ కుదరదు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రైతు రుణాల రీషెడ్యూల్ సాధ్యం కాదని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ స్పష్టం చేసింది. దీనివల్ల బ్యాంకింగ్ రంగం కుదేలవుతుందని, ఇందుకు తాము అంగీకరించబోమని తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీకి బదులు తొలుత రైతులు గత ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయించి ప్రస్తుత ఖరీఫ్‌లో వారికి రుణాలు మంజూరు చేరుుంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య అధ్యక్షతన ఏర్పాటైన రుణమాఫీ విధివిధానాల రూపకల్పన కమిటీ మంగళవారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురాంరాజన్తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైంది. రైతులు కష్టాల్లో ఉన్నందున వారి రుణాలు మొత్తం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అరుుతే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని తొలుత రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుగా గత రుణాలను రీ షెడ్యూల్ చేయూలని భావిస్తున్నందున ఇందుకు అనుమతించాలని కోరింది. విశ్వసనీయ సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని ఆర్బీఐ అధికారులు కోటయ్య కమిటీకి స్పష్టం చేశారు. దీంతో కనీసం గత ఖరీఫ్‌లో కరువు, తుపానుల కారణంగా పంటలు కోల్పోయిన రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకైనా నిబంధనలు సడలించి అనుమతించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో తుపాను కారణంగా 462 మండలాల్లో రైతులు పంటలు నష్టపోయారని, అలాగే కరువు కారణంగా 113 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. ఆ మండలాల్లోని రైతులు తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కోరింది. దీనిపై కూడా ఆర్బీఐ అధికారులు అంత సానుకూలంగా స్పందించలేదు. కేంద్ర ఆర్ధిక మంత్రి, అధికారులతో సంప్రదించి చెబుతామన్నారు. ఆర్బీఐ అంగీకరిస్తే 35 లక్షల మందికి లబ్ది వాస్తవానికి గత ఖరీఫ్‌లో కరువు, తుపాను బారిన పడిన మండలాల ప్రకటనలో ప్రభుత్వం జాప్యం చేసింది. కరువు, తుపాను సంభవించిన 90 రోజుల్లోగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు జీవో ద్వారా ప్రకటించాలి. అలా అరుుతేనే రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి మంజూరు చేస్తుంది. ప్రభుత్వం గడువులోగా ప్రకటించకపోవడంతో ఆర్బీఐ ఆ మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించలేదు. 90 రోజుల నిబంధనలను సడలించి రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాలని గతంలోనే ఆర్ధిక శాఖ అధికారులు ఆర్బీఐకి లేఖలు రాశారు. అయినా ఆర్బీఐ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడైనా కనీసం కరువు, తుపాను బారిన పడిన 575 మండలాల్లోని రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకైనా అనుమతించాలని కోటయ్య కమిటీ ఆర్బీఐని కోరింది. ఆర్బీఐ ఇందుకు అంగీకరిస్తే 575 మండలాల్లోని 35 లక్షల మంది రైతులు గత ఖరీఫ్‌లో తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణాలు నాలుగేళ్లపాటు రీ షెడ్యూల్ అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఆ రైతులకు ఖరీఫ్‌లో రుణాల మంజూరుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారుు. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఇందుకు సంబంధించిన రుణ మాఫీ భారం ప్రభుత్వంపై ఉండదని, నాలుగు సంవత్సరాల తరువాత దాని గురించి ఆలోచించవచ్చుననేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రుణాలు రీషెడ్యూల్ అరుుతే తొలి సంవత్సరం మారటోరియం (చెల్లింపుల తాత్కాలిక నిలుపుదల) ఉంటుంది. తర్వాతి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి 12 శాతం వడ్డీతో కలిపి అసలును వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి. రైతుల పేరు మీదే రుణం! వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రైతులు సంతకం చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వారి పేరు మీదే రుణం ఉంటుందని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత రుణాలు రీ షెడ్యూల్ అయితే వెంటనే ఈ ఖరీఫ్‌కు గాను రైతులకు రుణాలు మంజూరవుతాయన్నారు. దీనిపై ఆర్బీఐ, కేంద్రంతో చర్చిస్తున్నామని, ఇందుకు నెల రోజుల వరకు సమయం పట్టవచ్చునని వివరించారు. బంగారు రుణాలతో పాటు అన్ని రకాల రుణాలను కలిపి లెక్కిస్తున్నామని, అన్ని రకాల రుణ గ్రహీతలకూ లబ్ది చేకూర్చుతామని చెప్పారు. కోటయ్య కమిటీకి ఆర్బీఐ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రైతు రుణాల రీషెడ్యూల్ సాధ్యం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందుకు తాము అంగీకరించబోమని తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీకి బదులు తొలుత రైతులు గత ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయించి ప్రస్తుత ఖరీఫ్‌లో వారికి రుణాలు మంజూరు చేరుుంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య అధ్యక్షతన ఏర్పాటైన రుణమాఫీ విధివిధానాల రూపకల్పన కమిటీ మంగళవారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ తోపాటు ఉన్నతాధికారులతో సమావేశమైంది. రైతు ల రుణాలు మొత్తం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అరుుతే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని తొలుత రైతుల గత రుణాలను రీ షెడ్యూ ల్ చేయూలని కోరింది. విశ్వసనీయ సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని ఆర్బీఐ అధికారులు కోటయ్య కమిటీకి స్పష్టం చేశారు.