ఉత్తర్వులు వస్తే రుణాల రీ షెడ్యూల్
ఉత్తర్వులు వస్తే రుణాల రీ షెడ్యూల్
నుంచి ఆదేశాలు వస్తే జిల్లాలోని రైతులకు ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రుణగ్రహీతల జాబితాలు ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రీషెడ్యూల్‌పై నాలుగైదు రోజుల్లో క్లియరెన్స్ ఉంటుంది’’ అని కలెక్టర్ ముదావత్ మల్లికార్జున నాయక్ తెలిపారు. గురువారం ఆయనవిలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలుండగా వర్షాభావ పరిస్థతుల కారణంగా కేవలం 50 వేల ఎకరాల్లో మాత్రమే ఈ ఏడాది సాగయ్యే అవకాశముందని చెప్పారు. మిగతా 50వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ, తేలికపాటి పంటలు వేసుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. అవసరమైన విత్తనాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.రువు కొరత లేదుజిల్లాలో ఎరువుల కొరత లేదని, ఇప్పటికే 28వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. నెలవారీగా అవసరమైన ఎరువుల నిల్వలు తెచ్చుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
రైతులకు ‘ఈ’ పాస్‌పుస్తకాలు
జిల్లాలోని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానే ‘ఈ’ పాస్‌పుస్తకాల సరఫరాకు చర్యలు తీసుకుంటామని , అయితే ఇప్పటికే ‘ఈ’ పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులున్నా వారికి పంపిణీ చేయడంలో తాత్సారం జరిగిందన్నారు. ‘ఈ’ పాస్‌పుస్తకాల దరఖాస్తులు 8 వేల వరకూ పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. త్వరలో తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అప్రూవల్ చేయిస్తానని తెలిపారు. మీ సేవ కేంద్రాల ద్వారా పారదర్శకంగా ‘ఈ’ పాస్ పుస్తకాల పంపిణీ చేపడతామన్నారు. సమర్థంగా అక్షరాస్యత అక్షరాస్యత కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. తాగునీటి సమస్యపై ఆ శాఖ అధికారులతో మాట్లాడి ఎక్కడ ఎద్దడి ఉందో తెలుసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగేందుకు తనకు మరికొంత సమయం పడుతుందని, ఈ లోగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ నాయక్ తెలిపారు.