విజయనగరం అర్బన్ : రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్‌బీఐ చేసిన ప్రకటన వల్ల జిల్లా రైతులకు పెద్దగా ఒరిగే ప్రయోజనం కనిపిం చడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ సీజన్లలో 2.6 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగా వీరిలో కేవలం 60 వేల మందికి మాత్రమే రీషెడ్యూల్ వర్తించనుంది. దీంతో మిగతా రెండు లక్షల మంది రైతుల పరిస్థితి అగమ్య గోచరమే. రుణమాఫీ హామీ వల్ల రైతులకు ప్రయోజనం కలగకపోగా వారి కొంపముంచింది. ఇటు రుణాల రీషెడ్యూల్ లేక, కొత్త రుణాలు అందక, చేతిలో పెట్టుబడి లేక పోవడంతో ఎలా సాగు చే యాలో తెలియక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణ జిల్లాల తో పాటు విజయనగరం జిల్లాలో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. జిల్లాలో 34 మండలాల్లో రైతులకు వర్తింపచేస్తూ ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
అయితే బ్యాంక్ విధిం చిన నిబంధనల కారణంగా చాలా మంది రైతులు రీ షెడ్యూల్‌కు దూరమవుతున్నారు. జిల్లాలో 4.30 లక్షల మంది రైతులుండగా వీరిలో బ్యాంకుల ద్వారా 2.60 లక్షల మంది రుణాలు పొందారు. ఏప్రిల్-అక్టోబర్ మ ధ్యలో తీసుకున్న రుణాలకు మాత్రమే రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకు ప్రకటించింది. అంటే ఖరీఫ్ సీజన్‌లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఖరీఫ్ సీజన్‌లో సుమారు లక్షా10 వేల మంది రైతులు బ్యాం కుల ద్వారా రూ.482.72 కోట్లు రుణంగా పొందారు. వీటిలో రూ.250 కోట్ల వరకు రీ షెడ్యూల్ అర్హతలేని బంగారు తనఖా రుణా లు ఉన్నాయి. ఈ రుణాలు తీసుకున్న రైతు లు సుమారు 50 వేల మంది ఉన్నారు. దీం తో అన్నీ సక్రమంగా జరిగితే కేవలం 60వేల మంది రైతుల కు మాత్రమే ‘రీ షెడ్యూల్’ ద్వారా కొత్త రుణాలకు అర్హత లభించే అవకాశం ఉందని నివేదికలు చెపుతున్నాయి.
రీ షెడ్యూల్‌తో ఒరిగేది నిల్
Published Sun, Aug 10 2014 2:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement