హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రైతు రుణాల రీషెడ్యూల్ సాధ్యం కాదని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ స్పష్టం చేసింది. దీనివల్ల బ్యాంకింగ్ రంగం కుదేలవుతుందని, ఇందుకు తాము అంగీకరించబోమని తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీకి బదులు తొలుత రైతులు గత ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయించి ప్రస్తుత ఖరీఫ్‌లో వారికి రుణాలు మంజూరు చేరుుంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య అధ్యక్షతన ఏర్పాటైన రుణమాఫీ విధివిధానాల రూపకల్పన కమిటీ మంగళవారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురాంరాజన్‌తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైంది.
రైతులు కష్టాల్లో ఉన్నందున వారి రుణాలు మొత్తం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అరుుతే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని తొలుత రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుగా గత రుణాలను రీ షెడ్యూల్ చేయూలని భావిస్తున్నందున ఇందుకు అనుమతించాలని కోరింది. విశ్వసనీయ సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని ఆర్‌బీఐ అధికారులు కోటయ్య కమిటీకి స్పష్టం చేశారు. దీంతో కనీసం గత ఖరీఫ్‌లో కరువు, తుపానుల కారణంగా పంటలు కోల్పోయిన రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకైనా నిబంధనలు సడలించి అనుమతించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో తుపాను కారణంగా 462 మండలాల్లో రైతులు పంటలు నష్టపోయారని, అలాగే కరువు కారణంగా 113 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. ఆ మండలాల్లోని రైతులు తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కోరింది. దీనిపై కూడా ఆర్‌బీఐ అధికారులు అంత సానుకూలంగా స్పందించలేదు. కేంద్ర ఆర్ధిక మంత్రి, అధికారులతో సంప్రదించి చెబుతామన్నారు.
ఆర్బీఐ అంగీకరిస్తే 35 లక్షల మందికి లబ్ది
వాస్తవానికి గత ఖరీఫ్‌లో కరువు, తుపాను బారిన పడిన మండలాల ప్రకటనలో ప్రభుత్వం జాప్యం చేసింది. కరువు, తుపాను సంభవించిన 90 రోజుల్లోగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు జీవో ద్వారా ప్రకటించాలి. అలా అరుుతేనే రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి మంజూరు చేస్తుంది. ప్రభుత్వం గడువులోగా ప్రకటించకపోవడంతో ఆర్‌బీఐ ఆ మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించలేదు. 90 రోజుల నిబంధనలను సడలించి రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాలని గతంలోనే ఆర్ధిక శాఖ అధికారులు ఆర్‌బీఐకి లేఖలు రాశారు. అయినా ఆర్‌బీఐ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడైనా కనీసం కరువు, తుపాను బారిన పడిన 575 మండలాల్లోని రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకైనా అనుమతించాలని కోటయ్య కమిటీ ఆర్‌బీఐని కోరింది. ఆర్‌బీఐ ఇందుకు అంగీకరిస్తే 575 మండలాల్లోని 35 లక్షల మంది రైతులు గత ఖరీఫ్‌లో తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణాలు నాలుగేళ్లపాటు రీ షెడ్యూల్ అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఆ రైతులకు ఖరీఫ్‌లో రుణాల మంజూరుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారుు. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఇందుకు సంబంధించిన రుణ మాఫీ భారం ప్రభుత్వంపై ఉండదని, నాలుగు సంవత్సరాల తరువాత దాని గురించి ఆలోచించవచ్చుననేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రుణాలు రీషెడ్యూల్ అరుుతే తొలి సంవత్సరం మారటోరియం (చెల్లింపుల తాత్కాలిక నిలుపుదల) ఉంటుంది. తర్వాతి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి 12 శాతం వడ్డీతో కలిపి అసలును వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి.
రైతుల పేరు మీదే రుణం!
వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రైతులు సంతకం చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వారి పేరు మీదే రుణం ఉంటుందని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత రుణాలు రీ షెడ్యూల్ అయితే వెంటనే ఈ ఖరీఫ్‌కు గాను రైతులకు రుణాలు మంజూరవుతాయన్నారు. దీనిపై ఆర్‌బీఐ, కేంద్రంతో చర్చిస్తున్నామని, ఇందుకు నెల రోజుల వరకు సమయం పట్టవచ్చునని వివరించారు. బంగారు రుణాలతో పాటు అన్ని రకాల రుణాలను కలిపి లెక్కిస్తున్నామని, అన్ని రకాల రుణ గ్రహీతలకూ లబ్ది చేకూర్చుతామని చెప్పారు.
కోటయ్య కమిటీకి ఆర్‌బీఐ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రైతు రుణాల రీషెడ్యూల్ సాధ్యం కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇందుకు తాము అంగీకరించబోమని తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీకి బదులు తొలుత రైతులు గత ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయించి ప్రస్తుత ఖరీఫ్‌లో వారికి రుణాలు మంజూరు చేరుుంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య అధ్యక్షతన ఏర్పాటైన రుణమాఫీ విధివిధానాల రూపకల్పన కమిటీ మంగళవారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ తోపాటు ఉన్నతాధికారులతో సమావేశమైంది.
రైతు ల రుణాలు మొత్తం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అరుుతే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని తొలుత రైతుల గత రుణాలను రీ షెడ్యూ ల్ చేయూలని కోరింది. విశ్వసనీయ సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని ఆర్‌బీఐ అధికారులు కోటయ్య కమిటీకి స్పష్టం చేశారు.
రుణాల రీ షెడ్యూల్ కుదరదు!
Published Wed, Jun 25 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
Advertisement
Advertisement