120 మండలాలకే రుణాల రీషెడ్యూలింగ్ | rescheduling of loans will be confined for 120 mandals, says RBI | Sakshi
Sakshi News home page

120 మండలాలకే రుణాల రీషెడ్యూలింగ్

Published Tue, Aug 26 2014 10:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

rescheduling of loans will be confined for 120 mandals, says RBI

ఆంధ్రప్రదేశ్లో కేవలం120 మండలాలకే వ్యవసాయ రుణాల రీషెడ్యూలింగ్ పరిమితం అవుతుందని రిజర్వు బ్యాంకు చెప్పింది. ఇదే విషయాన్ని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇంతకుమించి మరెక్కడా రుణాలను రీషెడ్యూలు చేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు రిజర్వు బ్యాంకు గవర్నర్ తెలిపారు. ఇకమీదట ఈ విషయంలో ఎలాంటి ప్రతిపాదన వచ్చినా పరిశీలించేది లేదని కూడా తేల్చిచెప్పారు.

ఒకవైపు రిజర్వు బ్యాంకు ఇలా చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రుణాల మాఫీ, రీషెడ్యూలు అంశంపై నిమిషానికో మాట చెబుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని అంటున్నారు తప్ప.. ఎలా చేస్తామన్న విషయం మాత్రం చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement