క్యాంపస్‌లో నవదంపతుల మృతి | Newly Married Couple Found Dead On Campus Of Visva Bharati University | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌లో నవదంపతుల మృతి

Published Sun, May 5 2019 2:13 PM | Last Updated on Sun, May 5 2019 2:16 PM

Newly Married Couple Found Dead On Campus Of Visva Bharati University - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలో విశ్వభారతి యూనివర్సిటీ క్యాంపస్‌లో నవ దంపతులు మరణించిన ఘటన కలకలం రేపింది. క్యాంపస్‌లోని చీనా భవన్‌ వద్ద కొత్త జంట మృతదేహాలను గుర్తించామని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వెల్లడించారు. విశ్వభారతి వర్సిటీకి చెందిన చైనా భాష, సాంస్కృతిక శాఖ చినా భవన్‌గా పేరొందిన సంగతి తెలిసిందే. మృతులను సోమనాధ్‌ మహతో (18), అవంతిక (19)గా గుర్తించారు. వీరిద్దరూ ఇటీవల వివాహం చేసుకున్నారని, వీరు గతంలో బోల్పూర్‌లోని శ్రీనంద హైస్కూల్‌ విద్యార్ధులని పోలీసులు చెప్పారు.

కాగా, ఈ ఏడాది సోమనాధ్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్షలకు హాజరవగా, అవంతిక పదవ తరగతి పరీక్షలు రాసినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తుండగా పోస్ట్‌ మార్టర్‌ నివేదిక తర్వాతే వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అర‍్ధరాత్రి వేళ నవజంట క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించిందనే అంశంపై వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశిస్తారని విశ్వభారతి యూనివర్సిటీ పీఆర్‌ఓ అనిర్బన్‌ సర్కార్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement