viswa bharati
-
అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి
సాక్షి, కర్నూలు: దర్యాప్తునకు హాజరు కావాలంటూ సిబిఐ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. "మా అమ్మ లక్ష్మి (67 ఏళ్లు) తీవ్ర అస్వస్థతకు గురయి, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. బ్లడ్ ప్రెషర్‌తో పాటు హైపర్ టెన్షన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మా నాన్నా భాస్కరరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం మీకు తెలిసిందే. మా తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క కొడుకయినా నాపై ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ, నిస్సత్తువతో పాటు మగతలో ఉంటున్నారు. ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అమ్మ లక్ష్మికి డాక్టర్లు యాంజియోగ్రామ్ టెస్టు చేయగా.. గుండెలో రెండో చోట్ల బ్లాక్‌లు ఉన్నాయని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆమెను మరిన్ని రోజులు ICUలోనే ఉంచి చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు. పై పరిస్థితుల దృష్ట్యా నాకు 7 రోజుల గడువు కావాలని కోరుతున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడగానే మీ ముందు విచారణకు హాజరు కాగలనని అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు. ఇటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పై రేపు విచారణ ఉందని సిబిఐకి తెలిపారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. మరో వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారు. బీపీ తక్కువగా ఉండి.. ఏం తినలేకపోతున్నారు. వాంతులు అవుతున్నాయి. మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంది. ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఇంకా కొన్నిరోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. లో బీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలి అని వైద్యులు ప్రకటించారు. -
మాజీ వైస్ ఛాన్సలర్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, ఢిల్లీ : విశ్వభారతి విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ సుశాంత దత్తాగుప్తాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. పదవీకాలంలో ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారన్న కారణంగా వీసీ సుశాంత దత్తాగుప్తాను 2016లో తొలిగించారు. కేంద్ర విశ్వవిద్యాలయ వీసీనీ పదవినుంచి తొలిగించడం ఇదే మొదటి సంఘటన. గుప్తాను తొలిగించాలని కోరుతూ సిఫారసు చేయడంలో ఎలాంటి చట్ట విరుద్ధం లేదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించారు. కాగా విశ్వభారతి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించే సమయంలో జీతం డబ్బులతో సహా పెన్షన్ వేతనాన్ని అందుకున్నాడు. కేంద్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఓ ప్రైవేటు సంస్థకు అక్రమంగా నిధులు సమకూర్చేవాడు. గతంలోనూ యూనివర్సిటీ నియామకాల్లో తన వర్గానికి చెందిన కొందరిని నియమించాడనే అభియోగాలు గుప్పుమన్నాయి. దత్తాగుప్తా ఆర్థిక అవకతవలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దుత్తాను దోషిగా తేల్చుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదికను అందజేసింది. -
కరోనా ఆసుపత్రిగా విశ్వభారతి మెడికల్ కాలేజీ
కర్నూలు(సెంట్రల్): కరోనా బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు కోడుమూరు సమీపంలోని విశ్వభారతి ప్రైవేట్ మెడికల్ కాలేజీని కోవిడ్–19 ఐసోలేషన్ హాస్పిటల్‌గా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఆదివారం ఆయన ఆ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి లాక్డౌన్ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని.. ప్రజలు రోడ్లపైకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. విదేశాల నుంచి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారిని జియోట్యాగింగ్ చేసి వారి ప్రతి కదలికపై నిఘా ఉంచామన్నారు. నగరంలో చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలు కోసం గుమికూడుతున్నారని.. ఇది మంచిది కాదని సామూహిక దూరం పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ మత ధార్మిక కార్యక్రమానికి హాజరై వచ్చిన 21 మందిని సి. బెళగల్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైన ఉచిత బియ్యం, కేజీ బ్యాళ్ల పంపిణీలో సుమారు లక్ష మంది పేదలు సరుకులు తీసుకున్నారన్నారు. ప్యాకింగ్ ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల బ్యాళ్లు అందలేదని, నేటి నుంచి అన్ని సరుకులు అందుతాయన్నారు. -
క్యాంపస్‌లో నవదంపతుల మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలో విశ్వభారతి యూనివర్సిటీ క్యాంపస్‌లో నవ దంపతులు మరణించిన ఘటన కలకలం రేపింది. క్యాంపస్‌లోని చీనా భవన్ వద్ద కొత్త జంట మృతదేహాలను గుర్తించామని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వెల్లడించారు. విశ్వభారతి వర్సిటీకి చెందిన చైనా భాష, సాంస్కృతిక శాఖ చినా భవన్‌గా పేరొందిన సంగతి తెలిసిందే. మృతులను సోమనాధ్ మహతో (18), అవంతిక (19)గా గుర్తించారు. వీరిద్దరూ ఇటీవల వివాహం చేసుకున్నారని, వీరు గతంలో బోల్పూర్లోని శ్రీనంద హైస్కూల్ విద్యార్ధులని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఏడాది సోమనాధ్ హయ్యర్ సెకండరీ పరీక్షలకు హాజరవగా, అవంతిక పదవ తరగతి పరీక్షలు రాసినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తుండగా పోస్ట్ మార్టర్ నివేదిక తర్వాతే వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి వేళ నవజంట క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించిందనే అంశంపై వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశిస్తారని విశ్వభారతి యూనివర్సిటీ పీఆర్ఓ అనిర్బన్ సర్కార్ వెల్లడించారు. -
శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ 49వ స్నాతకోత్సవ కార్యక్రమం
-
ముందుగా మీకు క్షమాపణ చెబుతున్నా...
కోల్‌కతా : శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ 49వ స్నాతకోత్సవ కార్యక్రమం... ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక హసీనా, పశ్చిమబెంగాల్ గవర్నర్ కేఎన్ త్రిపాఠి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో కొన్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలను కూడా చూడాల్సి వచ్చింది. ప్రధాని పదవిలో ఉన్న మోదీనే ఏకంగా యూనివర్సిటీ విద్యార్థులను క్షమాపణ కోరారు. ఎందుకో తెలుసా..?? యూనివర్సిటీ పరిసరాల్లో సరియైన మంచి నీటి సౌకర్యం అందించలేకపోవడంతో మోదీ క్షమాపణ కోరారు. ‘విశ్వభారతి యూనివర్సిటీ ఛాన్సలర్‌గా నేను మీ క్షమాపణ కోరుతున్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది విద్యార్థులు సంజ్ఞల ద్వారా యూనివర్సిటీలో మంచి నీరు సరిగ్గా అందడం లేదని చెప్పారు. మీకు అసౌకర్యం కలిగించినందుకు యూనివర్సిటీ ఛాన్సలర్‌గా క్షమాపణ కోరుతున్నా’ అని మోదీ అన్నారు. మోదీ రాకకు యూనివర్సిటీ విద్యార్థులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్న సమయంలో ప్రధాని ఇలా క్షమాపణ చెప్పి, తన ఔనత్యాన్ని చాటుకున్నారు. సరియైన మంచినీటి సౌకర్యం లేక యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు అనారోగ్యం పాలైనట్టు కూడా పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇక నుంచి యూనివర్సిటీలో మంచినీటి సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని హామీ ఇచ్చారు. -
మోదీ నిర్ణయం.. మమత షాక్
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే దేశికొత్తమ్ అవార్డుల ప్రదానొత్సవంలో మాత్రం ఆయన పాల్గొనట్లేదు. దీంతో అవార్డుల వేడుక లేనట్లేనని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా అవార్డులను అందించలేరని ప్రధాని కార్యాలయం బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ పరిణామాలపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవో కార్యాలయం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ.. గతంలోనూ ఇలాంటి పరిణామాలు జరిగాయని చెబుతున్నారు. అయితే గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం.. ఈసారి జరిగి తీరుతుందని అంతా భావించారు. ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అతిథులతో వేదిక పంచుకోవటం గమనార్హం. అవార్డుల జాబితాపై కూడా... అవార్డుల ఎంపిక పైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వభారతి అకాడమీ కౌన్సిల్ ఈనెల మొదట్లో దేశీకొత్తమ్ అవార్డుల కోసం పలువురు ప్రముఖుల పేర్లను ఎంపిక చేసింది. జాబితాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, రచయిత అమితవ్ ఘోష్, ప్రముఖ కవి గుల్జర్, పెయింటర్ జోగెన్ చౌదరి, ద్విజెన్ ముఖర్జీ తదితరుల పేర్లు ఉన్నాయి. అయితే అమితాబ్‌తోపాటు ద్విజెన్ పేర్లను అవార్డుకు ఎంపిక చేయలేదు. ‘అర్హత ఉన్న వారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలీట్లేదు. ఈ నిర్ణయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది’ అంటూ ఆమె మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో... ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ భారతి యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక హసీనా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇరు ప్రధానులతోపాటు సీఎం మమతా బెనర్జీ వేదికను పంచుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి స్వయంగా మమతా ఆహ్వానం పలికి, యూనివర్సిటీకి వెంటబెట్టుకొచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక బంగ్లాదేశ్ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వీడియోపై పేలుతున్న జోకులు.. ఇటీవల కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ కర్ణాటక డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొద్ది దూరం నడవాల్సి రావటంతో ఆమె డీజీపీ నీలమణి రాజుపై చిందులు తొక్కారు. ఆ పరిణామంతో కుమారస్వామి-దేవగౌడలు కూడా బిత్తరపోయారు. అనంతరం ఆ డీజీపీని బదిలీ చేస్తూ కుమారస్వామి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రధాని రాక సందర్భంగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెలిప్యాడ్‌కు దూరంలో ఉన్న మమతను ఇటువైపుగా రావాలంటూ ప్రధాని మోదీ సైగలు చేయటం, ఆమె అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చి మోదీకి పుష్ఫగుచ్ఛం అందించటం చూడొచ్చు. మరి తనను అంత దూరం నడిపించిన మోదీపై మమత ఎవరికి ఫిర్యాదు చేస్తుందో చూడాలంటూ పలువురు సెటైర్లు పేలుస్తున్నారు. #WATCH PM Narendra Modi arrives in Shanti Niketan to attend the convocation of Visva Bharati University, received by West Bengal CM Mamata Banerjee pic.twitter.com/dnDE1pZmyf — ANI (@ANI) 25 May 2018 -
ఎమ్మెల్యే గౌరు చరితమ్మకు మాతృ వియోగం
– శోకసంద్రంలో ఎమ్మెల్యే చరితమ్మ – వైఎస్ జగన్ సంతాపం – నివాలర్పించిన ఎమ్మెల్యేలు నందికొట్కూరు: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి సూదిరెడ్డి బాలనాగమ్మ(70) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో మృతి చెందింది. 10 రోజుల నుంచి కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో బాలనాగమ్మకు చికిత్సలు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాతి మృతి చెందడంతో మృతదేహాన్ని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలోని స్వగృహానికి తరలించారు. చరితారెడ్డి తల్లి మృతదేహంపై పడి భోరున విలపించిన తీరు పలువురిని కంటతడి తెప్పించింది. బాలనాగమ్మకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సంతానం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి బాలనాగమ్మ మృతి చెందడం పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బాలనాగమ్మ మరణ వార్త తెలియగానే చరితారెడ్డికి ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలనాగమ్మ మృతి తీరని లోటు బాలనాగమ్మ మృతి వైఎస్ఆర్సీపీకి తీరని లోటు అని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం ఆమె మృతదేహానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళికృష్ణ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి, నంద్యాల ఇన్చార్జ్ డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి, గుంతకల్ ఇన్చార్జ్ వెంకట్రామిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురళీరెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి పూలమాల వేసి నివాళ్లులర్పించారు.