ఎమ్మెల్యే గౌరు చరితమ్మకు మాతృ వియోగం
ఎమ్మెల్యే గౌరు చరితమ్మకు మాతృ వియోగం
Published Mon, Mar 13 2017 11:12 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
– శోకసంద్రంలో ఎమ్మెల్యే చరితమ్మ
– వైఎస్ జగన్ సంతాపం
– నివాలర్పించిన ఎమ్మెల్యేలు
నందికొట్కూరు: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి సూదిరెడ్డి బాలనాగమ్మ(70) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో మృతి చెందింది. 10 రోజుల నుంచి కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో బాలనాగమ్మకు చికిత్సలు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాతి మృతి చెందడంతో మృతదేహాన్ని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలోని స్వగృహానికి తరలించారు. చరితారెడ్డి తల్లి మృతదేహంపై పడి భోరున విలపించిన తీరు పలువురిని కంటతడి తెప్పించింది. బాలనాగమ్మకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సంతానం.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి బాలనాగమ్మ మృతి చెందడం పట్ల వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. బాలనాగమ్మ మరణ వార్త తెలియగానే చరితారెడ్డికి ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాలనాగమ్మ మృతి తీరని లోటు
బాలనాగమ్మ మృతి వైఎస్‌ఆర్‌సీపీకి తీరని లోటు అని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం ఆమె మృతదేహానికి వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళికృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ఇన్‌చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి, నంద్యాల ఇన్‌చార్జ్ డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి, గుంతకల్ ఇన్‌చార్జ్ వెంకట్రామిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురళీరెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి పూలమాల వేసి నివాళ్లులర్పించారు.
Advertisement
Advertisement