సాక్షి, ఢిల్లీ : విశ్వభారతి విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ సుశాంత దత్తాగుప్తాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. పదవీకాలంలో ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారన్న కారణంగా వీసీ సుశాంత దత్తాగుప్తాను 2016లో తొలిగించారు. కేంద్ర విశ్వవిద్యాలయ వీసీనీ పదవినుంచి తొలిగించడం ఇదే మొదటి సంఘటన. గుప్తాను తొలిగించాలని కోరుతూ సిఫారసు చేయడంలో ఎలాంటి చట్ట విరుద్ధం లేదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించారు.
కాగా విశ్వభారతి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించే సమయంలో జీతం డబ్బులతో సహా పెన్షన్ వేతనాన్ని అందుకున్నాడు. కేంద్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఓ ప్రైవేటు సంస్థకు అక్రమంగా నిధులు సమకూర్చేవాడు. గతంలోనూ యూనివర్సిటీ నియామకాల్లో తన వర్గానికి చెందిన కొందరిని నియమించాడనే అభియోగాలు గుప్పుమన్నాయి. దత్తాగుప్తా ఆర్థిక అవకతవలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దుత్తాను దోషిగా తేల్చుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదికను అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment