ప్రతీకాత్మక చిత్రం
బొద్దింక ఏమిటి.. పద్దెనిమిది ఇళ్లు మార్పించడం ఏమిటన్న డౌట్ వస్తోందా? నిజమే.. కొత్తగా ఓ పెళ్లయిన జంట బొద్దింకతో పడ్డ అవస్థలు, తర్వాతి చిక్కులు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ కారణం కూడా చాలా సింపులే.. ముందు అసలు కథేమిటో తెలుసుకుందామా? మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 2017లో ఓ అమ్మాయితో పెళ్లయింది. హాయిగా కొత్త కాపురం పెట్టారు. ఓ రోజు ఆమె కిచెన్‌లో పనిచేసుకుంటోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టింది. వెళ్లి చూస్తే భయంతో గజగజా వణికిపోతూ కనిపించింది. మళ్లీ కిచెన్‌లోకి వెళ్లనంటే వెళ్లబోనంటూ మొండికేసింది.
మరెట్లా అంటే.. ఇల్లే మార్చేద్దామన్నది. సరేనని ఇల్లు మారారు. మళ్లీ అదే సీన్.. మళ్లీ కిచెన్.. గట్టి కేక, భయం, వణుకు.. ఇలా మూడేళ్లలో ఒకటీ రెండు కాదు ఏకంగా 18 ఇళ్లు మార్చాల్సి వచ్చింది. ప్రతిచోటా కిచెన్‌లో ఆమె భయపడి కేక పెట్టినది బొద్దింకలను చూసే. ఇలా భయపడటంతో వదిలేయకుండా చేతికందిన వస్తువు తీసి విసరడం, బొద్దింకలు తాకిన వస్తువులను బయటపడేయడం మొదలుపెట్టింది. అసలు తాము వెళ్లిన ప్రతిచోటా బొద్దింకలు ఎందుకు వస్తున్నాయో, ఏం చేయాలో, ఆమెకు బొద్దింకలంటే ఉన్న భయాన్ని (ఫోబియాను) ఎలా పోగొట్టాలో అర్థంగాక సదరు భర్త తలపట్టుకుంటున్నాడట.
Comments
Please login to add a commentAdd a comment