సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధూవరులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దులోని గొల్రంత వద్ద దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండు రోజులకే దంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాలు.. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణుకు (26) ఒడిశాలోని బరంపురానికి చెందిన స్ ప్రవల్లికతో (23) ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం ఇచ్ఛాపురంలో రిసెప్షన్ జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం సోమవారం సాయంత్రం నూతన జంట ద్విచక్రవాహనంపై ప్రవల్లిక ఇంటికి బరంపురానికి బయల్దేరారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో గొళంత్రా దగ్గర వెనక నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే మృతిచెందింది.
వరుడికి తీవ్ర గాయాలవ్వగాని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతిచెందారు. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన ఇలా కాళ్ల పారాణి ఆరకముందే మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ
Comments
Please login to add a commentAdd a comment