ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్‌లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీష, కలెక్టర్ ఎం.జగన్మోహన్, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. చీపుళ్లతో రోడ్డు శుభ్రపర్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సయ్యద్ సాజిదొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్, ఆదిలాబాద్ ఎంపీపీ నైతం లక్ష్మీ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి రామన్న సారథ్యంలో వేడుకలు నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మహాత్ముని సందేశాన్ని అందించారు. నాయకుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు సునందరెడ్డి, గణేష్‌రెడ్డి, తుమ్మ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలల అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రిమ్స్ ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు గాదె వినోద్‌కుమార్, నాయకులు జనగం సంతోష్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గాంధీ జయంతి
Published Fri, Oct 3 2014 1:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement