Gandhi park
-
Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్‌గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది. తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులోని గాంధీ పార్క్‌లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? Gandhi Park, Guntur. Ladies Fighting...we are so developed. 😂😂😂 pic.twitter.com/fgqfWOef4k — Saran Bhuma (@telugodikeka) November 27, 2023 -
గుంటూరులో గాంధీపార్క్ ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి
-
ప్రభుత్వ భూమికి ఎసరు..!
చౌటుప్పల్ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్‌రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్‌ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు. -
ఆ పార్కులో అన్నీ సమస్యలే
వికారాబాద్ అర్బన్ : మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న గాంధీ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి సిబ్బంది అనుమతించడం లేదు. ఇదేమిటని అడిగితే పనులు జరుగుతున్నాయని, అక్కడ ఏర్పాటు చేసిన ఆట వస్తువులు చెడగొడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. సుమారు రూ.30 లక్షలతో చేపట్టిన గాంధీ పార్కు అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయి రెండు మాసాలు కావస్తోంది. సంబంధిత కాంట్రాక్టు అసంపూర్తిగా పనులు చేసి వెళ్లిపోయారు. అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో పార్కుకు తాళం వేసేస్తున్నారు. సెలవు రోజు పిల్లలు పార్కులో ఆడుకుందామని వస్తున్నా గేట్లకు వేసిన తాళాలు చూసి వెళ్లిపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చచేసి కొనుగోలు చేసిన పిల్లల ఆటు వస్తువులు ఆడుకునే వారు లేక బోసిపోతున్నాయి. పార్కులో కొంత మేరా గ్రీన్‌మ్యాట్ వేసినా సక్రమంగా లేక పిచ్చిమొక్కలు మొలిశాయి. అనేక చోట్ల పూల మొక్కలు ఎండిపోతున్నా సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఆది, సోమవారాలు రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చినా పిల్లలను పార్కులోకి అనుమతించలేదు. పిల్లలు ఆడుకోవడానికి అనుమతించకుంటే లక్షలు ఖర్చుచేసినా లాభముండదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. -
గాంధీ పార్కు పట్టించుకోరా?
నిలిచిన వర్షపు నీరు పట్టించుకోని నగర పంచాయతీ పాలకవర్గం జోగిపేట: జోగిపేటలో ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ పార్కు నిరాదరణకు గురవుతుంది. కేవలం 15వ అగస్టు, 26 జనవరిలలో మాత్రమే గేట్లు తెరచి పతాకావిష్కరణ చేసి మళ్లీ మూసేస్తారు. పార్కులో శుభ్రత విషయంలో పట్టించుకునే పరిస్థితి లేదు. పార్కులోకి వెళుతుండగా ఎదురుగా గాంధీ విగ్రహన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. విగ్రహం ముందు నీరు నిలవడంతో కనీసం నిలబడే పరిస్థితిలేదు. ఖాళీ ప్రదేశంలో కూడా వర్షపు నీరు నిండిపోయింది. చెట్లు వంగిపోయాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ పార్కు అభివృద్ధి కోసం పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పార్కులను అభివృద్ధి చేపసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు, పాలకవర్గాలు సరైన శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలున్నాయి. పార్కులో నీడనిచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. పరిశుభ్రంగా లేకపోవడంతో దుర్గంధం వస్తుంది. సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే పార్క్‌ను తెరవడంతో ఆదరణ కోల్పోతుంది. పార్కులో బెంచీలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు తెరచుకుంటే బాగుంటుందని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్కు నిర్వాహణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుది. పార్కులో వేల చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. జోగిపేట నగర పంచాయతీ పాలకవర్గం పార్కు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. గాంధీ పార్కును అభివృద్ధి చేయాలి జోగిపేటలోని గాంధీ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. పట్టణంలో ఇదే ముఖ్యమైన పార్కు,. పార్కులో అన్ని వసతులు కల్పించాలి. విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం వేళలో పార్కులో కూర్చునే విధంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. నగర పంచాయతీ నుంచి నిధులను విడుదల చేయాలి. చాలా సంవత్సరాలుగా పార్కు నిరాదరణకు గురవుతుంది. - రామకృష్ణ, జోగిపేట చర్యలు తీసుకుంటాం గాంధీ పార్కులో చేరిన వర్షపునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. గాంధీ పార్కు అభివృద్ధికి సంబంధించి పాలకవర్గం దృష్టికి తీసుకువస్తాం. పార్కులో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూస్తాం. ప్రతిరోజు సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. గాంధీ పార్కులో ఇతర సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - రాజ్‌భరత్, ఏఈ నగర పంచాయతీ జోగిపేట -
అరిచిందని చంపేశారు..
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని గాంధీపార్కులో గత నెల 28న వెలుగు చూసిన మహిళ ‘హత్యా’చారం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితుల్ని రిమాండుకు తరలించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజకుమారి కేసు వివరాలు వెల్లడించారు. ధారూరు మండలం మైలారం ముందు తండాకు చెందిన రమావత్ చాప్లీబాయ్ (45) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె వికారాబాద్ పట్టణంలో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. మద్యానికి బానిసైన ఆమె గతనెల 27న రాత్రి 9 గంటల సమయంలో వికారాబాద్‌లోని అనంత్ వైన్స్ వద్ద కూర్చొని ఉంది. వికారాబాద్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఎండీ గౌస్, ఎండీ అలీలు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలు అప్పటికే వెళ్లిపోవడంతో వారు స్టేషన్ సమీపంలోని అనంత్ వైన్స్ వైపుగా వచ్చారు. అంతకుముందే వారు మద్యం తాగి ఉన్నారు. వారిద్దరు ఒంటరిగా ఉన్న చాప్లీబాయిని గమనించారు. వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినట్లు నటించి ఆమెతో మాటలు కలిపారు. కొద్దిసేపటి తర్వాత మద్యం తాగుదామని వారు చెప్పి చాప్లీబాయిని గాంధీ పార్కులోకి తీసుకెళ్లారు. అంధకారంగా ఉన్న పార్క్‌లో ఎండీ గౌస్, ఎండీ అలీలు ఆమెపై అత్యాచారం చేశారు. అరిచిందని అంతం చేశారు.. కొద్దిసేపటికి తర్వాత గౌస్, అలీలు చాప్లీబాయిపై రెండోసారి అఘాయిత్యం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె కేకలు వేసింది. అరుపులకు ఎవరైనా వస్తారేమోనని భయపడిన అలీ చాప్లీబాయి గొంతు కొరికాడు. అయినా ఆమె కేకలు ఆపకపోవడంతో తన జేబులో ఉన్న చేతిరూమాలును తీసి గొంతుకు బిగించి చంపేశాడు. దీనికి గౌస్ సహకరించాడు. మరుసటి రోజు ఉదయం ధారూరు మైలారం ముందు తండాకు చెందిన విద్యార్థులు సేదతీరేందుకు గాంధీ పార్క్‌కు రావడంతో మహిళ విగతజీవిగా పడి ఉంది. ఆమెను చాప్లీబాయిగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఆర్ఐ ఎదుట లొంగిపొయిన నిందితులు... మహిళ ‘హత్యా’చారం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పోలీసులకు పట్టుబడుతామేమోనని భయపడిన నిందితులు బుధవారం సాయంత్రం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ షేక్‌అలీ ఎదుట లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. నిందితుల్ని గురువారం రిమాండుకు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ స్వామి, సీఐ రవి, ఎస్ఐ శేఖర్‌ను,ఐడీ పార్టీ పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి అభినందించారు. -
ఘనంగా గాంధీ జయంతి
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్‌లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీష, కలెక్టర్ ఎం.జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. చీపుళ్లతో రోడ్డు శుభ్రపర్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ సాజిదొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్, ఆదిలాబాద్ ఎంపీపీ నైతం లక్ష్మీ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి రామన్న సారథ్యంలో వేడుకలు నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మహాత్ముని సందేశాన్ని అందించారు. నాయకుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు సునందరెడ్డి, గణేష్‌రెడ్డి, తుమ్మ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలల అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రిమ్స్ ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు గాదె వినోద్‌కుమార్, నాయకులు జనగం సంతోష్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు. -
బీసీల సమరభేరి
‘‘తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. ఇక అందరూ పోరాడేది బీసీవాదం పైనే’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. - న్యూస్‌లైన్, చౌటుప్పల్ చౌటుప్పల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉండడంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుం టున్నారు.. ఇక అందరూ పోరాడేది బీసీ వాదంపై నే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లోని గాంధీపార్కులో గురువారం జరిగిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. రాజ్యాధికారం కోసం బీసీలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అగ్రకులాల వారు ఏ పా ర్టీలో ఉన్న రాజ్యాధికారం కోసం ఏకమవుతారని, అం దుకే అధిక సంఖ్యలో చట్టసభలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. దొరల రాజ్యం పోవాలంటే అగ్రకులాలకు సీట్లిచ్చే పార్టీలకు ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.అగ్రకుల వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని కోరారు. ఎన్నికల మెనిఫెస్టోలో బీసీ బిల్లు, బీసీల కోసం ప్రవేశపెట్టే పథకాలను చేర్చాలన్నారు. త్వరలో నల్లగొండలో 2లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలి పారు. సభలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య, జెల్లా మార్కండేయులు,చంద్రకళ, లావణ్య, అంజయ్య, జం గయ్య, మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్, పల్లె రవికుమార్, గౌరీశంకర్, రమణగోని శంకర్, తిరుమని కొండల్, చక్రహరి రామరాజు పాల్గొన్నారు.