Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు | Girls Fighting To Take Selfies First At Guntur Gandhi Park, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు

Nov 27 2023 10:01 AM | Updated on Nov 27 2023 11:51 AM

Girls Fighting For Selfies At Guntur Gandhi Park Video Viral - Sakshi

సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం ట్రెండ్‌గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది.

తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది.  గుంటూరులోని గాంధీ పార్క్‌లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది.

రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్‌ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
చదవండి:  ఫ్రీ మీల్స్‌ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement