పాకిస్తాన్ మళ్లీ తెగబడింది. అంతర్జాతీయ వేదికలపై నీతులు వల్లిస్తున్న పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది.
శ్రీనగర్ : పాకిస్తాన్ మళ్లీ తెగబడింది. అంతర్జాతీయ వేదికలపై నీతులు వల్లిస్తున్న పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఫూంచ్ సెక్టార్ సౌజెయిన్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 17 ఏళ్ల యువతి జహీరా అక్తర్తో పాటు మరో నలుగురు గాయడ్డారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో పాక్ సైన్యం ఇలా కాల్పులు జరపడం ఇది మూడోసారి. పాక్ సైనికులు గురువారం జరిపిన కాల్పుల్లో కూడా ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.