నిద్రపోతున్న కూతురిని నరికి చంపేశాడు!
నిద్రపోతున్న కూతురిని నరికి చంపేశాడు!
Published Thu, Oct 27 2016 4:48 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గాఢంగా నిద్రపోతున్న తన కన్న కూతురిని ఓ తండ్రి నరికి చంపేశాడు. తెల్లవారుజాము సమయంలో ఆశారామ్ అనే వ్యక్తి తన కూతురు సోనియా (19)ను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గౌరవ్ అనే వ్యక్తిని సోనియా ప్రేమించిందని, అది వద్దని ఆశారామ్ తరచు చెప్పేవాడని సీనియర్ ఎస్పీ దీపక్ కుమార్ సింగ్ తెలిపారు.
వృత్తిరీత్యా టైలర్ అయిన ఆశారామ్.. తన భార్య రేఖ తెల్లవారుజామునే పాల కోసం సమీపంలోని డెయిరీ వద్దకు వెళ్లినప్పుడు సమయం చూసుకుని మరీ కూతుర్ని హతమార్చాడు. ఆమె మెడమీద పదునైన ఆయుధంతో కోసినట్లు గాయాలున్నాయి. ఆ సమయంలో సోనియా తన చెల్లెళ్లతో కలిసి నిద్రపోతోంది. కుమార్తెను చంపేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని వీధిలో పెట్టి, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆశారామ్‌ను జైలుకు పంపినట్లు సీనియర్ ఎస్పీ చెప్పారు.
Advertisement
Advertisement