బతుకమ్మ పూలకోసం వెళ్లి..
Published Mon, Oct 3 2016 4:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
అశ్వరావుపేట: బతుకమ్మ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూలను తెచ్చేందుకు వెళ్లిన ఓ బాలిక చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం అనంతారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావ్య(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు బతుకమ్మ పేర్చడానికి పూలను కోసుకొచ్చేందుకు వెళ్లిన కావ్య ఊర చెరువులో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement